గాజువాకలో శనివారం రాత్రి జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం సభకు జనం పోటెత్తారు.
విశాఖపట్నం: గాజువాకలో శనివారం రాత్రి జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం సభకు జనం పోటెత్తారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల రాకతో గాజువాక జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో వైఎస్‌ఆర్ సువర్ణయుగాన్ని మళ్లీ తెద్దామని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ మరణం తర్వాత ఆ మహానేతపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన సమైక్యశంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరా క్రాంతి పదం(ఐకెపి) ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని జగన్మోహన రెడ్డి హామీ ఇచ్చారు. ఐకెపి మహిళలు వచ్చి జగన్ను కలిశారు. వారు తమ సమస్యలను ఆయనకు తెలిపారు. జగన్ వెంటనే స్పందించి 47వేల మంది ఐకెపి ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలిరోజునే ఆ ఫైలుపై సంతకం చేస్తానని చెప్పారు.
అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సిపి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీకి అండగా ఉంటుంది అక్కచెల్లెమ్మలేనని, వారిని తప్పక ఆదుకుంటామని చెప్పారు. విఏఓలు, సంఘమిత్ర ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.