jublihills
-
మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో మరో ట్విస్ట్
-
ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ రాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. లంబోర్గిని కారు నడిపింది ప్రముఖ రియాల్టర్ కార్తికేయ మ్యాడం అని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇటీవల ‘ఎక్స్’ ట్విటర్లో వీడియో పోస్ట్ గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కారు రిచ్ మౌంట్ వెంచర్స్ సంస్థ అధినేత కార్తికేయ మీద ఉన్నట్లు తేలడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు నెలల క్రితం కారు జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ వైపు కార్తీకేయ కారు నడిపినట్లు విచారణలో వెల్లడింది. ప్రస్తుతం కార్తికేయ దుబాయిలో ఉన్నట్లు సమాచారం. కార్తీకేయ మీద చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. ఒకరి మృతి.. కేసు నమోదు -
వెంగళరావునగర్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం
హైదరాబాద్: బోనాల వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వీరంగం సృష్టించారు.వెంగళరావునగర్‌లో బోనాల వేడుకలు జరుగుతుండగా అక్కడకొచ్చిన ఎమ్మెల్యే గోపీనాథ్ ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆ బోనాల వేడుకల్లో భాగమైన సామాన్య వ్యక్తి గణేష్ ఇంటిపై దాడి చేశారు. తన అనుచరులతో కలిసి గణేష్ ఇంట్లోకి చొచ్చుకువెళ్లి దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడగా.. వారు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. చదవండి: లాల్‌దర్వాజ బోనాలు: ఆలయం వద్ద చికోటీ ప్రవీణ్ ఓవరాక్షన్! -
హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదు
హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఐపీఎస్ అధికారి కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు హంగామా చేసిందన్న ఆరోపణలతో ఆమెపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్కేఆర్ ఎన్క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసముంటున్నారు. అదే అపార్ట్మెంట్లోని టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారట. అయితే ఐపీఎస్ అధికారి కారు పార్క్ చేసే స్థలంలో డింపుల్, ఆమె స్నేహితుడు తమ బీఎండబ్ల్యూ కారును పెట్టడంతోపాటు పలుమార్లు గొడవకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. డీసీపీ వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్లను కాలితో తన్నడం వంటివి చేశారు. ఇదే క్రమంలో ఈ నెల 14న డీసీపీ వాహనాన్ని డింపుల్ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు కారును కాలితో తన్నుతూ వీరంగం సృష్టించింది. ఇదేంటని ప్రశ్నించిన డ్రైవర్‌తోనూ గొడవకు దిగింది. ఇదే విషయంపై డింపుల్, ఆమె స్నేహితుడు విక్టర్ డేవిడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలె డింపుల్ గోపీచంద్‌తో కలిసి రామబాణం అనే సినిమాలో నటించింది. -
బెడిసికొట్టిన జనసేన, టీడీపీ వికృత వ్యూహాం
-
జూబ్లీహిల్స్ పబ్‌లలోనే రాత్రి 10 దాటితే నో మ్యూజిక్: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల వ్యవహారంలో మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. 10 పబ్‌లలో రాత్రి పది గంటల తర్వాత మ్యూజిక్ వినిపించకూడదని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని అప్పీలు చేసింది రెస్టారెంట్ అసోసియేషన్. ఈ అప్పీలుపై విచారణ సందర్భంగా డివిజనల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు జూబ్లీహిల్స్‌లోని 10 పబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 26న పబ్‌లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే మైనర్లను కూడా పబ్‌లలోకి అనుమతివ్వొద్దని ఆదేశించారు. ఇదీ చదవండి: కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్ ఓ.. ప్చ్! యాప్ ఎంతపని చేసింది? -
DAV స్కూల్ గుర్తింపు రద్దుతో అయోమయంలో పేరెంట్స్
-
దాండియా జోష్...స్టెప్పులు అదరహో..
-
దాండియా జోష్...స్టెప్పులు అదరహో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో దాండియా సందడి మొదలైంది. శిల్పి ఈవెంట్స్, ఎస్కే క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నగరంలోనే అతిపెద్ద ‘నవరాత్రి ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాల్లో పాల్గొని, ఉత్తమంగా నృత్యం చేసిన వారికి రూ.25 లక్షల విలువ చేసే బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ, నిర్వాహకులు శ్రీకాంత్ గౌడ్, కిరణ్, సంజయ్ జైన్, కైలాష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నగరం వేదికగా నవరాత్రి సందడి వైభవంగా మొదలైంది. ఇందులో భాగంగా ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ వేదికగా ప్రీ నవరాత్రి ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ వేడుకల్లో సంప్రదాయ గర్బా నృత్యంతో పాటు దాండియాతో అలరించారు. (చదవండి: సిరి పట్టు చీర న్యూజిల్యాండ్ వెళ్లింది) -
మైనింగ్ పేరుతో టోకరా!
పంజగుట్ట: మైనింగ్‌లో లాభాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మాజీ మంత్రి సీనియర్ కాగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ, మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏకే ఖాన్‌పై న్యాయస్థానం ఆదేశాల మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. టౌలీచౌకీకి చెందిన వ్యాపారి మహ్మద్ అబ్దుల్ వాహబ్కు జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి మోహ్సిన్ ఖాన్ పరిచయం ఉంది. మోహ్సిన్ ఖాన్ తనకు బంజారాహిల్స్‌లో సన్‌లిట్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రిజిస్టర్ సంస్థ ఉందని దానికి తానే ఎండీనని చెప్పాడు. తపస్వీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఖమ్మ జిల్లా, రామానుజవరంలో 46 ఎకరాల్లో ఇసుక మైనింగ్ టెండర్ దొరికిందని, ఆ సంస్థతో తమ సంస్థ 25 శాతం వాటాకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పాడు. 25 శాతం వాటాలో సుమారు రూ.6.5 కోట్లు లాభం వస్తుందని అబ్ధుల్ వాహబ్‌ను నమ్మించాడు. రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నట్లు నకిలీ పత్రాలు చూపించాడు. తనతో చేతులు కలిపితే నీకు 50 శాతం వాటా ఇస్తానని అందుకుగాను రూ.90 లక్షలు చెల్లించాలని కోరాడు. మోహ్సిన్ ఖాన్ చెప్పిన మాటలు అబ్థుల్ వాహబ్ నమ్మక పోవడంతో తన మామ జూబ్లీహిల్స్‌కు చెందిన రాజకీయ నాయకుడు మొహ్మద్ అలీ షబ్బీర్‌ను (షబ్బీర్ అలీ)ని పరిచయం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా చేయడంతో బాధితుడు అబ్థుల్ వాహబ్ అతడిని గుర్తుపట్టాడు. కుందన్‌బాగ్‌లో ఉంటున్న మాజీ పోలీస్ ఉన్నతాధికారి అబ్థుల్ ఖయ్యూం ఖాన్ (ఏకే ఖాన్)ను కూడా అతడికి పరిచయం చేశాడు. దీంతో అబ్థుల్ వాహబ్ అతడి మాటలు నమ్మి 2016లో బ్యాంకు ద్వారా, నగదు ద్వారా రూ.90 లక్షలు చెల్లించాడు. సంవత్సరాలు గడుస్తున్నా లాభం ఇవ్వకపోగా మొహం చేయడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మోహ్సిన్ ఖాన్ బాధితుడిని బెదిరించడం, తప్పించుకుని తిరగడం చేస్తుండడంతో బాధితుడు నాంపల్లి కోర్టును ఆదేశించారు. కోర్టు ఆదేశాలమేరకు పంజగుట్ట పోలీసులు మోహ్సిన్ ఖాన్, మొహ్మద్ అలీ షబ్బీర్, అబ్థుల్ ఖయ్యూం ఖాన్‌లపై 465, 420, 406, ఐపీసీ రెండ్‌విత్ 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. (చదవండి: సెల్‌ఫోన్ వాడడు..సీసీ కెమెరాకు చిక్కడు..శ్మశానంలోనే తిండి నిద్ర) -
Telangana: సీఎం హామీలు నేరవేరేనా..?
సాక్షి,మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ నగర శివారు హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న సీఎం హామీ నీరుగారిపోతోంది. 2020 అక్టోబర్ 29న గ్రేటర్ సమీపంలోని మూడు చింతలపల్లి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రాంరంభోత్సవం సందర్భంగా నగర శివారు హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తానని ఆయన హమీ ఇవ్వటంతో పాటు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాలను ఆదేశించారు. దీనిపై స్పందించిన అధికార యంత్రాంగం శివారుల్లో హారి్టకల్చర్ హాబ్ను అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల వ్యవధిలో రూ.250 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. ► మూడేళ్లలో అదనంగా 30 వేల ఎకరాల్లో ఉద్యానవన (హార్టికల్చర్) పంట సాగు చేసేందుకు ప్రతిఏటా 10 వేల ఎకరాల చొప్పున దశలవారీగా హార్టికల్చర్ పంట సాగు పెంచుతామని నివేదించింది. ► అలాగే శాఖలో ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బందికి అదనంగా ఏడుగురు హారి్టకల్చర్ అధికారులు, 10 మంది హెచ్ఈఓ పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో కోరారు. అయితే ప్రతిపాదనలు నివేదించి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఉద్యానవన పంట సాగు పెంచేందుకు కావలసిన నిధులు ఇవ్వలేదు. హారి్టకల్చర్ శాఖలో అదనపు పోస్టుల మంజూరీ అటుంచితే ఖాళీ అయిన పోస్టులను కూడా భర్తీ చేయలేకపోయారు. ► ఆగిపోయిన ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనులు ► ఘట్కేసర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్డి నిర్మాణ పనులను 2009 సంవత్సరంలో రూ.39 కోట్లతో ప్రారంభించారు. నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వే శాఖ తనకు సంబంధించిన సగం వాటా నిధులు సకాలంలో విడుదల చేసి, పనులు పూర్తి చేసినప్పటికిని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద విడుదల చేయాల్సిన నిధుల జాప్యం వల్ల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోయాయి. పాత పెండింగ్ బిల్లుతో కలిపి మొత్తంగా రూ.2 కోట్లు చెల్లించకపోవటం వల్లనే బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. ► చర్లపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులిలా.. ► చర్లపల్లి ఇండస్ట్రీయల్ కారిడార్‌ను దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్–కాజీపేట రైల్వే మార్గంలో చర్లపల్లి వద్ద 2018లో రూ.24 కోట్లతో ఆర్ఓబీ పనులు ప్రారంభమయ్యాయి. అందులో సగం నిధులను కేంద్రం ప్రభుత్వం విడుదల చేయగా రైల్వే శాఖ పనులు పూర్తి చేసింది. మిగతా సగం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. అయితే...సదరు నిర్మాణ çసంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.9 కోట్లు చెల్లించకపోవటంతో అప్రోచ్ రోడ్ల పనులు చేపట్టకుండానే వదిలేశారు. దీంతో చర్లపల్లి ఆర్ఓబీ ప్రారం¿ోత్సవానికి నోచుకోవటం లేదు. ► కీసరగుట్ట దేవస్థానం అభివృద్ధికి రూ.75 కోట్లు మంజూరు చేయాలని మూడేళ్ల కిందట ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ► దాదాపు మూడేళ్లుగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు రెగ్యులర్ కలెక్టర్ లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొత్త కలెక్టరేట్ ప్రారంభం నేపథ్యంలో ఇన్చార్జ్ కలెక్టర్‌గా కొనసాగుతున్న మెదక్ కలెక్టర్ హరీష్‌ను ఇక్కడనే రెగ్యులర్ కలెక్టర్ నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ► నగర శివారు ప్రాంతంగా ఉన్న మేడ్చల్ జిల్లాను హైదరాబాద్ నగరానికి సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులు ఇవ్వటంతో పాటు పర్యాటక రంగంగా అభివృద్ధి చేయటానికి ఉన్న అవకాశాల మేరకు జిల్లాను పర్యాటక కేంద్రంగా అబివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సీఎం ఇప్పటికైనా నగర శివారు మేడ్చల్ జిల్లా సమస్యలపై స్పందించి తగిన నిధుల విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. (చదవండి: 30 వేల మంది విద్యార్థుల జాతీయ గీతాలాపన ) -
నేను..సీవీ ఆనంద్‌ను మాట్లాడుతున్న..
బంజారాహిల్స్: తన నివాసిత ప్రాంతం చుట్టుపక్కల రాత్రిపూట శబ్ద కాలుష్యం నెలకొందని చర్యలు, తగిన తీసుకోవాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ 100కు డయల్ చేశారు. దీంతో పోలీసులు కొద్దిసేపట్లోనే ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీని ఆనుకొని ఉన్న ప్లజెంట్ వ్యాలీలో నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో డప్పుల హోరుతో శబ్ద కాలుష్యం పెరగడంతో ఆయన వెంటనే 100కు డయల్ చేశారు. నైట్‌డ్యూటీలో ఉన్న జూబ్లీహిల్స్ డీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడికి వెళ్లి పరిశీలించగా సమీపంలోని ఓం నగర్ బస్తీలో తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తూ డప్పులు వాయిస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే నిర్వాహకులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని 70బి కింద పెట్టీ కేసు నమోదు చేశారు. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించారు. స్వయంగా సీపీ 100కు డయల్ చేయడం అధికారులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. (చదవండి: పెట్స్.. అదో స్టేటస్! ) -
గ్యాంగ్ రేప్ నిందితులకు డీఎన్ఏ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడు, చట్టంతో విభేదించిన బాలురకు కచ్చితంగా శిక్ష పడేలా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వీరికి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ (టీఐపీ) పూర్తి చేసిన అధికారులు నిందితులకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానాలు అనుమతి మంజూరు చేయడంతో తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అవసరమైన పక్షంలో బాధితురాలి నుంచీ నమూనాలు సేకరించాలని యోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసులో సాదుద్దీన్, మరో ఐదుగురు చట్టంతో విభేదించిన బాలురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు సైతం పట్టుబడి జువైనల్ హోమ్‌కు చేరాడు. అయితే ఇతడు కేవలం బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడానికి సంబంధించి మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సాదుద్దీన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు సహా ఐదుగురు మాత్రం గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాన్సూ బేకరీ నుంచి బాలికను ఇన్నోవా కారులో పెద్దమ్మ గుడి సమీప ప్రాంతాలకు తీసుకువెళ్లిన ఈ ఐదుగురూ గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో వెంట్రుకలు, వినియోగించిన టిష్యూ పేపర్లతో సహా అనేక ఆధారాలు సేకరించారు. బాలిక పోలీసులకు, న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలోనూ తనపై ఆ కారులోనే అఘాయిత్యం జరిగినట్లు బయటపెట్టింది. దీంతో ఇన్నోవా కారులో లభించిన ఆధారాలు క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇప్పుడు సాదుద్దీన్ సహా ఐదుగురి నుంచి సేకరించిన నమూనాలకూ పంపనున్నారు. ఈ రెండింటినీ సరిపోల్చే నిపుణులు ఆ రోజు కారులో ఉన్నది, బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది వీరేనంటూ సాంకేతికంగా నిర్థారించనున్నారు. పోలీసులు దాఖలు చేసే అభియోగపత్రాల్లోనూ ఈ అంశాన్ని పొందుపరుస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపించడానికి ఇది కీలకం కానుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కోర్టుల్లో బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలంటూ పోలీసులు కోర్టును కోరుతున్నారు. కాగా బాలికపై సామూహిక అత్యాచారంలో ఎమ్మెల్యే కుమారుడి పాత్ర లేకున్నా... బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు, ఆధారాలు ఉండటంతోనే జువైనల్ హోమ్‌కు చేరాడు. ఇతడిపై ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద సదరు ఆరోపణలు నమోదు చేశారు. ఆమ్నేషియా పబ్ వద్ద సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఓ కీలక విషయం గుర్తించారు. ఇన్నోవా కారులో అప్పటికే ఉన్న సాదుద్దీన్‌ను దింపిన ఎమ్మెల్యే కుమారుడు అక్కడే కారు ఎక్కాడని, అలా ఈ కేసులో చిక్కాడని తెలుసుకున్నారు. (చదవండి: కోర్టును ఆశ్రయించిన పోలీసులు.. ఎందుకంటే..?) -
అమ్నీషియా పబ్ కేసు: కారులో ఉంది ఎమ్మెల్యే కొడుకే!
-
అమ్నీషియా పబ్ కేసులో కీలక మలుపు.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఐదుగురు వ్యక్తులు ఓ మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదులో పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఒక మేజర్, ఇద్దరు మైనర్లు ఉన్నారు. సాజిద్ మాలిక్ (18 ), వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు (16)తో పాటు మరో మైనర్ (16)ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ఇది కూడా చదవండి: పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది? -
బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో ఎమ్మెల్యే కుమారుడు?
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్ ఇన్సోమియా పబ్ నుంచి బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్న అధికారులు సూరజ్, హాదీలను అదుపులోకి తీసుకుని ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివసించే రుమేనియా దేశానికి చెందిన బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్ఎల్ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది. పథకం ప్రకారం అప్పటికే హాదీ స్నేహితుడు సూరజ్ పబ్‌లో ఉన్నాడు. పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో తానంతట తాను వెళ్లిపోతానని బాలిక చెప్పినా వినిపించుకోని హాదీ, సూరజ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని బయలుదేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కేకలు పెట్టేందుకు యత్నించగా సూరజ్, హాదీలతో పాటు మరో యువకుడు బెంజ్ కారును అక్కడే ఉంచి ఇన్నోవా కారులో బాలికను బలవంతంగా కూర్చొబెట్టుకుని పబ్ వద్దకు తీసుకువచ్చి వదిలి వెళ్లారు. ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు హదీ, సూరజ్‌లతో పాటు మరో ముగ్గురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్ నుంచి వెళ్లిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో ఆ కారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు తేలింది. అక్కడే వదిలేసిన బెంజ్ కారును తీసుకువచ్చి సీజ్ చేశారు. అయితే.. పబ్‌లోకి బాలికను ఎలా అనుమతించారనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క నిందితుల్లోనూ ముగ్గురు మైనర్లుగా తెలుస్తోంది. (చదవండి: వివాహేతర సంబంధం: ఇంట్లో నుంచి బయటకు వెళ్లి..) -
పబ్‌గా కేఫ్ అండ్ బార్... అర్థనగ్న డ్యాన్సులతో హంగామా!
సాక్షి, హైదరాబాద్: మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) క్లబ్ టెకీల పేరుతో కేఫ్ అండ్ బార్ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని పబ్‌గా మార్చేశాడు. అది చాలదన్నట్లు డ్యాన్స్ బార్ యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ రూపమిచ్చి క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేసినట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. క్లబ్ టెకీల మేనేజింగ్ డైరెక్టర్ సైతం మహిళ కావడం గమనార్హం. బోయిన్‌పల్లికి చెందిన జి.విజయ్‌కుమార్ గౌడ్ కొన్నాళ్లుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్లబ్ టెకీలను నిర్వహిస్తున్నారు. దీనికి నళిని రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎన్.రవి దీనికి మేనేజర్/అకౌంటెంట్‌గా, సైదా జరీన్, బి.హరికృష్ణ డీజే ఆపరేటర్లుగా, బి.ప్రకాష్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. సమయ పాలన లేకపోవడంతో పాటు డీజే నిర్వహణ, డిస్కో లైట్ల ఏర్పాటులోనూ నిబంధనలు పాటించలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ మారని, అంతటితో ఆగని క్లబ్ టెకీల నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకు వేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దిగువ మధ్య తరగతి యువతులను ఆకర్షించి వారితో నృత్యాలు చేయిస్తూ డ్యాన్స్ బార్గా మార్చేశారు. ఈ యువతులు తమ హావభావాలతో పాటు చర్యలతోనూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. డ్యాన్సర్లు అభ్యంతరకరంగా నృత్యం చేస్తూ వెళ్లి కస్టమర్ల పక్కన కూర్చోవడం, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేస్తూ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారు. దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్‌కు సమాచారం అందింది. ఎస్సై సీహెచ్ నవీన్ కుమార్ బృందంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో క్లబ్ టెకీలపై దాడి చేశారు. నళిని రెడ్డి, ఎన్.రవి, సైదా జరీన్, బి.హరికృష్ణ, బి.ప్రకాష్‌లతో పాటు నృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అరెస్టు చేశారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం ఆర్ పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న విజయ్ కుమార్ గౌడ్ కోసం గాలిస్తున్నారు. పబ్‌లో రష్యన్ యువతులతో డ్యాన్సులు బంజారాహిల్స్: రష్యన్ యువతులతో అర్దనగ్న డ్యాన్స్‌లతో అర్ధరాత్రి హంగామా సృష్టించిన ఓ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–36లో ఎనిగ్మా పేరుతో ఒక రెస్టారెంట్, పబ్‌ను ప్రారంభించారు. ప్రీలాంచింగ్ అంటూ ప్రారంభించిన ఈ పబ్‌లో రష్యన్ యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు ఎౖMð్సజ్‌శాఖ నుంచి అనుమతులు తీసుకున్న పబ్ నిర్వాహకులు..పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇదే సమయంలో పబ్‌లో శనివారం రాత్రి అతిథులు పెద్దసంఖ్యలో రావడం, మద్యం మత్తులో తూలడంతో పాటు అక్కడున్న రష్యన్ యువతులతో కలిసి నృత్యాలు చేశారు. దీనికితోడు రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడం,పబ్‌లోని శబ్ధాలకు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పబ్ నిర్వాహకులైన దుర్గాప్రసాద్, చువాల్సింగ్లపై ఐపీసీ సెక్షన్ 294, ఆబ్సెంట్ చట్టం, 341, 21 ఆఫ్ 76 చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పబ్బు..గబ్బు!) -
పబ్బు..గబ్బు!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌పై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడితో వీటి కేంద్రంగా సాగుతున్న రేవ్ పార్టీలు బహిర్గతమయ్యాయి. తాజాగా రామ్‌గోపాల్‌పేటలోని క్లబ్ టెకీలపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జూబ్లీహిల్స్‌లోని ఎనిగ్మా పబ్‌పై స్థానిక పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేయడంతో వీటి కేంద్రంగా జరుగుతున్న ‘డ్యాన్సుల’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన నగర పోలీసులు అన్ని క్లబ్బుల పైనా నిఘా ముమ్మరం చేశారు. దేశ, విదేశీ యువతులతో క్యాబరేలు... పబ్స్‌లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాల్లో నగరంలోని దిగువ, మధ్యతరగతి, దేశ, విదేశీ యువతులతో చేయించే క్యాబరేలు నయా ట్రెండ్‌గా మారాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి వీటి నిర్వాహకులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు తెర తీస్తున్నారు. వివిధ మెట్రో నగరాలకు చెందిన యువతలతో పాటు టూరిస్టు వీసాలపై విదేశీ యువతుల్ని నగరానికి తెస్తున్న దళారులు పబ్స్, రిసార్ట్స్‌లో వారి ఒంపుసొంపులను ఎరగా వేసి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. పర్యాటకం ముసుగులో సాగుతున్న ఈ వ్యాపారం వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఎప్పుడైనా దాడులు జరిగినపుడు ఆ యువతులే పట్టుబడుతున్నారు తప్ప సూత్రధారులు మాత్రం తప్పించుకుంటున్నారు. గతంలో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పట్టపగలే అశ్లీల నృత్యాలుృ చేస్తూ ముగ్గురు రష్యా యువతులు పోలీసులకు దొరికారు. మరో యువతి టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడింది. ఆ దేశాల వాళ్లే ఎక్కువ... ఈ అనధికారిక క్యాబరేల్లో నర్తించడానికి వస్తున్న విదేశీ యువతుల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, ఇతర వూజీ సోవియట్ యూనియన్ దేశాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఆయా దేశాల్లోని ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు దళారులు అక్కడి యువతులకు డబ్బు ఎరవేస్తున్నారు. ఆకర్షణీయమైన దేహ సౌష్టవం కలిగిన వారిని టూరిస్టు వీసాలపై ఇక్కడకు రప్పిస్తున్నారు. ఆపై వారికి, వారి నృత్యాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతరం వీరితో పబ్‌లు, క్లబ్బుల్లో అశ్లీల ప్రదర్శనలు ఇప్పిస్తూనే కస్టమర్లను విటులుగా మార్చుకుని మరోపక్క వ్యభిచారం చేయిస్తున్నారు. గంట గంటకో రేటు... విదేశీ యువతుల నృత్యాలు, వారిపై ఉండే క్రేజును లక్ష్యంగా చేసుకునే ఏజెంట్లు వీరిని ఆటబొమ్మల్ని చేసి గంటల చొప్పున రేటు కట్టి మరీ వసూలు చేస్తుంటారు. ఒక్కో సందర్భంలో ఈ క్యాబరేలకు గంటకు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇందులో యువతులకు దక్కేది మాత్రం తక్కువే. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ వ్యవహారాలు నడిపే సూత్రధారులు నగరానికి చెందిన వారు కారని తెలుస్తోంది. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ముంబై కేంద్రంగా ఈ దందా నడుపుతున్నాడని సమాచారం. అక్కడి ఓ ఆంగ్లో ఇండియన్ యువతి ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పబ్స్‌పై డేగకన్ను వేశాం వరుసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాల నేపథ్యంలో నగరంలోని పబ్స్‌పై డేగకన్ను వేశాం. ఇప్పటి వరకు డ్రగ్స్ పైనే దృష్టి ఉండేది. ఇకపై ఇలాంటి డ్యాన్సుల విషయాన్నీ, అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తాం. నిర్ధేశిత సమయానికి మించి నడుస్తున్న పబ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. దీనిపై ఇప్పటికే వాటి నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చాం. – నగర పోలీసు ఉన్నతాధికారి (చదవండి: కార్డినల్‌గా పూల ఆంథోనీ) -
ఐఏఎస్ అధికారి పేరుతో వాట్సాప్ డీపీ ... డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్
బంజారాహిల్స్: పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ పేరుతో హెచ్ఎండీఏ ఉద్యోగులకు ఫోన్లు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తి 9313411812 నంబర్ ద్వారా ఫోన్లు చేస్తున్నాడు. వాట్సాప్ డీపీగా అరవింద్‌కుమార్ ఫొటో పెట్టుకోవడంతో పాటు ట్రూకాలర్‌లో సైతం అదే పేరు వచ్చేలా చూసుకున్న దుండగుడు హెచ్ఎండీఏ ఉద్యోగులతో పాటు మరికొందరికి ఫోన్లు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. మంగళవారం దీనిని గుర్తించిన అరవింద్‌కుమార్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తన పేరుతో ఫోన్లు చేస్తున్న వ్యక్తిపట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. దీంతో పాటు తన పేరును దుర్వినియోగం చేస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేయాలని హెచ్ఎండీఏ ఇన్స్పెక్టర్ వెంకటేష్‌ను అదేశించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వెంకటేష్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: డోంట్ బీ ప్రాంక్..) -
ఖరీదైన చీరలపై మోజు
బంజారాహిల్స్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని చీరల షోరూంలలో సరికొత్త డిజైన్ల చీరలు కట్టుకోవాలని ఆమెకు ఆశ. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో కనువిందు చేసే వాటిని కట్టుకోవడం కష్టతరంగా మారింది. తన ఇష్టాన్ని ఎలాగైనా తీర్చుకోవాలన్న కోరిక ఓ యువతిని దొంగగా మార్చింది. తల్లితో కలిసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని ఖరీదైన షోరూంలకు వెళ్తూ సేల్స్‌మెన్స్ కళ్లుగప్పి తాము ఇష్టపడ్డ చీరలను దొంగిలిస్తున్న తల్లీ, కూతుళ్లను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... అంబర్‌పేట సలీంనగర్ కాలనీకి చెందిన నల్లూరి సుజాత, ఆమె కుమార్తె నల్లూరి వెంకటలక్ష్మి పావనికి చీరలంటే మోజు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని తలాశా క్లాత్ షోరూంకు వచ్చింది. అందులో తాను ఇష్టపడ్డ రూ. 1.10 లక్షల విలువ చేసే అయిదు చీరలను, అదే రోజు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని గోల్డెన్ థ్రెడ్స్ క్లాత్ స్టోర్‌లో రూ. 2.80 లక్షల విలువ చేసే నాలుగు చీరలను దొంగిలించి పరారయ్యారు. షాపు యజమానురాలు కవిత ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం సీఐ రమేష్, డీఎస్ఐ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేపట్టారు. దొంగతనం చేసిన తర్వాత తల్లీకూతుళ్లు ఇద్దరు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్లో రైలెక్కి ముసరంబాగ్ స్టేషన్లో దిగారు. ఆయా ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు స్పష్టంగా ఉండటంతో వీరు స్వైప్ చేసిన మెట్రో కార్డ్ ఆధారంగా వారి అడ్రస్ గుర్తించారు. సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ. 3.90 లక్షల విలువైన తొమ్మిది చీరలను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు) -
సూటు..బూటు..బీఎండబ్య్లూ కారు
సాక్షి, బంజారాహిల్స్: ఐఏఎస్ అధికారిగా ప్రచారం చేసుకుంటూ ప్రముఖులతో పరిచయాలను అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గుంటూరు జిల్లా, నల్లపాడు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇతను గతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం. 9లోని ఓ మహిళకు చెందిన రూ. 25 కోట్ల విలువ చేసే ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించాడు. ప్రధాని మోదీ భద్రతా సలహాదారునంటూ పోలీసులను బురిడీ కొట్టించేందుకు యత్నించాడు. వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లాకు చెందిన తెలదేవులపల్లి వెంకట లక్ష్మినరసింహమూర్తి కొంత కాలంగా ఐఏఎస్‌నని చెప్పుకుంటూ అటు పోలీసు ఉన్నతాధికారులను, ఇటు ప్రధాని, ముఖ్యమంత్రి కార్యాలయాల ప్రముఖులను నమ్మిస్తూ పలువురికి రూ.కోట్లలో టోకరా వేశాడు. ఖరీదైన దుస్తులతో, బీఎండబ్య్లూ కారుకు పీఎంఓ కార్యాలయం అంటూ స్టిక్కర్ తగిలించి ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్లుగా తేలింది. జూబ్లీహిల్స్‌లోని ఒంటరి మహిళ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించిన అతను ఆమెను ఇంటి నుంచి బయటికి పంపించేందుకు గతేడాది డిసెంబర్ 30న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతడి వైఖరిపై అనుమానం వచ్చిన పోలీసులు సివిల్ మ్యాటర్ కింద కేసును పక్కన పెట్టారు. అయితే తాను ప్రధాని మోదీ భద్రతా సలహాదారుగా పని చేస్తున్నానని జూబ్లీహిల్స్ పోలీసులు తన మాట వినడం లేదని తనకు ఎక్స్‌ప్రెస్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు నకిలీ లెటర్ ప్యాడ్‌పై లేఖ రాశారు. అయితే గవర్నర్ కార్యాలయం అతడికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేశానని, ఇస్రో పాలసీ మేకర్నని పీఎంవో భద్రతా సలహాదారునని తనకు 20 డిగ్రీలు ఉన్నాయని సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకుంటూ పలువురిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గతంలో పోలీసు ఉన్నతాధికారులకు న్యాయ సలహాదారుగా పని చేసిన ఓ వ్యక్తి ఇతడికి అండగా నిలవడంతో మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. జూబ్లీహిల్స్‌లోని ఇంటిని ఖాళీ చేసే విషయంలో నానా రభస చేశారు. అందులో దేశ భద్రతకు సంబంధించిన రికార్డులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయంటూ పోలీసులకు చుక్కలు చూపించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ)లో ఆరా తీయగా ఆ పేరు మీద ఐఏఎస్‌లు ఎవరూ లేరని స్పష్టమైంది. విషయం తెలుసుకున్న ఐబీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ నకిలీ ఐఏఎస్‌పై విచారణ చేస్తుండగానే గుంటూరులో పట్టుబడ్డాడు. దొరికింది ఇలా.. సదరు నకిలీ ఐఏఎస్ టీవీ. లక్ష్మీనరసింహ మూర్తి పీఏనంటూ శుక్రవారం రాత్రి నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మా సార్ నరసింహ మూర్తి మాట్లాడుతారని ఎస్ఐ ఆరోగ్య రాజ్‌కు ఫోన్ ఇచ్చారు. తాను డీజీపీ, ఎస్పీతో మాట్లాడానని చెప్పిన నరసింహ మూర్తి తాను బస చేసిన హోటల్‌కు కానిస్టేబుళ్లను పంపించాలని సూచించాడు. ఈ విషయాన్ని ఎస్ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో డీఎస్సీ ప్రశాంతి నరసింహ మూర్తికి ఫోన్ చేయగా తాను అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో మాట్లాడానని, గుంటూరు వికాస్ నగర్లో ఓ యువతికి తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తనతో పోలీసు బలగాలను పంపించాలని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన డీఎస్పీ సదరు హోటల్‌కు పోలీసులకు పంపగా అప్పటికే నకిలీ ఐఏఎస్ అక్కడినుంచి ఉడాయించాడు. దీంతో పోలీసులు అతడి మొబైల్ లొకేషన్ ఆధారంగా విజయవాడకు వెళ్తున్న అతడిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ఫోన్లు, నకిలీ లెటర్హెడ్లు స్వాధీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేసి కోట్లాది రూపాయలు కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతడి కోసం ఐబీ గత ఆరు నెలలుగా గాలిస్తోంది. ఇతడి బాధితుల్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, విశ్రాంత అధికారులు ఉన్నట్లు తేలింది. (చదవండి: ఫోన్ చేసి మాటల్లో పెట్టి.. 5 నిమిషాల్లోనే..) -
అల్లుడిపై కోపంతో అతడి స్నేహితుడి బైక్ దహనం
సాక్షి, బంజారాహిల్స్: అత్తమీద కోపం దుత్తమీద చూపించిందనే సామెతను తలపించిందీ ఘటన. అల్లుడి మీద కోపంతో ఆయన స్నేహితుడి బైక్‌ను దహనం చేసిన మామపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఫస్ట్ బెటాలియన్ ప్లాట్ నంబర్ 522 వద్దకు జగద్గిరిగుట్టలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే ఎం.పాండు తన స్నేహితుడు శ్రీనివాస్‌ను కలిసేందుకు శుక్రవారం రాత్రి వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగి ఇంటి బయట ఇసుకలోనే నిద్రించారు. అదే సమయంలో శ్రీనివాస్ మామ నాగయ్య తన అల్లుడి మీద కోపంతో స్నేహితుడు పాండు అక్కడ పార్కింగ్ చేసిన బైక్‌ను పెట్రోల్ పోసి దహనం చేశాడు. ఒక్కసారిగా మంటలు అంటుకొని శబ్దాలు రావడంతో మెలకువ వచ్చిన పాండు అక్కడికి వెళ్లి చూడగా బైక్ మంటలో కాలిపోతోంది. అక్కడి నుంచి నాగయ్య వస్తూ కనిపించాడు. తన బైక్‌ను కాల్చివేసిన నాగయ్యపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఘర్షణ) -
తక్కువ ధరకే లగ్జరీ కార్లు ఇప్పిస్తానని మోసం
బంజారాహిల్స్: లగ్జరీ కార్లను మార్కెట్ ధరలో 30 శాతం తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి మోసగించిన స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ డైరెక్టర్ ఆత్మకూరి ఆకాష్, అజయ్, విజయ్ కాంజీలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు... జూబ్లీహిల్స్ రోడ్ నం. 82లోని సినార్‌వ్యాలీలో నివసించే వ్యాపారి వి.పి.ఆనంద్‌కు తన స్నేహితుడు దివేష్ ద్వారా ఆత్మకూరి ఆకాష్, అజయ్ పరిచయం అయ్యారు. తాము హైఎండ్ కార్లను 30 శాతం రాయితీతో ఇప్పిస్తామని చెప్పడంతో నమ్మిన ఆనంద్ ఆ మేరకు ఇన్నోవా క్రిస్టా కారును కొనేందుకు ఆసక్తి చూపాడు. రూ. 18 లక్షల విలువ చేసే ఈ కారును రూ. 15 లక్షలకే ఇస్తామని చెప్పడంతో ఆ మేరకు రూ. 10.83 లక్షలు చెల్లించాడు. ఇందుకు సంబంధించిన ఆర్సీని కూడా పంపించాడు. అయితే కారును ఇవ్వడంలో ఆకాష్ విఫలమయ్యాడు. అంతకుముందే ఆయన వంద మందికిపైగా వీవీఐపీలను రాయితీ కార్ల పేరుతో రూ. 60 కోట్ల వరకు మోసగించిన కేసులు పోలీస్ స్టేషన్లో నమోదై ఉన్నాయి. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 406, 420 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
Lockdown: సార్.. మా కుక్కకు జ్వరం.. వదిలేయండి.. సరే
బంజారాహిల్స్: సార్.. మా కుక్కపిల్లకు జ్వరమొచ్చింది.. వణికిపోతుంది.. మందులు వేయకపోతే చచ్చి పోయేలా ఉంది.. చూస్తూ..చూస్తూ.. ఇంట్లో ఉంచలేకపోతున్నాం.. డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నా.. దయచేసి కుక్క పరిస్థితి చూసైనా మమ్మల్ని వదిలేయండి.. అంటూ ఓ శునక యజమాని లాక్డౌన్ సమయంలో బయటికి వచ్చి పోలీసులకు చిక్కగా ఆ కుక్కను చూ పిస్తూ వేడుకున్న వైనమిది. జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని సీవీఆర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన లాక్డౌన్ చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి కారులో శునకాన్ని తీసుకెళ్తూ కనిపించాడు. బయటికి ఎందుకు వచ్చారని ఎస్ఐ నవీన్‌రెడ్డి ప్రశ్నించగా కుక్కకు బాగా జ్వరం వచ్చిందని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ జవాబు విని పోలీసులకు ఏం చేయాలో తోచలేదు. హృదయవిదారకమైన ఈ ఘటన పోలీసులను కూడా చలింపజేసింది. దీంతో శునకాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లండంటూ అతడిని వదిలి పెట్టారు. చదవండి: Hyderabad: ‘చేపలు అయిపోయాయి.. తప్పక చికెన్ తీసుకున్నా’ ‘లైట్’ తీస్కోలేదు.. కూకట్‌పల్లిలో ఓ బైక్ కహానీ -
చోరీకోసం వచ్చి ప్రాణాలు కోల్పోయాడు
బంజారాహిల్స్: దొంగతనం చేయడానికి వచ్చి ఇంటి కుటుంబ సభ్యులు కేకలు పెట్టడంతో పారిపోయే క్రమంలో ఓ దొంగ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో మృతి చెందాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపి న మేరకు.. బోరబండ సఫ్దర్‌నగర్‌లో నివాసం ఉండే సయ్యద్ చాంద్‌పాషా అలియాస్ ఇబ్రహీం (22) ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌రోడ్ నెం 10(బి) లోని వెంకటగిరిలోని ఓ అపార్ట్మెంట్లో చోరీ కోసం వచ్చాడు. భవనంలోని నాలుగో అంతస్తులో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అలికిడి రావడంతోఇంటి యజమానులు కేకలు వేశారు. దాంతో కంగారు పడిన ఇబ్రహీం పారిపోయే క్రమంలో నాలుగో అంతస్తునుంచి పక్కనున్న ఖోమాన్ స్కూల్‌భవనం మీదకు దూకేశాడు. అక్కడినుంచి రోడ్డు మీదకు దూకడంతో తలపగలడంతో పాటు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు జూబ్లీహిల్స్‌పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇబ్రహీంను 108లో ఉస్మానియా ఆస్పత్రికి తర లించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి గురించి పోలీసులు ఆరా తీయగా అతడిపై సనత్‌నగర్ పీఎస్‌లో ఒక రాబరీ కేసు, ఒక చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. చదవండి: మరొకరితో చనువుగా ఉంటోందని బీటెక్ విద్యార్థినిపై దారుణం -
జూబ్లీహిల్స్‌లో దారుణం: కలిసి మద్యం తాగారు, మళ్లీ వచ్చి చూస్తే
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో దారుణ హత్య జరిగింది. గత రాత్రి 2గంటల సమయంలో శివ (40) హత్యకు గురయ్యాడు. పోలీసులు వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి శివ తన స్నేహితులు రాకేశ్, శ్రీనివాస్, డేవిడ్‌తో కలిసి శివ మద్యం సేవించాడు. మద్యం సేవించిన అనంతరం రాకేశ్, శ్రీనివాస్ వెళ్లిపోగా.. శివ, డేవిడ్ మాత్రం అక్కడే ఉన్నారు. రాత్రి 2.20 గంటల సమయంలో స్నేహితుడు శ్రీనివాస్ వచ్చి చూడగా మద్యం సేవించిన ప్రదేశంలో తల పగిలి రక్తపు మడుగులో శివ విగత జీవిగా కనిపించాడు. వెంటనే శీనివాస్ పోలీసులకు సమాచారం అందించగా.. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. శివ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు శివ కూలి పని చేసుకుంటూ, ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అనుమానితుడు డేవిడ్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: అత్తారింటికి వచ్చి.. బావిలో పడి ఇద్దరు అల్లుళ్ల మృతి -
ఎమ్మెల్సీ సతీమణి కన్నుమూత
జనగామ/హైదరాబాద్: శాసన మండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి(62) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె, గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీ బోడకుంటి సతీమణి విజయలక్ష్మి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి బోడకుంటిని పరామర్శించారు. -
ఆస్పత్రిలో దంపతుల మృతి.. బెడ్ పక్కనే సూసైడ్ నోట్!
పంజగుట్ట: ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనుమానాస్పద స్థితిలో భార్య, అపస్మారక స్థితిలో పడి చికిత్స పొందుతూ ఆమె భర్త మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే .. రహమత్‌నగర్‌లో నివసించే ఎన్.సుబ్బారావు కారు డ్రైవర్. ఇతడి భార్య ఎన్.సాయిలక్ష్మి(42) గృహిణి. సాయిలక్ష్మికి బ్రైయిన్ స్ట్రోక్ రావడంతో చికిత్స నిమిత్తం రాజ్‌భవన్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు సహాయకుడిగా భర్త సుబ్బారావు అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 11వ తేదీన ఉదయం ఆస్పత్రి సిబ్బంది వెళ్లి చూడగా ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సిబ్బంది కూకట్పల్లి బాలాజీనగర్‌లో నివసించే వీరి కూతురు ఎన్.శివాణికి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆమె ఉదయం 4:30 గంటల లోపు అక్కడకు వచ్చి చూసే సరికి తండ్రి అపస్మారక స్థితిలో ఉండగా తల్లి అప్పటికే మృతి చెందింది. ఇక, సుబ్బారావును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా అతడు కూడా శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి బెడ్ పక్కనే సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. ఆస్పత్రి సిబ్బందికి తన చావుకు ఎలాంటి సంబంధం లేదు. మానసిక వ్యధతో చనిపోతున్నాను. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే తమ దహన సంస్కారాలు చేయాలని రాసి ఉంది. కాగా అనారోగ్య సమస్యలతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా.. లేక భార్యను గొంతునులిమి చంపి తర్వాత సుబ్బారావు ఏదైనా విష ప్రయోగం చేసుకున్నాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు సెక్షన్–174, 309 ఐపీసీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చెట్టుపై కూర్చున్నట్లుగా యువతి మృతదేహం.. అసలేం జరిగింది? -
డిజైన్స్ కొత్త.. ఫ్యాషన్ సూత్ర..
-
కర్రలు, ఇనుప రాడ్లతో యువకుల హల్చల్
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 సమీపంలో గురువారం రాత్రి కొందరు యువకులు కర్రలు, ఇనుప రాడ్లతో హల్చల్ చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న వారు అర్థరాత్రి వరకు పూటుగా మద్యం సేవించారు. అనంతరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో రోడ్లపై వెళుతున్న వాహనదారులపై కూడా రాళ్ల దాడి చేశారు. దాదాపు 10మంది యువకులు నడిరోడ్డుపై ఇనుప రాడ్లు పట్టుకుని హల్చల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
విశ్రాంత ఐఏఎస్ విఠల్ కన్నుమూత
సాక్షి, జూబ్లీహిల్స్: ప్రముఖ ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ (94) శుక్రవారం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శేషు విఠల్, కుమారులు సంజయ్ బారు, చైతన్య, కుమార్తె నివేదిత ఉన్నా రు. పెద్ద కుమారుడు సంజయ్ బారు ప్రముఖ కాలమిస్ట్‌గా పనిచేయడంతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వద్ద మీడియా సలహాదారుగా పని చేశారు. ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సహా పలు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. శనివారం ఫిలిం నగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1950లో ఐఏఎస్‌కు ఎంపిక... హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసిన విఠల్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1950లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 1950 కేడర్‌కు చెందిన బీపీఆర్ విఠల్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో సేవలు అందించారు. 1972 నుంచి 1982 వరకు ఆయన ఏపీ ప్రణాళికా విభాగానికి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. పదవ ఆర్థిక సంఘం చైర్మన్‌గా సేవలు అందించారు. కేరళ ప్రభుత్వంలో ఎక్స్పెండిచర్ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. విషాద వదనంలో బీపీఆర్ విఠల్ సతీమణి శేషు విఠల్, కుమార్తె నివేదిత ప్రణాళికా సంఘం సభ్యుడిగానే కాకుండా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్) సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. సూడాన్, మలావీ తదితర దేశాల ప్రభుత్వాలకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సర్వీసెస్ (సెస్) ఏర్పాటు చేయడంలో బీపీఆర్ విఠల్ ప్రధాన భూమిక పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళ్రావు, పీవీ నర్సింహారావు, మర్రి చెన్నారెడ్డి వద్ద ప్రభుత్వ కార్యదర్శిగా పని చేశారు. అప్పట్లో ఆయన ‘మెమరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల నుంచి మన్న నలు అందుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి బీజం... ఆర్థిక రంగంపై బీపీఆర్ విఠల్ పలు పుస్తకాలు రచించారు. ఆయన రాసిన ‘ద తెలంగాణ సర్ప్లస్ఎస్: ఎ కేస్ స్టడీ’పుస్తకం తర్వాత కాలంలో తెలంగాణా ఉద్యమానికి బీజం వేసిందని చెబుతారు. రిటైర్మెంట్ అనంతరం నిజాం ట్రస్ట్, హైదరాబాద్ లిటరరీ సొసైటీ, జనవిజ్ఞాన వేదిక తదితర సంఘా లు, సంస్థలకు ఆయన సేవలు అందించారు. విఠల్ తండ్రి ప్రొఫెసర్ బీవీ రామనర్సు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్‌గా, నిజాం కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రసి ద్ధ ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్య క్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలంపాటు ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా విఠల్ సేవలందించారని సీఎం గుర్తుచేసుకున్నారు. ఏపీ ప్రణాళిక, అభివృద్ధి మం డలి ఉపాధ్యక్షుడిగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సలహాదారుగా, 10వ ఆర్థిక సంఘం సభ్యుడిగా విఠల్ ఉత్తమ సేవలందించా రని కొనియాడారు. బీపీఆర్ విఠల్ మృతిపట్ల మంత్రి కె. తారక రామారావు తీవ్ర సంతాపం వ్య క్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిలదొక్కుకుంటుందా లేదా? అనే అనుమానాలను పటాపంచలు చేసేందుకు ‘తెలంగాణ సర్ప్లస్ఎస్’పుస్తకాన్ని విఠల్ రాశారని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన కుమారుడు, కుటుంబ సభ్యుల కు సానుభూతి తెలియజేశారు. విఠల్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు, విశ్రాంత ఐఏఎస్‌లు సంతాపం తెలిపారు. బీపీఆర్ విఠల్ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ఉమ్మడి ఏపీ ఆర్థిక శాఖ మాజీ ప్రభుత్వ కార్యదర్శి, ఐఎంఎఫ్(ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్) సలహాదారు బీపీఆర్ విఠల్ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
జూబ్లీహిల్స్‌లో ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో సీఆర్పీఎఫ్ ఎస్ఐ భవానీ శంకర్ (30) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర పోలీసు వర్గల్లో తీవ్ర కలకలం రేపింది. ఆయన నివాసం ఉంటున్న గదిలోనే గురువారం తెల్లవారుజామున సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. శంకర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
నాగార్జున డౌన్ డౌన్ నినాదాలు; ఉద్రిక్తత!
సాక్షి, జూబ్లీహిల్స్ : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3కి హోస్ట్‌గా వ్యవహరించనున్న సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంటిని ఓయూ విద్యార్థులు ముట్టడించారు. బిగ్‌బాస్ షోను నిలిపి వేయాలంటూ, నాగార్జున డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఓయూ జేఏసీ నాయకుడు కందుల మధు ఆధ్వర్యంలో బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని షోను రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం విదితమే. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఓయూ విద్యార్థి నాయకులు ఫిర్యాదు చేశారు. జేఏసీ నాయకులు డాక్టర్ కందుల మధు, వేల్పులకొండ వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... మా టీవీలో ప్రసారమవుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ కోసం నటీనటుల ఎంపికకు స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారని, ఆ టెస్టులకు మహిళలను ఆహ్వానించి లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. వేధింపులపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. సభ్యులను మూడు నెలలు నిర్బంధంలో ఉంచి రహస్యంగా దృశ్యాలు చిత్రీకరించడం, వారితో ముందుగానే బాండ్‌పేపర్‌పై అగ్రిమెంట్ రాసుకోవడం, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని ఆడవాళ్లను లైంగికంగా హింసిస్తున్నారని పేర్కొన్నారు. బిగ్‌బాస్ షోను నిలిపివేసేలా కమిషన్ ఆదేశాలు ఇవ్వాలని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం..
-
జూబ్లీహిల్స్‌లో కారుతో మందుబాబుల బీభత్సం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జుబ్లీహిల్స్‌లో మందుబాబులు కారుతో బీభత్సం సృష్టించారు. మితిమీరిన వేగంతో దూసుకుపోతూ.. మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టారు. అదృష్టం బాగుండి సమయానికి ఎయిర్బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ముగ్గురు వ్యక్తులకు ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు-36 నుంచి కొండాపూర్‌కు వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తాగిన మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉండటం, అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల కారు స్టీరింగ్ అదుపుచేయలేక.. రోడ్డు మీద బీభత్సం సృష్టించారు. మితిమీరిన వేగంగా అజాగ్రత్తగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఏకంగా కారు డ్రైవింగ్ సీటు వైపున్న టైరు ఊడిపోయింది. కారులో ఉన్న కొండాపూర్‌కు చెందిన జయంత్, పవన్‌తోపాటు మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. అదృష్టం బాగుండి సమయానికి ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ముగ్గురికీ ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ ముగ్గురిని మాదాపూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని విచారణ చేపట్టారు. -
రేవంత్‌రెడ్డికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులు కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డితో పాటు అప్పటి కమిటీలో ఉన్న 13 మందికి బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ సొసైటీ పరిధిలోని ఏడు ఓపెన్ప్లాట్ల కబ్జాకు చెందిన రికార్డులు ధ్వంసం అయ్యాయనీ, కోర్టులో స్టే ఎత్తివేశాక కూడా ఇంత వరకు చర్యలు తీసుకోలేదంటూ హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గత జూలై 18న రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును వెలికి తీశారు. ఇందులో భాగంగానే విచారణకు హాజరుకావాలని ఆయనకు 41(ఏ) కింద నోటీసు జారీ చేశారు. మరోవైపు రికార్డులు ధ్వంసమైన కేసుపై రామారావు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం రెండు వారాల్లో ప్రమాణ పత్రాలను దాఖలు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. కాగా ఏడు ప్లాట్లు కబ్జాకు గురైనట్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 2002లో కేసు నమోదైంది. సొసైటీ కార్యవర్గ సభ్యుల్లో ఒకరైన రేవంత్‌రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన అధికారులు ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా ప్లాట్లను విక్రయించారని తేల్చారు. దీనిపై రేవంత్‌రెడ్డితో పాటు కొందరు సభ్యులు కోర్టును ఆశ్రయించారు. 2014 వరకు స్టే ఇచ్చిన హైకోర్టు తర్వాత దాన్ని ఎత్తివేసింది. విచారణను కొనసాగించి బాధ్యులపై చర్యలకు ఆదేశించింది.ఆ తర్వాత అదీ మరుగునపడింది. దీనిపై రామారావు తొలుత నాంపల్లిలోని మూడో అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును , ఆ క్రమంలో తాజాగా హైకోర్టునూ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్.. యువతి హల్చల్!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసు పరిధిలోని ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 79 మందిపై కేసులు నమోదు చేశారు. 27 కార్లు, 49బైక్‌లు, రెండు ఆటోలు సీజ్ చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మద్యం మత్తులో ఓ యువతి హల్చల్ చేసింది. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. -
తప్పతాగి పోలీసులుపై చేయి చేసుకున్నాడు
-
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి తృటిలో పెనుప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి అతివేగంగా కారునడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టాడు. తర్వాత కారు అదుపుతప్పి గాల్లో పల్టీలు కొట్టి కరెంట్ స్తంభాన్ని కూడా ఢీకొట్టింది. కారు వేగానికి కరెంటు స్తంభం కూలిపోయింది. ఈ సంఘటన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో కారు వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఈ కారును ఫరీద్ అనే డ్రైవర్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ - టీఎస్ 07 యూఏ 0509. కాగా, ఇటీవలే మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 లో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు. -
జూబ్లిహిల్స్‌లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్
-
జూబ్లీహిల్స్‌లో యువతి వీరంగం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ యువతి మద్యం సేవించి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఆరు చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 79 మంది మందు బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 34 కార్లు, 25 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో ఓ యువతి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తుండగా పోలీసులు ఆపారు. దీంతో పోలీసులతో యువతి వాగ్వాదానికి దిగింది. కొద్దిసేపు వీరంగం సృష్టించింది. పోలీసులకు చుక్కలు చూపించింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది. తాగిన పర్సంటేజ్ ఎక్కువ ఉండటంతో పారిపోయే యత్నించింది. పారిపోతున్న మహిళను ట్రాఫిక్, సివిల్ పోలీసులు వెంబడించి పట్టుకుని కేసు నమోదు చేశారు. చివరకు పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. -
పట్టపగలే కత్తులతో బెదిరించి
-
తల్లితండ్రులను రోడ్డున పడేశారు
-
జూబ్లీహిల్స్‌లో ర్యాష్ డ్రైవింగ్
-
జూబ్లీహిల్స్‌లో కారు బోల్తా
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బోల్తాకొట్టింది. ఎన్టీఆర్ భవన్ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కారులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
బంగారంపై షాపులపై కేసులు
-
జూబ్లీహిల్స్ లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సెర్చ్ లో 500 మంది పోలీసులు పాల్గొన్నారు. జవహర్ నగర్, మసీద్ గడ్డల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు 43 మంది అనుమానితులు, 8 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 63 బైక్ లు, ఐదు ఆటోలు, గ్యాస్ సిలీండర్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. -
జూబ్లీహిల్స్ లో కార్డన్ సెర్చ్
-
‘వాటర్స్’లో దాండియా..
-
‘వాటర్స్’లో దాండియా..
జూబ్లీహిల్స్: నవరాత్రి ఉత్సవాల్లో సిటీ మునిగి తేలుతోంది. బంజారాహిల్స్‌లోని ‘వాటర్స్’లో ఆదివారం నిర్వహించిన ‘ఆక్వా గర్భా దాండియా’ సందడిగా సాగింది. మహిళలు నీటి కొలనులో ఆడిపాడుతూ ఆనందంగా గడిపారు. ఫిట్నెస్ ట్రైనర్ వేణు మందల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. -
జూబ్లీహిల్స్‌లోని హోటల్లో సమంత సందడి
-
ముగ్గురు కబ్జాదారుల అరెస్ట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో రూ.10 కోట్ల విలువ చేసే 1200 గజాల ఖరీదైన ప్లాట్‌కు అక్రమ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నించిన ముగ్గురు కబ్జాదారులను జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. దారుసలాంకు చెందిన అమృత్ కల్రేజా అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ప్లాట్ నెం.864 ను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా తమ సమీప బంధువు బ్రిజేష్ కుమార్ బజాజ్, అనుచరుడు అస్గర్ అలీతో కలిసి శనివారం ఈ ప్లాట్‌లోకి వెళ్లి చుట్టూ గోడలు నిర్మించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ సొసైటీ కార్యదర్శి టి.హన్మంతరావు సొసైటీకి చెందిన ప్లాట్‌ను బోగస్ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కబ్జా స్థలంలో అమృత్ కల్‌రేజాతో పాటు బ్రిజేష్‌కుమార్ బజాజ్, అస్గర్ అలీలను అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 420, 468, 471, 427, రెడ్‌విత్ 34, సెక్షన్ 5ఆఫ్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. 1982లో ఈ ప్లాట్‌ను బ్రిజ్వేశ్వర్‌నాథ్ గుప్తాకు కేటాయించారు. అయితే సకాలంలో సభ్యత్వ రుసుము చెల్లించకపోవడంతో ఆయనకు ఇంకో ప్లాట్ కేటాయించారు. ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ జరగకముందే ఆయన మృతి చెందారు. బ్రిజ్వేశ్వర్‌నాథ్ కొడుకు రాజేంద్రనాథ్ 1999లో ఈ ప్లాట్ తనకు అలాట్ అయిందంటూ బోగస్ పత్రాలు సృష్టించి కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండగా.. అమృత్ ఈ ప్లాట్‌పై కన్నేశాడు. నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి సొంతం చేసుకునే ప్రయత్నం చేసి కటకటాలపాలయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అసభ్యంగా ప్రవర్తించిన యువకులకు రిమాండ్
బంజారాహిల్స్ : పబ్‌లో పీకలదాకా మద్యం సేవించి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ గురుస్వామి కథనం మేరకు... సరూర్‌నగర్ ఎర్రకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ సయీద్(25), చాంద్రాయణగుట్టకు చెందిన అహ్మద్ బిన్ ఇజ్రీస్ జుబాలి(25) ఈ నెల 25న మరో ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని కాక్టైల్స్ పబ్‌కు వచ్చి పీకల దాకా మద్యం సేవించారు. పబ్ మూసేశాక సెల్లార్లోకి వచ్చి వాహనాలను తీస్తున్న సమయంలో.. అదే పబ్ నుంచి తన స్నేహితురాళ్లతో కలిసి ఓ యువతి(23) పార్కింగ్ వద్దకు వచ్చింది. తాగిన మత్తులో ఈ నలుగురు కలిసి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె చెయ్యి పట్టుకొని లాగారు.. అసభ్యంగా దూషించారు. దీంతో బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీల ఆధారంగా సయీద్, జుబాలిని అరెస్టు చేసి వీరిపై ఐపీసీ సెక్షన్ 354(బి), 334, 506ల కింద కేసులు నమోదు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అర్ధరాత్రి బార్‌పై పోలీసుల దాడి
-
రోడ్డు ప్రమాదంలో ఈవెంట్ మేనేజర్ మృతి
-
కలర్స్..అదుర్స్
బంజారాహిల్స్: పనాజీ ఈవెంట్స్ హైదరాబాద్ కోచర్ పేరుతో జూబ్లీహిల్స్ క్లబ్లో శుక్రవారం రాత్రి జరిగిన ఫ్యాషన్‌షో నగర వాసులను అలరించింది. సినీ తారలు నిఖితానారాయణ్, సీత, షామిలీ, తేజస్విని, తేనీషచంద్రన్ తదితరులు ప్రదర్శనలో సందడి చేశారు. ఆకట్టుకునే దుస్తులు ధరించి క్యాట్ వాక్ చేస్తూ అలరించారు. షోలో గందరగోళం ఫ్యాషన్ షో ప్రారంభానికి ముందు గందరగోళం నెలకొంది. తమను అవమానపర్చడమే కాకుండా ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించారంటూ ముంబైకి చెందిన నలుగురు టాప్ మోడల్స్‌తో పాటు డిజైనర్ కూడా ఈ ప్రదర్శనను బహిష్కరించారు. దీంతో ష్యాషన్ షో ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. హైదరాబాద్‌లో తమకు అవమానం జరిగిందంటూ ముంబై మోడల్స్ నమ్రతషెట్టి, స్రవంతి, శతి, దీపాచారి డిజైనర్ సంఘమిత్రాసింగ్ షోను బహిష్కరించారు. నిర్వాహకులపై మండిపడ్డారు. తాజ్ హోటల్లో ష్యాషన్షో అనిచెప్పి జూబ్లీహిల్స్ క్లబ్లో ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆరుగురు హైదరాబాద్ మోడల్స్ కూడా షో నుంచి తప్పుకున్నారు. దీంతో అందుబాటులో ఉన్న స్టార్లతో ప్రదర్శన కొనసాగించారు. -
కాల్పుల కలకలం
► పట్టపగలు జూబ్లీహిల్స్‌లో గుల్బర్గా అంతర్రాష్ట్ర ముఠా కాల్పులు ►భారీ దోపిడీకి ఫయీమ్ ముఠా స్కెచ్ ►చార్మినార్‌లోని ఓ ప్రముఖ ఆభరణాల షాపు లూటీకి పథకం ►వీలుకాకపోవడంతో మాదాపూర్ షాపింగ్ మాల్స్‌పై కన్ను ►బిగ్‌సీ వద్ద రెక్కీ కోసం వెళ్తుండగా అడ్డగించిన పోలీసులు ►దుండగులు కాల్పులు జరపడంతో ఓ కూలీ ఛాతీలోకి దూసుకెళ్లిన తూటా ►పోలీసులతో కలసి ఫయీమ్‌ను వెంబడించి పట్టుకున్న తోటి కూలీలు ►మొత్తం ముగ్గురు దుండగుల అరెస్టు.. రెండు తుపాకులు, బైక్ స్వాధీనం సాక్షి, హైదరాబాద్: గురువారం.. మిట్ట మధ్యాహ్నం.. నగరంలోని జూబ్లీహిల్స్ నీరూస్ జంక్షన్.. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుండి కాల్పులు.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగుల వెనుక పోలీసుల పరుగు.. వారికి తోడుగా మరో 11 మంది కూలీలు.. అంతా కలసి చివరికి ఆ దుండగులను పట్టేశారు! అక్కడే వారి కోసం ఎదురుచూస్తున్న మరో దొంగ కూడా పోలీసులకు చిక్కాడు. దుండగుల తూటా తగిలి తోటి కూలీ గాయపడడంతో వాహనంలోని మిగతా కూలీలు కిందకు దూకి, ప్రాణాలకు తెగించి దోపిడీ దొంగలను వేటాడి పట్టుకోవడం విశేషం! సినీ ఫక్కీలో జరిగిన ఈ పరిణామాలు రాజధానిలో కలకలం సృష్టించాయి. కాల్పులకు పాల్పడింది కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు గుర్తించారు. అరెస్టయిన ముగ్గురి నుంచి రెండు నాటు తుపాకులు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. అసలు ఎవరు వారు..? గుల్బర్గాలో నివాసం ఉంటున్న టోలీచౌకి వాసి మీర్జా మహమ్మద్ అబ్దుల్లా(32) అలియాస్ ఫయీమ్ మిర్జా ఈ ముఠాకు నాయకుడు. కరుడుగట్టిన నేరగాడిగా పోలీసు రికార్డుల్లో ఉన్న ఇతడు హైదరాబాద్‌లో భారీ దోపిడీకి స్కెచ్ వేశాడు. తన సహచరులు మహమ్మద్ సమీయుద్దీన్ (లంగర్హౌస్వాసి), అబ్దుల్ ఖదీర్(గుల్బర్గావాసి)తో కలిసి ఐదు రోజుల క్రితమే నగరానికి వచ్చాడు. వీరంతా ఫయీమ్ మిర్జా ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పటికే మూడు ప్రధాన ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన ఈ ముఠా.. చార్మినార్‌లోని ఓ ప్రముఖ ఆభరణాల షాపును లూటీ చేసేందుకు పథకం పన్నారు. అయితే వీలు కాకపోవడంతో మాదాపూర్‌లోని షాపింగ్ మాల్స్‌పై కన్నేశారు. ఇందులో భాగంగా గురువారం బిగ్‌సీ మొబైల్ షాప్ వద్ద రెక్కీ నిర్వహించేందుకు ఫయీమ్, ఖదీర్ వెళ్లారు. తర్వాత అక్కడ్నుంచి ద్విచక్రవాహనంపై నీరూస్ జంక్షన్ సమీపంలో తమ కోసం ఎదురుచూస్తున్న సమీయుద్దీన్‌ను కలిసేందుకు బయల్దేరారు. మూడ్రోజుల నుంచే వీరి కదలికలపై నిఘా పెట్టిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఇద్దరేసి సభ్యులుగా నాలుగు బృందాలుగా నాలుగు చోట్ల కాపుగాశారు. హైటెక్‌సిటీ, మాదాపూర్, మాదాపూర్ పోలీసు స్టేషన్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36 నీరూస్ షోరూం జంక్షన్ వద్ద మధ్యాహ్నం 12.00 గంటల నుంచే మాటేశారు. ఈ మార్గం మీదుగానే ఫయీమ్, అబ్దుల్ ఖదీర్‌లు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ వద్ద తమను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే బైక్ వేగాన్ని పెంచారు. నీరూస్ జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడినా బైక్ ఆపలేదు. సరిగ్గా జంక్షన్ మధ్యలోకి వెళ్లగానే అప్పటికే నీరూస్ వద్ద వేచి ఉన్న ఇద్దరు పోలీసులు బండిని ఆపారు. తప్పించుకొనే ప్రయత్నం చేస్తూ పోలీసులతో పెనుగులాడారు. కాల్పుల కలకలం పోలీసులతో పెనుగులాడుతూనే ఫయీమ్ తన తుపాకీతో కాల్పులు జరిపాడు. పోలీసులు తప్పించుకోవడంతో ఓ బుల్లెట్ అటువైపుగా మెట్రో కార్మికులతో వెళ్తున్న ఓ డీసీఎం వాహనంపై దూసుకెళ్లింది. వాహనంలోని వెనుక వైపు కూర్చున్న ధర్మేందర్ సింగ్(25) ఛాతీలోకి దిగింది. ఈ కార్మికులు మెట్రోరైలు నిర్మాణ పనులను చేసి మధ్యాహ్నం భోజనం కోసం జూబ్లీహిల్స్ నుంచి వస్తున్నారు. కాల్పుల కలకలంతో రోడ్డుపై జనమంతా చెల్లాచెదురయ్యారు. అయితే తమ సహచరుడిని కాల్చాడన్న ఆగ్రహంతో 11 మంది కూలీలు ధైర్యాన్ని ప్రదర్శించారు. వాహనం నుంచి దూకి ఫయీమ్, ఖదీర్‌ను వెంబడించి పట్టుకున్నారు. ఆ వెంటనే అక్కడే వీరి కోసం వేచి చూస్తున్న సమీయుద్దీన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన ధర్మేందర్ పొట్టకూటి కోసం మూడు నెలల క్రితం నగరానికి వచ్చి మెట్రో పనులు చేసుకుంటున్నాడు. ఈయన ప్రస్తుతం కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎవరీ ఫయీమ్? టోలీచౌకికి చెందిన ఫయిమ్ మిర్జా ఏడేళ్ల క్రితం గుల్బరా్గాకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. 2012లో అక్కడ ఓ హత్య కేసులో నిందితుడు. బెయిల్‌పై వచ్చి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. నగరంలో దోపిడీలకు పాల్పడి గుల్బర్గాలో తలదాచుకుంటాడు. అక్కడ కూడా దోపిడీలు చేసి పోలీసులను చిక్కకుండా ఉండేందుకు మకాంను హైదరాబాద్‌కు మార్చుతుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో భారీ దోపిడీకి స్కెచ్ వేసి పోలీసులకు దొరికిపోయాడు. భారీ దోపిడీకి వ్యూహం: సీపీ మహేందర్‌రెడ్డి ఫయీమ్ ముఠా నగరంలో భారీ దోపిడీకి వ్యూహం పన్నిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ‘‘గుల్బర్గా నుంచి వచ్చిన ఆ ముఠా నగరంలో దోపిడీ చేసేందుకు వ్యూహం పన్నినట్లుగా మాకు సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదు రోజులుగా గ్యాంగ్‌ను గుర్తించేందుకు గాలింపు చేపట్టారు’’ అని ఆయన తెలిపారు. కాల్పుల్లో గాయపడిన ధర్మేందర్‌ను కమిషనర్ పరామర్శించారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. -
మిషన్-150తో సమస్యల పరిష్కారం
జూబ్లీహిల్స్ (హైదరాబాద్) : ప్రజా సమస్యలు తెలుసుకోవడం, సాధ్యమైనంత వరకు వాటిని అక్కడికక్కడే పరిష్కరించే దిశలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి చేపట్టిన మిషన్-150 కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఆయన శనివారం జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్, గౌతంనగర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆయనకు వారి గోడు వెళ్లబోసుకున్నారు. మూడేళ్ల నుంచి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా వీధి దీపాలు బాగుచేయడం లేదని చెప్పడంతో ఆయన అక్కడి నుంచి ఏఈ నరేందర్‌రాజుతో ఫోన్లో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఛత్రపతి శివాజీనగర్‌లో కూడా పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
గజదొంగ అరెస్టు
హైదరాబాద్ : భక్తుడిగా గుడికి వచ్చి పూజారుల కళ్లుగప్పి శఠగోపాలు, ఇతర పూజా సామగ్రి తస్కరిస్తున్న ఓ దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇ.రాంపవన్ అలియాస్ రాంబాబు(50) సోమవారం ఉదయం బోరబండ గాయత్రి హిల్స్‌లో ఉన్న సాయిబాబా దేవాలయానికి భక్తుడిగా వచ్చాడు. పూజారి హారతి ఇచ్చి గర్భగుడిలోకి వెళ్లి తీర్థప్రసాదాలను తీసుకొచ్చేలోపు అక్కడున శఠగొపం, హారతిపళ్లెం తస్కరించి పారిపోతుండగా భక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నెల క్రితం చంచల్‌గూడ జైలు పక్కన దేవాలయంలో అమ్మవారి మంగళసూత్రం, శఠగోపం దొంగిలిస్తూ సీసీ కెమెరాలో చిక్కుకున్నది రాంపవనేని పోలీసుల విచారణలో తేలింది. మరికొన్ని దేవాలయాలలో చోరీలకు పాల్పడింది కూడా ఇతడేనని పోలీసులు గుర్తించారు. (బంజారాహిల్స్) -
ఆన్లైన్లో వ్యభిచారం!
హైదరాబాద్: నగరంలో ఆన్లైన్ పద్ధతిలో వ్యభిచారాన్ని నడుపుతున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని వెస్ట్‌జోన్ డిసిసి సత్యన్నారాయణ తెలిపారు. వ్యభిచార గృహాలపై దాడి చేసేందుకు వెళ్లిన ఇద్దరు జూబ్లీహిల్స్ కానిస్టేబుల్స్‌పై కొందరు దుండగులు చేసిన దాడి వివరాలను ఆయన వెల్లడించారు. సమాచారం వచ్చిన వెంటనే అడిషనల్ డిసిపి గన్‌మేన్, జూబ్లీహిల్స్ హెడ్‌కానిస్టేబుల్ కొండారెడ్డి వ్యభిచార గృహంపై దాడి చేయడానికి వెళ్లారని తెలిపారు. సుధాకర్ అనే వ్యక్తి కిచెన్‌లో చాకుతో వాడిపై దాడిచేసినట్లు చెప్పారు. గ్రిల్ ఊడదీసి నిందితుడు పారిపోయారన్నారు. ఇద్దరు పోలీసులు మఫ్టీలో ఉన్నారని, సరైన బందోబస్తు ఉండిఉంటే, ఈ ఘటన జరిగి ఉండేదికాదన్నారు. బ్రోకర్ జగదీష్‌ను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఐ, సీఐలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కానిస్టేబుళ్లు దాడిచేసినట్లు డిసిపి చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకురాకుండా ఈ దాడులు చేశారని, అత్యుత్సాహంతో చేశారా? లేక వసూళ్ల కోసం చేశారా? అన్నది ఆరా తీస్తున్నట్లు ఆయన వివరించారు. సరైన భద్రత లేకుండా దాడి చేయడం పొరపాటేనన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యన్నారాయణ చెప్పారు. -
జూబ్లీహిల్స్‌లో వ్యభిచార గృహాలవారి ఆగడాలు!
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో వ్యభిచార గృహాలవారు రెచ్చిపోతున్నారు. వారు పోలీసులపై కూడా దాడి చేసే స్థాయికి చేరారు. వారిని అలాగే వదిలివేస్తే ముందు ముందు వారు ఏ స్థాయికి ఎదిగిపోతారో ఊహించుకోవచ్చు. వ్యభిచార గృహాలపై దాడి చేసేందుకు వెళ్లిన ఇద్దరు జూబ్లీహిల్స్ కానిస్టేబుల్స్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిలో అడిషనల్ డీసీపీ గన్‌మేన్ కూడా ఉన్నారు. -
ఎయిర్టెల్ ఏంజెల్ స్టోర్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఏంజెల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. కేవలం మహిళా ఉద్యోగులే వీటిని నిర్వహిస్తారు. స్టోర్‌లో 10 మంది వరకు సిబ్బంది ఉంటారు. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్‌లోని పాట్న నగరంలో తొలి స్టోర్ ఉంది. నెల రోజుల్లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏర్పాటవుతోంది. స్టోర్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లేయింగ్ జోన్ ఉంటుంది. కొత్త కనెక్షన్, డీటీహెచ్, రీచార్జ్ సేవలతోపాటు మొబైల్ ఫోన్లు ఇక్కడ విక్రయిస్తారు. వన్ స్టాప్ షాప్‌గా సేవలందిస్తారు. ఎయిర్టెల్ ఉద్యోగులే నేరుగా పనిచేస్తారు కాబట్టి ఈ సేవలు వేగంగా జరుగుతాయి. మహిళలకు ఉద్యోగావకాశాల కల్పనలో భాగంగా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఎయిర్టెల్ చెబుతోంది. మహిళా ఉద్యోగులు మరింత స్నేహపూర్వకంగా ఉంటారని అంటోంది. సొంత స్టోర్ల విస్తరణ.. దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ సొంత స్టోర్లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటి వరకు 100 స్టోర్లు రాగా, ఇందులో 14 హైదరాబాద్‌లో, 2 వైజాగ్‌లో నెలకొన్నాయి. సీమాంధ్ర, తెలంగాణలో 2014-15లో ఇటువంటివి 25 దాకా రానున్నాయని ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈఓ వెంకటేశ్ విజయ్‌రాఘవన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఎయిర్‌టెల్‌కు టాప్-3 సర్కిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఉందని, ఈ ప్రాంతంలో 3జీతోపాటు ప్రస్తుత నెట్వర్క్ విస్తరణపై దృష్టిపెట్టామన్నారు. ఎయిర్టెల్ స్టోర్లలో ప్రతిరోజు 500-600 మంది కస్టమర్లు అడుగుపెడుతున్నారు. కాగా, నైట్ స్టోర్ పేరుతో ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం వివిధ ప్యాక్‌లను కంపెనీ ప్రకటించింది. ఇందులో భాగంగా రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫేస్బుక్, ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ కాల్స్, 2జీ డాటా అపరిమితంగా వినియోగించుకోవచ్చు. ప్యాక్‌ల ధర రూ.7-49 వరకు ఉంది. -
‘ఇంతి’తై.. ఏలుకో!
ఆమె.. ఆకాశంలో సగం. మరి చట్టసభల్లో, ఇతరత్రా అవకాశాల్లో..?!. గ్రేటర్ పరిధిలో చట్టసభల్లో ప్రాతినిధ్యం విషయంలో ఆమె సగం కంటే తీసికట్టే.. మహా నగరం పరిధిలో 1951 హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలు మొదలు 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు శాసనసభ్యులుగా ఎన్నికైన మహిళల సంఖ్య చాలా తక్కువ. మహిళా సాధికారత, హక్కుల గురించి వల్లెవేసే ప్రధాన రాజకీయ పార్టీలు.. టికెట్ల విషయానికి వచ్చే సరికి 33 శాతమైనా కేటాయించట్లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో పురుషులు 39,18,570, స్త్రీలు 37,43,425 మంది ఉన్నారు. అంటే 1,75,145 మేర పురుషులే అత్యధికంగా ఉన్నారన్నమాట. అయితే ఈసారి జనాభా ప్రాతిపదికన గ్రేటర్ పరిధిలోని 25 శాసనసభ స్థానాల్లో కనీసం సగం స్థానాల్లోనైనా ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకు టిక్కెట్లు కేటాయించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలపై పెరుగుతున్న అకృత్యాలను కట్టడి చేసేలా చట్టాలను రూపొందించాలంటే మహిళలు అత్యధికంగా చట్టసభల్లో ప్రవేశించాల్సిందేనని అంటున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు ఈసారి మహిళలకు సముచిత స్థానం కల్పించకుంటే తిరస్కారానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాయి. గ్రేటర్లో ఇదీ అతివల ‘స్థానం’ 1951 సార్వత్రిక ఎన్నికల్లో శాలిబండ నుంచి మాసూమా బేగం తొలి మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1957 ఎన్నికల్లో పత్తర్‌ఘట్టి నుంచి గెలుపొందిన ఆమె.. 1962లో ఓటమి పాలయ్యారు 1957 ఎన్నికల్లో మలక్‌పేట నుంచి ఫతీజా ఆలం (పీడీపీ) పోటీచేసి ఓడిపోయారు. అవే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి సుమిత్రాదేవి (కాంగ్రెస్) విజయం సాధించారు 1962లో హైదరాబాద్ (తూర్పు) నియోజకవర్గం నుంచి సుమిత్రాదేవి, జూబ్లీహిల్స్ నుంచి రొడామిస్త్రీ విజయకేతనం ఎగురవేశారు 1967 ఎన్నికల్లో మలక్‌పేట నుంచి సరోజిని పుల్లారెడ్డి విజయదుందుభి మోగించారు. 1972లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు 1978లో లక్ష్మీకాంతమ్మ (హిమాయత్‌నగర్), 1983లో కాట్రగడ్డ ప్రసూన (సనత్‌నగర్-టీడీపీ) విజయం సాధించారు 1989లో మేరీ రవీంద్రనాథ్ (సికింద్రాబాద్-కాంగ్రెస్) గెలుపొంది.. 1994, 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు 1989లో మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య సతీమణి మణెమ్మ సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందారు. 2009 శాసనసభ ఎన్నికల్లో ముషీరాబాద్ అభ్యర్థినిగా మణెమ్మ, సికింద్రాబాద్ నుంచి సినీనటి జయసుధ, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించారు. సబిత.. దేశంలో తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించారు. అక్షరాస్యతలోనూ వెనుకంజే.. నగరంలో అక్షరాస్యులైన పురుషులు 29,97,979 మంది ఉండగా, మహిళలు 25,93,017 మంది ఉన్నారు పాఠశాల స్థాయిలో డ్రాపవుట్స్, బస్తీల్లో పాఠశాలలు అందుబాటులో లేకపోవడం వంటివి ఇందుకు కారణాలని తెలుస్తోంది 0-6 వయసు గ్రూపులో బాలుర కంటే బాలికల సంఖ్య తక్కువ. ఈ గ్రూపులో బాలురు 4,73,195, బాలికలు 4,36,255 మంది ఉన్నారు. -
జూబ్లీహిల్స్ లో కోడిపందాలపై దాడి
హైదరాబాద్: సంక్రాంతి రాకముందే కోడిపందాలు జోరందుకున్నాయి. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్ కాలనీలోని ఓ ఖాళీ ప్లాట్‌లో ఆదివారం కోడి పందాలు నిర్వహిస్తుండగా జూబ్లీహిల్స్ ఎస్ఐ రామన్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఆరుగురు పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా జూబ్లీహిల్స్ రోడ్డునెం.13ఏలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు సమాచా రం అందడంతో పోలీసులు దాడి నిర్వహించారు. పందెంలో పాల్గొన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఏడు కోడిపుంజులతో పాటు వీరి నుంచి రూ.2,500 నగదు స్వాధీనం చే సుకున్నారు. కోళ్లను పోలీసుస్టేషన్లో భద్రపరిచారు. నిందితులపై గే మింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కోళ్లను సోమవారం కోర్టుకు అప్పగిస్తామని చెప్పారు.