రెస్టారెంట్లలో మొసలి మాంసం! | Crocodile meat in bangalore restaurants | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్లలో మొసలి మాంసం!

Published Thu, Mar 17 2016 11:09 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

రెస్టారెంట్లలో మొసలి మాంసం!

రెస్టారెంట్లలో మొసలి మాంసం!

బెంగళూరు: నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో మొసలి మాంసం దొరుకుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు.. నగరానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి బుధవారం ఎంజీ రోడ్డులోని ఓ రెస్టారెంట్ కు దాదాపు 15 కిలోల బరువు కలిగిన చనిపోయిన మొసలిని అమ్మడానికి ప్రయత్నించాడు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న కబ్బన్ పోలీసులు రెస్టారెంట్ పై దాడులు చేశారు. ఆనంద్ ను అరెస్టు చేశారు. మొసలిని ఎక్కడ నుంచి తీసుకువస్తున్నాడు, ఎవరెవరికి విక్రయిస్తున్నాడనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు.  ఇదిలా ఉండగా మొసలి మాంసానికి బెంగళూరులో భారీ డిమాండ్ ఉందని తెలుస్తోంది. కిలో రూ. 2000 వరకు అమ్ముతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement