సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీకాళహస్తి సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజల గురించి చర్చించడం మరచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం దేశంలో ఎక్కడా జరగడంలేదని జగన్ తెలిపారు.