chintala ramachandra reddy
-
దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు : చింతల రామచంద్రారెడ్డి
-
మళ్లీ సెంటిమెంట్ రగిల్చే కుట్రలు: చింతల
సాక్షి, హైదరాబాద్: రాజకీయలబ్ధి కోసం సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ ను మళ్ళీ తెరపైకి తెస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. మళ్లీ తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. విభజన హామీలపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చింతల చెప్పారు. గురువారం రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మళ్లీ తెలంగాణ–ఆంధ్రా అంటూ నినాదాలు ముందుకు తీసుకురావడాన్ని రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే పార్టీ తమదని, ఏపీ, తెలంగాణలలో అధికారంలో లేకున్నా కేంద్రం సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉందని, నోటీసులు కేవలం సినిమా టైటిల్స్ మాత్రమేనని బీజేపీనేత, విశ్రాంత ఐఏఎస్ చంద్రవదన్ చెప్పారు. ప్రధాన సినిమా మొదలైతే కేసు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందన్నారు. గతంలో ఎక్సైజ్ కమిషనర్ పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని, ఈ కేసు ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. -
సొంత పార్టీ నాయకులపై కామెంట్లతో వివాదాలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ డివిజన్లో కార్పొరేటర్ ఎన్నిక చెల్లదంటూ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ ఎన్నికల ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేసినప్పటి నుంచి డివిజన్ బీజేపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఓ వైపు కార్పొరేటర్ ప్రమాణస్వీకారం ఏర్పాట్లలో ఉండగా మరోవైపు పార్టీలో కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డిపై పోస్టులు పెట్టడం తీవ్ర స్థాయిలో కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతల రాంచంద్రారెడ్డి టికెట్ కోసం రూ.కోటిన్నర తీసుకున్నారనే అర్థం వచ్చేలా శంకర్‌ప్రసాద్ అనే బీజేపీ కార్యకర్త తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. ఈ మేరకు ఇరువర్గాల మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. కాగా తాజాగా ఆదివారం మరికొన్ని వాట్సప్ గ్రూపుల్లో ఓ బీజేపీ కార్యకర్త రాసిన లేఖ మరింత రచ్చ చేసింది. పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించి కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఇద్దరు పిల్లల నిబంధన ఉల్లంఘించిన విషయం ముందే తెలిసినా చింతల రాంచంద్రారెడ్డి పట్టించుకోకుండా పార్టీ పరువును రచ్చకీడ్చారంటూ లేఖలో ఆరోపణలు చేయడం పార్టీ పెద్దలను కలవరపెట్టింది. గ్రేటర్ ఎన్నికల తర్వాత తలెత్తిన అనర్హత వివాదం మూడు నెలల్లోనే తేల్చాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆందోళనలో ఉన్న పార్టీ పెద్దలకు సొంత పార్టీ కార్యకర్తల మధ్య చోటు చేసుకుంటున్న వాట్సాప్ వార్ ఎక్కడికి దారితీస్తుందోనని టెన్షన్ పట్టుకుంది. టికెట్ కోసం చివరి క్షణం దాకా ప్రయతి్నంచిన కొంతమంది నేతల అనుచరులు జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంగా ఉన్నారు. తమ నేతలకు టికెట్లు ఇచ్చి ఉంటే పార్టీ పరువు పోయేది కాదు అంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండటం కొసమెరుపు. చదవండి: వారికి రివిట్లు ఎక్కించే పరిస్థితి వస్తది: సంజయ్ -
ఈఎస్ఐ స్కామ్ సిగ్గు చేటు: ఎమ్మెల్యే చింతల
-
రాజకీయ దురుద్దేశంతో బిల్లులను అడ్డుకున్నారు
-
‘పెద్ద మనసు లేని వ్యక్తులు పెద్దలు ఎలా అవుతారు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాజకీయ ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయం గెలిచిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు గ్రామాలకు హీరో అయితే 13 జిల్లాలకు విలన్ అని మండిపడ్డారు. శాసనమండలి చైర్మన్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన లోక్‌ష్‌ను మండలిలోకి పంపారని, లోకేష్ పదవి పోతుందని చంద్రబాబు బాధపడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చైర్మన్‌ను ప్రభావితం చేశారు శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను శాసన మండలిలో అడ్డుకుని కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం బిల్లు, ఎస్సీ, ఎస్టీ కమీషన్ బిల్లును శాసన మండలి అడ్డుకుందని, తాజాగా పాలన వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను ప్రభావితం చేశారని, టీడీపీకి శాసన మండలిలో మెజారిటీ ఉందని రాజకీయంగా అడ్డుకున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో శాసన మండలి ఉందని గుర్తు చేశారు. మండలి రద్దును ప్రతిపాదిస్తే సమర్థిస్తానని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.శాసనమండలి అవసరం లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. రాజకీయ దురుద్దేశంలో మండలిలో బిల్లులను అడ్డుకున్నారని, ప్రజా సంక్షేమం కోసం పనిచేయని మండలికి ప్రజాధనం వెచ్చించడం వృథా అని వ్యాఖ్యానించారు. పెద్ద మనసులేని వ్యక్తులు పెద్దలు ఎలా అవుతారని చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
నవరత్నాలతో ప్రతి కుటుంబానికీ లబ్ధి
చిత్తూరు, పీలేరు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటిం చిన నవరత్నాల్లాంటి పథకాలతో ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.లక్ష నుం చి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో బూత్ కమిటీ కన్వీ నర్లు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బూత్ కమి టీ కన్వీనర్ల పాత్ర కీలకమన్నారు. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. చంద్రబాబు ఓటమి భయంతో జిమ్మిక్కులు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు గెలుపే లక్ష్యంగా ముం దుకు పోవాలని సూచించారు. జాబి తాలో ఉన్న ఓటర్ల వివరాలను పరి శీలించి దొంగ ఓటర్లను గుర్తిం చా లన్నారు. ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తోం దని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు రోజుకో ప్రకటనతో ప్రజలను మరోమారు మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలిపి నవరాత్నాల పథకాల వల్ల కలిగే లబ్ధిని వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ డి.హరిత, పార్టీ మండల కన్వీనర్ డి. జగన్మోహన్రెడ్డి, జెడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య, జిల్లా అధి కార ప్రతినిధి బీడీ నారాయణరెడ్డి, కార్యదర్శి నారే వెంటక్రమణారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్‌బాషా, మహ్మద్‌షఫీ, కడప గిరిధర్‌రెడ్డి, ఎం.భానుప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరితే ఖబడ్దార్
సాక్షి, చిత్తూరు: సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్న వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. కలికిరి మండలం బాలయ్యకుంట వడ్డిపల్లి గ్రామంలో 70 కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాలన్నీ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి దశాబ్దాలుగా అండగా ఉంటూ వచ్చాయి. ఆయన తమ్ముడు కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరడం వారికి నచ్చలేదు. ఆ గ్రామంలోని దాదాపు 40 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాయి. దీనికోసం 45 రోజులుగా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని సంప్రదిస్తున్నారు. శనివారం (22వ తేదీన) ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేర్చుకుంటామని గ్రామస్తులకు ఆయన చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పీలేరు టీడీపీ ఇన్చార్జి కిశోర్‌కుమార్‌రెడ్డి గ్రామస్తులను బెదిస్తున్నారు. ‘‘మీరు ఎలా వైఎస్సార్సీపీలో చేరుతారో చూస్తా’’ అంటూ బెదిరిస్తున్నారు. మీ ఇళ్లను ధ్వంసం చేయడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. దీంతోపాటు 22నే గ్రామదర్శిని కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఆశ్రయించారు. ఆయన గ్రామస్తులను వెంటబెట్టుకొని చిత్తూరు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను శుక్రవారం కలిశారు. ‘ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోనైనా చేరేందుకు స్వేచ్ఛ ఉంది. ప్రశాంతగా ఉన్న గ్రామంలో చిచ్చు రేపొద్దు’ అని ఎస్పీ సూచించారు. రంగంలోకి ఎక్సైజ్ పోలీసులు ఎస్పీ న్యాయంగా వ్యవహరించడంతో కిశోర్‌కుమార్‌రెడ్డి ఎక్సెజ్ పోలీసులను రంగంలోకి దింపారు. గ్రామంలో చెరకు గానుగ ఆడిస్తుంటారు. వడ్డెపల్లితో పాటు మిగతా గ్రామాల్లోనూ నల్లబెల్లం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని వైఎస్సార్సీపీలో చేరాలనుకున్నవారి ఇళ్లపై ఎక్సైజ్ పోలీసులతో దాడి చేయించారు. నల్లబెల్లంతో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నారనే నెపంతో నాగన్న అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఎవరూ లేని సమయంలో తమ ఇంటి తాళం పగలగొట్టడం ఏంటని ప్రశ్నించింనందుకు నాగయ్య భార్యపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. శనివారం ఎక్సైజ్ పోలీసులు వడ్డిపల్లిలో దాడులు నిర్వహిస్తారని తెలిసింది. -
‘టీడీపీ భూస్థాపితం తథ్యం’
సాక్షి, పీలేరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర విపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజాసంకల్ప యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రతో రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం కావడం తద్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ.. పాదయాత్రను అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలైన ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. ఎన్ని కుట్రలు చేసిన పాదయాత్ర కొనసాగుతోంది.. పాదయాత్రతో తన బండారం బయట పడుతుందనే భయంతో అడ్డుకోవడం కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడ ఎవరి అనుమతి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. నియంతలా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు ఈ రాష్ట్రానికి శాశ్వత సీఎం కాదని హెచ్చరించారు. రోజు రోజుకూ వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆరదణ చూసి ఓర్వలేని సీఎం తన ఉనికిని కాపడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజా సంకల్పయాత్ర నిరాటకంగా కొనసాగుతుందన్నారు. టీడీపీ పతనం.. పాదయాత్ర ప్రారంభంతో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పతనం ఆరంభమౌతుందన్నారు. ఇక బాబు మాయ మాటలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని తెలిపారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రాభివృద్ది కోసం సీఎం చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ అరచేతిలో స్వర్గం చూపుతున్నారని అన్నారు. రాజధాని కోసం సేకరించిన భూముల్లో తొడాకులు గుడ్లు పెడుతున్నాయి తప్ప సీఎం చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ది గురించి ఆలోచిండం లేదు.. బాబు కేవలం కమీషన్ల కోసం పాకులాడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని ద్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. దీనిని నుంచ ప్రజల దృష్టిని మల్లించడం కోసం సీఎం కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని పేర్కొన్నారు. జగన్ పాదయాత్రతో టీడీపీ కనుమరుగౌతుందన్నారు. ప్రజల కోరిక మేరకు వైఎస్ జగన్ సీఎం కావడం తద్యమని ధీమా వ్యక్తం చేశారు. -
‘టీడీపీ పతనం నంద్యాల నుంచి ప్రారంభం’
పీలేరు: కర్నూల్ జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పతనం నంద్యాల నుంచి ప్రారంభమౌతుందని ఆయన అన్నారు. శుక్రవారం నంద్యాల నియోజక వర్గ పరిధిలోని గోస్పాడు మండలంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డితో కలసి ఆయన విస్త్రృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నంద్యాల నియోజక వర్గ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఓటమి భయంతో సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా గెలుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. బాబువన్నీ వాగ్ధాన భంగాలేన్న విషయం నంద్యాల నియోజక వర్గ ప్రజలు గుర్తించారని ఆయన తెలిపారు. టీడీపీకి ఉప ఎన్నికల్లో బుద్ది చెప్పడం కోసం ప్రజలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగాన్నంతా నంద్యాలలో కేంద్రీకృతం చేసి అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంత్రి మండలి అంతా మకాం వేసి ప్రజలను తీవ్ర భయబ్రాంతుకు గురిచేస్తోందన్నారు. ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం ఆచరణకు సాధ్యం కాని హామీలతో ఇక ఎంతో కాలం ప్రజలను మోసం చేయలేరని తెలిపారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేని సీఎం నంద్యాల ప్రజలను మోసం చేయడం కోసం రోజుకో ప్రకటన, పూటకో వాగ్ధనంతో మళ్లీ మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రచారంలో ఇక్కడి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. -
‘అధికార పార్టీ తొత్తులైన అధికారులు’
పీలేరు: పార్టీలకతీతంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు బరితెగింపుతో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై ప్రత్యేక మక్కువ ఉన్న అధికారులు నేరుగా ఆ పార్టీలో చేరితే తమకు అభ్యంతరం లేదని కొంతమంది అధికారుల తీరు దుర్మార్గమని అన్నారు. పలుమార్లు హెచ్చరించినా పలువురు అధికారులు తమ తీరు మార్చుకోకపోవడం శోచనీయమన్నారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద నెలవారీ ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రత్యేకాధికారి అధ్యక్షతన ఆరు మండలాలకు చెందిన అన్ని శాఖల అధికారులతో ఈ కార్యక్రమం జరిగింది. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాకుండానే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వచ్చేసరికి స్టేజిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉండడాన్ని చూసి ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక టీడీపీ సమావేశమా అని అధికారులను ప్రశ్నించారు. ఏ అధికారం ఉందని టీడీపీ నేతలను స్టేజిపైకి ఆహ్వానించి అసలైన ప్రజాప్రతినిధులను ఎందుకు విస్మరించారని నిలదీశారు. ఎమ్మెల్యే రావటం గమనించిన అధికారులు స్టేజిపైకి రావాలిన మైక్‌లో పిలిచారు. దీనికి స్పందించిన రామచంద్రారెడ్డి కనీసం ప్రొటోకాల్ పాటించాలన్న ఇంగిత జ్ఞానం లేనపుడు తాను పైకి రానని జనంలోనే కూర్చుంటానంటూ పక్కన ఉన్న కూర్చీలో పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీలతో కలిసి కూర్చున్నారు. ఎమ్మెల్యేను విస్మరించి టీడీపీ కార్యక్రమం తరహాలో కొనసాగించారు. ఇంతలో లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేసే సమయంలో ఎమ్మెల్యే పేరు ప్రస్తావించగా ప్రొటోకాల్ పాటించని అధికారుల వైఖరికి నిరసనగా కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఇంతలో టీడీపీ నేతలు కేరింతలు, బిగ్గరగా కేకలు వేయడంతో ఎమ్మెల్యే అనుచరులు అధికారులను నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలను ఎందుకు ఆహ్వానించలేదని, వారు వస్తే ఎక్కడ కూర్చోవాలో చూపాలంటూ అధికారులను నిలదీశారు. టీడీపీ నేతల కేకలకు నిరసనగా ఎమ్మెల్యే ఎంపీడీవో కార్యాలయం ప్రవేశ గేటు వద్ద నేలపై గంటకుపైగా బైఠాయించారు. ఎమ్మెల్యే ధర్నాకు కూర్చున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం టీడీపీ నేతల సూచనల మేరకు కార్యక్రమాన్ని ముగించారు. పీలేరు అర్బన్, రూరల్ సీఐలు డీ. నాగరాజు, మహేశ్వర్, ఎస్ఐ సుధాకర్‌రెడ్డి ఇతర పోలీస్ అధికారులు ధర్నా వద్దకు చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. కార్యక్రమం అనంతం నియోజక వర్గ ప్రత్యేకాధికారి గోపీచంద్, పీలేరు ఎంపీడీవో, తహశీల్దార్ ఏ. వసుంధర, మునిప్రకాశంలు సుదీర్గంగా ఎమ్మెల్యేతో చర్చించి ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే స్పందిస్తూ ఇప్పటికే అనేక సార్లు ఇలానే చెప్పా, కనీస మర్యాద కూడా పాటించకుండా వ్యవహరించడం దారుణమన్నారు. పోలీసులు, అధికారుల సూచనల మేరకు ఎమ్మెల్యే ధర్నా విరమించారు. -
విశాఖ స్కాంపై సీబీఐ దర్యాప్తు చేయించగలరా?
- పీలేరు ఎమ్మెల్యే చింతల సవాల్ పీలేరు: ముఖ్యమంత్రి చంద్రబాబుకు దైర్యం ఉంటే విశాక భూస్కాంపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. పీలేరులో ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులో మాట్లాడుతూ.. తాను నిప్పునని నిత్యం చెప్పుకుంటున్న సీఎం, తన మంత్రివర్గ సభ్యులు ఏ తప్పు చేయనపుడు సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధం కావడం లేదని ప్రశ్నించారు. టీడీపీ పెద్దలు తప్పు చేయలేదని నమ్మకం ఉంటే ఏ విచారణకైనా సిద్దం కావాలి తప్ప తాను ఆడించినట్లు ఆడే వారితో ‘సిట్’ వేయడమేంటని నిలదీశారు. సీఎం సహా టీడీపీ నేతలకు జగన్ పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతోందన్నారు. దేశంలో మరెక్కడా ఇంత పెద్ద స్కాం జరగలేద్నారు. రికార్డులు తారుమారు చేసే హుద్‌హుద్ తుఫాన్లో రికార్డులు గల్లంతయ్యాయని చెప్పడం దుర్మార్గమన్నారు. ఓట్లు వేసి గెలిపించిన పాపానికి విశాఖ ప్రజల భూములను బలవంతగా లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు. మూడేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కేవలం దోచుకోవడం, దాచుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో జరుగుతున్న అక్రమాలు, స్కాంలపై విచారణకు సిద్ధం కాకుండా ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత విమర్శలకు దిగడం టీడీపీ నేతల దిగజారుగుతనానికి నిదర్శమన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా వర్ల రామయ్యను ప్రజలు తిరస్కరించారని, అయితే సీఎం వద్ద తన మనుగడ కాపాడుకునేందుకు జగన్ పై విమర్శలు చేస్తున్నారని చింతల రామచంద్రారెడ్డి అన్నారు. -
హైదరాబాద్ నీటి సరఫరాపై మాటల యుద్ధం
-
ఎమ్మెల్యే భూమి పూజ.. స్థానికుల ఆందోళన
హైదరాబాద్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 1 వెంగల్రావు పార్కు వెనుకాల దోబీఘాట్ బస్తీలో వ్యాయామశాల నిర్మాణానికి మంగళవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి భూమి పూజ చేశారు. అయితే ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వద్దంటూ స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పనులను తక్షణం నిలిపివేయాలంటూ స్థానికులంతా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే వారందరినీ శాంతింపజేసి ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వల్ల ప్రయోజనాలను తెలియజేశారు. పార్కు పక్కన ఉన్న పార్కింగ్ స్థలం నుంచి వ్యాయామశాలకు రోడ్డు నిర్మిస్తామని దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. ఇక్కడ వ్యాయామశాల నిర్మాణం వల్ల దళిత యువకులకు ప్రయోజనం ఉంటుందన్నారు. సుఖ్‌దేవ్‌నగర్, రామకష్ణానగర్, బాలాపురబస్తీ, గాందీపుర బస్తీ, దేవరకొండ బస్తీ, ఇలా అన్ని ప్రాంతాల యువకులు వినియోగించుకోవడానికి వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు కిషన్, అభిలాష్, రవి, శివ, ప్రవీన్, వీరాస్వామి, చంద్రశేఖర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
’మోదీ నిర్ణయం హర్షణీయం’
హైదరాబాద్ : నల్లధనం వెలికితీతకు భారత ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నోట్ల రద్దుతో దేశంలో నల్లధనం పూర్తిగా బయటకు రావడంతో పాటు నకిలీ నోట్లను అరికట్టవచ్చని చింతల చెప్పారు. కొద్ది రోజులు ఇబ్బందులు ఉన్నా రాబోయే రోజుల్లో దేశం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశముంటుందన్నారు. ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే చింతల చెప్పారు. -
ఇనుగుర్తిలో దీక్షలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే సంఘీభావం
కేసముద్రం : చారిత్రక ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు మంగళవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రతోపాటు, భౌగోళికంగా అన్ని వనరులున్న ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు సాధన సమితిసభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. దీక్షలో కూర్చున్న సిరంశెట్టి నవీన్ కుమార్, కూటికంటి ప్రణయ్, గణేష్, మధు, కిరణ్‌కుమార్, సాయికుమార్, దయాకర్, ప్రశాంత్‌కు పూలమాలలు వేశారు. రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్‌రావు, సాధనసమితి కన్వీనర్ చిన్నాల కట్టయ్య, కోకన్వీనర్ దార్ల భాస్కర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నేడు కేబీఆర్ పార్కు వద్ద తిరంగా యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు, దేశ స్వాతంత్య్రంతో పాటు హైదరాబాద్ సంస్థానానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించేందుకు కృషి చేసిన వీరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేత, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 6.30కి కేబీఆర్ పార్కు వద్ద నిర్వహిస్తున్న ఈ యాత్రకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కేబీఆర్ పార్కు చుట్టూ 5.2 కి.మీ. పరిధిలో యాత్ర నిర్వహిస్తామన్నారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనాచౌదరి, జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, ప్రముఖులు పద్మనాభయ్య, బీవీఆర్ మోహన్‌రెడ్డి, డివి మనోహర్, పార్టీ నేతలు పి. మురళీధర్‌రావు, డా.కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి ఎన్.రామచందర్‌రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొంటారని చెప్పారు. -
మహాగణపతి పూజకు మొదటి ఆహ్వానం
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకు గవర్నర్ దంపతులను ఆహ్వానిస్తూ గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌లు ఆహ్వాన పత్రికను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా 5వ తేదీ ఉదయం 9.30 గంటలకు గవర్నర్ దంపతులు మహాగణపతికి తొలి పూజ నిర్వహించేందుకు ఆహ్వానించినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. ముఖ్యమంత్రిని కేసీఆర్‌నూ ఆహ్వానిస్తామని తెలిపారు. రాష్ట్ర మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎన్.ప్రేమ్‌రాజ్, నగేష్, వంశీ తదితరులు ఉన్నారు. -
ఈసారి శక్తిపీఠ మహాగణపతి
58 అడుగుల ఎత్తులో దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణేశుడు హైదరాబాద్: ఏటా వివిధ రూపాల్లో కొలువుదీరే ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం ‘‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’’గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 58 అడుగుల ఎత్తులో రూపొందిస్తున్నట్టు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. శనివారం ఈ మహాగణపతి చిత్రాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. వినాయక చవితి నాటికి ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద సబ్వే పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. ‘శక్తి పీఠాలను దర్శించుకొంటే జ్ఞానం, శక్తి అనుగ్రహం దక్కుతాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో తిరుపతి బాలాజీ, బృందావన సహిత గోవర్ధనగిరిని ఏర్పాటు చేయాలని సూచించా. వీటికి అనుగుణంగానే శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా నామకరణం చేశాం’ అని మేడిపల్లి జ్యోతిర్మయ మహాపీఠం దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఇవీ ప్రత్యేకతలు... నీలి వర్ణంలో నిలిచుని అభయమిచ్చే మహాగణపతి కుడివైపు 18 శక్తిపీఠాలలో మొదటిదైన శ్రీలంకలోని శాంకరీదేవి విగ్రహం, ఎడమవైపు చివరి శక్తిపీఠమైన జమ్ముకశ్మీరులోని సరస్వతి విగ్రహం 10 అడుగుల ఎత్తులో ఉంటాయి. వినాయకుడి వెనుకవైపు భారీ పుట్ట, దానికి ఇరు వైపులా పాలాభిషేకం చేస్తున్నట్టు రెండు ఆవులు, భారీ శివలింగం ఉంటాయి. మహాగణపతిపై పడగవిప్పిన శేషు ఉంటుంది. గణపతి ఆరు చేతుల్లో విష్ణుచక్రం, శంకం, ఆశీర్వాదం, లడ్డూ, గధ, కమలం ఉంటాయి. ఇక గణపతికి ఇరువైపులా 15 అడుగుల ఎత్తులో తిరుమల వెంకన్న, బృందావన సహిత గోవర్ధనగిరిధారుడు దర్శనమిస్తారని శిల్పి రాజేంద్రన్ తెలిపారు. -
ఈటలను టీఆర్ఎస్ అధ్యక్షుడిని చెయ్యగలరా ?
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు చింతల రామచంద్రారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్న బహిరంగసభను చూసి టీఆర్ఎస్ ఓర్వలేక పోతుందని చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. అమిత్ షా వ్యాఖ్యలకు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర ఉలిక్కిపడి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రూ. 90 కోట్లు కాదు.... రూ. 1.16 లక్షల కోట్లు కేంద్రప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ లేదా ఫామ్‌హౌస్‌లో అయిన బహిరంగ చర్చకు సిద్ధమని చింతల రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో కరువు నివారణకు రూ. 791 కోట్లు మోదీ ప్రభుత్వం మంజూరు చేస్తే... ఆ సొమ్ము ఒక్క రైతుకైనా ఇచ్చారా ? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ను టీఆర్ఎస్ అధ్యక్షుడిని చెయ్యగలరా? అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ఫాంహౌస్, సచివాలయంలో సీఎం కేసీఆర్ ఎన్ని రోజులు ఉన్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మోదీ కేంద్రంలో అధికారంలో చేపట్టి రెండేళ్లు పూర్తి అయన సందర్భంగా వికాస్ పర్వ్ పేరిట దేశవ్యాప్తంగా బీజేపీ విజయోత్సవ సభలు నిర్వహిస్తుంది. అందులోభాగంగా ఇటీవల ఆ పార్ట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ప్రతిస్పందించారు. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై చింతల రామచంద్రారెడ్డిపై విధంగా స్పందించారు. -
'తెలంగాణ ప్రజలే కేసీఆర్‌కు గుణపాఠం చెబుతారు'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అహంభావంతో మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలే ఆయనకి గుణపాఠం చెబుతారని అన్నారు. గురువారం హైదరాబాద్‌లో చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... ప్రధాని మోదీని కేసీఆర్ కలుస్తున్నారుగాని.. మేం మిమ్మల్ని కలవగలమా అని ప్రశ్నించారు. మీరు ఫాంహౌస్‌లో ఎన్ని రోజులున్నారో... సచివాలయంలో ఎన్ని రోజులున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని కేసీఆర్‌ను చింతల డిమాండ్ చేశారు. 600 జిల్లాలను బీజేపీ పరిపాలిస్తే... 10 జిల్లాలను పరిపాలిస్తున్న కేసీఆర్‌కు ఇంత అహంభావమా అని చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. -
ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ విఫలం
పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన విషయంలో టీడీపీ, బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం ఎమ్మెల్యే పీలేరులో మాట్లాడుతూ కేంద్రంలో బీజీపీ, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ప్రత్యేక హోదా కల్పించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా లేకుంటే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని సీఎం చంద్రబాబుకు తెలిసినా, ఈ విషయంపై గట్టిగా కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం లేదని దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై అడగలేక పోతున్నారన్నారు. కేంద్రంతో టీడీపీ పొత్తుపెట్టుకుని ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది ఏళ్లు ఇస్తామని బీజేపీ, పదే ళ్లు పరి పోదు పదిహేనేళ్లు ఇవ్వాలని చంద్రబాబు మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఊసేలేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పీలేరు నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, ప్రజలు, మేధావులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. -
ఐసీడీఎస్ కార్యాలయమా... బార్ అండ్ రెస్టారెంటా ?
ఎమ్మెల్యే చింతల తీవ్ర ఆగ్రహం వాల్మీకిపురం: వందలాది మంది మహిళలు పనిచేస్తున్న చిత్తూరు జిల్లాలోని వాల్మికీపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం నిత్యం బార్ అండ్ రెస్టారెంట్లా మారిందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరుణమ్మ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఇంటి ముందు ఉన్న ఐసీడీఎస్ కార్యాలయంలో రాత్రి పది గంటలు దాటిన తరువాత కూడా అధికారులు, బయటి వ్యక్తులు మద్యం సేవిస్తూ ప్రభుత్వ కార్యాలయాన్ని బార్లాగా మార్చేశారని మండిపడ్డారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాల బిల్లుల్లో అవకతవకలు, జాప్యం చోటుచేసుకున్నా సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చారావాండ్లపల్లెలో అంగన్వాడీ స్థలాలు ఆక్రమణకు గురైనా అధికారులు కళ్లు మూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఇంకుడు గుంతలు తవ్వి ఆదర్శ వుండలంగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను గ్రావూల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ సవూవేశంలో జెడ్పీటీసీ సభ్యులు శ్రీవల్లి, మండల ప్రత్యేక ఆహ్వానితులు హరీష్‌రెడ్డి, తహశీల్దార్ సురేంద్ర, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలు అరికట్టలేరా?: కొరుముట్ల
- బస్సులు అతివేగంతో వెళుతున్నా పట్టించుకోవడంలేదు - రోడ్డు ప్రమాదాలపై పలువురు సభ్యుల ఆవేదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్లు రక్తమోడుతున్నాయి. ప్రమాదాలు తీవ్రమవుతున్నా నివారణ చర్యలు చేపట్టడం లేదని, రోడ్లపై ఎక్కడా రేడియం స్టిక్కర్లు లేవని, మలుపుల వద్ద ఎలాంటి ముందస్తు సూచనలు లేవని, ప్రైవేటు బస్సులు మితిమీరిన వేగంతో వెళుతున్నా పట్టించుకునే వారు లేరని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్డు ప్రమాదాలపై సుమారు ఇరవై నిముషాల పాటు శాసన సభలో చర్చ జరిగింది. చెన్నై-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోజూ ప్రమాదాలు సంభవించి పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణిస్తున్నా పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వేకోడూరు) అన్నారు. ప్రధానంగా రేణిగుంట, కడప మార్గంలో ప్రతి రోజూ ప్రమాదం జరిగి ప్రయాణికులు, ప్రజలు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగుతున్న చోట స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలంటే, అలా చేస్తే హైవేలకు అర్థం లేదని చెప్పడమంటే జనాన్ని చంపడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా గొల్లపూడి వద్ద మెడికోల మృతి ప్రైవేటు బస్సుల అతి వేగానికి నిదర్శనమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ప్రైవేటు బస్సుల వేగానికి అడ్డూ అదుపూ లేకపోవడం వల్లనే మెడికోలు మృతి చెందారన్నారు. హైవేలలో వేగ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని, ఇష్టారాజ్యంగా వెళ్లడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు అన్నారు. తక్షణమే హైవేల పక్కనే ఉన్న వైన్ షాపులను తొలగించాలని డిమాండ్ చేశారు. 2014-15తో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రమాదాలు శాతం 1.4 మేర తగ్గుముఖం పట్టాయని మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. -
'తండ్రీకొడుకులిద్దరిది మైండ్ గేమ్'
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి శుక్రవారం చిత్తూరులో నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీ క్లోజ్ కావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు ఏపీలో తండ్రీకొడుకులిద్దరూ మైండ్‌గేమ్ మొదలుపెట్టారని ఆరోపించారు. రానున్న కాలంలో ఏపీలో టీడీపీ నుంచి వలసలు ప్రారంభమవుతాయని వారు జోస్యం చెప్పారు. -
గో సంరక్షణతో రైతు ఆత్మహత్యల నివారణ
దయచేసి గోవధ చేయవద్దు గో రక్షా దివస్‌లో పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్: గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రొత్సహించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలను నివారించవచ్చని, ఆ వైపుగా ప్రభుత్వాలు కృషి చేయాలని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులకు గోవులను పంపిణీ చేసేలా గో క్రాంతి పథకాన్ని (గతంలో పశు క్రాంతి పథకం లాగా) ప్రవేశపెట్టాలని కోరారు. గో రక్షా దివస్‌ను పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్‌బండ్ గోశాలలో గురువారం గోపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు ఆత్మహత్యల నివారణకు రైతులకు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ సరిపోవడం లేదన్నారు. గోవుల పెంపకం, పశు సంపద, పాడి తదితర అంశాలపై ప్రభుత్వాలు ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. గో రక్షణకు సంబంధించి డా.బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 48లో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. భారత భూమిలో దయచేసి గోవధ చేయొద్దని కోరారు. గో రక్షా దివస్‌గా ప్రకటించాలి ప్రతి ఏడాది డిసెంబర్ 10వ తేదీన గో రక్షా దివస్‌గా ఏపీ ప్రభుత్వం ప్రకటించినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించాలని కోరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ చింతల రామచంద్రా రెడ్ది మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పండితుల మహాసభలో 10వ తేదీన గోమాతకు పూజలు చేయాలని నిర్ణయించినట్లు, ఆ ప్రకారమే గో రక్షా పూజ నిర్వహించినట్లు తెలిపారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రకాశ్ రావు గోశాల ట్రస్టు చైర్మన్ కమల్ నారాయణ అగర్వాల్‌కు రూ. 25 వేలను విరాళంగా ఇచ్చారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
విపక్షాలు సహకరించాలి
కేంద్ర మంత్రి వెంకయ్య విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచమంతా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నరేంద్రమోదీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘చైనా ఆర్థికవృద్ధి మందగించింది. ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని దేశాలకు భారత్ ఒక్కటే ఆశాకిరణంగా నిలిచింది. ఇలాంటి కీలక సమయంలో అధికార, ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పని చేయాల్సిన అవసరం ఉంది. దేశ ఆర్థిక అభివృద్ధి వేగంగా పెరగడానికి అవసరమైన చట్టాల ఆమోదంలో ప్రతిపక్ష పార్టీలు క్రియాశీలక పాత్ర పోషించాలి. జీఎస్టీ, భూ సేకరణ (సవరణ) వంటి కీలక బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. అందరికీ అవకాశాలు కల్పిస్తే తప్పెలా అర్హత కలిగినప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులకు విద్యావ్యవస్థలో కీలక స్థానాలను అప్పజెప్పడం తప్పెలా అవుతుందని వెంకయ్య ప్రశ్నించారు.ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్షపై వెంకయ్య స్పందిస్తూ రాజకీయ పార్టీలు తమకు నచ్చిన కార్యక్రమాలను చేసుకోవడంలో తప్పు ఏముంటుందన్నారు.హోదా కోసం ఇటీవలే కోటి ఎస్ఎంఎస్ల ఉద్యమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు తనకు ఒక్క ఎస్ఎంఎస్ కూడా రాలేదని చెప్పారు. -
ర్యాగింగ్‌ను అరికట్టండి
