samaikya shankharavam
-
'ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు'
భోగాపురం: ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పూనుకుంటున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీల వల్లే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని జగన్ విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా విజయనగరం జిల్లాలోని భోగాపురం సభలో ప్రసంగించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. రామరాజ్యం చూడలేదు కాని వైఎస్ హయాంలోసువర్ణయుగం చూశామని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని తెలిపారు. మహానేత చనిపోయి నాలుగున్నర ఏళ్లు అయినా ప్రజల గుండెల్లో ఆ మహానేత ఎప్పటికీ నిలిచిపోయారని జగన్ అన్నారు. ప్రతి పేద వాడి గుండె చప్పుడు, ప్రతి పేదవాడి మనసెరిగి ఆ మహానేత పాలన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాలు మరింతగా దిగజారాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాల మధ్య .ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారన్నారు. విభజన బిల్లు వచ్చినప్పుడే సీఎం కిరణ్ రాజీ నామా చేసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలుచుకుని రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచిన వారినే ప్రధానిగా చేద్దామని జగన్ విజ్ఞప్తి చేశారు. -
గాజువాకలో జగన్ సమైక్య శంఖారావం సభకు పోటెత్తిన జనం
విశాఖపట్నం: గాజువాకలో శనివారం రాత్రి జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం సభకు జనం పోటెత్తారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల రాకతో గాజువాక జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో వైఎస్ఆర్ సువర్ణయుగాన్ని మళ్లీ తెద్దామని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ మహానేతపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరా క్రాంతి పదం(ఐకెపి) ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. ఐకెపి మహిళలు వచ్చి జగన్‌ను కలిశారు. వారు తమ సమస్యలను ఆయనకు తెలిపారు. జగన్ వెంటనే స్పందించి 47వేల మంది ఐకెపి ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలిరోజునే ఆ ఫైలుపై సంతకం చేస్తానని చెప్పారు. అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సిపి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీకి అండగా ఉంటుంది అక్కచెల్లెమ్మలేనని, వారిని తప్పక ఆదుకుంటామని చెప్పారు. విఏఓలు, సంఘమిత్ర ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
విశాఖ లో జగన్ కు ఘన స్వాగతం
విశాఖ: జిల్లాలోని సమైక్యశంఖారావంలో భాగంగా విశాఖకు చేరుకున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. జగన్ రాక కోసం ఎదురు చూసిన అభిమానులు, కార్యకర్తలు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. ఈ రోజు మధ్యాహ్నం విశాఖకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి నేరుగా చోడవరం బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్స్ గార్డెన్స్‌లో జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి హాజరవుతారు. -
పేదవాడి చదువు రాజశేఖరుని స్వప్నం
-
పేదవాడి చదువు రాజశేఖరుని స్వప్నం
నెల్లూరు: పేదవాడు చదువు కోవడమనేది ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి స్వప్నమని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో భాగంగా జిల్లాలోని గూడూరు సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు.ప్రతీ పేదవాడు ఉన్నత చదువులు చదువుకుని గొప్పవాడు కావాలని రాజశేఖర రెడ్డి ఎప్పుడూ తాపత్రాయపడేవారన్నారు. నేటి పరిస్థితులు చూస్తే బాధేస్తుందన్నారు. అసలు ప్రజల గురించి ఆలోచించే నాయకుడే లేడని జగన్ తెలిపారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో నలభై నాలుగు రోజుల పాటు చర్చ జరిగినా, చంద్రబాబు రెండు చేతుల సిద్ధాంతాన్ని పాటించారని, అసెంబ్లీలో ఒక చేతితో సీమాంధ్ర, మరో చేతితో తెలంగాణ నినాదాలు చేయించారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్నికాపాడుకోవడానికి ప్రజలంతా ఒక్కటి కావాలని జగన్ పిలుపునిచ్చారు. -
'మాటమీద నిలబడిన వ్యక్తి వైఎస్సార్ ఒక్కరే'
చిత్తూరు: పేదరికంతో వైద్యం అందక ఎవరూ చనిపోకూడదని ఆరోగ్యశ్రీ అనే పథకంతో వైద్యం కల్పించిన మహా నాయకుడు ఎవరైనా ఉంటే అది ఆ దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో భాగంగా చంద్రగిరి సభకు హాజరైన జగన్..అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. పేదవాడి గుండె చప్పుడు, మనసెరిగి వారి సంక్షేమం కోసం వైఎస్సార్ పాటు పడిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్కా, చెల్లెల్లకు కోసం వైఎస్సార్ పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి ఆదుకున్నారన్నారు. విశ్వసనీయతకు, ఆప్యాయతకు మారుపేరు వైఎస్సార్ అని, మాట ఇస్తే..కష్టమైనా, నష్టమైనా ఆ మాట మీదే నిలబడేవారని జగన్ తెలిపారు. రైతన్నల ఆత్మహత్యల గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. మద్యపాన నిషేదం చేస్తానని చెప్పిన బాబు.. అధికారం చెపట్టిన తరువాత బెల్టుషాపులు తెరిపించాడన్నారు.కాంగ్రెస్ కు డిపాజిట్ లేకుండా చేసి, ప్యాకేజీలు అడుగుతున్న బాబును తరిమికొట్టినపుడే సమైక్య వాదం గెలుస్తుందన్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యం ఉంచుతారో వారినే ప్రధానిని చేద్దామని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
రాజశేఖరుని స్వర్ణయుగం చూశారు: వైఎస్ జగన్
-
రాజశేఖరుని స్వర్ణయుగం చూశారు: వైఎస్ జగన్
చిత్తూరు: ప్రజలు రామరాజ్యం చూడలేదు కానీ రాజశేఖరుని స్వర్ణయుగాన్ని చూశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ కొనసాగిస్తున్న సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం ఏర్పేడులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి మండుటెండలో 1600 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పరిష్కరించిన ఏకైక నేత వైఎస్ఆర్ అని జగన్ అన్నారు. పేదవారి ఆరోగ్యం బాగుండాలనే ఆశయంతో వారి కోసం ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి వైఎస్ఆర్ ఆదుకున్నారని జగన్ అన్నారు. ఓట్లు, సీట్ల కోసం ఇప్పుడు ఏ గడ్డి తినడానికైనా రాజకీయ నేతలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తూంటే బాధేస్తోందని, ఓట్లు, సీట్ల కోసం దొంగ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలంటే తమకు గిట్టనివారిని జైళ్లకు పంపిస్తారు, మనుషుల్నితప్పిస్తారని జగన్ అన్నారు. -
'రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఎక్కడా జరగలేదు'
-
'రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఎక్కడా జరగలేదు'
చిత్తూరు: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వారివురూ కుమ్మక్క రాజకీయాలకు పాల్పడుతూ విభజనకు సహకరిస్తున్నారన్నారని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీకాళహస్తి సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజల గురించి చర్చించడం మరచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం దేశంలో ఎక్కడా జరగడంలేదని జగన్ తెలిపారు. అసలు మనస్సాక్షే లేకుండా సభ జరుగుతుందని జగన్ విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు ఏ రోజూ విద్యార్థుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఉచితంగా కరెంట్ ఇస్తామంటే తీగలపై బట్టలారేసుకోవాలని బాబు వ్యంగ్యంగా మాట్లాడిన సంగతిని జగన్ గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ కాదు..అసలు వడ్డీనే మాఫీ చేయలేదన్నారు. అక్కా చెల్లెళ్లను లక్షాధికారులను చేయాలని వైఎస్ఆర్ పావలా వడ్డీ ఇస్తే చంద్రబాబు వడ్డీతో సహా వసూలు చేశారని జగన్ తెలిపారు. ఆనాడు పేదవారికి వైఎస్ఆర్ దిక్కుగా నిలిచారని అన్నారు. ఆ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకానికి తూట్లు పొడుస్తూ పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచన చెయ్యడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయమంటే చనిపోయాక కూడా బతకడానికి ఆరాటపడడమేనని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే కుట్రలు, కుతంత్రాలతో తప్ప ఏమీ కనిపించడం లేదన్నారు. త్వరలో రాజకీయవ్యవస్థలో మార్పులొస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని జగన్ సూచించారు. -
జగన్మోహనరెడ్డికి అడుగడుగునా జన నీరాజనం
-
నాలుగు నెలల్లో సువర్ణయుగం: వైఎస్ జగన్
చిత్తూరు: పేదవాడి వైద్యం కోసం ఆరాటపడింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఆదివారం నిండ్రలో వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. నిండ్ర సభలో జగన్ మాట్లాడుతూ.. పేదవారికి వైఎస్ఆర్ దిక్కుగా నిలిచారని అన్నారు. నాలుగు నెలల్లో సువర్ణయుగం తెచ్చుకుందామని, కుట్రతో రాజకీయాలు చేసేవారు ఈ ఉప్పెనలో కొట్టుకుపోతారని జగన్ అన్నారు. రాజకీయమంటే చనిపోయాక కూడా బతకడానికి ఆరాటపడడమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో రాజకీయవ్యవస్థలో మార్పులొస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. -
పేదోడి పెద్ద కొడుకు వైఎస్
సమైక్య శంఖారావంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఒక మనిషి మరణించి నాలుగున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ జనం గుండె చప్పుళ్లలో సజీవంగానే ఉన్నారు.. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన మహా నాయకుడు. రాజకీయాల్లో విశ్వసనీయతకు నిలువెత్తు చిరునామా. పేదవాడి గుండె చప్పుడును హృదయంతో విన్న డాక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాడి కుటుంబానికి ఆయన పెద ్దకొడుకు. అలాంటి ప్రియతమ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మన నుంచి దూరమయ్యాక రాజకీయాల్లో విశ్వసనీయత కనుమరుగయిపోయింది. రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే నాయకుడే కరువయ్యాడు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పస్తుతం రాజకీయాలను ఒక చదరంగంలా మార్చేసి, ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని లెక్కలేస్తున్నారే తప్ప పేద ప్రజల గురించి ఆలోచించడమే లేదని అన్నారు. నాలుగో విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ శుక్రవారం ఐదోరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సాగింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే.. వైఎస్ అందుకే ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.. ‘‘ఎనిమిదిన్నర కోట్ల మందిలో దేవుడు ఒక్కరికే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇస్తాడు. పదవిలో ఉన్నప్పుడు ప్రజల కోసం మనమేం చేశామన్న ప్రాతిపదికగానే ప్రజలు మనల్ని చనిపోయాకగానీ, పదవి నుంచి దిగిపోయాక గానీ గుర్తు పెట్టుకుంటారు. మహానేత మన నుంచి దూరమై నాలుగున్నరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఆయన మా గుండెల్లోనే సజీవంగా ఉన్నాడని ఇంత మంది గర్వంగా చెప్పుకుంటున్నారంటే అందుకు కారణం.. పదవిలో ఉన్న ప్రతిక్షణం ఆ నేత ప్రజల బాగోగుల కోసం పరితపించడమే. మండుటెండలో 1,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలను అతి దగ్గర నుంచి గమనించారు. పేదవాడు అప్పుల ఊబిలో కూరుకు పోవడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి పిల్లల చదువులు, మరొకటి అనుకోకుండా వచ్చిపడే ఆరోగ్య సమస్యలు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపితే పేదవాడిని అప్పుల ఊబి నుంచి బయటపడేయగలం అని వైఎస్ భావించారు. అందుకే పెద్ద చదువులకు పేదరికం అడ్డురాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెట్టారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఈ పథకాలను రాజకీయాలు, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అమలు చేశారు. ఎంతమంది అర్హులుంటే అంత మందికీ ప్రయోజనం కలిగేలా పథకాలను తీర్చిదిద్దారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు పూయించడం కోసం అనుక్షణం తపన పడ్డాడు. అలా పేదవాడి కుటుంబంలో పెద్దకొడుకయ్యాడు. ఇలా దివంగత నేత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇదా రాజకీయం..? మహానేత మనకు దూరమయ్యాక రాష్ట్రంలో ప్రజల కోసం తపించే ఒక్క నాయకుడూ లేకుండా పోయాడు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేదే లేకుండా పోయింది. ఎత్తులు, పైఎత్తుల రాజకీయ చదరంగంలో పేదవాణ్ణి ఎప్పుడో పక్కకు నెట్టేశారు. ఈ రోజు ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విభజించాలి? ప్రత్యర్థిపై ఎలా కేసులు పెట్టాలి? ఎలా జైల్లో పెట్టాలి? అన్న అంశాలే రాజకీయాలైపోయాయి. అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారి చూస్తే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థమవుతుంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు ఒక చేత్తో సైగ చేసి తన ఎమ్మెల్యేల్లో కొందరితో సమైక్య మనిపిస్తారు. మరోచేత్తో సైగచేసి ఇంకొందరితో విభజన కేకలేయిస్తారు. ఇదా రాజకీయం..? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏ ప్రాంతానికైనా వెళ్లినా.. ‘నన్ను నమ్మండి. మీకు నేనున్నాను. నన్ను చూసి ఓటేయండి’ అని అడిగే దమ్మూ, ధైర్యం లేని వారు నాయకులుగా చలామణి కావడమే నేటి రాజకీయాల్లో దౌర్భాగ్యం. ప్రతి కార్యకర్తా కాలర్ ఎగరేసుకుని ఫలానా వ్యక్తి మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితుల్లో ముఖ్యమంత్రీ లేరు. పతిపక్ష నేతా లేరు. ఒకరేమో సీఎం కుర్చీలో ఎంతకాలం వీలైతే అంతకాలం ఉండేందుకు సోనియా గీసిన గీత దాటకుండా ‘సమైక్య’ ముసుగులో విభజన కార్యక్రమాన్ని సజావుగా కొనసాగిస్తారు. మరొకరేమో ప్యాకేజీల బేరసారాలతో కుమ్మక్కవుతున్నారు. రాజకీయాల్లో విలువలు లేని ఈ పరిస్థితిని మనమే మార్చుకోవాలి. ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో విభజన కుట్రదారులను బంగాళాఖాతంలో కలిపేద్దాం. 30 మంది ఎంపీలను మనమే గెలిపించుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించే సాహసం ఎవరు చేస్తారో చూద్దాం. సమైక్య రాష్ట్రాన్ని సజీవంగా ఉంచుకుందాం’’ యాత్ర సాగిందిలా... గంగాధర నెల్లూరు నియోజక వర్గం తిరువీధి కుప్పం నుంచి యాత్ర మొదలైంది. తొలుత జగన్ ముసలయ్యగారి పల్లె చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆవులకొండలో పార్టీ జెండాను ఆవిష్కరించి తూగుండ్రం, పిలారికుప్పం, ఆముదాల క్రాస్ మీదుగా పాలసముద్రం మండలంలోకి ప్రవేశించారు. వీర్లగుడి గ్రామంలో చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతర అక్కడ శిఖామణి సుగానందం కుటుంబాన్ని ఓదార్చారు. ఏటుకూరి పల్లెలో చెరకు రైతులను కలసి బెల్లం తయారీ విధానాన్ని పరిశీలించారు. పాలసముద్రంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడ్నుంచి నగరి చేరుకుని మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ గృహంలో బస చేశారు. పాలసముద్రం నుంచి నగరి వచ్చే దారిలో దాదాపు 15 కి.మీ. మేర జగన్ తమిళనాడు సరిహద్దులో ప్రయాణించారు. పల్లెపట్టు నియోజకవర్గ కేంద్రం దాటేంత వరకు దారిపొడవునా ఉన్న తమిళ గ్రామాల ప్రజలు జగన్‌ను ఆప్యాయంగా పలకరించారు. అతిమాంజరిపేట వద్ద జనం పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జగన్ ముందుకు సాగారు. యాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాంధీ, మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం (వైఎస్ఆర్టీయూసీ అనుబంధం) 2014 క్యాలెండర్‌ను జగన్ ఆవిష్కరించారు. ఆరుమాకుల పల్లె సమీపంలో వైఎస్ఆర్సీపీ కార్మిక విభాగం నేత జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో తరలి వచ్చిన విద్యుత్ ఉద్యోగులు జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్టీయూసీ జిల్లా కన్వీనర్ బీరేంద్రవర్మ, విద్యుత్ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
'హైదరాబాద్ కలిసికట్టుగా నిర్మించుకున్నరాజధాని'
-
'హైదరాబాద్ కలిసికట్టుగా నిర్మించుకున్నరాజధాని'
గుడిపాల(చిత్తూరు జిల్లా): 'వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్ ను వదిలి వెళ్లాలంటున్నారు. అది అందరం కలిసి కట్టుగా నిర్మించుకున్న రాజధాని. 50 శాతం బడ్జెట్ ఉన్న హైదరాబాద్ ను వదిలితే సీమాంధ్రలో ఆదాయం పరిస్థితి ఏంటి?'అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం సభలో భాగంగా ఆదివారం గుడిపాల బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన జగన్.. నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రతీ రైతన్న జై సమైక్యాంధ్ర అంటుంటే, ఆ నినాదాలు పాలకులకు వినిపించడం లేదా?అని ప్రశ్నించారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ప్రతీ ఒక్కరి మాట జై సమైక్యంధ్రా అంటూ గళమెత్తుతున్నా.. ఆ నేతలకు చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. ఎవర్ని జైల్లో పెడితే, ఎలా విడగోడితే ఓట్లు, సీట్లు వస్తాయని ఆలోచన మాత్రమే చేస్తున్న కాంగ్రెస్ పెద్దలకు బుద్ధి వచ్చే విధంగా ముందుకు వెళదామని జగన్ పిలుపునిచ్చారు. అందరం ఏకమయ్యి, రానున్న ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలను గెలుచుకుందామని ప్రజలకు విన్నవించారు. దివంగత నేత వైఎస్సార్ పేదరికానికి వైద్యం చేసేందుకు ఓ డాక్టర్‌గా ముందుకు వచ్చారని, ఆయన ఉన్నన్నాళ్లు రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరికి రాలేదన్నారు. -
రేపు పుంగనూరు నియోజవర్గంలో జగన్ సమైక్య శంఖారావం
చిత్తూరు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర గురువారం చిత్తూరు జిల్లాలో కొనసాగనుంది. పుంగనూరు నియోజకవర్గంలో జగన్ పర్యటించనున్నారు. సాదుంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించి, అనంతరం బహిరంగం సభలో మాట్లాడుతారు. బాలంవారిపల్లి, శివరాంపురం మీదుగా పర్యటించి పీలేరు క్రాస్ రోడ్స్ వద్ద జరిగే బహిరంగం సభలో పాల్గొంటారు. పీలేరు కాలనీ మీదుగా పర్యటన సాగనుంది. కల్లూరులో YSR విగ్రహాన్ని ఆవిష్కరించి, కల్లూరులో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం పడిపుట్ల బైలు మీదుగా పర్యటన కొనసాగుతుంది. జగన్ సమైక్య శంఖారావం యాత్ర గురువారం దామలచెరువు (చంద్రగిరి) వరకూ కొనసాగనుంది. -
27 నుంచి సమైక్య శంఖారావం
-
సమైకానికి నువ్వే
-
రేపే సమైక్య శంఖారావం సభ
-
భీమవరంలో జేడీ శీలంను అడ్డుకున్న సమైక్యవాదులు
-
రంగారెడ్డి జిల్లా నేతలతో జగన్ సమీక్ష
-
సమైక్య శంఖారావానికి తరలివస్తాం:ఎస్వీయూ విద్యార్ధులు
-
వైయస్సార్సీపి ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ
-
విభజన ఆగదు-సమస్యలపైనే పోరాటం
-
ఉద్యమాన్ని నీరుగార్చేలా సీఎం వ్యవహరిస్తున్నారు
-
విశాఖలో ఆటో ర్యాలీ
-
సిఎం కిరణ్, పోలీసులపై మండిపడ్డ వైయస్సార్సీపీ
-
వాడ వాడలా సమైక్య ఉద్యమం
-
ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమైక్య ఉద్యమం
-
ఏపీ ఎన్జీవో సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ
-
బాబుకు అధికారం ఇస్తే మనం గొయ్యి తవ్వుకున్నట్లే
-
విశాఖ జిల్లాలో ప్రవేశించిన షర్మిళ బస్సు యాత్ర
-
షర్మిళ శంఖారావం 15th Sept 2013
-
సమైక్యవాదుల నిరసనలు
-
రావులపాలెంలో షర్మిళ సమైక్య శంఖారావం
-
మాట్లాడింది నేను కాదు... భగవంతుడి లీల
-
సమైక్య శంఖారావం 11th Sept 2013
-
సమైక్యవాదులకు ధన్యవాదాలు తెలిపిన షర్మిళ
-
కాకినాడలో సమైక్య గళం
-
తిరుపతిలో షర్మిళకు సంఘీభావం
-
కాసేపట్లో మదనపల్లీ చేరుకోనున్న సమైక్య శంఖారావం
-
రాష్ట్రంలో ఎటు చూసినా సమైక్య సెగ
-
ఇంకా సేపట్లో చిత్తూరులో షర్మిల బహిరంగ సభ