కోహ్లీ రెస్టారెంట్‌లో ఇంత రేటా..? | Hyderabad Woman Paying Rs 525 For Corn | Sakshi
Sakshi News home page

కోహ్లీ రెస్టారెంట్‌లో ఇంత రేటా..?: వైరల్ అవుతున్న పోస్ట్

Published Tue, Jan 14 2025 3:15 PM | Last Updated on Tue, Jan 14 2025 3:56 PM

Hyderabad Woman Paying Rs 525 For Corn

హైదరాబాద్‌లోని ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి.. విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌ (Virat Kohli Restaurant)లో రూ. 525 విలువైన డిష్‌ ఆర్డర్ చేసి నిరుత్సాహానికి గురైంది. కోహ్లి యాజమాన్యంలోని రెస్టో బార్ అయిన వన్8 కమ్యూన్‌లో ఈ ఘటన జరిగింది.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి స్నేహ.. విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌లో పెరి పెరి కార్న్ రిబ్స్ (మొక్కజొన్న ముక్కలు) కోసం ఏకంగా రూ. 525 చెల్లించినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఎక్స్ (Twitter) ఖాతాలో చేసింది. ఫోటోలలో గమనిస్తే.. మొక్కజొన్న ముక్కలు రుచి ఉండటానికి పర్మేసన్ చీజ్, స్కాలియన్​తో వడ్డించి ఉండటం చూడవచ్చు.

ఈ ఘటనపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ''ఆర్డర్ చేయడానికి ముందు మీకు ధర తెలుసు, కాబట్టి మీ ఏడుపు ఆపండి" అని ఒకరు కామెంట్ చేయగా.. రెస్టారెంట్ వాతావరణం, శుభ్రత, సర్వీస్ వంటి వాటికి ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నట్లు మరొకరు కామెంట్ చేశారు. నిజానికి ఫుడ్ కోసం కాకుండా, వైబ్స్ కోసం ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారని ఇంకొకరు అన్నారు.

ప్రముఖ నగరాలలోని ఫ్యాన్సీ రెస్టారెంట్లలో ధరలు భారీగా ఉంటాయని దాదాపు అందరికీ తెలుసు. అయితే ధరకు తగ్గ క్వాంటిటీ మాత్రం లభించే అవకాశం లేదు. ఇది ఫుడ్ లవర్స్ (Food Lovers)​ను బాధపెడుతోంది. బయట ఇదే ఫుడ్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. లగ్జరీ అనుభవాన్ని పొందాలంటే మాత్రం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకతప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement