ఇటీవల ట్రైయిన్‌లో టికెట్ కలెక్టర్ల వరుస అనుచిత ప్రవర్తన ఘటనలు మరువక మునుపే ఓ ప్యాసింజర్ రైలులో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్ ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో నిలంబూరు నుంచి కొచ్చవేలి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో జరిగింది. దీంతో రైల్వే పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ చేశారు.
వివరాల్లోకెళ్తే.. రైలు రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ నిలంబూర్ కొచువేలిలోని అలువా స్టేషన్ దాటిన తర్వాత ఈ అనూహ్య ఘటన జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలికి ఆర్‌ఏసీ టికెట్ వచ్చింది. దీంతో ఆమె ఎస్4లో కూర్చొని ఉండగా ఒక టిక్కెట్ ఎగ్జామినర్ (టీఈ) వచ్చి ఆమె పక్కనే కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో ఆమె వెంటనే తిరువనంతపురంలోని రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెతోనూ 35 ఏళ్ల టీఈతోనూ మాట్లాడి విచారించి, సదరు టీఈని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత టీఈకి వైద్య పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఆ మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. కోర్టు అతనికి 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీని విధించినట్లు అధికారులు తెలిపారు.
(చదవండి: బహుభార్యత్వంపై కొరడా ఝళిపిస్తున్న అస్సాం! సీఎం కీలక ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment