పాట్నా ఎన్‌ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య | AP Student Dies By Suicide At NIT Patna, Body Found In Hostel | Sakshi
Sakshi News home page

పాట్నా ఎన్‌ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య

Published Sat, Sep 21 2024 12:14 PM | Last Updated on Sat, Sep 21 2024 12:30 PM

AP Student Dies By Suicide At NIT Patna, Body Found In Hostel

పాట్నా: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్ధిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) పాట్నాలో ఆత్మహత్యకు పాల్పడింది.  బిహ్తాలో క్యాంపస్‌లోని శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలంలో సూసైడ్‌ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు శనివారం తెలిపారు.

శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో  విద్యార్థిని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని  ఉండటాన్ని గుర్తించిన తోటి విద్యార్ధులు యాజమాన్యానికి తెలియజేశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకుని విద్యార్ధినిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని, ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైందని, ఆ దిశగా కేసు నమోదు చేసి  విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే విద్యార్ధిని మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని చెప్పారు. మరోవైపు విద్యార్థి మరణవార్త తెలియడంతో పెద్ద సంఖ్యలో ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులు క్యాంపస్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement