Ticket Checker
-
జస్ట్ మిస్..! వందేభారత్ కింద.. చెకింగ్ అధికారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి..
అహ్మదాబాద్: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబయికి వెళ్తున్న రైలులో చెకింగ్ అధికారి కాస్తలో ప్రాణాలతో బయటపడ్డారు. ట్రైన్‌లోకి ఎక్కే ప్రయత్నంలో డోర్లు మూసుకోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. గుజరాత్ నుంచి వందేభారత్ రైలు ముంబయికి వెళుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ వద్ద ఆగింది. అక్కడే ఉన్న చెకింగ్ అధికారి రైలులోకి ఎక్కడం కాస్త ఆలస్యం అయింది. అంతలోనే రైలు ప్రారంభమైంది. ట్రైన్‌లోకి ఎక్కే ప్రయత్నం చేశారు చెకింగ్ అధికారి. కానీ అప్పటికే డోర్లు మూసుకున్నాయి. ఈ క్రమంలో ఆయన కిందపడ్డారు. కాస్తలో రైలు కింద పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఆయన్ను పైకి లాగారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. Video | Gates of Mumbai bound Vande Bharat closed at Ahmedabad station & a Ticket checker was left out. Desparate to get in, he attempted something that may have cost him his life. This is reported to have happened on 26th June. #Vandebharat #Mumbai #IndianRail pic.twitter.com/WvzuQDGudN — ABS (@iShekhab) June 29, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందించారు. ట్రైన్ ఎక్కేప్పుడు జాగ్రత్తలు సూచించారు. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
ట్రైయిన్‌లో మరో అసభ్యకర ఘటన.. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్..
ఇటీవల ట్రైయిన్‌లో టికెట్ కలెక్టర్ల వరుస అనుచిత ప్రవర్తన ఘటనలు మరువక మునుపే ఓ ప్యాసింజర్ రైలులో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్ ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో నిలంబూరు నుంచి కొచ్చవేలి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో జరిగింది. దీంతో రైల్వే పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ చేశారు. వివరాల్లోకెళ్తే.. రైలు రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ నిలంబూర్ కొచువేలిలోని అలువా స్టేషన్ దాటిన తర్వాత ఈ అనూహ్య ఘటన జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలికి ఆర్ఏసీ టికెట్ వచ్చింది. దీంతో ఆమె ఎస్4లో కూర్చొని ఉండగా ఒక టిక్కెట్ ఎగ్జామినర్ (టీఈ) వచ్చి ఆమె పక్కనే కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే తిరువనంతపురంలోని రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెతోనూ 35 ఏళ్ల టీఈతోనూ మాట్లాడి విచారించి, సదరు టీఈని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత టీఈకి వైద్య పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఆ మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. కోర్టు అతనికి 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీని విధించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: బహుభార్యత్వంపై కొరడా ఝళిపిస్తున్న అస్సాం! సీఎం కీలక ప్రకటన) -
టీటీఈలకు బాడీ కెమెరాలు
న్యూఢిల్లీ: టికెట్ల తనిఖీలో పారదర్శకత, రైలు ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు టికెట్ తనిఖీ అధికారుల(టీటీఈ)లకు బాడీ కెమెరాలు అమర్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్‌కు చెందిన 50 మంది టీటీలకు బాడీ కెమెరాలను సిద్ధం చేసింది. ఒక్కో కెమెరా ఖరీదు రూ.9 వేలు. ఇవి 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలుగుతాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల సెంట్రల్ రైల్వేలో ఓ టీటీఈ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఇటువంటి ఘటనలను నివారించి, సిబ్బందిలో బాధ్యత పెంచేందుకు కూడా ఇవి సాయపడతాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది. -
Ticket Checker Pees :టీసీపై సస్పెన్షన్ వేటు విధించిన రైల్వే మంత్రి
రైలులో ప్రయాణిస్తున్న మహిళపై టీసీ మూత్ర విసర్జనకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి టీసీపై సస్పన్షన్ వేటు విధించమని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన జరిగిన రోజు సదరు నిందితుడు టీసీ సెలవులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఉత్తర మద్య రేల్వేకి రాసిన లేఖలో..మహిళలను అగౌరవపరిచే ప్రవర్తన తీవ్ర దుష్ప్రవర్తన కిందకు వస్తుంది. వ్యక్తిగా అతనికే కాకుండా సంస్థగా మొత్తం రైల్వేలకు చెడ్డపేరు వచ్చేలా చేశాడు. రైల్వే ఉద్యోగిగా అతని అనుచిత ప్రవర్తనకు గానూ అతన్ని విధుల నుంచి తొలగించడమే సరైన శిక్ష అని భావిస్తున్నా. అందువల్ల అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించండి అని లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన లేఖను కూడా రైల్వే మంత్రి అశ్వనీ ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా అకాల్ తఖ్ ఎక్స్‌ప్రెస్ ఏ1 కోచ్‌లో ఒక మహిళ తన భర్తతో కలసి ప్రయాణిస్తుంది. ఇంతలో మద్యం మత్తులో ఉన్న టీసీ అర్థరాత్రి నిద్రిస్తున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఆమె కేకలు పెట్టడంతో వెంటనే ఆమె భర్త, ప్రయాణికులు స్పందించి..అతడికి దేహశుద్ధి చేసి రైల్వే పోలీసులకు అప్పగించారు. (చదవండి: మోదీజీ ఆ ఆస్కార్ క్రెడిట్‌ని తీసుకోకండి: ఖర్గే సెటైరికల్ పంచ్) -
కీచక టిక్కెట్ కలెక్టర్..కదులుతున్న రైలులో మహిళపై...
