గురుగ్రామ్: మద్యం సేవించిన తర్వాత చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు. ఏం చేస్తారో? ఎందుకు చేస్తారో? తెలియదు. ప్రపంచాన్నే మరిచేంత మైకంలో ఉంటారు. మత్తు నుంచి బయటకు రాగానే అసలు విషయం తెలుసుకుని తలదించుకుంటారు. పూటుగా తాగి గురుగ్రామ్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు. రాత్రి తప్పతాగి.. తన కారును దొంగకు అప్పగించాడు. ఉదయం అసలు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు.
గురగ్రామ్‌కు చెందిన వ్యక్తి అమిత్ ప్రకాశ్(30). పరిమితికి మించి మద్యం సేవించిన తర్వాత మళ్లీ మద్యం కొనుగోలుకు వెళ్లారు. కేవలం రూ.2000 ఉండే వైన్ బాటిల్‌కు రూ.20 వేలు ఇచ్చాడు. అయితే..బార్ యజమాని తనకు రిటన్‌లో రూ.18 వేలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. కారులో కూర్చుని వైన్ తాగుతుండగా అపరిచిత వ్యక్తి వచ్చి వైన్ షేర్ చేసుకున్నట్లు చెప్పాడు. ఇద్దరు కలిసి కారులో సుభాష్ చౌక్ వరకు వెళ్లినట్లు తెలిపాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ అపరిచితుడు కారులోంచి దిగిపోమ్మని అడగగానే.. కారు తనదేనని మరిచి దిగిపోయినట్లు పోలీసులకు తెలిపాడు. కారు దిగిపోగానే అపరిచిత వ్యక్తి కారును అపహరించినట్లు ఫిర్యాదు చేశాడు. కారుతో పాటు తన రూ.18000, ల్యాప్‌టాప్ కోల్పోయినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:ట్రెండ్ సెట్టింగ్ ఐడియా..ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసుల వినూత్న ప్రయోగం..
Comments
Please login to add a commentAdd a comment