జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం | Road accident in Jublihills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

Published Sun, Jan 21 2018 3:32 PM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Road accident in Jublihills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి తృటిలో పెనుప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి అతివేగంగా కారునడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టాడు. తర్వాత కారు అదుపుతప్పి గాల్లో పల్టీలు కొట్టి కరెంట్ స్తంభాన్ని కూడా ఢీకొట్టింది. కారు వేగానికి కరెంటు స్తంభం కూలిపోయింది. ఈ సంఘటన జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్‌ 45లోని చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో కారు వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. ఈ కారును ఫరీద్ అనే డ్రైవర్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ - టీఎస్ 07 యూఏ 0509. కాగా, ఇటీవలే మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 10 లో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేగంగా వచ్చిన కారు స్కూటీని ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement