Ticket Checker Of Vande Bharat Express Had A Narrow Escape In A Dramatic Fall - Sakshi
Sakshi News home page

జస్ట్ మిస్‌..! వందేభారత్‌ కింద.. చెకింగ్ అధికారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి..

Published Fri, Jun 30 2023 8:09 PM | Last Updated on Fri, Jun 30 2023 9:07 PM

Ticket Checker Of Vande Bharat Express Had A Narrow Escape In A Dramatic Fall - Sakshi

అహ్మదాబాద్‌: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబయికి వెళ్తున్న రైలులో చెకింగ్ అధికారి కాస‍్తలో ప్రాణాలతో బయటపడ్డారు. ట్రైన్‌లోకి ఎక్కే ప్రయత్నంలో డోర్లు మూసుకోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

గుజరాత్‌ నుంచి వందేభారత్ రైలు ముంబయికి వెళుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌ వద్ద ఆగింది. అక్కడే ఉన్న చెకింగ్ అధికారి రైలులోకి ఎక్కడం కాస్త ఆలస్యం అయింది. అంతలోనే రైలు ప్రారంభమైంది. ట్రైన్‌లోకి ఎక్కే ప్రయత్నం చేశారు చెకింగ్ అధికారి. కానీ అప్పటికే డోర్లు మూసుకున్నాయి. ఈ క్రమంలో ఆయన కిందపడ్డారు. కాస్తలో రైలు కింద పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఆయన్ను పైకి లాగారు.  ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. 

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందించారు. ట్రైన్ ఎక్కేప్పుడు జాగ్రత్తలు సూచించారు.

ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement