హైదరాబాద్: నగరంలో ఆన్‌లైన్ పద్ధతిలో వ్యభిచారాన్ని నడుపుతున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని వెస్ట్‌జోన్ డిసిసి సత్యన్నారాయణ తెలిపారు. వ్యభిచార గృహాలపై దాడి చేసేందుకు వెళ్లిన ఇద్దరు జూబ్లీహిల్స్ కానిస్టేబుల్స్‌పై కొందరు దుండగులు చేసిన దాడి వివరాలను ఆయన వెల్లడించారు. సమాచారం వచ్చిన వెంటనే అడిషనల్ డిసిపి గన్‌మేన్, జూబ్లీహిల్స్ హెడ్‌కానిస్టేబుల్ కొండారెడ్డి వ్యభిచార గృహంపై దాడి చేయడానికి వెళ్లారని తెలిపారు.
సుధాకర్ అనే వ్యక్తి కిచెన్‌లో చాకుతో వాడిపై దాడిచేసినట్లు చెప్పారు. గ్రిల్ ఊడదీసి నిందితుడు పారిపోయారన్నారు. ఇద్దరు పోలీసులు మఫ్టీలో ఉన్నారని, సరైన బందోబస్తు ఉండిఉంటే, ఈ ఘటన జరిగి ఉండేదికాదన్నారు. బ్రోకర్ జగదీష్‌ను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఐ, సీఐలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కానిస్టేబుళ్లు దాడిచేసినట్లు డిసిపి చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకురాకుండా ఈ దాడులు చేశారని, అత్యుత్సాహంతో చేశారా? లేక వసూళ్ల కోసం చేశారా? అన్నది ఆరా తీస్తున్నట్లు ఆయన వివరించారు. సరైన భద్రత లేకుండా దాడి చేయడం పొరపాటేనన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యన్నారాయణ చెప్పారు.
ఆన్‌లైన్‌లో వ్యభిచారం!
Published Sun, Jun 22 2014 8:44 PM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM
Advertisement