
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ యువతి మద్యం సేవించి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఆరు చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 79 మంది మందు బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా 34 కార్లు, 25 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో ఓ యువతి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తుండగా పోలీసులు ఆపారు. దీంతో పోలీసులతో యువతి వాగ్వాదానికి దిగింది. కొద్దిసేపు వీరంగం సృష్టించింది. పోలీసులకు చుక్కలు చూపించింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది. తాగిన పర్సంటేజ్ ఎక్కువ ఉండటంతో పారిపోయే యత్నించింది. పారిపోతున్న మహిళను ట్రాఫిక్, సివిల్ పోలీసులు వెంబడించి పట్టుకుని కేసు నమోదు చేశారు. చివరకు పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment