restarents
-
కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా!
విజయవంతమైన వ్యాపారాలన్నీ కూడా కేవలం ఒక్క ఆలోచనతో ప్రారంభమైనవే అనే విషయం అందరికి తెలుసు. ఇలాంటి వ్యాపారాలు భారతదేశంలో కోకొల్లలనే చెప్పాలి. ఇలాంటి కోవకు చెందిన ఒక బిజినెస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కాలిఫోర్నియా బుర్రిటో.. అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త 'బెర్ట్ ముల్లర్' (Bert Mueller) భారతదేశంలో పర్యటించడానికి వచ్చి క్విక్ సర్వీస్ రెస్టారెంట్ 'కాలిఫోర్నియా బుర్రిటో' (California Burrito) పేరుతో నిర్మించాడు. ఇతడు ధరమ్ ఖల్సా & గేలాన్ డ్రేపర్‌లతో కలిసి దీనిని స్థాపించాడు. బుర్రిటో రెస్టారెంట్ బెంగళూరులో ఉంది. దీనిని బుర్రిటో రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2010లో ప్రారంభించినట్లు సమాచారం. నిజానికి వీరు ఇండియాలో మొదట గురుగ్రామ్‌లో రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ చివరకు బెంగళూరులో ప్రారంభించారు. దీనికోసం ముల్లెర్ & డ్రేపర్ స్వయంగా చాలా కష్టపడ్డారు. చెన్నైకి విస్తరణ.. క్రమంగా బుర్రిటో రెస్టారెంట్ భారతదేశంలో క్రమంగా అభివృద్ధి చెందటం ప్రారంభమైంది. 2023 మే నెలలో కాలిఫోర్నియా బుర్రిటో చెన్నైకి విస్తరించింది. ఇప్పుడు దేశం మొత్తం మీద బెంగళూరు మాత్రమే కాకుండా ఢిల్లీ ఎన్‌సిఆర్, హైదరాబాద్ నగరాలలో కూడా ఉన్నట్లు సమాచారం. బుర్రిటో రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన ముల్లర్ అమెరికాలోని మోస్ సౌత్‌వెస్ట్ గ్రిల్లో పనిచేశాడు. ది కాలేజ్ ఆఫ్ విలియం అండ్ మేరీ నుంచి ఆర్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. దీనికోసం కుటుంబం, స్నేహితుల నుంచి డబ్బు తీసుకుని తమ ప్రయాణం సాగించి నేడు మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. 100 స్టోర్ల లక్ష్యం.. ప్రస్తుతం కాలిఫోర్నియా మొత్తంలో బుర్రిటో రెస్టారెంట్ 50 కంటే ఎక్కువ లొకేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ప్రతి సంవత్సరం రూ. 110 కోట్లకంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. 2025 మార్చి నాటికి కాలిఫోర్నియా బురిటో 100 స్టోర్లను కలిగి ఉండాలని బెర్ట్ ముల్లర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 15/15 Bert is aiming for California Burrito to have 100 stores by March of 2025. Here’s a sneak peek from the podcast conversation I had with him recently. If you want to watch the entire video, you can find a link to it in my bio. pic.twitter.com/bdMlBk6vae — Caleb Friesen (@caleb_friesen2) August 21, 2023 -
రెస్టారెంట్లో ఖరీదైన వాటర్ బాటిల్ అంటగట్టారని.. ‘పైసా వసూల్’ పనిచేసి..
ఖరీదైన రెస్టారెంట్లలో బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భాల్లో కాస్త నిట్టూరుస్తూనే బిల్లు చెల్లిస్తుంటాం. తాజాగా ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్ రితికా బోరా రెస్టారెంట్లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఆమె రెస్టారెంట్లో వాటర్ బాటిల్‌కు ఆర్డర్ చేయగా, దానికి ఆమె భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె క్యాప్షన్‌లో ‘మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు స్నేహితురాలితో పాటు వెళ్లాను. అక్కడ వాటర్ బాటిల్‌కు రూ.350 చెల్లించాల్సి వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆ బాటిల్‌ను నాతో పాటు ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీనిని తిరిగి వినియోగించవచ్చని భావించాను. ఈ విధంగా నేను మాత్రమే చేస్తున్నానా? మీరు కూడా చేస్తారా?’ అని అమె ప్రశ్నించింది. Met up with a friend at this fancy restaurant for lunch, and you won't believe they charged 350 rps for a bottle of water! So, I decided to bring the bottle home with me so that I can reuse it. Is it only me or u have done this too? pic.twitter.com/AecGPLuoV8 — Ritika Borah (@coach_ritika) July 10, 2023 ఎక్కడైనా వాటర్ బాటిల్ రూ. 20కి లభ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్లో ఏకంగా వాటర్‌బాటిల్‌కు రూ. 350 చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. రితికా బోరా పోస్టును చూసిన పలువరు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకు రెస్టారెంట్లలో ఎదురైన అనుభవాలను తెలియజేయగా, మరికొందు ‘పైసా వసూల్’ పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
జూబ్లీహిల్స్ పబ్‌లలోనే రాత్రి 10 దాటితే నో మ్యూజిక్: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల వ్యవహారంలో మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. 10 పబ్‌లలో రాత్రి పది గంటల తర్వాత మ్యూజిక్ వినిపించకూడదని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని అప్పీలు చేసింది రెస్టారెంట్ అసోసియేషన్. ఈ అప్పీలుపై విచారణ సందర్భంగా డివిజనల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు జూబ్లీహిల్స్‌లోని 10 పబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 26న పబ్‌లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే మైనర్లను కూడా పబ్‌లలోకి అనుమతివ్వొద్దని ఆదేశించారు. ఇదీ చదవండి: కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్ ఓ.. ప్చ్! యాప్ ఎంతపని చేసింది? -
ఇండియన్ రెస్టారెంట్లో జానీ డెప్ పార్టీ, రూ. 49 లక్షల బిల్లుతో షాకిచ్చాడు
ప్రముఖ హాలీవుడ్ స్టార్ జానీ డెప్ తన మాజీ భార్యపై విజయం సాధించడంతో ఫుల్ ఖుషి ఉన్నాడు. గృహ హింస, పరువు నష్టం దావా కేసు కోర్టు ఆయనకు అనుకులంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తున్న జానీ డేప్ వరుసగా యూకేలోని మ్యూజిక్ కన్సర్ట్స్కు హజరవుతున్నాడు. ఈ క్రమంలో గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో కలిసి బ్రిటన్‌లో బర్మింగ్‌హెమ్‌లో దర్శనమిచ్చాడు. ఆదివారం సాయంత్రం అక్కడి ఇండియన్ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్న జానీ డెప్ రెస్టారెంట్‌కు అయిదు అంకెల బిల్లు కట్టి షాకిచ్చాడు. చదవండి: ఆ ముసలోడి కంటే నేనే నయం: నటికి పెళ్లి ప్రపోజల్ దీంతో జానీ కట్టిన బిల్లు న్యూయార్క్ పత్రికల్లో కథనంగా ప్రచురితమైంది. ఇది తెలిసి అంతా షాక్ అవుతున్నారు. కాగా బర్మింగ్‌హోమ్‌లోని ‘వారణాసి’ రెస్టారెంట్లో జానీ డెప్ ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి కర్రీపార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీలో భారతీయ వంటకాలు, కాక్టెయిల్స్, రోజీ ‘ఆంపైయిన్ వంటివి ఏర్పాటు చేశారు. అక్కడి ఇండియన్ డిషెస్ టేస్ట్ చేసిన జానీ డెప్ వాటికి ఫిదా అయ్యాడట. దీంతో రెస్టారెంట్ వెయిటర్స్‌ని మెచ్చుకుంటూ వారితో కలిసి ఫొటోలు దిగాడు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించిన జానీ చివరగా 50 వేల పౌండ్ల బిల్లు కట్టాడు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల 49 లక్షల రూపాయలు. చదవండి: రీఎంట్రీకి సిద్ధమవుతున్న కాజల్ అగర్వాల్? దీంతో రెస్టారెంట్ యాజమాన్యం ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని మహమ్మద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం సమయంలో తనకు ఫోన్ వచ్చిందని, జానీ డెప్ తమ రెస్టారెంట్లో డిన్నర్‌కు వస్తున్నట్లు చెప్పారన్నాడు. మొదట జోక్ అనుకున్నానని, ఆ తర్వాత ఆయన భద్రత దృష్ట్యా మొదట సిబ్బంది రెస్టారెంట్ అంతా తనిఖి చేశారని చెప్పాడు. దీంతో నిజమని నమ్మనన్నాడు. ఇక ఈ విందులో శిష్ కబాబ్, చికెన్ టిక్కా, పనీర్ టిక్కా, మసాలా, ట్యాంబ్ కరాహీ, కింగ్ తందూరీ ప్రాన్స్ వంటి వంటకాలు వడ్డించినట్లు తెలిపాడు. కాగా ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో అతిపెద్ద రెస్టారెంట్స్‌లో ఇండియన్ ‘వారణాసి’ రెస్టారెంట్ ఒకటి. -
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్... దెబ్బతో అకౌంట్లో డబ్బులన్నీ మాయం!
ముంబై: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి ఓ వ్యక్తి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నాడు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. అంతే ఎకౌంట్లో డబ్బులన్నీ మాయం! అసలేంజరిగిందంటే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన బాబాసాహెబ్ థోంబ్రె (41) అనే వ్యక్తి పేరుగాంచిన ఓ రెస్టారెంట్‌కు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. సోషల్ మీడియాలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఫుడ్ డిసౌంట్ ఆఫర్ చూసి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాడట. రెండు మీల్స్ ఆర్డర్ చేస్తే ఒకటే మీల్‌కు ధర చెల్లింపు అనేదే ఆ డిస్కౌంట్. ఆర్డర్ ఇవ్వడానికి క్రెడిట్ కార్డు వివరాలు తెలపాలి. అలా చేయగానే వెంటనే అతని అకౌంట్ నుంచి 89 వేల రూపాయలు కట్ అయ్యాయని పోలీసధికారులు బుధవారం మీడియాకు తెలిపారు. కాగా సెప్టెంబర్‌లో ఈ సంఘటన చోటుచేసుకోగా... బాధితుడి పిర్యాదు మేరకు ఎమ్ఐడీసీ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 420, ఐటీ చట్టం కింద మంగళవారం కేసు ఫైల్ చేసినట్లు పోలీసధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఒమిక్రాన్ ఎలుకల నుంచి మనుషులకు సోకిందా? ఎంతవరకు నిజం.. -
స్విగ్గీ.. జొమాటోకు షాక్.!
న్యూఢిల్లీ: జొమాటో.. స్విగ్గీ.. పట్టణ ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేనివి. కరోనా వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల సేవలు మరింతగా విస్తరించాయి. వైరస్ కారణంగా ఎక్కువ మంది ఆహారం కోసం బయటకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆర్డర్ చేసి తెప్పించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే వీటి ప్రాచుర్యం మరింత పెరిగిపోయింది. ఈ పరిస్థితులను గమనించిన కొన్ని పెద్ద రెస్టారెంట్లు మనమే సొంతంగా ఎందుకు డెలివరీ చేయకూడదు? జొమాటో, స్విగ్గీలపై ఎంతకాలం ఆధారపడడం? అన్న ఆలోచనలకు వస్తున్నాయి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ)లో సభ్యత్వం కలిగిన కొన్ని రెస్టారెంట్లు డాట్పే, థ్రైవ్ వంటి టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని సొంతంగా ఆన్లైన్ ఆర్డర్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గూగుల్ సెర్చింజన్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనా ఆయా రెస్టారెంట్లు తమ ఆన్లైన్ ఆర్డర్ల లింక్‌లకు ప్రచారం కల్పించే మార్కెటింగ్ వ్యూహాలను కూడా అమలు చేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీలకు రెస్టారెంట్లు ప్రతీ ఆర్డర్‌పై ఇంత చొప్పున కమీషన్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఈ కమీషన్ 30 శాతం వరకు ఉంటుందని రెస్టారెంట్లు చెబుతున్నాయి. తామే సొంతంగా జొమాటో, స్విగ్గీ మాదిరిగా కస్టమర్లను చేరుకునే మార్గాలు తెలుసుకుంటే ఈ మేర కమీషన్‌ను ఆదా చేసుకోవచ్చని భావిస్తున్నాయి. ఎక్కువ మందిని చేరుకోవచ్చు.. ‘‘సాధారణంగా 7–10 కిలోమీటర్ల పరిధిలోనే అగ్రిగేటర్లు (స్విగ్గీ, జొమాటో తదితర) సేవలు అందించగలవు. సొంతంగా నెట్‌వర్క్‌ను కలిగి ఉంటే లేదా లాజిస్టిక్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే ఇంతకుమించిన దూరంలో ఉన్న కస్టమర్లను కూడా చేరుకునేందుకు వీలుంటుంది’’ అని దేవిదయాళ్ వివరించారు. హంగర్ హాస్పిటాలిటీ సైతం 80% ఆర్డర్లను సొంత ఆన్లైన్ ఆర్డర్ ప్లాట్‌ఫామ్ నుంచే సమకూర్చుకుంటోంది. ఈ సంస్థకు బాంబే క్యాంటీన్, ఓ పెడ్రో, బాంబే స్వీట్‌షాప్ తదితర బ్రాండ్లున్నాయి. థ్రైవ్ సాయంతో సొంతంగా ఆర్డర్లను స్వీకరించే టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. సొంత డెలివరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని కస్టమర్లను చేరుకుంటోంది. ఈ సంస్థ ఇటీవలే రెండు ప్రత్యేకమైన బ్రాండ్లను ఆవిష్కరించింది. ఇవి స్విగ్గీ, జొమాటో ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉండవు. సొంత ప్లాట్‌ఫామ్‌పైనే వీటిని ఆఫర్ చేస్తోంది. ‘‘మార్కెటింగ్‌కు ఇన్‌స్ట్రాగామ్ సేవలను వినియోగిస్తున్నాం. దీర్ఘకాలం కోసం బ్రాండ్లను ఏర్పాటు చేసుకున్నాం కనుక మార్కెటింగ్ ఖర్చులు సహేతుకంగానే అనిపిస్తున్నాయి’’ అని సంస్థ వ్యవస్థాపకుడు యాష్ బనాజే చెప్పారు. ఢిల్లీకి చెందిన బిగ్ చిల్ కేఫ్ సైతం సొంతంగానే ఆన్ లైన్ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సేవలను అందిస్తోంది. కస్టమర్లు కోరుకున్న రుచులు రెస్టారెంట్లు సొంతంగానే ఆర్డర్లు తీసుకోవడం వల్ల కస్టమర్లకు ఇష్టమైన రుచులను అందించేందుకు వీలుంటుందని ఫుడ్మ్యాటర్స్ ఇండియా పార్ట్నర్ గౌరీదేవిదయాళ్ పేర్కొన్నారు. కస్టమర్లు కోరుకున్న ప్రత్యేకమైన రెసిపీలను తయారు చేసి డెలివరీ చేసేందుకు వీలుంటుందన్నారు. అదే జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌లపై ఇందుకు పరిమిత అవకాశమే ఉంటుందన్నది ఆయన విశ్లేషణ. -
రెస్టారెంట్ ధ్వంసం.. విద్వేషపూరిత రాతలు
వాషింగ్టన్: న్యూ మెక్సికోలోని సాంటే ఫే నగరంలో ఒక భారతీయ రెస్టారెంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారు. రెస్టారెంట్ గోడల మీద విద్వేషపూరిత సందేశాలను రాశారు. ఇండియా ప్యాలెస్ అనే ఈ రెస్టారెంట్ ఓ సిక్కు వ్యక్తిది అని స్థానిక మీడియా తెలిపింది. రెస్టారెంట్‌కు జరిగిన నష్టం 1,00,000 డాలర్లుగా ఉంటుందని సమాచారం. ఈ సంఘటనను సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్ఏఎల్డీఈఎఫ్- సాల్డెఫ్) తీవ్రంగా ఖండించింది. ఈ రకమైన ద్వేషం, హింస ఆమోదయోగ్యం కాదని తెలిపింది. అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి అని సాల్డెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ కౌర్ గిల్ అన్నారు. అంతేకాక శాంటా ఫే ఒక ప్రశాంతమైన పట్టణం అని.. సిక్కు సమాజం గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో సంతోషంగా జీవిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో యజమాని మాట్లాడుతూ.. ‘దుండగులు రెస్టారెంట్‌లోని టేబుల్స్‌ని విరగ్గొట్టారు. గాజు సామానును ముక్కలు ముక్కలు చేశారు. వైన్ ర్యాక్‌ను ఖాళీ చేశారు. ఓ దేవత విగ్రహాన్ని శిరచ్ఛేదన చేశారు. కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. వంటగదిని కూడా పూర్తిగా నాశనం చేశారు. ఆహారాన్ని వేడి చేసే పరికరాలు ధ్వంసం చేశారు. గోడల మీద ‘వైట పవర్’.. ‘ట్రంప్2020’.. ‘ఇంటికి వెళ్లు’ అని రాసి ఉంది. ఇవన్ని చూసి అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు ఇంకా అర్థం కావడం లేదు’ అని వాపోయాడు. దీని గురించి స్థానిక పోలీసులు, ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమంలో భాగంగా స్పానిష్ వలసవాదులతో సంబంధం ఉన్న విగ్రహాలను తొలగించడంతో ఇటీవల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. అంతేకాక ఈ ఏడాది ఏప్రిల్ 20న కొలరాడోలోని లాక్వుడ్లో ఎరిక్ బ్రీమాన్ అనే వ్యక్తి.. సిక్కు అమెరికన్ లఖ్వంత్ సింగ్‌పై దారుణంగా దాడి చేశాడు. నాటి నుంచి ఈ ద్వేషపూరిత నేరాలలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని సాల్డెఫ్ తెలిపింది. లఖ్వంత్ సింగ్‌పై దాడి చేస్తున్నప్పుడు సదరు వ్యక్తి.. ‘మీ దేశానికి తిరిగి వెళ్ళు’ అని బెదిరించాడని తెలిపారు. అయితే దాడి చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. -
‘టిఫినీ’లు చేశారా?
సాక్షి, బంజారాహిల్స్ : పిజ్జా దోశ.. చాక్లెట్ దోశ.. డ్రై ఫ్రూట్ దోశ.. వీటిని రుచి చూడాలనిపిస్తోందా..? జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో గురువారం ప్రారంభమైన టిఫినీ రెస్టారెంట్లో వెజ్, నాన్‌వెజ్‌లతో వివిధ రకాల టిఫిన్లు అల్పాహార ప్రియులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన టిఫినీ రెస్టారెంట్‌ను మాజీ గవర్నర్ రోశయ్య, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ గేయ రచయిత అనంత శ్రీరాం, కేవీ రమణాచారి, చక్రపాణి, డాక్టర్ బీవీ పట్టాభిరామ్‌తో పాటు అలనాటి నటి జమున ప్రారంభించారు. ఇక్కడి టిఫిన్లను రుచి చూశారు. 80 మంది ఒకేసారి కూర్చునే విధంగా ఇక్కడ రెస్టారెంట్‌ను సంప్రదాయ రీతిలో రూపొందించినట్లు నిర్వాహకులు వెంకట్రామ్, నవీన్ వెల్లడించారు. ఇక్కడ కీమ దోశ, బొమ్మిడాల పులుసు, రొయ్యల ఇగురు, నాటుకోడి కర్రీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయని వారు తెలిపారు. -
ఆ రెస్టారెంట్లపై కొరడా
సాక్షి,న్యూఢిల్లీ: రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినా ఆయా సంస్థలు వినియోగదారులకు పాత రేట్లనే వర్తింపచేస్తుండటం ఇక చెల్లుబాటు కాదు. అలాంటి సంస్థల పనిపట్టేందుకు వినియోగదారులకు ఆసరాగా నిలిచేలా కేంద్రం నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ (ఎన్ఏఏ) పేరిట జీఎస్టీ కింద మరో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గురువారం ఎన్‌ఏఏకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎస్టీ రేట్లను తగ్గించిన రీతిలో వినియోగదారులకు చేరేలా ఈ అథారిటీ పర్యవేక్షిస్తుంది. తగ్గించిన పన్ను రేట్ల ప్రయోజనాన్ని ఏ సంస్థలు వినియోగదారులకు బదలాయించని పక్షంలో రాష్ర్టాల్లో ఏర్పాటయ్యే స్క్రీనింగ్ కమిటీలకు నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. ఆయా కమిటీలు పరిశీలించిన అనంతరం ఏమైనా సంస్థలు వినియోగదారులకు తగ్గించిన రేట్లను బదలాయించకుంటే వాటిపై ఎన్ఏఏ చర్యలు చేపడుతుంది. బాధిత వినియోగదారుడికి వడ్డీతో సహా తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటారు. ఈ తరహా మోసాలు పెద్ద ఎత్తున సాగితే ఆ వ్యాపార సంస్థపై జరిమానా విధించడం, జీఎస్టీ రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయడం వంటి తీవ్ర చర్యలూ చేపడతారు. -
రెస్టారెంట్లలో మొసలి మాంసం!
బెంగళూరు: నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో మొసలి మాంసం దొరుకుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు.. నగరానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి బుధవారం ఎంజీ రోడ్డులోని ఓ రెస్టారెంట్ కు దాదాపు 15 కిలోల బరువు కలిగిన చనిపోయిన మొసలిని అమ్మడానికి ప్రయత్నించాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న కబ్బన్ పోలీసులు రెస్టారెంట్ పై దాడులు చేశారు. ఆనంద్ ను అరెస్టు చేశారు. మొసలిని ఎక్కడ నుంచి తీసుకువస్తున్నాడు, ఎవరెవరికి విక్రయిస్తున్నాడనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా మొసలి మాంసానికి బెంగళూరులో భారీ డిమాండ్ ఉందని తెలుస్తోంది. కిలో రూ. 2000 వరకు అమ్ముతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.