జూబ్లీహిల్స్‌ పబ్‌లలోనే రాత్రి 10 దాటితే నో మ్యూజిక్‌: హైకోర్టు | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌ పబ్‌లలోనే రాత్రి 10 దాటితే నో మ్యూజిక్‌: హైకోర్టు

Published Mon, Oct 31 2022 3:42 PM

TS High Court Says No Music After 10 PM Only In Jubilee Hills Pubs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల వ్యవహారంలో మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. 10 పబ్‌లలో రాత్రి పది గంటల తర్వాత మ్యూజిక్‌ వినిపించకూడదని గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని అప్పీలు చేసింది రెస్టారెంట్‌ అసోసియేషన్‌. ఈ అప్పీలుపై విచారణ సందర్భంగా డివిజనల్‌ బెంచ్‌ కీలక వ్యాఖ్యలు  చేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పు జూబ్లీహిల్స్‌లోని 10 పబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 26న పబ్‌లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే మైనర్లను కూడా పబ్‌లలోకి అనుమతివ్వొద్దని ఆదేశించారు. 

ఇదీ చదవండి: కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్‌ ఓ.. ప్చ్‌! యాప్‌ ఎంతపని చేసింది?

Advertisement
 
Advertisement
 
Advertisement