వాల్మీకిపురం: కళాశాలల్లో జరుగుతున్న ర్యాగింగ్‌ను అరికట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ నాయకులు బుధవారం ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని వాల్మీకిపురంలోని ఆయన స్వగృహం లో క లుసుకున్నారు. స్టాప్ ర్యాగింగ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ కళాశాలల్లో మొదటి సంవత్సరం చేరే విద్యార్థులను పరిచయం చేసుకోవాలని, సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. పరిచయాల సాకుతో ర్యాగింగ్‌కు పాల్పడడం సబబుకాదన్నారు. ఇటీవల నాగార్జున యూనివ ర్సిటీలో ర్యాగింగ్ భూతానికి ఓ అమ్మాయి బలికావడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సెక్రటరీ చక్రధర్, జిల్లా సెక్రటరీ కుమార్, విద్యార్థులు ఇంతియాజ్, శ్రీనాధ్, శ్రీకాంత్, పవన్, నాగ, ప్రశాంత్, చరణ్, హరి, ప్రసాద్, జగదీష్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రోజుకో ప్రకటన, పూటకో హామీతో వంచన విదేశీ పర్యటనలతో సాధించింది శూన్యం పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజం పీలేరు: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేల వ్యవస్థను నిర్వీర్యం చేశారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రోజుకో ప్రకటన, పూటకో జీవోతో రాష్ట్ర ప్రజలను ఇంకా సీఎం చంద్రబాబు వంచిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధులు మంజూరు చేయకుండా అభివృద్ధి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదన్నారు. చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 67 మంది శాసన సభ్యులున్నారన్న అక్కసుతో నిధులు మంజూరు చేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిధులు మంజూరుచేసినా చేయకపోయినా తాము నిత్యం ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల పరిష్కారంకోసం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తామన్నారు. సీఎం ఈ జిల్లా వాసిగా ఉండి ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహల్లో విహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రుణమాఫీపై రైతులు, డ్వాక్రా మహిళలు కోటి ఆశలతో ఎదురు చూశారని, అయితే వారి ఆశలను సీఎం ఉసూరుమనిపించారని అన్నారు. అధికార యంత్రాంగం ఏపనీ చేయకుండా చేతులెత్తేసిందని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన హామీలను అప్పటికప్పుడే అమలు చేశారని, అయితే బాబు చేసిన సంతకాలకు దిక్కు లేదని విమర్శించారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం బాబు ద్వంద నీతికి నిదర్శనమన్నారు. -
మిషన్-150తో సమస్యల పరిష్కారం
జూబ్లీహిల్స్ (హైదరాబాద్) : ప్రజా సమస్యలు తెలుసుకోవడం, సాధ్యమైనంత వరకు వాటిని అక్కడికక్కడే పరిష్కరించే దిశలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి చేపట్టిన మిషన్-150 కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఆయన శనివారం జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్, గౌతంనగర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆయనకు వారి గోడు వెళ్లబోసుకున్నారు. మూడేళ్ల నుంచి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వీధి దీపాలు బాగుచేయడం లేదని చెప్పడంతో ఆయన అక్కడి నుంచి ఏఈ నరేందర్‌రాజుతో ఫోన్లో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఛత్రపతి శివాజీనగర్‌లో కూడా పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
టీటీడీ బోర్డు సభ్యునిగా ఎమ్మెల్యే చింతల
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తిరుమల శ్రీవారికి పరమ భక్తుడైన చింతలకు టీటీడీ బోర్డు సభ్యత్వం రావడంతో ఆయన అనుచరులు కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇంకా టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరన్న విషయం మాత్రం ఖరారు కాలేదు. దీని కోసం టీడీపీ వర్గాల్లోనే పోటీ తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో కనుమూరి బాపిరాజు రెండుసార్లు బోర్డు చైర్మన్ పదవిని నిర్వర్తించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇంకా ఎవరినీ చైర్మన్‌గా నియమించలేదు. -
టీఆర్ఎస్ పాలన బ్రిటీష్ రాజ్యాన్ని తలపిస్తోంది: చింతల
బాన్సువాడ(నిజామాబాద్ జిల్లా): తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుతామని ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్...బ్రిటిషర్లు, నిజాములను తలపించే విధంగా పాలన కొనసాగిస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ) విమర్శించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు అన్యాయంగా ఇతర పార్టీల నాయకులు, ప్రజలను వేధిస్తున్నారని, అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నించిన వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న భవనం గురించి ప్రశ్నించినందుకు స్థానిక బీజేపీ నేత రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బాన్సువాడ సీఐ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి జిల్లా ఎస్పీకి తాను ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. -
మా మీద నిందలు వేస్తారా: చింతల
హైదరాబాద్ : కేంద్రం నుంచి నిధులు రావటం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పటం సరికాదని ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రం సహకరిస్తున్నా... తమపై నిందలు వేయటాన్ని ఖండించారు. అలాగే యువతకు ఉపాధి విషయంలో కూడా తెలంగాణ బడ్జెట్లో ప్రస్తావన ఇవ్వలేదన్నారు. -
విఐపి రిపోర్టర్ - ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
-
రోజుకో ప్రకటనతో వంచన
పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరు: సీఎం చంద్రబాబు రోజుకో ప్రకటనతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. గురువారం పీలేరు లో రెండో విడత వార్డుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు హామీలను నమ్మి, ప్రజలు ఆయనకు పట్టం కట్టారని, అయితే ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆరోపించారు. కాలు తీసి కాలుపెడితే ప్రత్యేక విమానాల్లో విహరించే సీఎం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని చెప్పుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రామాల్లోని ప్రజలకు తాగడాని కి గుక్కెడు మంచినీరు దొరకక ఆహాకారాలు చే స్తున్నా ఈ ప్రభుత్వం స్పందించక పోవడడం దారుణమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు గెలిచారన్న అక్కసుతో నియోజక వర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా, ప్రజల బాగోగులు తెలుసుకోవడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పల్లెబాట, వార్డు బాట కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం బాబు ద్వంద నీతికి నిదర్శనమన్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి ప్రజల దాహార్తి తీవ్రతను గుర్తించి పీలేరు నియోజక వర్గానికి ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ కన్వీనర్ నారే వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కే. మహితాఆనంద్, జెడ్పీటీసీ సభ్యుడు ఎం. రెడ్డిబాషా, కోఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్ బాషా, పార్టీ నాయకులు కడప గిరిధర్‌రెడ్డి, బీడీ నారాయణరెడ్డి, ఎం.భానుప్రకాష్‌రెడ్డి, శ్రీరాములురెడ్డి, గాయం భాస్కర్‌రెడ్డి, సుంకర చక్రధర్, చామంతుల వెంకటరమణ, ఉదయ్‌కుమార్, ఎస్. గౌస్‌బాషా, ఆదినారాయణ, వీపీ. రమేష్, పూలకుమార్, ధర్మానందరెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
తిరుమలలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చింతల
తిరుమల : చిత్తూరు జిల్లా పీలేరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంగళవారం తిరుమల విచ్చేశారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో వెంకన్నను దర్శించుకున్న చింతల రామచంద్రారెడ్డికి ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని.... వర్షాలు కురవాలని ఆ దేవుడిని ప్రార్ధించినట్లు చెప్పారు. -
వీఐపీల దర్శనంపై ఉన్న శ్రద్ధ ...
హైదరాబాద్: అన్యాక్రాంతమైన తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణలో టీటీడీ అధికారులు అనుసరిస్తున్న వైఖరీపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుధవారం మండిపడ్డారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు మాట్లాడుతూ... టీటీడీ అధికారులకు వీఐపీ దర్శనంపై ఉన్న శ్రద్ధ... ఆస్తుల రక్షణపై లేదని ఆరోపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా టీటీడీకి కోట్ల ఆస్తులున్నాయని గుర్తు చేశారు. వాటిని పరిరక్షించాలన్న ఆసక్తి టీటీడీ అధికారుల్లో కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడి ఆస్తుల పరిరక్షణ, పర్యవేక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు డిమాండ్ చేశారు. -
రుణ మాఫిపై షరతులు సరికాదు: బీజేపీ
హైదరాబాద్: ఎలాంటి షరతులు, పరిమితులు లేకుండా రైతుల రుణాలను మాఫీ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేఎల్పీ ఉప నేత చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధుల బృందం గురువారం వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో భేటీ అయింది. 2013-14 పంట రుణాలనే మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినట్టు వస్తున్న వార్తలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఇలా మాట మార్చడం భావ్యం కాదని, తెలంగాణ రైతుల ఆశలు ఆవిరయ్యేలా చేయొద్దని కోరారు. సహకార, వాణిజ్య, గ్రామీణ బ్యాంకుల నుంచి తీసుకున్న అన్ని రకాల రుణాలనూ మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో పుస్తకాన్ని మంత్రికి చూపుతూ, దానికి విరుద్ధంగా వ్యవహరించొద్దని కోరారు. రైతులందరికీ రూ.లక్ష వరకు ఉన్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను మాఫీ చేయాలని, కౌలు రైతులు తీసుకున్న రుణాలకూ దీన్ని వర్తింపజేయాలని, కాలవ్యవధి, షరతులు పెట్టొదని వినతిపత్రం అందజేశారు. నిరుటి రుణాలకే మాఫీ అన్న వార్త నిజం కాదని పోచారం పేర్కొన్నట్టు భేటీ అనంతరం నేతలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి, మల్లారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆచారి, నేతలు మధుసూదన్‌రెడ్డి, పాపయ్యగౌడ్, నర్సింహారెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
'కిరణ్ ఊర్లో వెబ్ కెమెరాల ద్వారా నిఘాపెట్టాలి'
చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై దృష్టి సారించాలని ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం, గ్రామంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని ఎన్నికల అధికారులకు రాజంపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, పీలేరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిలు కోరారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశముందని, వెబ్ కెమెరాల ద్వారా పొలింగ్ సరళి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డిలు కోరారు. -
వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడాలి
పీలేరు, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని, అందుకోసం పార్టీ కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని ఆ పార్టీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గ సమన్వయకర్త చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలో మంగళవారం విస్తృతంగా పర్యటించా రు. కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరి బెదిరింపులకు భయపడొద్దని, అండ గా ఉంటామని భరోసా ఇచ్చారు. పీలేరులో చింతల రామచంద్రారెడ్డి ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల కొనసాగుతున్నాయని తెలిపారు. మూడేళ్ల పాలనలో కిరణ్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన పీలేరులో మంచినీటి ఎద్దడితో జనం అల్లాడుతున్నారని, బిందె తాగునీరు రూ.3 వెచ్చించి కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పరిశ్రమల ఏర్పాటు పేరిట వందలాది ఎకరాలను రైతుల నుంచి లాక్కొన్నారని ఆరోపించారు. ఆ భూముల్లో కిరణ్ వేసిన శిలాఫలకాలు తప్ప ఒక్క పరిశ్రమ కూడా లేదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాగానే తిరిగి భూములను అప్పగిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రావన్నారు. లాస్ట్బాల్ అంటూనే చివరి ఫైల్ వరకు రేయింబవళ్లు సంతకాలు పెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీ అడ్ర స్సు గల్లంతు అవుతుందన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమన్నారు. సమావేశంలో పార్టీ నాయకు లు నారే వెంకట్రమణారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి మల్లెల రెడ్డిబాషా, భానుప్రకాష్‌రెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, ఎం.ఆదినారాయణ, ఎం.రవీంద్రనాథరెడ్డి, డి.జగన్మోహన్రెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, ఎస్.హబీబ్‌బాషా, షామియానా షఫీ, రామిరెడ్డి, బాబ్జిరెడ్డి, సదుం నాగరాజ, ఉదయ్‌కుమార్, శ్రీనివాసు లు, కాకులారంపల్లె రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.