ఒక కీచక టిక్కెట్ కలెక్టర్ రైలులో దారుణమైన అకృత్యానికి పాల్పడ్డాడు. కదులుతున రైలులో తన సహచరుడితో కలిసి మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంభాల్ జిల్లాలో జనవరి 16న చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..జనవరి 16న ఒక మహిళ చందౌసి రైల్వే స్టేషన్లో వేచి ఉంది. నిందితుడు ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ ఆమెను ఏసీ కోచ్‌లో కూర్చొపెట్టాడు. ఆమె చందౌసి నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని సుబేదర్‌గంజ్‌కు వెళ్లాల్సి ఉంది. ఐతే ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో చందౌసి టీటీఈ మరోక వ్యక్తి వచ్చి..ఆమెపై సాముహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో ఆమె సంభాల్ జిల్లాలోని గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ రైలుకి సంబధించి పలు టీటీఈలను మహిళకు చూపించగా సదరు నిందితుడు టీటీఈని ఆమె గుర్తించింది. ఐతే మరొక వ్యక్తిని గుర్తించలేకపోయింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు టీటీఈని రాజు సింగ్‌గా గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. మరొక నిందితుడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: గోహత్యపై గుజరాత్ కోర్టు కీలక వ్యాఖ్యలు) -
టికెట్ తనిఖీ సిబ్బందీ రన్నింగ్ స్టాఫే
న్యూఢిల్లీ: బ్రిటిష్ జమానాలో రద్దయిన సౌకర్యాలను రైల్వే టికెట్ తనిఖీ సిబ్బంది 87 ఏళ్ల తర్వాత తిరిగి పొందేందుకు మార్గం సుగమమైంది. రైలు ప్రయాణం సురక్షితంగా సాగడంలో కీలకంగా వ్యవహరించే లోకో డ్రైవర్లు, అసిస్టెంట్ లోకో డ్రైవర్లు, గార్డులు, బ్రేక్స్మెన్ తదితరులను రన్నింగ్స్టాఫ్గా వ్యవహరిస్తారు. 1931 వరకు టికెట్ తనిఖీ సిబ్బంది కూడా రన్నింగ్ స్టాఫ్‌లో భాగంగానే ఉండేవారు. అయితే, తమకు వ్యతిరేకంగా పోరాడే భారతీయ నేతలు రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో వీరిని రన్నింగ్‌స్టాఫ్ జాబితా నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తొలగించింది. అప్పటి నుంచి టికెట్ తనిఖీ సిబ్బంది మిగతా ‘రన్నింగ్‌స్టాఫ్’తో పోలిస్తే వేతనాలు, అలవెన్సులు, పింఛన్లు తదితర విషయాల్లో వివక్షకు గురవుతున్నారు. దీంతో వీరు తమను తిరిగి రన్నింగ్‌స్టాఫ్ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు స్పందించిన రైల్వే శాఖ ఈ విషయమై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని తాజాగా నియమించింది. -
వెళ్తున్న రైల్లో నుంచి ప్రయాణికుడి తోసివేత
కటిహార్: టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడనే కారణంతో వెళ్తున్న రైల్లో నుంచి టీటీఈ (టికెట్ ఎగ్జామినర్) ఓ ప్రయాణికుడిని బయటకు తోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బిహార్‌లోని కటిహార్ జిల్లా సుదాని రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు. గాయపడిన ప్రయాణికుడిని కటిహార్ జిల్లాకు చెందిన అనిల్ నునియాగా గుర్తించారు. నార్త్-ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్న నునియా సుదాని స్టేషన్లో దిగి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాడు. టీటీఈ టికెట్ చూపించమని అడగ్గా, టికెట్ తన భార్య దగ్గర ఉందని, ఆమె రైల్లో ఉందని నునియా చెప్పాడు. రైల్వే అధికారి వినిపించుకోకుండా వెళ్తున్న రైల్లో నుంచి నునియాను బయటకు తోసేశాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని సంబంధిత టీటీఈని గుర్తించేందుకు విచారిస్తున్నారు.