
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 సమీపంలో గురువారం రాత్రి కొందరు యువకులు కర్రలు, ఇనుప రాడ్లతో హల్‌చల్ చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న వారు అర్థరాత్రి వరకు పూటుగా మద్యం సేవించారు. అనంతరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో రోడ్లపై వెళుతున్న వాహనదారులపై కూడా రాళ్ల దాడి చేశారు. దాదాపు 10మంది యువకులు నడిరోడ్డుపై ఇనుప రాడ్లు పట్టుకుని హల్‌చల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment