మాట్లాడుతున్న బాధితులు
సాక్షి, ప్రొద్దుటూరు: తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నల్లబోతుల నాగరాజు తనపై దాడి చేసి, దూషిస్తూ నైటీ చింపేశాడని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని వరసిద్ధి వినాయక నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నల్లబోతుల చిట్స్ నిర్వాహకుడుగా ఉన్న నల్లబోతుల నాగరాజు వద్ద గతంలో తాను అప్పు తీసుకుని ప్రతి నెలా అధిక వడ్డీని చెల్లిస్తున్నానన్నారు.
కొద్ది రోజులుగా తన భర్త శివప్రసాద్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో జాప్యం జరిగిందని, వడ్డీతో సహా పూర్తి డబ్బు చెల్లిస్తామని తెలిపామన్నారు. అయినా వినకుండా శనివారం నల్లబోతుల నాగరాజుతోపాటు మరికొంత మంది తమ ఇంటి వద్దకు వచ్చి తనపై దాడి చేసి నైటీ చింపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటిలో ఉన్న తన భర్త శివప్రసాద్‌ను దూషించి, జుట్టుపట్టుకుని గాయపరిచారని తెలిపారు. వెంటనే డబ్బు చెల్లించకుంటే చంపుతామని కత్తితో బెదిరింనట్లు ఆమె వివరించారు. ఘటనపై ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం నల్లబోతుల నాగరాజు కేసు రాజీ కావాలని ఇతరులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment