![Tdp Leaders Attempt To Attack Ysrcp Woman Zptc In Palnadu District](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Guntur1.jpg.webp?itok=Mbu3MWvH)
సాక్షి, పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. పెదకూరపాడు మండలం గార్లపాడులో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ స్వర్ణకుమారి దంపతులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లగా.. వారిపై దాడి చేయడానికి టీడీపీ గూండాలు ఆలయాన్ని చుట్టుముట్టారు. గుడి నుంచి బయటికి వస్తే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రెండు గంటల పాటు జడ్పీటీసీ దంపతులు గుళ్లోనే ఉండిపోయారు.
మరోవైపు, పిడుగురాళ్లలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. పోలీసులతో కుమ్మక్కై అరాచకం సృష్టిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు, పోలీసులు బెదిరించి భయపెడుతున్నారు. 14వ వార్డు కౌన్సిలర్ పులి బాల కాశీని రాత్రి పోలీసులు తీసుకువెళ్లారు. పోలీసుల చెరలో ఉన్న తన భర్తను విడిపించాలని కాశీ భార్య రమణ వేడుకుంటోంది.
టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులు భరించలేక 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మునిరా దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం 23వ వార్డు కౌన్సిలర్ జూలకంటి శ్రీరంగ రజిని భర్తను జూలకంటి శ్రీనివాసరెడ్డిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పార్టీ మారాలంటూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను పోలీసులు వేధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment