Online Prostitution
-
హైటెక్ వ్యభిచారం: వాట్సాప్‌లో ఫొటోలు.. ఓకే అయితే
చిత్తూరు జిల్లాలో హైటెక్ వ్యభిచారం గుట్టుగా సాగుతోంది. కొంతమంది బలహీనతలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు విచ్చలవిడిగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం నిర్వాహకులు సోషల్ మీడియాను దర్జాగా వాడుకుంటున్నారు. తిరుపతిలో ఇటీవల పట్టుబడిన ఉందతమే దీనికి ఉదాహరణ. సాక్షి, తిరుపతి క్రైం: కొంతమంది సులభంగా డబ్బు సంపాధించేందుకు వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అపార్ట్మెంట్లను ఎంచుకుంటున్నారు. జిల్లాతోపాటు నెల్లూరు, తమిళనాడు నుంచి మహిళలు, యువతులను రప్పించి యథేచ్ఛగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్లలో ప్రకటనలిస్తూ విటులను ఆకర్షిస్తున్నారు. నేరుగా తిరుపతి కాల్‌గరŠల్స్తోనే ఈ వెబ్‌సైట్స్ క్రియేట్ అవ్వడం గమనార్హం. వాటిని చూసి ఫోన్ ద్వారా సంప్రదించిన వారికి యువతుల ఫొటోలు, మొత్తం, బ్యాంక్ ఖాతా నంబర్ పంపిస్తారు. డబ్బు ఖాతాలోకి రాగానే ఎంపిక చేసుకున్న లాడ్జీలకు రమ్మని విటులకు చెబుతున్నారు. అలా కాదనుకుంటే ఆ యువతలను వారు చెప్పిన చోటికి వారి సిబ్బంది ద్వారా పంపిస్తున్నారు. అదేవిధంగా లాడ్జీలో గదులు తీసుకున్న వారు అమ్మాయిలను కావాలని అడిగితే నిర్వాహకులతో లావాదేవీలు జరిపి సరఫరా చేస్తున్నారు. చదవండి: (పూటుగా తాగి లైంగిక దాడి) సోషల్ మీడియా ద్వారా విటులకు వల వ్యభిచార గృహాల నిర్వాహకులు సామాజిక మాధ్యమాలను బాగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా బ్రోకర్లు యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో అందమైన యువతులు, మహిళల ఫొటోలను పోస్టు చేస్తున్నారు. నచ్చిన వారు సంప్రదించాలంటూ కాంటాక్ట్ నంబర్‌ను సైతం పెడుతున్నారు. గంటకు రూ.1000 నుంచి రూ.5,000లు, యువతులను ఒక్కరోజు తీసుకువెళితే రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పేదరికంలో ఉన్న యువతులే టార్గెట్ పేదరికంలో ఉన్న మహిళలు, విద్యార్థినులు, యువతులకు డబ్బు ఆశ చూపించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు సమాచారం. పక్క రాష్ట్రాల బ్రోకర్లతో సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడి అమ్మాయిలను అక్కడికి, అక్కడి అమ్మాయిలను ఇక్కడికు తరలిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా జిల్లాతోపాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్టార్ హోటళ్లు, లాడ్జీలు, ఊరు శివార్లలో ఇళ్లు తీసు కుని విటులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. చదవండి: (మాట వినడం లేదని అత్తను హత్యచేసిన అల్లుడు) చెక్ పడేనా? కొద్దిరోజుల క్రితం తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో ముగ్గురు విటులతో పాటు నిర్వాహకులు, అమ్మాయిలు పట్టుబడ్డారు. తాజాగా గత శుక్రవారం తిరుపతి నగరంలో పలమనేరుకు చెందిన వ్యక్తి వ్యభిచారానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. పోలీసుల విచారణలో ముగ్గురు కీలక వ్యక్తుల పేర్లు వెల్లడయ్యాయి. ఇందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉండడం గమనార్హం. ఈ దందాలో మహిళ కీలకంగా వ్యహరించడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. వారి ఫోన్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిఘా పెట్టాం ఆన్లైన్లో విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలపై నిఘా పెట్టాం. త్వరలోనే వీరిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. లాడ్జీలపైన పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాం. వ్యభిచారాన్ని కూకటి వేళ్లతో నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాం. ఆధ్యాత్మిక నగర పవిత్రతను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. – ఆవుల రమేష్‌రెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ -
ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, బెంగళూరు : ఇంటర్నెట్ ద్వారా హైటెక్ వేశ్యావాటిక నిర్వహిస్తున్న నలుగురిని శనివారం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి పదిమంది యువతులను రక్షించారు. జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ శనివారం వివరాలు వెల్లడించారు. నిందితులు రాజాజీనగర కుమార్, బీటీఎంలేఔట్ భరత్ కుమార్, ఈజీపుర రఘు, కోడిచిక్కనహళ్లి ప్రజ్వల్‌లు ఇతర రాష్ట్రాల యువతులకు ఉద్యోగం పేరుతో నమ్మించి తీసుకొచ్చి వేశ్యావృత్తిలోకి దించారు. లోకాంటో వెబ్సైట్ ద్వారా మొబైల్లో యువతుల ఫోటోలను పంపించి ఆకర్షితులైన వారి నుంచి వేలల్లో వసూలు చేసేవారు. ఇప్పటికే వీరిపై నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇంటర్నెట్ ద్వారానే వేశ్యవాటిక ముఠా ఆచూకీ కనిపెట్టి పక్కా సమాచారంతో ముఠాను అరెస్ట్ చేసి పది మంది యువతులను రక్షించామని జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు. -
ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ ద్వారా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన ప్రత్యేక బృందం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, ఓ మహిళకు విముక్తి కల్పించిందని డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన టి.సతీష్‌గౌడ్ నగరానికి వలసవచ్చి జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో నివాసముంటున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఆన్లైన్లో వ్యభిచార దందా చేయడానికి సిద్ధమైన ఇతగాడు ఖమ్మం నుంచి వలసవచ్చిన నాగ కార్తీక్‌ను సహాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన పేద మహిళలు, యువతులకు గాలం వేస్తున్న సతీష్ వారిని సిటీకి తరలిస్తున్నాడు. అభ్యంతరకరమైన ఫొటోలతో ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తూ తన ఫోన్ నంబర్ వాటిలో పొందుపరుస్తున్నాడు. వీటికి ఆకర్షితులై ఫోన్లు చేసిన వారి నుంచి నగదు వసూలు చేసి యువతుల్ని సరఫరా చేస్తున్నాడు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బి.చాంద్‌బాష ఇటీవల ఆన్లైన్లో ఉన్న ఈ ప్రకటన గమనించారు. అందులోని ఫోన్‌నంబర్‌కు కాల్ చేయగా... రూ.3 వేలు తీసుకుని వెంకటగిరి ప్రాంతానికి రావాల్సిందిగా సతీష్ చెప్పాడు. దీంతో డెకాయ్ ఆపరేషన్‌కు రంగంలోకి దిగిన పోలీసులు విటుల మాదిరిగా అక్కడకు వెళ్లి సతీష్‌తో పాటు అతడి ఇంటిపై దాడి చేసి కార్తీన్‌ను పట్టుకున్నారు. వీరి చెరలో ఉన్న యువతికి విముక్తి కల్పించారు. -
అర్ధనగ్నచిత్రాలతో యువకులకు వల
సాక్షి,సిటీబ్యూరో: ఆన్లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ స్పెషల్ అపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు శనివా రం అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన మేరకు.. ఈస్ట్గోదావరిలోని దేవరపల్లికి చెంది న జోగేశ్వరరావు కష్ణానగర్, ఎస్ఆర్ నగర్లో ఉన్నాడు. ఈ క్రమంలో కొంతమంది వ్యభిచారముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. టెక్నాలజీని ఉపయోగించి.. యువకులను ఆకర్షించే విధంగా యువతు ల అర్ధనగ్నచిత్రాలను వెబ్సైట్లలో ఆప్‌లోడ్ చేసేవాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన మోడల్స్, ఆర్టిస్టులు, విదేశీ మహిళలు, యాంకర్లను కూడా ఈ వ్యభిచార రొంపి లోకి దింపేవాడు. ఇతర రాష్ట్రాల వ్యభిచార నిర్వాహకులకు ఐదు నుంచి పది రోజుల నగదు అడ్వాన్స్‌గా ఇచ్చి విమాన టికెట్లు సమకూర్చి నగరంలోని స్టార్ హోటల్స్‌లో యువతులను ఉంచేవాడు. విటుల నుంచి రూ.50వేలకుపైగా డబ్బు వసూలు చేసేవాడు. మరో వ్యభిచార నిర్వాహకుడు, గతంలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన లక్ష్మన్నవరి గోపాల్తోను కలిసి కొంత మంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ఇక్కడి యువతులను అక్క డకు పంపి పరస్పర అవగాహనతో ఒప్పందం కుదుర్చుకునేవాడు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెం దిన వ్యభిచార నిర్వాహకుడు ఉస్మాన్‌తో మా ట్లాడి వారం పాటు ఒప్పందంపై ఉజ్బెకిస్థాన్‌కు చెందిన యువతిని నగరానికి తీసుకొచ్చాడు. ఈ నెల 19 నుంచి కత్రియా హోటల్ లో ఉంచి కస్టమర్ల వద్దకు పంపిస్తున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ నేతత్వంలోని బృం దం దాడిచేసి వ్యభిచార ప్రధాన నిర్వాహకులు జోగేశ్వరరావు, లక్ష్మన్నవరి గోపాల్, సహాయ నిర్వాహకుడు కీసన గోపాల్‌లను అరెస్టు చేసి, ఉబ్జెకిస్తాన్ మహిళను పట్టుకున్నా రు. వీరి నుం చి రూ.25వేల నగదుతో పాటు కారు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ‘ఆరు నెలల టూరిస్ట్ వీసాపై తొమ్మిది నెలల క్రితం ఢిల్లీకి వచ్చాను. వీసా గడువు ముగిసి ఇప్పటికే మూడు నెలలు దాటింది. ఈ క్రమంలోనే ఢిల్లీ, గోవా, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన వ్యభిచార నిర్వాహకులతో పరిచయం ఏర్ప డింది. అలా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాన’ని బాధితురాలు పోలీసు విచారణలో తెలిపింది. -
టెక్నాలజీని వాడుకుంటూ వ్యభిచారం!
