బంజారాహిల్స్ : పబ్‌లో పీకలదాకా మద్యం సేవించి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ గురుస్వామి కథనం మేరకు... సరూర్‌నగర్ ఎర్రకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ సయీద్(25), చాంద్రాయణగుట్టకు చెందిన అహ్మద్ బిన్ ఇజ్రీస్ జుబాలి(25) ఈ నెల 25న మరో ఇద్దరు స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని కాక్‌టైల్స్ పబ్‌కు వచ్చి పీకల దాకా మద్యం సేవించారు.
పబ్ మూసేశాక సెల్లార్‌లోకి వచ్చి వాహనాలను తీస్తున్న సమయంలో.. అదే పబ్ నుంచి తన స్నేహితురాళ్లతో కలిసి ఓ యువతి(23) పార్కింగ్ వద్దకు వచ్చింది. తాగిన మత్తులో ఈ నలుగురు కలిసి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె చెయ్యి పట్టుకొని లాగారు.. అసభ్యంగా దూషించారు. దీంతో బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీల ఆధారంగా సయీద్, జుబాలిని అరెస్టు చేసి వీరిపై ఐపీసీ సెక్షన్ 354(బి), 334, 506ల కింద కేసులు నమోదు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అసభ్యంగా ప్రవర్తించిన యువకులకు రిమాండ్
Published Mon, May 30 2016 6:25 PM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement