రాష్ట్ర విభజన ఆగదని స్పష్టమవుతోందని, ఇక సీమాంధ్ర ప్రజల సమస్యలపై పోరాడతామని మంత్రి బాలరాజు చెప్పారు. ఢిల్లీకి వెళ్లి మంత్రుల బృందాన్ని కలుస్తామన్నారు. రాష్ట్రాన్ని విభజన చేయమని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బ్లాంక్‌గా రాసి ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మేవారు సిడబ్ల్యూసి చేసిన తెలంగాణ తీర్మానాన్ని గౌరవించాల్సిందేనన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశాలను చర్చిస్తామని మంత్రి బాలరాజు చెప్పారు.