వారు చెప్పిన అడ్రస్‌లో అమ్మాయిలు రెడీ! సినిమా, ఉద్యోగ అవకాశాల పేరుతో నగరానికి వచ్చే అమ్మాయిలే వారి టార్గెట్! బేరసారాలు అన్నీ ఆన్లైన్లోనే పోలీసుల ఎత్తులకు పైఎత్తులు హైదరాబాద్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో అంతే శరవేగంతో వృద్ధి చెందుతున్న టెక్నాలజీని వాడుకుంటూ విస్తృతంగా వ్యభిచారం కొనసాగుతోంది. వ్యభిచార నిర్వాహకులు పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ తమ వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సినిమా, ఉద్యోగ అవకాశాల పేరుతో నగరానికి వచ్చే అమ్మాయిలను బ్రోకర్లు టార్గెట్‌గా చేసుకుంటారు. ఇక విటులుగా బడాబాబుల పిల్లలను తమ బుట్టలో వేసుకుంటుంటారు. వారి వెబ్సైట్లో ఫోన్ నెంబర్‌తోపాటు అమ్మాయిల ఫొటోలు కూడా పెడతారు. బేరసారాలు అన్నీ ఆన్లైన్లోనే. బుకింగ్, పేమెంట్ అంతా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. వెబ్‌లో పెట్టిన నెంబర్‌కు ఫోన్ చేస్తే అన్ని వివరాలు చెబుతారు. బేరాలు, సమయం, ప్లేసు అన్నీ చెప్పేస్తారు. ఏ ఇబ్బందులూ ఉండవని దైర్యం చెబుతారు. వారిని కలవవలసిన ప్రదేశాన్ని తరచూ మారుస్తుంటారు. వారు చెప్పినచోటకు వెళితే అక్కడ నుంచి కారులో మళ్లీ మరోచోటుకు తీసుకువెళతారు. సాక్షిటీవి సేకరించిన సమాచారం ప్రకారం బ్రోకర్లు హైదరాబాద్, భరత్ నగర్లో శశికళ, చంద్రకళ థియేటర్ల దగ్గరకు వచ్చి కాల్ చేయమని చెప్పారు. బ్రోకర్ తో మాట్లాడితే అమ్మాయిలు తరచూ మారుతుంటారని చెప్పాడు. అమ్మాయి ఒక పూటకు కావాలంటే 5వేల రూపాయలు, ఒక నైట్‌కు అయితే పది వేల రూపాయలని చెప్పాడు. ఎర్రగడ్డ ప్రాంతంలో అమ్మాయిలు ఉన్నట్లు తెలిపాడు. అయితే అమ్మాయిలు ఉండే ప్రదేశాలను తరచూ మారుస్తుంటారు. వారికి డబ్బు ముట్టిన తరువాతే అమ్మాయిని ఒంటరిగా పంపుతారు. డబ్బు వారికి అందిన తరువాత, వారు చెప్పిన అడ్రస్‌లో అమ్మాయిలు రెడీగా ఉంటారు. అందినకాడికి దోచుకోవడమే బ్రోకర్ల పని. అమ్మాయిలకు ముట్టజెప్పిన సొమ్ములో సగానికి పైగా బ్రోకర్లకే పోతుంది. అమ్మాయిలకు వేల రూపాయలు ముడితే, బ్రోకర్లకు లక్షల రూపాయలు ముడుతున్నాయి. ** -
ఆన్లైన్లో వ్యభిచారం!
హైదరాబాద్: నగరంలో ఆన్లైన్ పద్ధతిలో వ్యభిచారాన్ని నడుపుతున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని వెస్ట్‌జోన్ డిసిసి సత్యన్నారాయణ తెలిపారు. వ్యభిచార గృహాలపై దాడి చేసేందుకు వెళ్లిన ఇద్దరు జూబ్లీహిల్స్ కానిస్టేబుల్స్‌పై కొందరు దుండగులు చేసిన దాడి వివరాలను ఆయన వెల్లడించారు. సమాచారం వచ్చిన వెంటనే అడిషనల్ డిసిపి గన్‌మేన్, జూబ్లీహిల్స్ హెడ్‌కానిస్టేబుల్ కొండారెడ్డి వ్యభిచార గృహంపై దాడి చేయడానికి వెళ్లారని తెలిపారు. సుధాకర్ అనే వ్యక్తి కిచెన్‌లో చాకుతో వాడిపై దాడిచేసినట్లు చెప్పారు. గ్రిల్ ఊడదీసి నిందితుడు పారిపోయారన్నారు. ఇద్దరు పోలీసులు మఫ్టీలో ఉన్నారని, సరైన బందోబస్తు ఉండిఉంటే, ఈ ఘటన జరిగి ఉండేదికాదన్నారు. బ్రోకర్ జగదీష్‌ను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఐ, సీఐలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కానిస్టేబుళ్లు దాడిచేసినట్లు డిసిపి చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకురాకుండా ఈ దాడులు చేశారని, అత్యుత్సాహంతో చేశారా? లేక వసూళ్ల కోసం చేశారా? అన్నది ఆరా తీస్తున్నట్లు ఆయన వివరించారు. సరైన భద్రత లేకుండా దాడి చేయడం పొరపాటేనన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యన్నారాయణ చెప్పారు.