ప్రజలు రామరాజ్యం చూడలేదు కానీ రాజశేఖరుని స్వర్ణయుగాన్ని చూశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ కొనసాగిస్తున్న సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం ఏర్పేడులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.