జూబ్లీహిల్స్ (హైదరాబాద్) : ప్రజా సమస్యలు తెలుసుకోవడం, సాధ్యమైనంత వరకు వాటిని అక్కడికక్కడే పరిష్కరించే దిశలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి చేపట్టిన మిషన్-150 కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఆయన శనివారం జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్, గౌతంనగర్ బస్తీలో పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆయనకు వారి గోడు వెళ్లబోసుకున్నారు. మూడేళ్ల నుంచి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వీధి దీపాలు బాగుచేయడం లేదని చెప్పడంతో ఆయన అక్కడి నుంచి ఏఈ నరేందర్‌రాజుతో ఫోన్‌లో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఛత్రపతి శివాజీనగర్‌లో కూడా పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.