
విశాఖ లో జగన్ కు ఘన స్వాగతం
విశాఖ: జిల్లాలోని సమైక్యశంఖారావంలో భాగంగా విశాఖకు చేరుకున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. జగన్ రాక కోసం ఎదురు చూసిన అభిమానులు, కార్యకర్తలు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. ఈ రోజు మధ్యాహ్నం విశాఖకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి నేరుగా చోడవరం బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం ఐదు గంటలకు గాజువాక చేరుకొని అక్కడ జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు.
అనంతరం ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద ఉన్న కింగ్స్ గార్డెన్స్‌లో జరిగే మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు మనుమడి వివాహానికి హాజరవుతారు.