
సాక్షి, పీలేరు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర విపక్ష నాయకుడు వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజాసంకల్ప యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రతో రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం కావడం తద్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ.. పాదయాత్రను అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలైన ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చలేదన్నారు.
ఎన్ని కుట్రలు చేసిన పాదయాత్ర కొనసాగుతోంది..
పాదయాత్రతో తన బండారం బయట పడుతుందనే భయంతో అడ్డుకోవడం కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడ ఎవరి అనుమతి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. నియంతలా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు ఈ రాష్ట్రానికి శాశ్వత సీఎం కాదని హెచ్చరించారు. రోజు రోజుకూ వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆరదణ చూసి ఓర్వలేని సీఎం తన ఉనికిని కాపడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాబు ఎన్ని
కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజా సంకల్పయాత్ర నిరాటకంగా కొనసాగుతుందన్నారు.
టీడీపీ పతనం..
పాదయాత్ర ప్రారంభంతో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పతనం ఆరంభమౌతుందన్నారు. ఇక బాబు మాయ మాటలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని తెలిపారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రాభివృద్ది కోసం సీఎం చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ అరచేతిలో స్వర్గం చూపుతున్నారని అన్నారు. రాజధాని కోసం సేకరించిన భూముల్లో తొడాకులు గుడ్లు పెడుతున్నాయి తప్ప సీఎం చేసిందేమీ లేదని విమర్శించారు.
రాష్ట్రాభివృద్ది గురించి ఆలోచిండం లేదు..
బాబు కేవలం కమీషన్ల కోసం పాకులాడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని ద్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. దీనిని నుంచ ప్రజల దృష్టిని మల్లించడం కోసం సీఎం కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని పేర్కొన్నారు. జగన్ పాదయాత్రతో టీడీపీ కనుమరుగౌతుందన్నారు. ప్రజల కోరిక మేరకు వైఎస్ జగన్ సీఎం కావడం తద్యమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment