
సాక్షి,హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం రేగింది. ఓ అగంతకుడు అర్థరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం, ఇంట్లో కిచెన్,హాల్‌సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు. గంటన్నరపాటు ఇంట్లో కలయతిరిగాడు.
అయితే,దుండగుడు వచ్చిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేకపోవడం ప్రమాదమే తప్పింది. మరోవైపు, డీకే అరుణ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగకపోవడంపై కుట్రకోణం దాగి ఉందని డీకే అరుణ కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో డీకే అరుణ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంట్లో పోలీసులు, క్లూస్ టీమ్ విచారణ చేపట్టారు. తనపై ఏదైనా కుట్ర కు ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్న ఎంపీ డీకే అరుణ.. తన ఇంటికి భద్రత పెంచాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment