వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడాలి
పీలేరు, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని, అందుకోసం పార్టీ కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని ఆ పార్టీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
మండలంలో మంగళవారం విస్తృతంగా పర్యటించా రు. కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరి బెదిరింపులకు భయపడొద్దని, అండ గా ఉంటామని భరోసా ఇచ్చారు. పీలేరులో చింతల రామచంద్రారెడ్డి ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల కొనసాగుతున్నాయని తెలిపారు. మూడేళ్ల పాలనలో కిరణ్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన పీలేరులో మంచినీటి ఎద్దడితో జనం అల్లాడుతున్నారని, బిందె తాగునీరు రూ.3 వెచ్చించి కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
పరిశ్రమల ఏర్పాటు పేరిట వందలాది ఎకరాలను రైతుల నుంచి లాక్కొన్నారని ఆరోపించారు. ఆ భూముల్లో కిరణ్ వేసిన శిలాఫలకాలు తప్ప ఒక్క పరిశ్రమ కూడా లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాగానే తిరిగి భూములను అప్పగిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రావన్నారు.
లాస్ట్‌బాల్ అంటూనే చివరి ఫైల్ వరకు రేయింబవళ్లు సంతకాలు పెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీ అడ్ర స్సు గల్లంతు అవుతుందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమన్నారు.
సమావేశంలో పార్టీ నాయకు లు నారే వెంకట్రమణారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి మల్లెల రెడ్డిబాషా, భానుప్రకాష్‌రెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, ఎం.ఆదినారాయణ, ఎం.రవీంద్రనాథరెడ్డి, డి.జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, ఎస్.హబీబ్‌బాషా, షామియానా షఫీ, రామిరెడ్డి, బాబ్జిరెడ్డి, సదుం నాగరాజ, ఉదయ్‌కుమార్, శ్రీనివాసు లు, కాకులారంపల్లె రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.