![రేపు పుంగనూరు నియోజవర్గంలో జగన్ సమైక్య శంఖారావం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41388163588_625x300_1.jpg.webp?itok=z3xTtwy8)
రేపు పుంగనూరు నియోజవర్గంలో జగన్ సమైక్య శంఖారావం
చిత్తూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర గురువారం చిత్తూరు జిల్లాలో కొనసాగనుంది. పుంగనూరు నియోజకవర్గంలో జగన్ పర్యటించనున్నారు.
సాదుంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించి, అనంతరం బహిరంగం సభలో మాట్లాడుతారు. బాలంవారిపల్లి, శివరాంపురం మీదుగా పర్యటించి పీలేరు క్రాస్ రోడ్స్ వద్ద జరిగే బహిరంగం సభలో పాల్గొంటారు. పీలేరు కాలనీ మీదుగా పర్యటన సాగనుంది. కల్లూరులో YSR విగ్రహాన్ని ఆవిష్కరించి, కల్లూరులో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం పడిపుట్ల బైలు మీదుగా పర్యటన కొనసాగుతుంది. జగన్ సమైక్య శంఖారావం యాత్ర గురువారం దామలచెరువు (చంద్రగిరి) వరకూ కొనసాగనుంది.