సాక్షి, బెంగళూరు : ఇంటర్నెట్ ద్వారా హైటెక్ వేశ్యావాటిక నిర్వహిస్తున్న నలుగురిని శనివారం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి పదిమంది యువతులను రక్షించారు. జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ శనివారం వివరాలు వెల్లడించారు. నిందితులు రాజాజీనగర కుమార్, బీటీఎంలేఔట్ భరత్ కుమార్, ఈజీపుర రఘు, కోడిచిక్కనహళ్లి ప్రజ్వల్‌లు ఇతర రాష్ట్రాల యువతులకు ఉద్యోగం పేరుతో నమ్మించి తీసుకొచ్చి వేశ్యావృత్తిలోకి దించారు. లోకాంటో వెబ్‌సైట్ ద్వారా మొబైల్‌లో యువతుల ఫోటోలను పంపించి ఆకర్షితులైన వారి నుంచి వేలల్లో వసూలు చేసేవారు. ఇప్పటికే వీరిపై నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇంటర్నెట్ ద్వారానే వేశ్యవాటిక ముఠా ఆచూకీ కనిపెట్టి పక్కా సమాచారంతో ముఠాను అరెస్ట్ చేసి పది మంది యువతులను రక్షించామని జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment