టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడనే కారణంతో వెళ్తున్న రైల్లో నుంచి టీటీఈ (టికెట్ ఎగ్జామినర్) ఓ ప్రయాణికుడిని బయటకు తోసేశాడు.
కటిహార్: టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాడనే కారణంతో వెళ్తున్న రైల్లో నుంచి టీటీఈ (టికెట్ ఎగ్జామినర్) ఓ ప్రయాణికుడిని బయటకు తోసేశాడు. తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బిహార్లోని కటిహార్ జిల్లా సుదాని రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు.
గాయపడిన ప్రయాణికుడిని కటిహార్ జిల్లాకు చెందిన అనిల్ నునియాగా గుర్తించారు. నార్త్-ఈస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్న నునియా సుదాని స్టేషన్లో దిగి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాడు. టీటీఈ టికెట్ చూపించమని అడగ్గా, టికెట్ తన భార్య దగ్గర ఉందని, ఆమె రైల్లో ఉందని నునియా చెప్పాడు. రైల్వే అధికారి వినిపించుకోకుండా వెళ్తున్న రైల్లో నుంచి నునియాను బయటకు తోసేశాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని సంబంధిత టీటీఈని గుర్తించేందుకు విచారిస్తున్నారు.