బంజారాహిల్స్: పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్ పేరుతో హెచ్‌ఎండీఏ ఉద్యోగులకు ఫోన్లు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తి 9313411812 నంబర్ ద్వారా ఫోన్లు చేస్తున్నాడు.
వాట్సాప్ డీపీగా అరవింద్‌కుమార్ ఫొటో పెట్టుకోవడంతో పాటు ట్రూకాలర్‌లో సైతం అదే పేరు వచ్చేలా చూసుకున్న దుండగుడు హెచ్‌ఎండీఏ ఉద్యోగులతో పాటు మరికొందరికి ఫోన్లు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. మంగళవారం దీనిని గుర్తించిన అరవింద్‌కుమార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తన పేరుతో ఫోన్లు చేస్తున్న వ్యక్తిపట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. దీంతో పాటు తన పేరును దుర్వినియోగం చేస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేయాలని హెచ్‌ఎండీఏ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్‌ను అదేశించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వెంకటేష్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: డోంట్ బీ ప్రాంక్..)
Comments
Please login to add a commentAdd a comment