‘టిఫినీ’లు చేశారా? | Have You Complete Your Breakfast | Sakshi
Sakshi News home page

‘టిఫినీ’లు చేశారా?!

Published Fri, May 11 2018 9:18 AM | Last Updated on Thu, Jul 11 2019 9:16 PM

Have You Complete Your Breakfast - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌ :  పిజ్జా దోశ.. చాక్లెట్‌ దోశ.. డ్రై ఫ్రూట్‌ దోశ.. వీటిని రుచి చూడాలనిపిస్తోందా..? జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో గురువారం ప్రారంభమైన టిఫినీ రెస్టారెంట్‌లో వెజ్, నాన్‌వెజ్‌లతో వివిధ రకాల టిఫిన్లు అల్పాహార ప్రియులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన టిఫినీ రెస్టారెంట్‌ను మాజీ గవర్నర్‌ రోశయ్య, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ గేయ రచయిత అనంత శ్రీరాం, కేవీ రమణాచారి, చక్రపాణి, డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌తో పాటు అలనాటి నటి జమున ప్రారంభించారు.

ఇక్కడి టిఫిన్‌లను రుచి చూశారు. 80 మంది ఒకేసారి కూర్చునే విధంగా ఇక్కడ రెస్టారెంట్‌ను సంప్రదాయ రీతిలో రూపొందించినట్లు నిర్వాహకులు వెంకట్‌రామ్, నవీన్‌ వెల్లడించారు. ఇక్కడ కీమ దోశ, బొమ్మిడాల పులుసు, రొయ్యల ఇగురు, నాటుకోడి కర్రీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయని వారు తెలిపారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement