Proddatur
-
కేసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
-
తెలంగాణకు మణిహారంగా ఎక్స్పీరియం ఎకోపార్కు
శంకర్పల్లి: ‘ఎక్స్పీరియం ఎకోపార్కు’రాష్ట్రానికి మణిహారంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో 85 దేశాల నుంచి తెచ్చిన 25 వేల మొక్కలతో ఏర్పాటు చేసిన ‘ఎక్స్పీరియం’ఎకో పార్కును ప్రముఖ సినీనటుడు చిరంజీవి, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పార్కు యజమాని రాందేవ్రావుతో కలిసి ఎలక్ట్రిక్ వాహనంలో తిరుగుతూ పార్కును పరిశీలించారు.మొక్కల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వనజీవి రామయ్య దంపతులు, ఇటీవల గవర్నర్ పురస్కారానికి ఎంపికైన దుశ్చర్ల సత్యనారాయణను సీఎం రేవంత్‌రెడ్డి, చిరంజీవి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎక్స్పీరియం ఎకోపార్కు లోగో, కాఫీ టేబుల్‌బుక్‌ను ఆవిష్కరించారు. అయితే కార్యక్రమ ప్రారంబోత్సవంలో వేదికపైకి వనజీవి రామయ్యను పిలవకపోవడాన్ని గమనించిన సీఎం..వారిని వేదికపైకి పిలిచి గౌరవించారు. టూరిజంతోనే గుర్తింపు, ఆదాయం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇప్పటికే ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో రాణించిందని, టూరిజంను అభివృద్ధి చేసేందుకు వనరులున్నా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. టూరిజం ద్వారానే రాష్ట్రానికి గుర్తింపు, ఆదాయం లభిస్తుందని తెలిపారు. త్వరలోనే నూతన టూరి జం (టెంపుల్, ఎకో, హెల్త్) పాలసీని తీసుకొచ్చేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. వికారాబాద్ ప్రాంతంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందని, ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం స్పాట్‌గా మారుస్తామని, ఇందుకోసం పెద్ద పెద్ద పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని స్పష్టం చేశారు. 25ఏళ్ల కలను సాకారం చేసుకున్న ఎక్స్పీరియం పార్కు యజమాని రాందేవ్‌రావును సీఎం ప్రత్యేకంగా అభినందించారు.ఈ పార్కు తెలంగాణ పర్యాటక రంగానికి ఎంతో దగ్గరగా ఉందని, ప్రస్తుతం 30 శాతం మాత్రమే పూర్తయిందని, ఏడాదిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీనికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేశారు. వనజీవి రామయ్య జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీఎం రమేశ్, అనిల్‌కుమార్, శాసనమండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నా సంపాదన అంతంతే: చిరంజీవి ‘రాందేవ్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. దేశ, విదేశాల్లోని మొక్కలను తీసుకొచ్చి చూపిస్తూ తీసుకోండి సార్ అనేవారు. అప్పుడు రూ.వేలల్లో ఉన్న మొక్కలు ధరలు, ఇప్పుడు కోట్లలో ఉన్నాయి. ప్రస్తుతం నా సంపాదన అంతంత మాత్రమే ఉంది. తర్వాత కొనుగోలు చేస్తానంటూ’మెగాస్టార్ చిరంజీవి చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.ప్రొద్దుటూరులో రాందేవ్రావు నిర్మించిన ఎక్స్పీరియం పార్కును చూడాలంటే కళా హృదయం ఉండాలని చిరంజీవి అన్నారు. తనకు ఈ ప్రాంతంతో 25 ఏళ్ల క్రితం నుంచి అనుబంధం ఉందన్నారు. 2000లో జీవం ఉన్న మొక్కలను అందించి రాందేవ్ తననే ఆశ్చర్యపరిచారని, ఆ మొక్కలు నేటికి తన గార్డెన్లో ఉన్నాయని తెలిపారు. షూటింగ్‌లకు అనుమతి ఇస్తారా అంటే తనకే ఫస్ట్ ఇస్తానని రాందేవ్ చెప్పారని, రానున్న రోజుల్లో ఇక్కడ షూటింగ్ చేసేందుకు తాను సుముఖంగా ఉన్నానని తెలిపారు. -
ప్రొద్దుటూరులో ప్రాణం తీసిన రూ.150 అప్పు
సాక్షి, కృష్ణా జిల్లా: ప్రొద్దుటూరు గ్రామంలో దారుణం జరిగింది. రూ.150 రూపాయల అప్పు ప్రాణాలు తీసింది. వెంకటస్వామి వద్ద భుజంగరావు అనే వ్యక్తి 150 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.భుజంగరావును వెంకటస్వామి ఛాతిపై గట్టిగా కొట్టాడు. దీంతో ఒక్కసారిగా భుజంగరావు కుప్పకూలిపోయారు. భుజంగరావును కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సత్య.. ఇక అమాత్య !
సాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరువాసి సత్యకుమార్ యాదవ్ ఆదినుంచి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీలో చురుగ్గా ఉన్నారు. టెన్త్ వరకు ప్రొద్దుటూరులోనే చదివిన ఆయన పాలిటెక్నిక్ విద్యనభ్యసించేందుకు అప్పటి చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్లారు. అక్కడ ఏబీవీపీ నాయకుడిగా ఉన్నారు. అక్కడి బీజేపీ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డితో ఉన్న చనువు కారణంగా ఆయన ద్వారా అప్పటి బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడుకు చేరువయ్యారు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో వ్యక్తిగత సహాయకుడిగా, ఓఎస్డీగా సేవలందించారు. అప్పటి నుంచి కేంద్ర రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించారు. వెంకయ్యనాయుడుకు ఉప రాష్ట్రపతి పదవి దక్కడంతో సత్యకుమార్‌ను పార్టీ అధిష్టానం బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇన్చార్జిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా తదితర నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానికేతరుడైనప్పటికీ సత్యసాయిజిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేశారు. ఈయన ఎన్నికల ప్రచార సభకు అమిత్‌షా సైతం హాజరయ్యారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఢిల్లీ పెద్దల ఆశీస్సులతోమంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. సత్యగా పిలుచుకునే ఆయన సన్నిహితులు ఆయనకు మంత్రి పదవి లభించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలిసారే విజయం సాధించడం, మంత్రివర్గంలో చో టు సంపాదించడంతో డబుల్ ధమాకా సాధించినట్లయింది.సీనియర్లకు లభించని అవకాశంప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచి రాజకీయంగా విశేషానుభవం ఉన్న ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డిలకు చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం లభించలేదు. బీజేపీకి లభించే ఛాన్సును చేజెక్కించుకునేందుకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది విశేషంగా ప్రయత్నించారు. కాగా బీజేపీ అధిష్టానం మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికే అవకాశం కల్పించాలనే నిర్ణయానికి రావడంతో ఆదికి మంత్రి పదవి చేజారినట్లు పలువురు వివరిస్తున్నారు. రాజకీయాల్లో సీనియర్‌గా 6సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై న చరిత్ర జిల్లాలో నంద్యాల వరదరాజులరెడ్డికి ఉంది. ఈమారు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. ఆమేరకు భారీగా ప్రయత్నాలు చేశారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యనేత ద్వారా విశేషంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.మాధవీరెడ్డికి నిరాశకడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి మంత్రి పదవి కోసం విశేషంగా ప్రయత్నించారు. టీడీపీ తరఫున 20 ఏళ్లుగా కడప ఎమ్మెల్యేగా ఎవరూ గెలుపొందని నేపథ్యంలో టికెట్ దక్కించుకున్న తొలిసారే విజయం సాధించారీమె. దీంతో మహిళ కోటాలో మంత్రియోగం కల్పించాలని అభ్యర్థించారు. తుదివరకూ మాధవీరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒక దశలో చంద్రబాబు ఆమె వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు లోకేష్ రాజకీయ సమీకరణల నేపధ్యంలో రామ్‌ప్రసాద్‌రెడ్డికి అవకాశం కల్పించా ల్సిందిగా పట్టుబట్టినట్లు సమాచారం. పైగా జిల్లా లోని ముఖ్యనేతలు వాసు కుటుంబానికి మంత్రి పదవి కేటాయించడాన్ని సమర్థించలేదని సమాచారం.ఫలితంగా చివరి నిమిషంలో ఆమెకు మంత్రియోగం చేజారినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
జింకా విజయలక్ష్మి రాజీనామా
ప్రొద్దుటూరు : ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామా లేఖ పంపారు. యధావిధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ పురోభివృద్ధికి చేస్తానని ఆమె తెలిపారు.వీరభద్రస్వామి ఆలయ కమిటీ సభ్యుల రాజీనామారాయచోటి టౌన్ : రాయచోటి వీరభద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు రాజీనామా చేసినట్లు ఆలయ ఈవో డివి.రమణారెడ్డి తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షురాలు పోలంరెడ్డి విజయతోపాటు కమిటీ సభ్యులు రత్నశేఖర్‌రెడ్డి, ఆర్.నరసింహులు, బి.జయభాస్కర్, ఎం.విజయ, యం.లక్ష్మి, డి.భారతమ్మ, బి.నాగభూషణం, కె.సురేష్‌కుమార్ మూకుమ్మడిగా రాజీనామా చేసినట్లు తెలిపారు. వీరి రాజీనామాలను దేవాదాయ, ధర్మాదాయశాఖకు పంపినట్లు తెలిపారు. పోలంరెడ్డి విజయ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సహకారంతో 92 భవనాల నిర్మాణం (దాతల సహకారంతో) చేపట్టారు. ఆలయంలో నిత్యాన్నదానంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు.ఘాట్‌లో ప్రమాదంచింతకొమ్మదిన్నె : కడప రాయచోటి ప్రధాన రహదారిలో గువ్వల చెరువు ఘాట్ వద్ద శనివారం బస్సు–లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారరు. హైదరాబాద్ నుండి చిత్తూరుకు వెళుతున్న బస్సును రాయచోటి వైపు నుంచి కడపకు వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మోసాలు, నేరాలే వారి చరిత్ర: సీఎం వైఎస్ జగన్
విప్లవాత్మక మార్పులకు మారుపేరుగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రజల అజెండానే జెండాగా వైఎస్సార్సీపీ ముందుకెళుతోంది. ఈ జెండా మరో జెండాతో జత కట్టలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాకు మద్దతుగా సిద్ధం అని ఈ జెండా తలెత్తుకుంది. ప్రజల అజెండాగా రెపరెపలాడుతోంది. పేద ప్రజల అభివృద్ధి కోసం 130 సార్లు బటన్ నొక్కాను. మీరు మే 13వ తేదిన ఫ్యాన్ గుర్తుపై రెండు మార్లు బటన్ నొక్కడంతోపాటు మరో వంద మందికి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలి. 48 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు మనకు ప్రత్యర్థులు. పేదల వ్యతిరేకులని ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. (సిద్ధం అని జనం నినాదాలు) అబద్దాలు, మోసాలు, కుట్రల కూటమిపై గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు బృందాన్ని నమ్మితే నట్టేట ముంచడం ఖాయం. ప్రభుత్వ ప్రయోజనాలు అందుకున్న ప్రతి కుటుంబం స్టార్ క్యాంపెయినర్‌గా బయటికి రావాలి. వారంతా మరో వంద మందికి చెప్పి మీ బిడ్డకు తోడుగా నిలవాలి. 2024 ఎన్నికల్లో ‘మన కోసం మనం’ ప్రతి ఒక్కరూ రెండుసార్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి. అలా నొక్కితేనే చంద్రముఖి బెడద ఉండదు. పొరపాటు జరిగితే చంద్రముఖి లక లక లక అంటూ సైకిల్‌పై వచ్చి టీ గ్లాస్ పట్టుకుని మీ ఇంటిలో రక్తం తాగుతుంది. చంద్రబాబుకు ఓటు వేయడమంటే మన పథకాలు మనమే రద్దు చేసుకోవడం. ఆయన్ను నమ్మడం అంటే మోసం, అబద్ధం, వెన్నుపోటును నమ్మడమే. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప: మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం, కుట్రలు చేయడంలో చంద్రబాబుకు 45 సంవత్సరాల అనుభవం ఉందని.. చేయాల్సిన నేరాలన్నీ చేసేసి నెపం వైఎస్సార్‌సీపీపైకి తోయడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరు చంపారో, ఎందుకు చంపించారో.. వారితో ఇప్పుడెవరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారో అందరికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ, చంద్రబాబు బంధువులవని తేలినా, ఎల్లో మీడియా సహకారంతో ఆ నెపాన్ని మనపై నెట్టేందుకు క్షణాల్లో రెడీ అయ్యారని మండిపడ్డారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడంలో, గోబెల్స్ ప్రచారంలో, కుటుంబాలను చీల్చడంలోనూ చంద్రబాబు అనుభవాన్ని చూస్తున్నామని ధ్వజమెత్తారు. బుధవారం ఇడుపులపాయలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్.. ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపానని హేయంగా చెప్పుకుని తిరుగుతున్నా ఆ హంతకుడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుంటున్నారు చంద్రబాబు, ఎల్లో మీడియా. ఈ హంతకుడికి రాజకీయ కాంక్షతో ఒకరిద్దరు నా వాళ్లు కూడా మద్దతిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నాన్నను ఓడించిన వారితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. వివేకం చిన్నాన్న బతికున్నంత వరకు చంద్రబాబును శత్రువుగా భావించారు. చనిపోయిన తర్వాత శవ రాజకీయాలతో కుట్రలు చేస్తున్నారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు వెన్నుపోటు పొడిచి, చనిపోయిన తర్వాత శవాన్ని లాక్కొని ఊరూరా విగ్రహాలు పెడుతూ దండలు వేస్తున్నారు. నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలి. నన్ను దెబ్బ తీసేందుకే కుట్రలు చేస్తున్నారు. ఇది కలియుగం కాక మరేమిటి? ఎవరెన్ని కుట్రలు పన్నినా నేను మాత్రం ప్రజల పక్షమే. ఆ దేవుడు, ప్రజల్నే నమ్ముకున్నా. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా. ప్రజలకు మంచి చేసిన చరిత్ర మనది. వారిలా వంచించిన చరిత్ర మనకు లేదు. మేనిఫెస్టోలో పది శాతం వాగ్దానాలు కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలుగా భావించి, త్రికరణ శుద్ధిగా 99 శాతం వాగ్దానాలను అమలు చేసి నిలబెట్టుకున్న చరిత్ర మన ప్రభుత్వానిది. ఈ తేడాను ప్రజలందరూ గమనించాలి’ అని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వారు చంద్రబాబు వదినమ్మ బంధువులు ► బ్రెజిల్ నుంచి చంద్రబాబు వదిన గారి చుట్టం డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటూ విశాఖపట్నంలో సీబీఐ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, చంద్రబాబు బంధువులు దొరికితే చివరికి ఎల్లో మీడియా సహకారంతో ఆ నెపాన్ని మనపైన నెట్టేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. చంద్రబాబు వదినమ్మ, ఆమె కొడుకు, వియ్యంకుడు తదితరులు డైరెక్టర్లుగా వ్యవహరించిన కంపెనీకి సంబంధించిన ఈ వ్యవహారంలో బుకాయిస్తూ మనపై బురదజల్లుతున్నారు. ► 45 సంవత్సరాలుగా క్షుద్ర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు బంధువులు అడ్డంగా దొరికితే.. వైఎస్సార్సీపీ వాళ్లని నీచ రాజకీయాలు చేస్తున్న వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు పత్రికను చదువుతుంటే ఛీ ఇదొక పేపరా అనిపిస్తోంది. కేంద్రం నుంచి ఒక పార్టీని పరోక్షంగా, మరొక పార్టీని ప్రత్యక్షంగా తెచ్చుకుని అందరూ కలిసి ఒక్క జగన్‌తో యుద్ధం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, నా ఇద్దరు చెల్లెళ్లు కలిసి నాపై యుద్ధానికి సిద్దమయ్యారు. మంచి చేసి చూపించాడు మీ బిడ్డ ► రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్షేమం, అభివృద్ధిని 58 నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో నాలుగు అడుగులు వేసినా సచివాలయ వ్యవస్థ కనిపిస్తోంది. అందులో మన పిల్లలు పది మంది ఉద్యోగం చేస్తుండడం కనిపిస్తోంది. 1వ తేదీ ఇంటి వద్దకు చిక్కటి చిరునవ్వుతో అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు వారి మనవళ్లు విచ్చేసి సెలవు దినమైనప్పటికీ పింఛన్ అందజేస్తుండటమూ కనిపిస్తోంది. ► రూ.3 వేలు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పింఛన్లకు ఖర్చు చేస్తున్నాం. మన తర్వాతి స్థానంలో తెలంగాణ రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మిగతా రాష్ట్రాలు రూ.8, 6, 4 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. లంచాలు, వివక్షకు ప్రతిరూపాలైన జన్మభూమి కమిటీలు లేనటువంటి వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఓటు వేయని వారికి కూడా పథకాలు అందిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే సాధ్యమైంది. ► మీ బిడ్డ డీబీటీ ద్వారా బటన్ నొక్కడంతో అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతోంది. రూ.2.70 లక్షల కోట్లు ఖాతాల్లో నేరుగా జమ అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ వంటి అంతర్జాతీయ స్థాయి బోధన, ట్యాబ్‌లు, ఐఎఫ్బీ, డిజిటల్ బోధన వంటివి ఒక్కసారి పాఠశాలలో కూర్చొని చూస్తే గుర్తుకు వచ్చేది వైఎస్ జగన్, వైఎస్సార్పీపీ ప్రభుత్వమే. రైతన్నకు తోడుగా నిలిచింది, రైతన్నకు సాయంగా రైతు భరోసా సొమ్మును అందించడం, రైతన్నకు తోడుగా అసైన్డ్ భూములు, 22ఏ భూములపై శాశ్వత భూ హక్కులు అందించడంలో అడుగులు వేగంగా పడ్డాయి. ► ప్రొద్దుటూరు గడ్డపై లక్షల సంఖ్యలో ఉన్న సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంతటి గొప్ప సభ గతంలో ఇక్కడ ఎప్పుడూ లేదు. జనసంద్రం కని్పస్తోంది. దుష్ట చతుష్టయాన్ని నిలువరించడమే లక్ష్యంగా ఎన్నికల సమరంలో పోరాడేందుకు గాండీవంతో అర్జునుడిగా నేను సిద్ధం.. శ్రీకృష్ణులుగా మీరు పాంచజన్యం పూరించేందుకు సిద్దమా? (ముక్తకంఠంతో మేమంతా సిద్ధమేనని జనం బదులిచ్చారు). సామాజిక న్యాయానికి పెద్దపీట ► నిరుపేదలకు తోడుగా సామాజిక న్యాయాన్ని చేతల్లో అమలు చేసి చూపిస్తున్న ప్రభుత్వం మనదే. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలందరికీ కులం, మతం, రాజకీయం చూడకుండా సామాజిక న్యాయం అమలు చేసి చూపెట్టాం. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఎస్సీలను తూలనాడితే వారు ఎలా బతుకుతారు? మైనార్టీల నాలుగు శాతం రిజర్వేషన్లపై చెలగాటమాడితే వారంతా ఎక్కడికి వెళ్లాలి? ► స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ కాగా, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఈ ఉద్యోగాల్లో 80 శాతం నా.. నా.. నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే ఉద్యోగాలు పొందడం సామాజిక న్యాయం కాదా? రాష్ట్రంలో 31 లక్షల ఇళ్లను అక్కాచెల్లెమ్మల పేరుమీద ఇచ్చాం. ఇందులో 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్క ప్రొద్దుటూరులోనే 24 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చింది మీ బిడ్డ వైఎస్ జగనే. ప్రతి అక్క, చెల్లెమ్మకు రూ.5–20 లక్షల వరకు ఆస్తిని ఇంటి రూపంలో ఇస్తోంది వైఎస్సార్సీసీ ప్రభుత్వమే. ► అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం చేసి సామాజిక న్యాయం అమలు చేశాం. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాలన్నీ మహిళా సాధికారతను తీసుకు వచ్చాయి. అక్కాచెల్లెమ్మలు ధైర్యంగా బయటికి వస్తే దిశ యాప్ ఉంది. రక్షణ కోసం గ్రామాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ► గ్రామాల్లో నాలుగు అడుగులు వేయగానే విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో అందరికీ ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ సాధ్యమైంది. 104, 108 కొత్త అంబులెన్స్‌లు కుయ్... కుయ్ మంటూ సేవలు అందిస్తున్నాయి. దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు పథకాలు తీసుకు రాగా, ఆయన తనయుడిగా మీ బిడ్డ ఆరోగ్యశ్రీని మరింత ఉన్నతీకరించి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా చేశారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. 10 షిప్పింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎయిర్‌పోర్టుల విస్తరణపై దృష్టి సారించాం. పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా పక్కనే ఉన్న బద్వేలులో సెంచురీ ఫ్లై బోర్డ్ పరిశ్రమను ప్రారంభించాం. రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. కోవిడ్ ఉన్నా ఎక్కడా తగ్గకుండా, సాకులు చెప్పకుండా మీ అవసరం రాష్ట్ర అవసరంగా భావించి 58 నెలల కాలంలో 130 సార్లు బటన్ నొక్కాను. విలువలకు అండగా నిలవాలి ► 2014లో మోదీ, దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల సమయంలో వారు రూపొందించిన అబద్ధాల పాంప్లేట్ ప్రతి ఇంటికి పంపారు. టీవీలు, పేపర్లలో యాడ్స్ వేశారు. రైతులకు రుణమాఫీ, పొదుపు సంఘాలకు రుణమాఫీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి, రూ.10 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్, సింగపూర్‌ను మించిన రాజధాని, ప్రతి జిల్లాకు హైటెక్ నగరం, మూడు సెంట్ల భూమి వంటి హామీలు ఇచ్చారు. వీటిలో ఒక్కటైనా అమలయ్యాయా? ప్రత్యేక హోదా ఇచ్చారా? (లేదు.. లేదని ప్రజల నినాదాలు) ► మళ్లీ ఇదే బ్యాచ్ ఎన్నికల్లో ఇప్పుడు ప్రజల ముందుకు వస్తోంది. వీరు కొత్త మేనిఫెస్టోలో కిలో బంగారం, బెంజ్ కారు, సూపర్ సిక్స్, సెవెన్ అంటూ మరోసారి మోసం చేసేందుకు రెడీ అయ్యారు. దేశ చరిత్రలో ఇలాంటి రాజకీయాలు ఎక్కడా లేవు. విశ్వసనీయత, విలువలకు ప్రతీకగా నిలుస్తున్న మీ బిడ్డ నోటిలో నుంచి ఒక్కమాట వస్తే దానిని అమలు చేసిన తర్వాతే ఓటు అడుగుతున్నాం. విలువల రాజకీయానికి, పొత్తుల రాజకీయానికి మధ్య జరుగుతున్న పోరులో విలువలకు అండగా నిలవాలి. ► ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. సైకిల్ ఇంటి బయట ఉండాలి.. తాగిన టీ గ్లాస్ సింక్‌లో ఉండాలి. జరుగుతున్న ఎన్నికలు పేదల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. పొరపాటు జరిగితే పేదల బతుకులు అంధకారమవుతాయి. ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్దమా? (సిద్ధమే అని సెల్లో టార్చ్ ఆన్ చేసి చేతులు పైకెత్తారు.) ► 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు సాధించడమే మనందరి లక్ష్యం. పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం కూడా తగ్గడానికి వీలు లేదు. ► ఒకే ఒక్కడి మీదకు ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేకపోవడానికి కారణం దేవుడి దయ, కోట్లాది మంది ప్రజల గుండెల్లో చోటు ఉండడమే. 75 సంవత్సరాల చంద్రబాబు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తారు. మళ్లీ ఎన్నికల సమయానికి కొత్త మేనిఫెస్టో, కొత్త వాగ్దానాలతో రొటీన్‌గా వంచన చేస్తారు. ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా జత కడతారు. ఢిల్లీ దాక వెళ్లి కాళ్లయినా పట్టుకుంటారు. విశ్వసనీయత, విలువలు లేని వీళ్ల రాజకీయాలు ఎవరికి స్ఫూర్తినిస్తాయి? మన మంచిని ప్రతి ఇంటా చెప్పాలి మన ప్రభుత్వం పరిపాలనలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిందని, మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. అమ్మ ఒడి, చేయూత, సున్నా వడ్డీ పథకం, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, రైతు భరోసా, వాహనమిత్ర మొదలు నేతన్న నేస్తం వరకు మనం అందించే పథకాల ద్వారా లబ్ధి పొందిన విషయాలను ఇంటింటికి తీసుకువెళ్లండి. ఈ పథకాలన్నీ అమలు కావాలన్నా, అవ్వాతాతలకు పెన్షన్లు సకాలంలో రావాలన్నా, మెరుగైన రేషన్ ఇంటికి రావాలన్నా, నాణ్యమైన విద్య, విదేశీ విద్య, వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్, పేదవాడికి మెరుగైన వైద్యం, ఆర్బీకేలు, రైతు భరోసా, తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఇన్‌ఫుట్ సబ్సిడీ తదితర పథకాలన్నీ కొనసాగాలంటే ‘జగన్ రావాలి...వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రావాలి’ అని తెలియజేయాలి. ఆత్మీయంగా అభ్యర్థుల పరిచయం ‘కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా తమ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తున్న సోదరుడు ప్రసాద్‌రెడ్డి, కమలాపురం నుంచి మామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, బద్వేలు నుంచి పోటీ చేస్తున్న సోదరి డాక్టర్ సుధమ్మ, జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తున్న సోదరుడు సుధీర్‌రెడ్డి, కడప నుంచి పోటీ చేస్తున్న నవాబ్ సాబ్ అంజద్‌బాష, మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న పితృ సమానులైన ఎస్.రఘురామిరెడ్డి, పులివెందుల నుంచి పోటీ చేస్తున్న నాపై మీ అందరి చల్లని ఆశీస్సులు ఉంచాలి’ అని సీఎం జగన్ కోరారు. అనంతరం వేదికపై ఉన్న నాయకులను పేరుపేరునా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా పాలన ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేలా జగనన్న పరిపాలన కొనసాగుతోంది. ఈ ఐదేళ్లలో ఆయన ఆలోచనలతో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. పరిపాలనను గ్రామ స్థాయికి, ప్రభుత్వ సేవలను ఇంటివద్దకే చేర్చారు. ఇవాళ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. పెన్షన్లు, ఇళ్ల కోసం ఏ ఒక్కరి దగ్గరికీ వెళ్లి చేయి చాచాల్సిన పనిలేదు. రెండేళ్లు కోవిడ్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతి వాగ్దానాన్ని జగనన్న నిలబెట్టుకున్నారు. ప్రొద్దుటూరులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో జగనన్న ప్రభుత్వం రూ.200 కోట్లను వెచ్చించి స్థలం కొనుగోలు చేసి 25 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చింది. ఇవాళ గండికోటలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోగలుగుతున్నాం. జగనన్న ప్రభుత్వం రాకముందు కనీసం ఐదు టీఎంసీలు కూడా అక్కడ నిల్వ చేయలేని దుస్థితి. దాదాపు రూ.900 కోట్లు ఖర్చు చేసి ఇవాళ అక్కడ 27 టీఎంసీల నీటిని స్టోరేజీ చేసుకుంటున్నాం. సీబీఆర్‌లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేశాం. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నింపుతున్నాం. ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే పరిస్థితి లేకపోవడంతో విపక్షాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయి. చంద్రబాబుకు బలం, ధైర్యం లేవు కాబట్టే జనసేన, బీజేపీని తోడు తెచ్చుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా సరే జగనన్నకు తిరుగులేదు. – వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎంపీ మళ్లీ మీరే సీఎం.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సీఎం జగన్ తొలి సభను నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,700 కోట్లను అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ అందించారు. దాదాపు రూ.1,300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగా, 24 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదల సొంతింటి కలను నెరవేర్చారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం. ఉమ్మడి కడప జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకుంటాం. – రాచమల్లు శివప్రసాదరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే -
నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారు: సీఎం జగన్
వైఎస్సార్, సాక్షి: ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తన వాళ్లనే చంద్రబాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, మోసాలు చేయడంలో చంద్రబాబుకి 45 ఏళ్ల అనుభవం ఉంది. వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. చంపిన హంతకుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో. కానీ, నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా. ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తపించిపోతున్న ఒకరిద్దరు నావాళ్లు భాగం అయ్యారు. ఇంతటి దారుణం చేసి.. నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి?. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం చేసినా.. నేను మాత్రం ప్రజల పక్షం ఉంటా అని గర్వంగా చెబుతున్నా. నాపై బురద జల్లుతూ రాజకీయం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పేవారు, కుట్రలు చేసేవాళ్లు మనకు శత్రవులుగా ఉన్నారు. అందరూ కలిసి జగన్‌పై యుద్ధానికి వస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ నా పై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా ఇద్దరు చెల్లెల్ని తీసుకొస్తున్నారు. వీళ్ల విలువలు లేని రాజకీయం ఎవరికి స్ఫూర్తి. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నా. నాకు ప్రజల అండగా, దేవుడి దయ ఉన్నాయి అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
LIVE: ప్రొద్దుటూరులో సీఎం జగన్ భారీ బహిరంగ సభ
-
ప్రొద్దుటూరు మేమంత సద్ధం బహిరంగ సభలో భారీ జనం
-
సీఎం జగన్ మీటింగ్ ఆలస్యం.. ఇసుక వేస్తే రాలనంత జనం
-
ప్రొద్దుటూరు సభ: సీఎం జగన్ ప్రసంగంలో హైలెట్స్
AP CM YS Jagan Public Meeting at Proddatur Updates ప్రొద్దుటూరులో సీఎం జగన్ ప్రసంగం మన టార్గెట్ 175కి 175 అసెంబ్లీ సీట్లు.. 25 పార్లమెంట్ సీట్లు మే 13న వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అందరి బాగు కోసం రెండుసార్లు ఫ్యాన్‌పై నొక్కండి మీ ఇంటికి రేషన్ రావాలంటే జగన్ రావాలి జగనన్న మీ కోసం 130 సార్లు బటన్ నొక్కాడు పేదల కోసం, మన కోసం రెండు బటన్లు జగనన్న కోసం నొక్కాలి ప్రతీ ఇంటికి సంక్షేమం అందాలంటే జగనన్నే సీఎం కావాలి ఫ్యాన్ మీద బటన్ నొక్కితే.. గతంలో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండదు చంద్రబాబును నమ్మడం అంటే.. పథకాలను మనం రద్దు చేసుకోవడమే నా చెల్లెల్ని తెచ్చుకున్నారు: సీఎం జగన్ చంద్రబాబుకి శవరాజకీయాలు, కుట్రలు అలవాటు నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు నా ఇద్దరు చెల్లెల్ని తెచ్చుకున్నారు ఛీ.. ఇది పేపరా?: సీఎం జగన్ మనల్ని తిట్టేవాళ్లు కూడా ఏం రాస్తారో చూడాలని పొద్దున్నే ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తా అందులో రాతలు చూసి ఛీ ఇది పేపరా అనుకుంటా ఈ మధ్య వార్తల్లో చూశా.. సీఎం జగన్ చంద్రబాబు వదినగారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతిచేస్తావుంటే సీబీఐ వాళ్లు రెయిడ్ చేశారు ఈ రెయిడ్ జరిగిందని తెలిసిన వెంటనే.. యెల్లో బ్రదర్స్ ఉలిక్కి పడ్డారు దొరికితే తమ బ్రదర్ కాదని.. మన బ్రదర్ అని నెట్టేసే యత్నం చేశారు బాబాయ్‌ను అన్యాయంగా చంపేశారు.. వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపి.. అతిహీనంగా.. బహిరంగంగా హంతకుడు తిరుగుతున్నాడు ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సినోడు జైల్లో.. నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన యెల్లో మీడియా రాజకీయ లబ్ధి కోసం తపించి పోతున్న ఒకరిద్దరు నా వాళ్లు చిన్నాన్నను అన్యాయంగా చంపారు రాజకీయంగా నాపై నెట్టేసే యత్నం చేస్తున్నారు ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బ తీయాలనుకుంటున్నారు.. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి? ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? అని మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం.. నేను మాత్రం ప్రజల పక్షం అని గర్వంగా చెబుతున్నా. ఆ దేవుడు, ఆ ప్రజల్నే నమ్ముకున్నా.. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా సీఎం జగన్ ప్రసంగం.. లక్షల సింహాల గర్జన... చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండి పోతుంది. గట్టిగా గర్జించండి.. మేమంతా సిద్ధమేనని! పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా? మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు! మే 13న ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? వైఎస్సార్ జిల్లా నేలమీద... ఈ పొద్దుటూరు గడ్డమీద...నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే. అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాలు, ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా కాబట్టే చెబుతున్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది అని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయి! కాబట్టే ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడం లేదు.. సీఎం జగన్ ప్రసంగిస్తూ.. నా విజయాలకు కారణమైన మీ అందరికి కృతజ్ఞతలు వైఎస్సార్ జిల్లా కుటుంబ సభ్యులు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు 58 నెలల పాలనలో ప్రతీ రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసిన ఘనత మనది మచంకి మద్దతుపలికే ఇంతటి ప్రజాసైన్యం మధ్య యాత్రను చేపట్టా మీ అంతా సిద్ధమేనా? అని గట్టిగా గర్జించండి.. సిద్ధం అని గర్జించిన ప్రొద్దుటూరు సభా ప్రాంగణం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు అండగా మేమంతా సిద్ధం జగనన్నకు తిరుగు లేదు మీరే స్టార్ క్యాంపెయినర్లు ఇచ్చిన ప్రతీ హామీని చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ఉపన్యాసం ప్రారంభమైన బహిరంగ సభ ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభ ప్రారంభం పేదింటి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేశారు 175 సీట్లకు 175 గెలవడం మా లక్ష్యం ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ జై జగన్.. జగన్ వన్స్‌మోర్ నినాదాలతో మారుమోగిన ప్రొద్దుటూరు సభాప్రాంగణం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలుపెట్టారు. ప్రొద్దుటూర్ టౌన్లో జరగబోయే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. తొలిరోజు వైస్సార్ జిల్లా కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగించింది. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద మహానేతకు నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనలు అభిమానుల కోలాహలం నడుమ మొదలైన యాత్ర.. సాయంత్రం వీరపనాయనిపల్లి మండలంలో ముగిసింది. ఇదిలా ఉంటే.. దారి పొడవునా గ్రామాల్లో జనం జననేతకు నీరాజనం పట్టారు. మధ్య మధ్యలో సీఎం జగన్ వాహనం పైకి ఎక్కడి అభివాదం చేశారు. అంతేకాదు.. ప్రజలు సమర్పించిన విజ్ఞప్తి పత్రాలను సైతం స్వీకరించారాయన. -
Watch Live: ప్రొద్దుటూరు మేమంతా సిద్ధం సభ
-
CM Jagan: అందరి చూపులూ ప్రొద్దుటూరు సభ వైపే..
వైఎస్సార్, సాక్షి: ప్రధాన పార్టీల అధినేతలు ప్రచారంలోకి దిగడంతో.. ఏపీలో ఎన్నికల వాతావరణంతో ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం ఇటు ప్రజలు, అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న ఈ 21 రోజుల ప్రచార యాత్ర.. ఇఛ్చాపురంతో ముగుస్తుంది. ఈ క్రమంలో తొలిరోజు ప్రొద్దుటూరులో నిర్వహించబోయే ప్రచార సభలో సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన ఆందోళనలు చేపట్టినా.. వాళ్ల సాధకబాధకాలను గుర్తించి భరోసా కల్పించేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేసినా.. చివరకు సుపరిపాలన తదనంతరం సిద్ధం సభలు నిర్వహించినా.. ఈ జననేతకు ప్రతీసారి జనం బ్రహ్మరథం పట్టారు. అయితే ఇప్పుడు సీఎం హోదాలో.. అదీ ఎన్నికలకు ముందు ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. దీంతో ప్రచార శైలి ఎలా ఉండనుంది?.. ప్రజా స్పందన ఏస్థాయిలో ఉండబోతోందో? అనే చర్చ నడుస్తోంది. మేమంతా సిద్ధం యాత్రలో.. ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారని, ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారని వైఎస్సార్సీపీ శ్రేణులు ఇదివరకే ప్రకటించాయి. అలాగే.. గత 58 నెలల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును సాయంత్రం జరిగే సభల్లో ఆయన వివరిస్తారని తెలిపాయి. దీంతో ప్రొద్దుటూరు సభలో ఆయన ఆయా అంశాల్ని కచ్చితంగా ప్రస్తావిస్తారనేది ఊహించొచ్చు. ఇదీ చదవండి: మరో యాత్రకు సిద్ధం అలాగే గత పాలన- వైఎస్సార్సీపీ సంక్షేమ పాలనను ఆయన పోల్చి పలు అంశాల్ని ప్రస్తావించ్చొచ్చు. అదే సమయంలో కూటమిపైనా ఆయన విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో గజదొంగల ముఠాగా, తోడేల మంద, మోసకారులుగా చంద్రబాబు అండ్ను కో(యెల్లో మీడియాను కలిపి మరీ) అభివర్ణించిన సీఎం జగన్.. ఇప్పటి కూటమి లక్ష్యంగా విమర్శలు, పంచ్ డైలాగులు గుప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే.. 2014లో ఇదే కూటమి రాష్ట్రాన్ని మోసపూరిత హామీలతో రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారని.. దోచుకో పంచుకో దాచుకో ద్వారా అవినీతికి పాల్పడ్డారని.. అలాగే ప్రజలను ఎలా మోసం చేశారనే దాన్ని.. ఆయన ప్రముఖంగా ప్రస్తావించే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే.. కూటమిలో భాగమైన పవన్ కల్యాణ్, బీజేపీ, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌ను ఆయన టార్గెట్ చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను ఇంకా ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారాయన. ఇక ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇవ్వడం సీఎం జగన్ చేస్తూ వస్తున్నారు. తద్వారా విశ్వసనీయత, విలువల్ని చాటుతూ వస్తున్నారు. దీంతో.. ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమానికి కొనసాగింపుగా ఆయన ఏమైనా ప్రకటనలు చేస్తారా?.. పోనీ మేనిఫెస్టో ఎప్పుడనేదానిపై స్పష్టత ఇస్తారా? అని అంతా ఎదురు చూస్తున్నారు. జగన్ కోసం జనమంతా.. ఇక.. సీఎం జగన్ సొంత జిల్లా నుంచే బస్సు యాత్ర ప్రారంభం అవుతుండడంతో తొలి ఎన్నికల ప్రచార సభ లక్షలాది మందితో జనసంద్రంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే తమ ప్రియతమ నాయకుడికి అండగా నిల్చేందుకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రొద్దటూరు వైపు అడుగులేస్తున్నారు. మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేలు ప్రాంతాల నుంచి అశేష ప్రజానీకం స్వచ్ఛందంగా తరలి రావొచ్చని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావటంతో పార్టీ కేడర్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలోని ముఖ్యనేతలతో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా ఈ సభకు హాజరు కానున్నారు. -
YSRCP Memantha Siddham: మేమంతా సిద్దం సభకు ఏర్పాట్లు పూర్తి (ఫొటోలు)
-
చారిత్రాత్మక యాత్రకు సర్వం సిద్ధం
-
ప్రొద్దుటూరులో సీఎం జగన్ బస్సు యాత్రకు భారీ ఏర్పాట్లు
-
సీఎం జగన్ బస్సు యాత్ర ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ
-
కుటుంబ సభ్యుల నుంచే విమర్శలు.. ఆదినారాయణరెడ్డి భవితవ్యం ఏంటి?
ఏపీలో విపక్షాల మధ్య పొత్తుల వ్యవహారం కొంత మంది నేతల్ని అయోమయానికి గురి చేస్తోంది. ఎంపీగా పోటీ చేయాలా.. లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలా.. అసలు తన సీటు తనకు దక్కుతుందా అనే అనుమానాలు టీడీపీలో వ్యక్తం అవుతున్నాయి. అక్కడక్కడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కాషాయ దళంలో చేరిన నేతలు కూడా తమకు అవకాశం వస్తుందా? రాదా? అన్న సందేహాలతో విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ జిల్లాలో విపక్షాల పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అదినారాయణరెడ్డి రాజకీయ భవితవ్యం అయనకే అర్థం కావడంలేదు. పైగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మరి కొంత మంది నేతలను గందరగోళంలోకి నెడుతున్నాయి. ఇందుకు కారణం టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తుల వ్యవహారమే కారణం అంటున్నారు. మూడు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారంపై ఎంతకీ క్లారిటీ రావడం లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయంగా కనుమరుగు అవుతామనే అభద్రతాభావం ఆదినారాయణరెడ్డిని వెంటాడుతోంది. ఎన్నికల పొత్తు సాకుతో జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానంటూనే, బీజేపీ ఆదేశిస్తే ప్రొద్దుటూరు అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ సీటుకు అయినా పోటీ చేస్తానని ఆయన ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆదినారాయణ రెండు నియోజవర్గాల టీడీపీ నేతల కంట్లో నలుసులా తయారయ్యారు. గతంలో పొత్తు ఉన్నా లేకున్నా టీడీపీ టికెట్ ఖరారైందంటూ ఆది చేసిన ప్రచారం ఇతర నేతల్లో గుబులు రేపింది. ఆదినారాయణరెడ్డి చేసిన ప్రకటన ఆయన సొంత కుటుంబంలోనే అలజడి రేపుతోంది. అన్న కుమారుడు భూపేష్ రెడ్డి తన రాజకీయ వారసుడు అంటూ 2009 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయనే సైంధవుడిలా భూపేష్‌రెడ్డిని అడ్డుకుంటున్నారని కుటుంబ సభ్యులనుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదినారాయణ అన్న మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పోటీ చేసి గతంలో ఓటమిపాలయ్యారు. తీరా 2004లో దివంగత మహానేత వైఎస్ఆర్ గాలి వీస్తున్న సమయంలో ఆది అడ్డు తగిలి అన్న బదులుగా తను పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ ఇప్పుడు అయన తనయుడు విషమయంలోను అదే చేస్తున్నాడంటూ కుటుంబం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెంటనే బీజేపీలో చేరిపోయారు. ఇక తనకు బాబాయ్ అడ్డు ఉండదని భావించిన భూపేష్‌రెడ్డి ఏడాది క్రితం జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి బాధ్యతలను తీసుకున్నారు. ఇంతలో జమ్మలమడుగు స్థానం బీజేపీకి కేటాయించాలంటూ ఆదినారాయణ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆది చర్యలు దేవగుడి కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భూపేష్ నాయకత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మెజార్టీ కుటుంబ సభ్యులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కుటుంబం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను అంచనా వేసిన ఆది ప్రొద్దుటూరులో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరుకు మారతారనే ప్రచారం అక్కడ టిక్కెట్లు ఆశిస్తున్నవారిలో టెన్సన్ పెంచుతోంది.ప్రొ ద్దుటూరు టీడీపీటికెట్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడు సీటు ఆశిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆ సీటుపై బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి కన్ను పడింది. ఇక్కడ టికెట్ కోసం నలుగురు పోట్లాడుకోవడం సాకుగా చూపించి..పొత్తులో భాగంగా బీజేపీకి ప్రొద్దుటూరు సీటు కేటాయించాలనే దిశగా ఆదినారాయణరెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎత్తుగడలు వేయడంలో దిట్టగా పేరున్న ఆదినారాయణరెడ్డి కుయుక్తులు కలిసి వస్తాయో...లేక బెడిసి కొడతాయో వేచిచూడాల్సిందే.. -
చంద్రబాబు బీజేపీ పొత్తుపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సెటైర్లు
-
వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు
-
ప్రొద్దుటూరు టీడీపీలో గందరగోళం
సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. తెలుగుతమ్ముళ్లు తలోదారిలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు క్రమం తప్పకుండా ఒకరి తర్వాత మరొకరు తెరపైకి వస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరికి వారు అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలదన్నట్లు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మైండ్‌గేమ్ ఆడుతున్నారు. అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయకముందే అభ్యర్థిగా పోస్టర్లు ఒకరు వేయిస్తే, టికెట్ మనదే, పోటీలో ఉండేది మనమే అంటూ మరొకరు వారి వారి నెట్వర్క్ ద్వారా ప్రచారపర్వాన్ని అందుకుంటున్నారు. ‘ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’అన్నట్లుగా ప్రొద్దుటూరు తెలుగుతమ్ముళ్ల పరిస్థితి నెలకొంది. ఓ వైపు టీడీపీ సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేకపోగా, పొత్తుల సమీకరణ పనిలో అధినేత చంద్రబాబు నిమగ్నమ య్యారు. అధినేత ఆ పరిస్థితిలో ఉంటే నాయకులు ప్రొద్దుటూరులో టికెట్ తమదేనని ఎవరికి వారు తెరపైకి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డి, ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నం కాగా, సోదరులమంతా అధినేతను కలిశాం. తుది జాబితాలో తానే ఉంటానంటూ సురేష్‌నాయుడు తెరచాటు మంత్రాంగం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో సీనియర్ నేత వరదరాజులరెడ్డితో వైరం లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. వరదపై మల్లెల మండిపాటు ఈమారు ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు కొండారెడ్డి పోటీలో ఉంటామని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునే అర్హత వరదరాజులరెడ్డికి లేదని జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విమర్శిస్తున్నారు. సభ్యత్వమే లేని వరద ఎలా ప్రచారం చేస్తారని మండిపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాటలు నిజమే అయితే, అధినేత చంద్రబాబు వద్దకెళ్లి వరద కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించే చర్యలు చేపట్టవచ్చు కదా...అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోయినా నోరెత్తని లింగారెడ్డి, ఉనికి కోసం ఆరాట పడుతున్నారని వరద వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటుండటంతో ప్రొద్దుటూరు తెలుగుదేశంలో గందరగోళం నెలకొంది. తలోదిక్కుగా తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తుండటం విశేషం. ప్రవీణ్‌కు వాసు వత్తాసు పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి వత్తాసుగా నిలుస్తున్నారు. ఆయన చర్యలే అందుకు దర్పణంగా నిలుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరుతో ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. నలుగురు ఆశావహులు ఉండటం, అధిష్టానం ప్రకటనతో నిమిత్తం లేకుండా రాత్రికి రాత్రి వాల్ పోస్టర్లు తెరపైకి రావడంతో తక్కిన వారు జీర్ణించుకోలేని పరిస్థితి తలెత్తింది. తాజాగా శ్రీనివాసులరెడ్డి ఏడాది క్రితమే నారా లోకేష్, ప్రవీణ్ నాయకత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తేల్చి చెప్పారు. తాను సైతం పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. రామేశ్వరం రోడ్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పుకొచ్చారు. కాగా, ఆకార్యక్రమానికి స్థానికంగా నివాసం ఉంటున్న జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డిని ఆహ్వానించకపోవడం గమనార్హం. ఇన్చార్జి ప్రవీణ్ చర్యలకు వత్తాసుగా నిల్చే విధంగా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి చర్యలున్నాయని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
టీడీపీ నేత ప్రవీణ్ ఇంట్లో దొంగ ఓట్లు..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్ రెడ్డిపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీ ఫిర్యాదు చేశారు. ప్రవీణ్‌తో పాటు ఆయన కుటుంబీకులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలతో సహా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. సొంత గ్రామం కోగొట్టంతో పాటు ప్రొద్దుటూరులోనూ ఓట్లు ఉన్నాయని, ఒక్క చోటే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫారం7లో భూమిరెడ్డి వంశీ ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో టీడీపీ నాయకులు దొంగ ఓట్లు చేర్చడంపై భూమిరెడ్డి వంశీ మండిపడ్డారు. ప్రవీణ్, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకు రెండు చోట్ల ఓట్లు సిగ్గుచేటు. దొంగ ఓట్లు అంటూ వైఎస్సార్సీపీని విమర్శించే ప్రవీణ్‌కి తన దొంగ ఓట్లు కనిపించలేదా?. తన ఇంట్లో దొంగ ఓట్లు పెట్టుకుని.. దొంగ ఓట్లు తొలగించాలంటూ అధికారులకు ఎలా ఫిర్యాదు చేస్తారు?. తక్షణం ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఓట్లపై అధికారులు చర్యలు చేపట్టాలని వంశీ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు -
6 రోజుల పాటు కాలినడకన తిరుమలకు పాదయాత్ర
-
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్
-
క్రిమినల్ మనస్థత్వంతో వ్యవహరిస్తున్న తెలుగుతమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాక్షేత్రంలో మరోమారు చేతులెత్తాల్సిన తప్పనిసరి పరిస్థితి. ప్రజలు సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏకపక్షంగా మద్దతిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలతో ఆ పార్టీ నేతలపై ప్రజలల్లో వ్యతిరేకత పెంచాలనే లక్ష్యం తెరపైకి వస్తోంది. వెరసి కవ్వింపు చర్యలకు దిగుతూ రెచ్చగొట్టి లబ్ధిపొందాలనే దిశగా అడుగులు పడుతున్నాయి. వైఎస్సార్సీపీ నేత బెనర్జీపై హత్యాయత్నం ఉదంతం అందుకు నిదర్సనంగా నిలుస్తోంది. సామాజిక సాధికార బస్సు యాత్ర రోజే దాడి చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం దాగి ఉన్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీలకతీతంగా అర్హులకు అందుతున్నాయి. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్నారు. వర్గాలకు, పార్టీలకతీతంగా పేదలంతా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోమారు ఎంపిక చేసుకోవాలని ఆశిస్తున్నారు. అధికారంలో ఆయనుంటేనే పేదల్ని గుర్తిస్తారనే భావనలో ఉన్నారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ సైతం పేదల దరికి చేరి, వారు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూనే మీకు సాయమంది ఉంటేనే వైఎస్సార్సీపీకి మద్దతు తెలపండని అభ్యర్థిస్తున్నారు. ‘ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న’అన్నట్లు ప్రజలు వైఎస్సార్సీపీకి అపారమద్దతు ప్రకటిస్తున్నారు. ఈవిషయాన్ని గ్రహించిన తెలుగుతమ్ముళ్లు కుట్ర రాజకీయాలను తెరపైకి తెస్తున్నారు. వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరు టార్గెట్‌గా.... ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ అత్యంత శక్తివంతంగా ఉంది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నాయత్వంలో పార్టీ శ్రేణులు బలంగా పనిచేస్తున్నాయి. పైగా అక్కడ సంక్షేమం, అభివృద్ధి పనుల నిమిత్తం దాదాపు రూ.3500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. వైఎస్సార్సీపీని బద్నాం చేయడానికి మార్గం కన్పించక, ఎమ్మెల్యే రాచమల్లు టార్గెట్‌గా వ్యక్తిత్వ హననం దిశగా అడుగులు వేశారు. అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న సోషల్ మీడియా కేంద్రంగా విపరీతమైన ఆరోపణలు చేయసాగారు. తెలుగుదేశం పార్టీ వైఖరి స్పష్టం కావడంతో ఎమ్మెల్యే ఏకంగా టీడీపీ ఆరోపణలపై సీబీఐ నేతృత్వంలో విచారణ చేపట్టాలని స్వయంగా రాతపూర్వకంగా అభ్యర్థించారు. అప్పట్లో మిన్నకుండి పోయిన టీడీపీ శ్రేణులు ఇటీవల క్రికెట్ బెట్టింగ్స్ వ్యవహారం తెరపైకి తెచ్చారు. ఎమ్మెల్యే పరోక్ష సహకారంతో చేపడుతున్న ఆరోపణల పర్వాన్ని అందుకున్నారు. తెలివిగా వ్యవహరించిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా ఎస్సీ సిద్ధార్థకౌశల్ని కలిసి క్రికెట్ బెట్టింగ్‌కు కట్టడి చేయాలని అభ్యర్థించారు. టీడీపీ కుటిల ఎత్తులను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ వచ్చారు. ఎన్ని ఎత్తులు వేసినా ప్రతికూలంగా మారుతోండడంతో ప్రత్యక్షదాడులకు పాల్పడి రెచ్చగొట్టి భారీ స్థాయిలో అల్లర్లు సృష్టించాలనే వ్యూహం పన్ని సామాజిక సాధికార యాత్ర రోజు అమలు చేసినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అంగళ్లు ఘటన నేపథ్యంలోనే బీజం... అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీ బలంగా ఉందన్నది జగమెరిగిన సత్యం. అక్కడ టీడీపీ పుంజుకోవాలంటే స్థానికంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడి, ప్రతిదాడులు ఉండాలని టీడీపీ ఎత్తుగడ వేసింది. వెరసి ప్రత్యక్షంగా చంద్రబాబు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఆమేరకు దాడి, ప్రతిదాడుల ఘటనలు అక్కడ తెరపైకి వచ్చాయి. ఈవ్యవహారం ఆగస్టు 4న చోటుచేసుకుంది. అచ్చం అలాంటి కవ్వింపు చర్యలను ప్రొద్దుటూరులో అవలంభించారు. శనివారం సామాజిక సాధికార యాత్ర సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కానున్నట్లు పసిగట్టారు. అదే రోజు పేద వర్గాలకు చెందిన క్రియాశీలక వైఎస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం చేపడితే, ఎమ్మెల్యే రాచమల్లుకు సంబంధం లేకుండానే ప్రతిదాడులకు పాల్పడుతారని అంచనాకు వచ్చారు. ప్రొద్దుటూరు పట్టణం అల్లర్లతో మారుమోగాలని భావించారు. ఆమేరకే తెలుగుయువత అధ్యక్షుడు భరత్‌కుమార్‌రెడ్డి, రామిరెడ్డిలు వైఎస్సార్సీపీకి చెందిన బెనర్జీపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు కూడా టీడీపీ ఇన్చార్జి గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం విశేషం. ఒక దాడి...బహుళ ప్రయోజనాలు.... బెనర్జీపైనే హత్యాయత్నానికి పాల్పడడం వెనుక వ్యూహం కూడా దాగి ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిఫల్ వైస్ చైర్మన్ బంగారురెడ్డికి బెనర్జీ సన్నిహితుడు. బెనర్జీని హత్య చేస్తే బంగారురెడ్డి అనుచరులు చెలరేగిపోయి, ప్రతిదాడులు చేస్తారనేది టీడీపీ అసలు లక్ష్యంగా కన్పిస్తోంది. ఇలా ప్రతిదాడులు చెలగేరితే ఎమ్మెల్యేకు ఆ బురద అంటించి, వాణిజ్య వర్గాల నుంచి అపార మద్దతు పొందే అవకాశం ఉంది. అలాగే ఈ వ్యవహారంతో వైఎస్సార్సీపీని దీటుగా ఎదుర్కొనే శక్తి తనకే ఉందని టీడీపీలో చెప్పకనే ప్రకటించుకోవడం, ఎమ్మెల్యే టికెట్‌కు అడ్డుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడుల కంటే పైచేయి సాధించడం.. ఇలా బహుళ ప్రయోజనాలు ఆశించిన తర్వాతే వ్యూహాన్ని హత్యాయత్నం అమలు చేసినట్లు విశ్లేషకులు వెల్లడిస్తుండడం గమనార్హం. ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో సహా మరో ఇద్దరిపై కేసు ప్రొద్దుటూరులోని గాంధీరోడ్డులో వైఎస్సార్సీపీ కార్యకర్త బెనర్జీపై జరిగిన దాడి సంఘటనలో భరత్‌కుమార్‌రెడ్డి, రాము అలియాస్ రామ్మోహన్‌రెడ్డితో పాటు కుట్రలో భాగస్వామి అయిన ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఇన్చార్జి డీఎస్పీ నాగరాజు తెలిపారు. టీడీపీ ఇన్చార్జి ఉక్కు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అనుచరుడైన భరత్‌కుమార్‌రెడ్డి పాత కక్షలను మనసులో పెట్టుకొని బెనర్జీని కత్తితో విచక్షణా రహితంగా నరికాడన్నారు. తీవ్ర గాయాలైన అతన్ని చికిత్స నిమిత్తం కేవీఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారన్నారు. ప్రస్తుతం బెనర్జీ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ప్రత్యక్ష సాక్షి వెంకటరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కుట్ర, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నాగరాజు చెప్పారు. -
బడుగుల ఆత్మగౌరవం సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, కడప: బడుగుల పట్ల నాడు చంద్రబాబు వివక్ష చూపగా, నేడు సీఎం జగన్ అదే బడుగుల ఆత్మగౌరవాన్ని పెంచారని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్ బాషా చెప్పారు. బీసీలు తమ పేటెంట్ అని చెప్పుకునే చంద్రబాబు వారికి చేసింది శూన్యమని అన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామా జిక సాధికార యాత్రలో భాగంగా శనివారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో జరగిన బహిరంగ సభ లో అంజాద్ బాషా ప్రసంగించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఎన్నికల్లో వాడుకొని, ఆ తర్వాత అవమానించిన వ్యక్తి అని ఆయన చెప్పారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరనుకుంటారంటూ హేళన చేశారని, బీసీలను తోక కత్తిరిస్తానని హెచ్చరించిన ఘనత కూడా బాబుదేనన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు అన్ని రంగాల్లో, అన్ని పద వుల్లో అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని, దేశంలోనే సామాజిక విప్లవాన్ని తీసుకువచ్చిన ఏకైక సీఎం అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లంతా ఆత్మగౌరవంతో బతకాలంటే జగన్‌ను మళ్లీ సీఎంని చేసుకోవాలన్నారు. బీసీల బలం, ధైర్యం వైఎస్ జగనే : మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వెనుకబడిన వర్గాల బలం, ధైర్యం సీఎం వైఎస్ జగనే అని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల పేటెంట్ హక్కు వైఎస్ జగనే అని తెలిపారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఎంతో మందిని ఆయన రాజకీయంగా ఉన్నత స్థితికి తెచ్చారన్నారు. 2019కి ముందు ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు పదవులు ఉన్నాయి?, ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయో బేరీజు వేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు అండగా ఉన్నంతవరకు వైఎస్ జగన్‌ను ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. జగనన్న సామాజిక న్యాయానికి రోల్ మోడల్ : ఎంపీ మస్తాన్‌రావు దేశంలో సామాజిక న్యాయానికి రోల్ మోడల్ సీఎం వైఎస్ జగన్ అని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. 8 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలు ఉండటమనేది సీఎం జగన్‌తోనే సాధ్యమైందన్నారు. బీసీ గణన కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లు వేయాలని తమకు సూచించి, అందుకోసం రాష్ట్రంలో ఒక కమిటీ వేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, రూ.లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్ కోసం పార్లమెంటులో పోరాడాలని సూచించారన్నారు. సీఎం వైఎస్ జగన్ అండతోనే మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కోసం పార్లమెంటులో పోరాడామని చెప్పారు. కుట్రలు చేసే వారికి గుణపాఠం చెప్పాలి : ఎంపీ గురుమూర్తి పేదలకు మేలు జరగకుండా కుట్రలు, కుతంత్రాలు చేసే వారికి గుణపాఠం చెప్పాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి పిలుపునిచ్చారు. పేదలైన దళిత, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ సంపన్నులుగా చేస్తున్నారని చెప్పారు. పేదరిక నిర్మూలనను సీఎం వైఎస్ జగన్ ఒక యజ్ఞంలా చేస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. సామాజిక సాధికారతకు నిజమైన అర్థం చెప్పారన్నారు. చిన్న పిల్లలు తినే తిండి మొదలుకొని వారి చదువు, వేసుకునే దుస్తులు, పుస్తకాలు, ట్యాబ్‌ల వంటివన్నీ ముఖ్యమంత్రే వ్యక్తిగతంగా పరిశీలించడం గతంలో ఎన్నడూ లేదన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్న స్వేచ్ఛ, గౌరవం మరే పార్టీ లో ఉండదని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇంటి వద్దకే పాలన అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. లంచాలు లేకుండా సంక్షేమం అందిస్తున్నారని చెప్పారు. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటే ఏమిటో ఇప్పుడు మనం చూస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీ లకు 4 ఎమ్మెల్సీలు, 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన చరిత్ర కూడా వైఎస్ జగనన్నదేనన్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు. మంచి చేసిన వైఎస్ జగన్‌కి అందరూ అండగా నిలవాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు మునుపెన్నడూ ఈ స్థాయిలో పదవులు దక్కలేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మేయర్ సురేష్‌బాబు అన్నారు. జిల్లాలో 372 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని చెప్పారు. ఈ సమావేశంలో సాధికార యాత్ర రాయలసీమ ఇన్చార్జి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరులో టీడీపీ నేతల వీరంగం
-
ప్రొద్దుటూరులో టీడీపీ నేతల వీరంగం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని ప్రొద్దుటూరులో టీడీపీ నేతలు వీరంగం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు బెనర్జీపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. బెనర్జీకి తీవ్ర గాయాలవ్వగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడికి తెగబడిన వ్యక్తిని టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ ముఖ్య అనుచరుడు భరత్‌గా గుర్తించారు. -
‘సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్’
సాక్షి, ప్రొద్దుటూరు: దళితులను గత ప్రభుత్వం మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. దళితులకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర ఎవ్వరికీ లేదని తెలిపారు. ఈ మేరకు కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశాంలో.. బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి అందించామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లోనూ బలహీన వర్గాలకే ప్రాధాన్యత సామాజిక న్యాయం అనేది గతంలో మాటలకే పరిమితమైందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. బీసీలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుందని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో కేబినెట్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారని. నామినేటెడ్ పదవుల్లోనూ బలహీన వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని చెప్పారు. ‘సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగింది. కుల, మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం. నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నాం. మళ్లీ జగనే సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని అంజాద్ బాషా తెలిపారు. చదవండి: చంద్రబాబు రాజకీయ జీవితంలో చోటు లేనిది దానికే! -
సామాజిక సాధికార బస్సు యాత్ర..అడుగడుగునా జనం
-
ప్రొద్దుటూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
కూతురుకి ప్రేమ పెళ్లి చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
-
కూతురుకి ప్రేమ పెళ్లి చేసిన ఎమ్మెల్యే
-
కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన పెద్ద కుమార్తె పల్లవికి ఆదర్శ వివాహం చేశారు. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కుమార్తె పల్లవి, కమ్మర లీలా గోపి పవన్‌కుమార్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు అయిప్పటికీ వారి పెళ్లికి ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పలేదు. ఆయనే స్వయంగా పల్లవి, పవన్‌కుమార్‌లను గురువారం స్థానిక బొల్లవరంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్లి సంప్రదాయ ప్రకారం పెళ్లి చేశారు. అనంతరం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో వారికి రిజిష్టర్ మ్యారేజీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ తన కుమార్తె ఎంబీఏ చదివేటప్పుడు పవన్‌కుమార్‌ను ప్రేమించిందని తెలిపారు. తన కుమార్తె ఇష్ట్రపకారం మనస్ఫూ ర్తిగా ప్రేమ వివాహం చేశానని చెప్పారు. పవన్‌కుమార్ తండ్రి ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేస్తున్నారని, ఇష్టపడిన అబ్బాయితో కుమార్తె వివాహం చేశానన్న తృప్తి తనకు ఉందని వివరించారు. వాస్తవానికి ఈ వివాహాన్ని ఘనంగా చేయాలని భావించానని, అయితే తన కు మార్తె ఇందుకు అంగీకరించకపోవడంతో నిరాడంబరంగా జరిపించానని ఎమ్మెల్యే చెప్పారు. చదవండి: ఏపీ విద్యాసంస్కరణలు అద్భుతం -
ప్రొద్దుటూరులో దారుణం.. ఒకరు మృతి
-
అయ్యా...స్వామీ... చంద్రబాబును అసెంబ్లీ లో ఉతికి ఆరేసిన వైఎస్ఆర్
-
పుట్టా...పుత్తాకు ఝలక్... ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికే
సాక్షి ప్రతినిధి, కడప: యువగళం పాదయాత్రలో టీడీపీ సీనియర్లకు నారా లోకేష్ షాక్ ఇస్తున్నారు. ఒకవైపు పార్టీ టికెట్లు ఇచ్చేది చంద్రబాబే అని అంటూనే, పరోక్షంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో ఇన్చార్జిల అభ్యర్థిత్వాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, మైదుకూరు, కమలాపురం అభ్యర్థిత్వాలపై నర్మగర్భంగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా ఈవినింగ్ వాకింగ్‌ను తలపించేలా యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నిత్యం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై పరిస్థితి బట్టి రాత్రి 11 గంటల లోపు ముగుస్తోంది. జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని భావిస్తే, అలాంటి వారు తప్పులో కాలేసినట్లే. యువగళం చెంతకు టీడీపీ కేడర్ మినహా, ప్రజలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు సమీకరించిన కేడర్‌తో ముఖాముఖీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదీ కూడా కులాలు ఆధారంగా చేపడుతూ సాగుతున్నారు. ► పాదయాత్ర అంటే ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకొని ఆయా సమస్యలను ఎక్స్‌ఫోజ్ చేయడం ఆనవాయితీగా చూశాం. నాలుగు దశాబ్దాలుగా ఇలాంటి పాదయాత్రనే ప్రజానీకం గమనించింది. కాగా నారాలోకేష్ పాదయాత్ర అందుకు భిన్నంగా సాగుతోంది. ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ప్రతిరోజూ ఈవినింగ్ వాకింగ్‌లా సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈలోపు స్థానికంగా టీడీపీ నాయకులు సమీకరించిన జనాలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదీకూడా ప్రణాళిక బద్ధంగా కులాలు ఆధారంగా చేపడుతుండడం విశేషం. టీడీపీ కేడర్‌తోనే చిలుక పలుకులు చెప్పించడం, ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిందిస్తూ నారా లోకేష్ ప్రసంగించడం. ముందస్తుగా రచించిన వ్యూహం ప్రకారం యువగళం పాదయాత్ర చేపట్టడం మినహా వాస్తవికత ఆధారంగా చేపట్టడం లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మదనపడుతోన్న సీనియర్లు... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆ పార్టీ సీనియర్లను మదనపెడుతోంది. జిల్లాలో చోటుచేసుకున్న పరిణామం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. జమ్మలమడుగులోకి ప్రవేశించిన ఆయన ‘లోకేష్–భూపేష్’ జోడి అదిరింది కదూ, అంటూనే అక్కడి కేడర్‌కు భూషేష్ అభ్యర్థిత్వంపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రొద్దుటూరుకు వచ్చే కొద్ది ప్రవీణ్‌కుమార్‌రెడ్డికే టికెట్ అని లోకేశ్ పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ప్రొద్దుటూరు పౌరుషాన్ని నిలబెట్టింది ప్రవీణ్. మీ తరపున పోరాడినందుకు 29 రోజులు జైలుకెళ్లింది ఈ ప్రవీణ్ (అతన్ని చూపుతూ) అంటూ ఆకాశానికెత్తారు. లోకేష్ మాటలతో అదే వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, టీడీపీ నేత పోట్లదుర్తి సురేష్‌నాయుడు మొహాల్లో నెత్తురు చుక్కలేదు. మా సహకారం లేకుండా ఏజెంట్లను కూడా పెట్టుకోలేని ప్రవీణ్‌ను అభ్యర్థిగా ప్రకటించడం ఏమిటి, ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారని వరదరాజులరెడ్డి, లింగారెడ్డిలు సన్నిహితుల వద్ద వాపోతుండడం విశేషం. యువగళం విజయవంతం కోసం.... ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా యువగళం విజయవంతం కోసం టీడీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. నారా లోకేష్ కటౌట్లు పెట్టించడం నుంచి పబ్లిక్‌ను చూపించడం వరకూ తంటాలు పడుతున్నారు. ఈపరిస్థితుల్లో బయటి ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లు పెట్టి ప్రజానీకాన్ని కడపకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఆపై పసుపు కండువాలు వారి చేతికి అప్పగించి, నిర్ణయించిన ప్రాంతంలో లోకేష్ పర్యటన కంటే ముందే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు నిర్వహిస్తుండడం విశేషం. పుట్టా...పుత్తాకు ఝలక్ మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో కొనసాగిన యువగళం యాత్రకు అక్కడి ఇన్‌ఛార్జిలు పుట్టా సుధాకర్‌యాదవ్, పుత్తా నరసింహారెడ్డిలు కృషి చేశారు. కాగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరుల్లో లాగా ఇక్కడ కూడా ఆ ఇరువురి నేతల అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇస్తారని ఆశించారు. కాగా, పసువు జెండాను గెలిపించాలని లోకేష్ కోరడం మినహా ఇక్కడి అభ్యర్థులుగా ఆ ఇరువుర్ని గెలిపించాలని లోకేష్ పేరు పెట్టి చెప్పకపోవడం, పుట్టా, పుత్తాల వర్గీయులు ఆందోళనలో ఉన్నారు. పైగా అటు పుట్టా సుధాకర్ వ్యతిరేకిస్తున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిలు నారా లోకేష్ యువగళంలో ప్రత్యక్షం కావడంతో వారు మరింత ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. చెన్నూరు సమీపంలో ఏర్పాటు చేసిన క్యాంపులో నారా లోకేష్‌తో వీరశివారెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం కమలాపురం టీడీపీలో అలజడి రేపుతున్నట్లు తెలుస్తోంది. -
లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఈవినింగ్ వాకింగ్ లా ఉంది: రాచమల్లు
-
ప్రొద్దుటూరులో వైఎస్ సునీత, చంద్రబాబు పోస్టర్లు
సాక్షి, ప్రొద్దుటూరు: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారంటూ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఆ పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకుల ఫొటోలున్నాయి. అంతేకాక.. సునీత తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి ఫొటోలను కూడా వేశారు. ప్రొద్దుటూరులోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఈ పోస్టర్లు వెలుగుచూశాయి. పోస్టర్లలో జై తెలుగుదేశం.. రాజకీయ రంగప్రవేశం చేయనున్న డాక్టర్ వైఎస్ సునీతమ్మ గారికి స్వాగతం.. సుస్వాగతం అని ఉంది. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం రోడ్డు, వైఎంఆర్ కాలనీ, టీబీరోడ్డు, కొర్రపాడు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ పోస్టర్లను అంటించారు. అకస్మాత్తుగా వెలుగుచూసిన ఈ పోస్టర్లు పట్టణంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై ప్రొద్దుటూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. వీటిని మంగళవారం వేకువజామున అంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ పోస్టర్లతో తమ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
ప్రొద్దుటూరు కోర్టుకు బండ్ల గణేష్
ప్రొద్దుటూరు క్రైం : చెక్‌బౌన్స్ కేసుకు సంబంధించి సినీ నిర్మాత బండ్లగణేష్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వర్గాలు తెలిపిన మేరకు బండ్లగణేష్‌పై ప్రొద్దుటూరు కోర్టులో చెక్‌బౌన్స్ కేసులు ఉన్నాయి. వీటిలో ఒక కేసుకు సంబంధించి బుధవారం ఆయన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు. తిరిగి ఈ కేసు విచారణ ఈ నెల 22కు వాయిదా పడినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. -
గోల్ కొట్టి అమెరికాకు.. మెరిసిన ప్రొద్దుటూరు బాలిక
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కానపల్లె గ్రామానికి చెందిన వజ్జల శ్రీదేవి త్వరలో కాలిఫోర్నియాలో జరగనున్న అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొననుంది. కానపల్లె గ్రామానికి చెందిన ఈమె తల్లిదండ్రులు శ్రీనివాసులు, సుబ్బమ్మ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తమ కుమార్తెకు క్రీడలపై ఉన్న ఆసక్తిని గమనించి నాలుగో తరగతిలోనే కడపలోని వైఎస్సార్ క్రీడా పాఠశాలలో చేర్పించారు. తర్వాత శ్రీదేవి నెల్లూరు శాప్ అకాడమీలో ఉంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. ఫుట్‌బాల్‌పై పట్టు ఉన్న శ్రీదేవి ఎన్నో మార్లు పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. గతంలో అరుణాచలంలో జరిగిన సీనియర్ క్యాంప్, కటక్‌లో జరిగిన జూనియర్ క్యాంప్, గుంటూరులో జరిగిన ఎస్జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించింది. ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాగపూర్‌లోని స్లమ్స్ సాకర్ స్టేడియంలో ఇండియా ఫుట్‌బాల్ జట్టుకు సంబంధించి ఎంపికలు జరిగాయి. ఇందులో మొత్తం 28 మందిని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వజ్జల శ్రీదేవి ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యార్థినికి కోచ్‌గా కె.సాయికిరణ్ వ్యవహరిస్తున్నారు. హోమ్‌లెస్ వరల్డ్ కప్ అంటే.. హోమ్‌లెస్ వరల్డ్ కప్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే వార్షిక అసోసియేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్. ఇది అసోసియేషన్ ఫుట్‌బాల్ క్రీడ ద్వారా నిరాశ్రయులు లేకుండా చేయాలని సూచించే సామాజిక సంస్థ. సంస్థ వార్షిక ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుంది. ఇక్కడ వివిధ దేశాల నుంచి నిరాశ్రయులైన వ్యక్తుల జట్లు పోటీపడతాయి. నిరాశ్రయులైన ప్రపంచ కప్ సంస్థను 2001లో మెల్ యంగ్, హెరాల్డ్ ష్మీడ్ స్థాపించారు. నిరాశ్రయుల కోసం మొదటి వార్షిక ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2003లో ఆస్ట్రియాలోని గ్రాజ్లో జరిగింది. ఇటీవల 2019 ఎడిషన్‌ను వేల్స్ కార్డిఫ్‌లోని బ్యూట్ పార్క్‌లో నిర్వహించింది. 2020 టోర్నమెంట్ ఫిన్లాండ్లోని టాంపేర్‌లో జరగాల్సి ఉంది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా రద్దు అయింది. 2023 ఏప్రిల్‌లో యూఎస్ఏలోని కాలిఫోర్నియాలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. హోమ్‌లెస్ వరల్డ్ కప్ యొక్క అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం స్కాట్లాండ్లోని ఎడిన్‌బర్గ్‌లోని ఈస్టర్ రోడ్ స్టేడియంలో ఉంది. జాతీయ జట్టులో.. వజ్జల శ్రీదేవి త్వరలో అమెరికాలోని కాలిఫోర్నియాలో జరగనున్న ఫుట్‌బాల్ హోమ్‌లెస్ వరల్డ్ కప్ పోటీలకు వెళ్లనుంది. ఈ ఏడాది జరగనున్న పోటీలకు సంబంధించి ఇండియా జట్టును ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీదేవి ప్రథమ స్థానంలో ఉంది. – కె.సాయికిరణ్, ఫుట్‌బాల్ కోచ్ వరల్డ్ కప్‌లో విజయమే లక్ష్యం ఇండియా జట్టుకు ఎంపికయ్యాను. వరల్డ్ కప్ పోటీల్లో విజయమే లక్ష్యంగా ప్రతిభ చూపుతా. చిన్ననాటి నుంచి ఫుట్‌బాల్ క్రీడపై ఎంతో మక్కువ. చదువు లేని నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. – వజ్జల శ్రీదేవి, ఫుట్‌బాల్ క్రీడాకారిణి, కానపల్లె, ప్రొద్దుటూరు మండలం, వైఎస్సార్ జిల్లా. -
టీడీపీ నేత దూషించి, దాడి చేశాడు
సాక్షి, ప్రొద్దుటూరు: తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి నల్లబోతుల నాగరాజు తనపై దాడి చేసి, దూషిస్తూ నైటీ చింపేశాడని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని వరసిద్ధి వినాయక నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. నల్లబోతుల చిట్స్ నిర్వాహకుడుగా ఉన్న నల్లబోతుల నాగరాజు వద్ద గతంలో తాను అప్పు తీసుకుని ప్రతి నెలా అధిక వడ్డీని చెల్లిస్తున్నానన్నారు. కొద్ది రోజులుగా తన భర్త శివప్రసాద్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో జాప్యం జరిగిందని, వడ్డీతో సహా పూర్తి డబ్బు చెల్లిస్తామని తెలిపామన్నారు. అయినా వినకుండా శనివారం నల్లబోతుల నాగరాజుతోపాటు మరికొంత మంది తమ ఇంటి వద్దకు వచ్చి తనపై దాడి చేసి నైటీ చింపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటిలో ఉన్న తన భర్త శివప్రసాద్‌ను దూషించి, జుట్టుపట్టుకుని గాయపరిచారని తెలిపారు. వెంటనే డబ్బు చెల్లించకుంటే చంపుతామని కత్తితో బెదిరింనట్లు ఆమె వివరించారు. ఘటనపై ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం నల్లబోతుల నాగరాజు కేసు రాజీ కావాలని ఇతరులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట విషాదం) -
సీఎం జగన్ పాదాలకు నమస్కరిస్తున్నా.. 12 గంటల్లోనే రూ.10లక్షలు
సాక్షి, ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యువకుడు ఆళ్లగడ్డ మౌలాలి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం తాను ప్రతిపాదన పంపిన వెంటనే రూ.10లక్షలు మంజూరు చేస్తూ (ఎల్ఓసీ) ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదాలకు నమస్కరిస్తున్నానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. స్థానిక పుట్టపర్తి సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనివారం ఎల్ఓసీని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులు, తమ పార్టీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు హనీఫ్, షా హుసేన్తోపాటు నూరి, కౌన్సిలర్లు జిలాని బాషా, కమాల్, యెల్లాల మహ్మద్ గౌస్, వడ్ల ఖలీల్, ఇర్ఫాన్ బాషా తదితరులు సమస్యను తన దృష్టికి తేవడంతో తన కార్యాలయం నుంచి గురువారం సీఎం కార్యాలయానికి లేఖను పంపి ఫోన్ చేసినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేవలం 12 గంటల్లోనే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రూ.10 లక్షలు మంజూరు చేశారని, బాధితుడు మౌలాలి హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడన్నారు. మౌలాలికి అతని భార్య లివర్ ఇస్తోందని చెప్పారు. ఆపరేషన్‌కు అవసరమయ్యే మిగతా రూ.10లక్షల్లో తన వంతుగా సొంత డబ్బు రూ.3 లక్షలు ఇస్తున్నానని, మిగతా రూ.7లక్షలను పార్టీ నాయకులు అందిస్తున్నారని తెలిపారు. పెద్దమనసుతో స్పందించి 12 గంటల్లోనే రూ.10 లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి మానవత్వాన్ని ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం పట్టణానికి చెందిన కరీముల్లా లివర్ ప్లాంటేషన్ కోసం సీఎం రూ.25 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులతోపాటు షాపీర్ ఆలి పాల్గొన్నారు. -
త్రిబుల్ మర్డర్ కేసులో ముద్దాయికి ఉరి
ప్రొద్దుటూరు క్రైం: త్రిబుల్ మర్డర్ కేసులో ముద్దాయి కరీముల్లాకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రెండవ అదనపు జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్ వీధిలో నివసించే ఉప్పలూరు చాంద్‌బాషా, గుల్జార్‌బేగం దంపతులకు ఓ కుమార్తె (కరీమున్నీసా), ముగ్గురు కుమారులు(కరీముల్లా, మహబూబ్‌బాషా, మహ్మద్ రఫీ). రఫీ మినహా ఇద్దరు కుమారులు, కుమార్తెకు పెళ్లిళ్లు అయ్యాయి. కరీముల్లా గతంలో తల్లిదండ్రుల వద్దే ఉండేవాడు. అయితే అతను కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో.. తల్లిదండ్రులు పక్క వీధిలో వేరే కాపురం పెట్టించారు. ఆ సమయంలో కొందరి చెప్పుడు మాటలు విన్న కరీముల్లా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తనపై నింద వేయడంతో.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కరీముల్లా మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చేశాడు. గర్భిణి అయిన చెల్లెలు కరీమున్నీసా కూడా పుట్టింటికి వచ్చింది. భార్యతో విడాకులు ఇప్పించాలని కరీముల్లా అడుగుతుండగా.. తల్లిదండ్రులు సర్ది చెబుతూ వచ్చారు. దీంతో 2021 ఏప్రిల్ 25వ తేదీన కరీముల్లా కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడు. ఆ మరుసటి రోజు(26వ తేదీ) తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న తల్లి గుల్జార్‌బేగం, చెల్లి కరీమున్నీసా, తమ్ముడు రఫీని కరీముల్లా రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా.. ప్రొద్దుటూరు రెండవ అదనపు జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. ముగ్గురిని తానే హత్య చేశానని కరీముల్లా అంగీకరించడం.. నేరం రుజువు కావడంతో జడ్జి జి.రమేశ్‌బాబు ఉరిశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రొద్దుటూరు కోర్టు చరిత్రలో ఇది మొదటి ఉరిశిక్ష తీర్పు అని ఏపీపీ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
డ్వాక్రా పొదుపు సంఘాల సొమ్ము గోల్మాల్ చేసిన టీడీపీ మహిళా నేత
-
MV Ramana Reddy: మనకాలం వీరుడు ఎమ్వీఆర్
2001వ సంవత్సరం. అమీర్ పేటలో ఆర్టిస్ట్ మోహన్ ఆఫీసు. ఉదయం పది గంటలకి ఎం.వి. రమణారెడ్డి ఫోన్ చేశారు. ‘హైద రాబాద్ బస్టాండ్‌లో వున్నా. అర గంటలో మీ ఆఫీసుకి వస్తాను’ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెన్రీ షారియర్ నవల ‘పాపిలాన్’ని ఆయన అనువ దించారు. కవర్ పేజీ బొమ్మ కోసం వస్తున్నారు. ఆయన చాలా రోజుల ముందే చెప్పినా మోహన్ బొమ్మ వేయలేదు. తాపీగా ఒక ఎ4 సైజ్ బాండ్ పేపర్ తీసుకుని, రెక్కలతో ఒక మనిషి ఎగురుతున్న ఒక చిన్న బొమ్మ వేశాడు. దాన్ని స్కాన్ చేసి, పచ్చని అడివి వున్న ఒక బ్రోషర్ తీసి ఇచ్చి, దాన్ని బ్యాక్ గ్రౌండ్‌గా వాడమని కంప్యూటర్ ఆపరేటర్‌కి చెప్పాడు. ఆ పని అయ్యేలోగా ‘రెక్కలు సాచిన పంజరం – ఎం.వి. రమణారెడ్డి’ అని అక్షరాలు రాసిచ్చాడు. కవర్ పేజీ పైన అడివి, కింద సముద్రం అలలు, మధ్యలో ఎగిరే స్వేచ్ఛాజీవి– 20 నిమిషాల్లోనే రెడీ అయింది అందమైన కవర్ డిజైన్. ఎమ్వీఆర్ వచ్చారు. హాయిగా నవ్వి ‘బాగుంది’ అన్నారు. నాకు ఒకటే ఆశ్చర్యం. ప్రొద్దుటూరు ఫ్యాక్షనిస్టూ, హత్య కేసులో జైలుకెళ్లిన మనిషీ, వైద్యం చేసే డాక్టరూ, ఉద్యమాలూ నడిపి, నిరాహార దీక్షలు చేసి, ఎమ్మెల్యేగా గెలిచి రాయలసీమ కోసం గొంతెత్తినవాడూ, పుస్తకాలు రాసినవాడూ ఈయనేనా? సౌమ్యంగా, వినమ్రంగా, సంస్కారవంతంగా, స్నేహశీలిగా ఉన్న ఈ నిరాడంబరమైన బక్కపలచని మానవుడేనా? ఎమ్వీఆర్‌గా ప్రసిద్ధుడైన మల్లెల వెంకట రమణా రెడ్డి తెలుగు సాహిత్యానికి కొన్ని అరుదైన కానుకలు ప్రసాదించిన ప్రతిభామూర్తి. విప్లవ కారుడూ, తిరుగుబాటుదారుడూ అయిన ఎమ్వీఆర్ మహాభారతాన్ని లోతుగా అధ్యయనం చేసినవాడు. ‘గుడిపాటి వెంకటచలం వచనం నాకిష్టం. ఆ ప్రభావం నా మీద వుంది’ అని ప్రకటించినవాడు. ఎంత విస్తృ తంగా చదువుకున్నాడో ఆయన రచనల్లోని వైవిధ్యమే మనకి చెబుతుంది. మార్గరెట్ మిషెల్ ‘గాన్ విత్ ది విండ్’, గోర్కీ ‘అమ్మ’, ఆర్కె నారాయణ్ ‘పెద్దపులి ఆత్మకథ’, ‘మాటకారి’ నవలలు తేట తెలుగులోకి అనువదించారు ఎమ్వీఆర్. ‘ఆయుధం పట్టని యోధుడు’ టైటిల్‌తో మార్టిన్ లూథర్ కింగ్ జీవిత చరిత్ర రాశారు. భారతంలో ద్రౌపది ప్రాధా న్యాన్నీ, విశిష్టతనీ తెలియజెప్పే ‘తెలుగింటికొచ్చిన ద్రౌపది’ ఒక అరుదైన రచన. ఎమ్వీఆర్ రాసిన ‘రాయల సీమ కన్నీటి గాథ’ ప్రజాదరణ పొందిన ఒక సీరియస్ డాక్యుమెంట్. జీవిత చరమాంకంలో రాసిన ‘తెలుగింటి వ్యాకరణం’ ఒక అసాధారణమైన రచన. ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ అని ఏకంగా నాలుగు సంపుటాలు రాసిన మన హెచ్.జి. వెల్స్ ఎమ్వీ రమణారెడ్డి. నవ చైనా సామాజిక జీవితం గురించి ఒక బ్రిటిష్ డాక్టర్ రాసిన పుస్తకాన్ని ‘పురోగమనం’ పేరుతో అనువదించారు. ఎనిమిది ఉత్తమ తెలుగు చిత్రాలకు ఆయన రాసిన సమీక్షలు ఎప్పటికీ మరిచిపోలేనివి. ‘తెలుగు సినిమా స్వర్ణయుగం’లో మల్లీశ్వరి, జయభేరి, దొంగరాముడు, దేవదాసు, బంగారు పాప, పాతాళ భైరవి, మాయాబజార్, విప్రనారాయణలను ఆయన సమీక్షించిన తీరు పాఠకుల్ని పరవశుల్ని చేస్తుంది. అవి డాక్టోరల్ థీసిస్‌కు ధీటైన పరిశోధన చేసి రాసినవని ముళ్ళపూడి వెంకట రమణ కితాబిచ్చారు. (క్లిక్: కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఎందుకు రాశారు!?) ఎమ్వీ రమణారెడ్డి అనే పదహా రణాల ప్రజల మనిషి, అక్షరాలా ఉత్తమ సాహితీవేత్త మన సాహిత్యానికి చేసిన కంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. కడప జిల్లా ప్రొద్దుటూరు అంటే ఆనాడు ‘శివతాండవం’ చేసిన పుట్టపర్తి నారాయణాచార్యులవారు, ప్రొద్దుటూరు అంటే తెలుగు సాహితీ పతాకాన్ని నీలాకాశం చేసి ఎగరేసిన ఎమ్వీ రమణారెడ్డి... అనే మనకాలం వీరుడు. ఉద్యమం, అధ్యయనం, ఆదర్శం కలిసి ప్రవహిస్తే... అదే ఉజ్వలమైన, ఉత్తేజకరమైన ఎమ్వీఆర్ జీవితం. (క్లిక్: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) - తాడి ప్రకాష్ సీనియర్ జర్నలిస్ట్ (సెప్టెంబర్ 30న ప్రొద్దుటూరులో ఎమ్వీఆర్ విగ్రహ ఆవిష్కరణ) -
ప్రొద్దుటూరు టీడీపీలో రచ్చ రచ్చ.. వెన్నుపోటుకు సిద్ధంగా ఆ వర్గాలు
సాక్షి, కడప: ప్రొద్దుటూరు టీడీపీలో మరోమారు వర్గపోరు రోడ్డెక్కింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ వ్యవహారం ఈ రచ్చకు వేదికగా మారింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకేనంటూ ప్రస్తుత ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గం పేర్కొంటోంది. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. తన ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తనకే అభ్యర్థిగా అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. పార్టీలో వర్గ విబేధాలపైనా చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు ఏం చెప్పారో తెలియదు గానీ ఈ దఫా ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకే అంటూ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని తన అనుయాయులకు సమాచారం అందించారు.ఈ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారని, మనమే పోటీలో ఉంటామంటూ ప్రకటించారు. ప్రవీణ్ సూచనలతో ప్రొద్దుటూరులో ఆయన వర్గం బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకుంది. ఇది జీర్ణించుకోలేని పార్టీ జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, ఆయన వర్గం భగ్గుమంటోంది. నూటికి లక్ష సార్లు నాకే టిక్కెట్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న మల్లెల లింగారెడ్డి పార్టీ అధిష్టానం ప్రొద్దుటూరు టిక్కెట్ ఇంకా ఎవరికీ ఖరారు చేయలేదంటూ నాలుగు రోజుల కిందట హడావుడిగా వీడియో రిలీజ్ చేశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి టిక్కెట్ కేటాయించలేదని, ఆ మేరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లింగారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ గందరగోళానికి గురి కావద్దని ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు అభ్యర్థిత్వం ఖరారుకు చాలా సమయం పడుతుందని, అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే అభ్యర్థి ఖరారు ప్రకటన ఉంటుందన్నారు. అంతటితో ఊరుకోకుండా రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు లింగారెడ్డి ప్రెస్‌మీట్ కూడా పెట్టారు. నూటికి లక్ష శాతం పార్టీ తనకే టిక్కెట్ కేటాయిస్తుందని చెప్పకనే చెప్పారు. ఆది నుంచి టీడీపీలో ఉన్నది తానేనన్నారు. తాను, తన కుటుంబం టీడీపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, తనకు కాకుండా పార్టీ ఎవరికి టిక్కెట్ ఇస్తుందని ప్రశ్నించారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, లింగారెడ్డిలు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ తనకేనంటూ ఎవరికి వారు ప్రకటించుకుంటుండడంతో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది. లింగారెడ్డి ప్రకటనపై ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తనకే టిక్కెట్ అని ప్రకటించుకోవడంపై లింగారెడ్డి వర్గంతోపాటు వరదరాజులురెడ్డికి మద్దతు పలుకుతున్న మరోవర్గం ఆగ్రహంతో ఉంది. ప్రొద్దుటూరు టీడీపీ టిక్కెట్‌ను వీరు ఇద్దరే కాకుండా మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి, సీఎం సురేష్‌నాయుడు తదితరులు ఆశిస్తున్నారు. ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకరికొకరు మద్దతు పలికే పరిస్థితి లేదు. ఏ ఒక్కరికీ టిక్కెట్ ఖరారు చేసినా మిగిలిన వర్గాలు వెన్నుపోటుకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా ప్రొద్దుటూరు టీడీపీలో టిక్కెట్ రచ్చ మరోమారు రోడ్డెక్కింది. -
పెళ్లయి నాలుగేళ్లు.. ఎన్నో పంచాయితీలు.. చివరకు..
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం (వైఎస్సార్ కడప): స్థానిక దేవాంగపేటలో బోదిన మేఘన (22) అనే వివాహిత సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు మేఘనకు 2018లో దేవాంగపేటకు చెందిన శ్రీనివాసులుతో వివాహమైంది. అతను ఎలక్ట్రానిక్ దుకాణంలో గుమాస్తాగా పని చేస్తుంటాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లయిన నాటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. పలుమార్లు ఇరువురి తరపు పెద్ద మనుషులు పంచాయతీ కూడా చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలియడంతో అమృతానగర్‌లో ఉంటున్న తల్లిదండ్రులు రమణమ్మ, మోహన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు. తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర) -
Narala Rama Reddy: అవధాన ఉద్దండుడు
సాక్షి, ప్రొద్దుటూరు : ఆయన అవధానంలో పాండిత్య ప్రదర్శన ఉండదు. అందమైన కవిత్వం ఉంటుంది. సాహిత్యంలో బరువైన పదసంపద ఉండదు. సున్నితమైన భావాలతో హృదయ స్పందన కలిగించడమే ఆయన శైలి. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు 1980 ప్రాంతంలో సరస్వతి పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులకు సాహిత్య రంగంలో గౌరవ డాక్టరేట్‌ను బహూకరించారు. 42 ఏళ్ల తర్వాత వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అవధాని నరాల రామారెడ్డికి ఇదే యూనివర్సిటీ వారు గత నెల 24న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. 1948 జూన్ 22న నరాల బాలిరెడ్డి, వెంకటమ్మ దంపతులకు రెండో సంతానంగా రామారెడ్డి జన్మించారు. ఐదో తరగతి తర్వాత 6 నుంచి 11వ తరగతి వరకు శ్రీకృష్ణ గీర్వాణ ఉన్నత పాఠశాలలో చదివారు. అక్కడ తన పెద్దనాన్న కుమారుడు నరాల వెంకటరామిరెడ్డి ప్రధానోపాధ్యాయుడు. 1959లో గీర్వాణ పాఠశాలలో చేరినప్పుడే జీవితం మలుపు తిరిగింది. సంస్కృతాంధ్ర భాషలపై పట్టు సాధించారు. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు పల్లె వెంకటరెడ్డి తెలుగు పాఠాలు బోధించారు. తెలుగు పండితులైన పల్లె వెంకటరెడ్డి పారిజాతపహరణం నాటకాన్ని రచించారు. ఆయనలాగే పద్యాలు రాయాలని రామారెడ్డి ప్రయత్నం చేశారు. 1964లో 11వ తరగతి ఉత్తీర్ణుడైన తర్వాత ఉన్నత చదువులు చదివేందుకు ప్రొద్దుటూరులో డిగ్రీ కళాశాల లేదు. స్థానికంగా పాలిటెక్నిక్ కళాశాల మాత్రమే ఉండగా.. ఆ చదువుపై ఇష్టం లేకపోవడంతో తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న ప్రాచ్య కళాశాలలో ఏ విద్వాన్ చదవడానికి సిద్ధపడ్డారు. చదువుతోపాటు ఉచిత భోజన వసతి కల్పిస్తుండటంతో ప్రాచ్య కళాశాలలో చేరారు. ప్రాచ్య కళాశాలలో ప్రవేశించిన తర్వాత సంస్కృతాంధ్ర భాషలపై మక్కువ పెంచుకుని పద్యాలను అలవోకగా అల్లే శక్తిని సంపాదించారు. 16వ ఏటనే అవధానం 1965లో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో బులుసు వెంకటరామమూర్తి అష్టావధానం జరిగింది. ఈ అవధానాన్ని చూసిన రామారెడ్డి హాస్టల్ గదుల్లోనే తోటి విద్యార్థులతో అవధానం నిర్వహించేవారు. అదే ఏడాది స్థానిక రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రప్రథమ అవధానం జరిగింది. విజయవంతంగా నిర్వహించినందుకు పండితులు ఆయనను ప్రశంసించారు. విద్యార్థి దశలోనే శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో 20 అవధానాలు నిర్వహించారు. 1968లో ఎ.విద్వాన్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తాను విద్యాభ్యాసం చేసిన శ్రీవెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగ బాధ్యతలను చేపట్టాలనుకున్నారు. తండ్రి అకాల మరణంతో కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికి, తండ్రి చేసిన రూ.10 వేలు అప్పు తీర్చడానికి సోదరుడైన నరాల వెంకటరామారెడ్డి ప్రోద్బలం వల్ల ప్రొద్దుటూరులోని శ్రీమలయాళస్వామి ఓరియంటల్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. అధ్యాపకునిగా పని చేస్తూ.. ప్రైవేటుగా ఎంఏ (తెలుగు) పూర్తి చేశారు. 1972 మార్చి 30న కర్నూలు జిల్లా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన గువ్వల యల్లారెడ్డి, పుల్లమ్మ ఏకైక పుత్రిక సరోజను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు సతీష్, కుమార్తెలు మనస్విని, ఉదయని ఉన్నారు. వీరు ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డారు. అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 2006లో పదవీ విరమణ చెందారు. చంధస్సు, అలంకారాలు, ప్రబంధాలను బోధించి విద్యార్థుల హృదయాల్లో చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశ, విదేశాల్లో అవధానాలు దేశ, విదేశాల్లో వందల అవధానాలు నిర్వహించారు. 1968లో అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లెలో చేసిన అవధానం జయప్రదం కావడం వల్ల.. అవధాన రంగంలో గుర్తింపు లభించింది. 1969లో బెంగళూరు ఆంధ్ర విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో, 1972లో జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నెల్లూరులో, 1974లో గుంటూరులో ప్రముఖుల సమక్షంలో అవధాన కార్యక్రమాలు నిర్వహించారు. 1973లో చెన్నైలో తాజ్కోరమండల్, అశోక్ హోటల్లో వేర్వేరుగా ప్రముఖల సమక్షంలో నిర్వహించారు. ఓ కార్యక్రమానికి పద్మశ్రీ డి.భానుమతి, మరో కార్యక్రమానికి సినీ నిర్మత ఎంఎస్ రెడ్డి అధ్యక్షత వహించారు. దేశ విదేశాల నుంచి ఆహ్వానాలు అందాయి. అమెరికాలో... 1992లో జూలైలో ‘ఆటా’ అధ్యక్షుడు టి.సదాశివారెడ్డి ఆహ్వానం మేరకు 9 వారాలపాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అష్టావధానాలను నిర్వహించి ప్రవాసాంధ్రుల ప్రశంసలు అందుకున్నారు. న్యూయార్క్‌లో శిరోమణి అవార్డు, న్యూజెర్సి, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, వాషింగ్టన్, హ్యూస్టన్, సెయింట్‌లూయిస్, డెట్రాయిట్ నగరాల్లో ప్రతిభ చాటారు. తర్వాత నాటా ఆహ్వానంతో మూడు మార్లు, ఆటా ఆహ్వానంతో నాలుగు మార్లు, తానా ఆహ్వానంతో ఒక సారి మొత్తం 8 సార్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అవధాన నైపుణ్యం ప్రదర్శించారు. డాలస్‌లో అష్టావధానం నిర్వహించి ‘అవధాన కౌస్తుభ’ బిరుదు పొందారు. చికాగోలో అష్టావధానం నిర్వహించి కనకాబి సత్కారంతోపాటు ‘అవధాని సౌరభౌమ’ బిరుదు పొందారు. ► నరాల రామారెడ్డి 1965 నుంచి 2018 వరకు సుమారు వెయ్యి అష్టావధానాలు నిర్వహించారు. ► 2012లో సంస్కృతంలో ప్రసిద్ధి గాంచిన శాలివాహన గాథాసప్తశతిలోని 300 శ్లోకాలను అనువాదం చేసి భావకవితా శైలిలో 300 తేటగీతులను తెలుగు పాఠకులకు అందించారు. 2018లో 400 పద్యాలతో ‘అవధాన సౌరభం’ గ్రంథాన్ని ప్రచురించారు. సంస్కృత సాహిత్యంలో అలంకార శాస్త్రంలో సుప్రసిద్ధ సంస్కృత శ్లోకాలు, కొన్ని చాటు శ్లోకాలు, ప్రసిద్ధం సంస్కృత కవుల శ్లోకాలను తెలుగులో అనువాదం చేసి ‘అనువాద మాధురి’ పేరుతో ప్రచురిస్తున్నారు. కర్ణుని జీవితంలో విశిష్ట ఘట్టాల ఆధారంగా కర్ణ జననం నుంచి సూర్యునిలో కలిసిపోవు వరకు ఇతివృత్తాన్ని తీర్చిదిద్ది ‘కర్ణభారతం’ అనే కావ్య రచన చేశారు. ► 978–80 ప్రాంతంలో శోభన్‌బాబు నటించి న ‘కార్తీక దీపం’, కృష్ట నటించిన ‘కలవారి సంసారం’ సినిమాలకు పాటలు రాశారు. ► 2000లో డాక్టర్ సి.నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, బండారు దత్తాత్రేయ సమక్షంలో రసమయి అవార్డు అందుకున్నారు. ► 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా హంస అవార్డు అందుకున్నారు. ► తిరుపతిలో చదివిన నరాల రామారెడ్డి 1971లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ అధ్యక్షతన, 1980లో దివాకర్ల వెంకట అవధాని, ఆ ఏడాదిలోనే శ్రీనివాస ఆడిటోరియంలో బీఎన్ రెడ్డి, 1981లో యూనివర్సిటీ రజతోత్సవం సందర్భంగా మహాకవి దాశరథ అధ్యక్షతన అవధాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ప్రతిభను గుర్తించిన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గత నెల 24న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. -
సీఎం జగన్ ఆశయం.. పార్టీ లక్ష్యం తప్పక నెరవేరుతాయి
సాక్షి, వైఎస్సార్: ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదవాలన్నది సీఎం జగన్ ఆశయమని, రాష్ట్రంలో నిరుద్యోగి ఉండకూడదన్నది వైఎస్సార్సీపీ లక్ష్యమని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరు సీబీఐటీలో శనివారం ఉదయం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్య ప్రతి ఒక్కరి అవసరం. ఉద్యోగాల కోసం ప్రతీ ఒక్కరూ పోటీ పడుతున్న పరిస్థితుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యోగం పొందితేనే కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పారాయన. అలాగే.. ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కొవాలని, ఇప్పుడు రానంత మాత్రాన మళ్లీ అవకాశం ఉంటుందని, బాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని విజయసాయిరెడ్డి యువతకు భరోసా ఇచ్చారు. జాబ్ మేళాలో వందకు పైగా కంపెనీలు పాల్గొనగా.. ఉద్యోగాల కోసం 13 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో.. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ఆధర్వ్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలకు అపూర్వ స్పందన లభిస్తోందని డిప్యూటీ సీఎం అమ్జాద్ బాషా పేర్కొనగా.. జగన్ ఆశయ సాధనకు అనుగుణంగా జాబ్ మేళా నిర్వహిస్తామని, నిరుద్యోగిరహిత లక్ష్య సాధన కోసం పార్టీ కృషి చేస్తుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. -
భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం.. పిల్లలు అమ్మా అని...
ప్రొద్దుటూరు క్రైం : ‘జరిగిందేదో జరిగిపోయింది.. మన ఇంటికి పోదాం రా’అని భార్య అనురాధను పిలిచాడు. పలుమార్లు పిలిచినా ఇమ్మానియేల్‌ను వదిలి పెట్టి రానని భర్తతో తెగేసి చెప్పింది. తన పిల్లలకు తల్లిని లేకుండా చేసిన ఇమ్మానియేల్‌పై అతను(రవి) పగ పెంచుకున్నాడు. తన భార్య మరో వ్యక్తితో సహజీవనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అతన్ని ఎలాగైనా హతమార్చాలని వ్యూహం పన్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. రెండు రోజుల క్రితం ఇమ్మానియేల్ నిద్రపోతుండగా పిడిబాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ హత్య చేసిన కేసులో నిందితుడు రవిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ప్రసాదరావు బుధవారం సాయంత్రం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రకాష్‌నగర్‌లోని ఇటుకల ఫ్యాక్టరీ వద్ద నివాసం ఉంటున్న ఇమ్మానియేల్‌ను హత్య చేసి రవి పారిపోయాడు. ఈ సంఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరెస్ట్ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాదరావు సుమారు ఐదేళ్ల కిందట రవి భార్య అనురాధ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఇమ్మానియేల్‌తో ప్రొద్దుటూరుకు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రవి తన భార్య అనురాధ వద్దకు వెళ్లి సంసారానికి రమ్మని ప్రాధేయపడ్డాడు. పిల్లలు అమ్మా అని తపిస్తున్నారు.. పోదాం రా అని ఎంతగా బతిమాలినా ఆమె కనికరించలేదు. ఇమ్మానియేల్‌ను వదిలేసి రానని భర్తతో తెగేసి చెప్పింది. ఇలా పలుమార్లు వచ్చి పిలిచినా ఆమె మనసు కరగలేదు. నిన్ను చంపేసి నా భార్యను తీసుకెళ్తా : రవి దీనంతటికీ కారకుడైన ఇమ్మానియేల్‌పై రవి పగ పెంచుకున్నాడు. ‘నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్. ఎప్పటికైనా నిన్ను చంపేసి నా భార్యను తీసుకుపోతా ’అని అతన్ని రవి హెచ్చరించాడు. అయినా ఇమ్మానియేల్ లైట్‌గా తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఇమ్మానియేల్‌ను హతమార్చేందుకు అవకాశం కోసం రవి ఎదురుచూస్తూ వచ్చాడు. అతను ఇటుకల బట్టి వద్ద బయట పడుకుంటున్నాడని పసిగట్టిన రవి ఇదే మంచి తరుణమని భావించాడు. సోమవారం అర్ధరాత్రి ఇమ్మానియేల్ నిద్రపోతున్న సమయంలో పిడిబాకుతో కసితీరా పొడిచి చంపాడు. అనంతరం రవి బైక్‌పై వెళ్తుండగా మోడంపల్లె బైపాస్ రోడ్డులో సీఐ ఇబ్రహీం సిబ్బందితో కలిసి అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బైక్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 24 గంటల్లోనే హంతకుడ్ని అరెస్ట్ చేసిన సీఐ ఇబ్రహీం, సిబ్బందిని డీఎస్పీ అభినందించి నగదు రివార్డును అందజేశారు. -
సీఎం జగన్ పులివెందుల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
కడప సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీ శుక్రవారం ఒకరోజు జిల్లా పర్యటనకు రానున్నారని జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. తొలుత ప్రొద్దుటూరు పట్టణంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి మనవడి వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అలాగే పులివెందుల పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సీఎం సమావేశం కానున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం పర్యటన ముగించుకుని సాయంత్రం కడప ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళతారని కలెక్టర్ వివరించారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా! ►ఈనెల 17వ తేదీ ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి 9.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►10.00 గంటలకు అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.40 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►10.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11.00 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ►11.00 నుంచి 11.15 గంటల వరకు స్థానిక నేతలతో ముచ్చటిస్తారు. ►అక్కడి నుంచి బయలుదేరి 11.25 గంటలకు ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీదేవి ఫంక్షన్ హాలుకు చేరుకుంటారు. ►11.25 నుంచి 11.40 గంటల వరకు డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి మనవడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. ►11.50 గంటలకు వివాహ వేదిక నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు పులివెందుల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►12.20 గంటలకు రోడ్డు మార్గాన ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు వెళతారు. ►12.20 నుంచి 12.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►12.30 నుంచి 4.00 గంటల వరకు పులివెందుల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ►4.00 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.10 గంటలకు పులివెందులలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►అక్కడినుంచి 4.15 గంటలకు బయలుదేరి 4.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►కడప ఎయిర్‌పోర్టు నుంచి 4.40 గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళతారు. ►5.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. చదవండి: (సచివాలయాలు సూపర్) సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పులివెందుల రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీన జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులకు రానున్న నేపథ్యంలో బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు ఇతర అధికారులతో చర్చించారు. పటిష్ట బందోబస్తు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించే ప్రాంతాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఆయన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాజు, ఎస్ఐలకు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం పులివెందులలోని హెలీప్యాడ్ స్థలాన్ని, ఆర్అండ్బీ అతిథి గృహాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ సాయికాంత్ వర్మ, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమస్యలపై కలెక్టర్ ఆరా పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలపై కలెక్టర్ విజయరామరాజు ఆరా తీశారు. బుధవారం స్థానిక ఏపీ కార్ల్ భవనంలో ఆయన జేసీ సాయికాంత్ వర్మ, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలతో కలిసి పులివెందుల, తొండూరు, వేంపల్లె మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందుల, తొండూరు, వేంపల్లె మండలాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశం నిర్వహిస్తారన్నారు. మండలాల్లోని గ్రామాల్లో సీఎం దృష్టికి తీసుకొచ్చే సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలాల్లో నెలకొన్న సమస్యలు ప్రస్తావించిన వెంటనే సమాధానం చెప్పే విధంగా అధికారులు ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. హెలిప్యాడ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ప్రొద్దుటూరు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను బుధవారం కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పరిశీలించారు. శ్రీదేవి ఫంక్షన్‌హాల్ ఎదురుగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం వేకువ జామున భారీ వర్షం పడిన నేపథ్యంలో తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షం పడినా ఇబ్బందులు తలెత్తకుండా రహదారిని ఎత్తుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఆర్టీఓ కార్యాలయం సమీపంలో హెలిప్యాడ్‌ను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. వారి వెంట జేసీ సాయికాంత్‌వర్మ, రిజర్వ్ అడిషనల్ ఎస్పీ మహేష్‌కుమార్, ఐఎస్‌డబ్ల్యూ డీఎస్పీ కృపాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావు, తదితరులు ఉన్నారు. -
జగన్ సీఎం కంటే నాకేదీ ముఖ్యం కాదు: ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు: పార్టీ కన్నతల్లిలాంటిదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తల్లి బాగుంటే ఆమె నీడలో పిల్లలందరూ బాగుంటారన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన జిల్లా నుంచి సహోదరుడు అంజద్‌బాషా రెండోసారి మంత్రి వర్గంలో స్థానం పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. మంత్రి పదవులు ఆశించిన కొందరు సీనియర్ ఎమ్మెల్యేల్లో కొంత నిరాశ, నిస్పృహలు ఉండటం సహజమేనన్నారు. 151 మంది ఎమ్మెల్యేల్లో 26 మందికి మాత్రమే మంత్రి పదవులు వస్తాయన్నారు. అంత మాత్రాన మిగిలిన వారిలో అసంతృప్తి ఉన్నట్లు కాదని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండటమే తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమన్నారు. జగన్ సీఎంగా ఉండటం కంటే తనకు మరే మంత్రి పదవి ముఖ్యం కాదని అన్నారు. తాను జీవించినంత కాలం వైఎస్ జగనే సీఎంగా ఉండాలన్నదే తన కోరిక అని తెలిపారు. చదవండి: (Balineni Srinivas Reddy: జగనన్న మాటే.. వాసన్న బాట) ప్రస్తుత మంత్రివర్గంలో అనుభవం, మేథస్సు ఆధారంగా సీనియర్లకు తిరిగి మంత్రి పదవులు దక్కాయన్నారు. కేబినెట్ విస్తరణ సందర్భంగా అలకలు అనేవి సాధారణమేనని, అవన్నీ క్రమంగా సర్దుకుపోతాయన్నారు. మంత్రి వర్గంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత లభించినట్లు ఆయన తెలిపారు. -
ఆ దంపతులేమయ్యారు?.. దారి తప్పారా లేక మరేదైనా..!
సాక్షి, ప్రొద్దుటూరు: ఎగువ అహోబిలంలో కనిపించకుండా పోయిన దంపతుల కోసం పోలీసులు విస్తతంగా గాలిస్తున్నారు. ప్రొద్దుటూరు మండలంలోని నంగనూరుపల్లెకు చెందిన పల్లెబోయిన నరసింహులు, నీలిమా అనే దంపతులు ఈ నెల 21న కర్నూలు జిల్లాలోని అహోబిలం క్షేత్రానికి వెళ్లి కనిపించకుండా పోయారు. మూడు రోజులైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు 23న ఆళ్లగడ్డ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఎగువ అహోబిలం సమీపంలోని కారంజ నరసింహస్వామి ఆలయం సమీపంలో నరసింహులుకు చెందిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దంపతులిద్దరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లి దారి తప్పి తప్పారా లేక మరేదైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో దంపతుల అదృశ్యానికి సంబంధించిన సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు అందించారు. వారి సాయంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చదవండి: (వదినతో వివాహేతర సంబంధం.. అన్నకు తెలిసి..) ప్రతి నెలా అహోబిలం వెళ్లేవారు.. నంగనూరుపల్లె గ్రామానికి చెందిన నరసింహులు ప్రొద్దుటూరులోని కోనేటికాల్వ వీధిలో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. వారికి సంతానం లేదు. గతంలో చీరల దుకాణం ఉండగా కొన్ని నెలల క్రితం మరొక రెడిమేడ్ షాపును ప్రారంభించారు. రెండు షాపుల నిర్వహణ బాధ్యతలను భార్యాభర్తలే చూసుకునేవారు. గతంలో ఇంట్లోనే బట్టల వ్యాపారం చేస్తుండగా ఏడేళ్ల నుంచి కోనేటికాల్వ వీధిలో ఇల్లు బాడుగకు తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. షాపు నిర్వహిస్తున్న ఇంటిపైనే నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు మాత్రం నంగనూరుపల్లెలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. దంపతులిద్దరూ ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజున అహోబిలం వెళ్తుంటారు. ముందు రోజు రాత్రి వెళ్లి దర్శనం ముగించుకొని మరుసటి రోజు రాత్రికి ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో ఈ నెల 21న బైక్‌లో నరసింహులు, నీలిమా అహోబిలం వెళ్లారు. ఇప్పటివరకు ఇంటికి రాకపోవడంతో దుస్తుల కొనుగోలుకు వెళ్లారేమోనని కుటుంబ సభ్యులు భావించారు. ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు అహోబిలం వెళ్తారని గుర్తుకు వచ్చి అక్కడికి వెళ్లి గాలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు రోజులైనా వారి జాడ కనిపించకపోవడంతో గ్రామంలోని బంధువులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: (పెళ్లైన యువకుడి నిర్వాకం.. బిడ్డకు జన్మనిచ్చిన..) ఆర్థిక సమస్యలపైన అనుమానం.. వ్యాపారం కోసం నరసింహులు అనేక మంది వద్ద అప్పు తీసుకున్నట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది. స్వగ్రామంలోనే అప్పులిచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. బాకీలు రూ. కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా రెండు బట్టల షాపులు మూసి ఉండటంతో అప్పులిచ్చిన వారు నంగనూరుపల్లెలోని నరసింహులు ఇంటి వద్దకు వెళ్తున్నారు. వారికి జవాబు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనికి ఆర్థిక సమస్యలు ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ పోలీసులకు తెలిపారు. ఈ కోణంలో పోలీసు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వైఎస్సార్ జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుంది
సాక్షి ప్రతినిధి, కడప: ‘నాన్న చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు వైఎస్సార్ జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. ప్రతి ఇంట్లో ఒక అన్న, తమ్ముడు, కొడుకుగా ఆశీర్వదించారు. ఈ రోజు మీ బిడ్డ ఈ స్థానంలో ఉన్నాడన్నా, ఇవన్నీ చేయగలుగుతున్నాడన్నా.. ఇదంతా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులే’ అని సీఎం జగన్ అన్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆయన ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ప్రొద్దుటూరు రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఏకంగా రూ.200 కోట్లు మంజూరు చేసి.. 22,212 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగామన్నారు. ‘ఇక్కడున్న సమస్యలు, పరిస్థితులు తెలిసిన వ్యక్తిని. ఈ జిల్లాలో ఏం జరిగినా అన్ని రకాలుగా ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను. గత నెలలో అన్నమయ్య సాగర్, పింఛా రిజర్వాయర్లు తెగిపోయి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగింది. ఎంతో బాధనిపించింది. ఈ జిల్లా వాడిగా, మీ బిడ్డగా బరువెక్కిన గుండెతో ఒక్క మాట చెబుతున్నాను. ఆ కుటుంబాలకు చనిపోయిన మనుషులనైతే తెప్పించలేను గానీ, ఆ కుటుంబ సభ్యులలో ఒకడిగా అన్ని రకాలుగా తోడుగా ఉంటానని భరోసా ఇస్తున్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఈ రోజు ఇన్ని మంచి పనులకు శ్రీకారం చుడుతున్నాను. మీ అందరికీ ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. లక్షాధికారులుగా రైతులు ► గోపవరం జాయింట్ ఫార్మింగ్ కో ఆపరేటివ్ సోసైటీ ప్రాజెక్టు భూముల్లో కొంత భాగాన్ని వ్యవసాయ–పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు తీసుకున్నారు. ఇందులో లీజు ద్వారా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ప్రస్తుతం రెండు ఎకరాల వంతున 201 మందికి పట్టాలు అందజేశారు. ► ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న ఎస్సీ రైతులు దేవదాసు, మాతంగి పుట్టి, రవీంద్రబాబు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు పెద్ద పీట వేశారని సంతోషం వ్యక్తం చేశారు. భారీ పరిశ్రమకు సమీపంలో తమకు రెండు ఎకరాలకు పట్టా ఇచ్చి లక్షాధికారులుగా చేస్తున్నారన్నారు. ► ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాష, మంత్రులు గౌతమ్‌రెడ్డి, సురేష్, ధర్మాన కృష్ణదాస్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, శాసన మండలి వైస్ ఛైర్మన్ జకియాఖానం, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. లీజు ద్వారా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్న సీఎం జగన్ -
సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
సాక్షి, కడప సిటీ/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఆయన పర్యటించనున్నారు. జిల్లాలోని గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారని తెలిపారు. అలాగే ప్రొద్దుటూరు, పులివెందులలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. 23వ తేదీ ►ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు ►12.00 – 1.25 గంట వరకు ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అనంతరం బహిరంగ సభ ►మధ్యాహ్నం 2.00 గంటలకు బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని గోపవరం ప్రాజెక్ట్ కాలనీ-1 కు చేరుకుంటారు ►2.15 –2.20 బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్ధాపన ►2.20 – 2.50 గంటలకు మెస్సర్స్ సెంచరీప్లై పరిశ్రమకు శంకుస్థాపన ►3.20 గంటలకు సీకే దిన్నె మండలం కొప్పర్తికి చేరుకోనున్న సీఎం ►3.35 గంటలకు కొప్పర్తి గ్రామంలోని వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చి ప్రారంభం ►3.50 – 4.50 గంటలకు వైఎస్సార్ ఈఎంసీ ఇండస్ట్రియల్ ఎన్క్లేవ్ వద్ద ఏర్పాటుచేసిన స్టాల్స్ ప్రారంభోత్సవం ►సాయంత్రం 5.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస 24వ తేదీ ►ఉదయం 9.05 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు ►ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇడుపులపాయలోని ప్రార్ధనా మందిరానికి చేరుకుని అక్కడ నిర్వహించే ప్రార్ధనల్లో పాల్గొంటారు. ►మధ్యాహ్నం 1.40 గంటలకు పులివెందుల పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్‌కు చేరుకుంటారు ►2.10 – 2.35 మధ్య ఇండస్ట్రియల్ పార్క్‌లో ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్ధాపన ►2.40 –3.25 గంటలకు వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ళ పట్టాల పంపిణీ, బహిరంగ సభలో లబ్ధిదారులతో ముఖాముఖి ►3.35 గంటలకు మార్కెట్ యార్డుకు చేరుకుని వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ►3.55 – 4.05 గంటలకు మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ►4.15 గంటలకు రాణితోపు సమీపంలో ఆక్వా హబ్ ప్రారంభోత్సవం ►సాయంత్రం 5.05 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస 25వ తేదీ ►ఉదయం 9.00 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.20 గంటలకు పులివెందుల చేరుకుంటారు ►9.35 – 10.55 గంటల మధ్య పులివెందుల భాకరాపురం సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొంటారు ►11.00 గంటలకు సీఎస్ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పాటుచేసిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం ►11.35 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని గన్నవరం బయలుదేరుతారు ►12.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం -
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మంది అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2,29,700తో పాటు, కర్ణాటక మద్యం ప్యాకెట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ప్రసాద్‌రావు గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో బెట్టింగ్ నిర్వహించే ప్రాంతాలు, నిర్వాహకుల కదిలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని ఆర్టీపీపీ రోడ్డు, రామేశ్వరం నీళ్ల ట్యాంకు ఆవరణలో పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఏఎస్ఐ ఇబ్రహీంలు సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించి బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మల్లెల వెంకటనారాయణరెడ్డి, కరుమూరు యుగంధర్, అచ్చుకట్ల జిలాన్‌బాషా, తులబండి బాలసుబ్రహ్మణ్యం, మోపూరి శ్రీధర్, బైసాని సుధాకర్, ధర్మవరం దస్తగిరి, పాలెం ఇమాంషా, వెంకటసుబ్బయ్య, శ్రీధర్‌కుమార్, వెంకటసుదర్శన్‌రెడ్డి, మైనగారి నాగేంద్రప్రసాద్ ఉన్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు 4 సెల్ఫోన్లు, 6 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, బెట్టింగ్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ ప్రసాద్‌రావు వివరించారు. -
మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత
-
మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ ఉద్యమ నేత, సాహితీవేత్త డాక్టర్ ఎంవీ రమణారెడ్డి (78) – ఎంవీఆర్ బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన ఏడాదిగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని జీవిస్తున్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం ఆయన్ను కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఉదయం కాలకృత్యాల అనంతరం ఆయనకు గుండెపోటు వచ్చింది. చికిత్స అందిస్తుండగానే కన్ను మూశారు. ఆయనకు భార్య లక్ష్మీకాంతమ్మ, కుమారులు మల్లేల మురళీధర్‌రెడ్డి, మల్లేల రాజారాంరెడ్డి, కుమార్తె కవిత ఉన్నారు. చిన్న కోడలు మల్లేల ఝాన్సీరాణి ప్రస్తుతం ఆప్కాబ్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. సామాజిక, సాహిత్య అంశాలపై వ్యాసకర్తగా, కరపత్ర, కథా రచయితగా, అనువాదకునిగా, విమర్శకునిగా, చరిత్రకారునిగా, పత్రికా నిర్వాహకుడిగా విభిన్న విశిష్టతలు కలిగిన వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు గడించారు. డాక్టర్ నుంచి రాజకీయ నేతగా.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో 1944 ఏప్రిల్ 4న జన్మించిన ఎంవీఆర్ స్థానికంగా ప్రాథమిక విద్య, గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత ఎల్ఎల్బీ చదివారు. ప్రొద్దుటూరులో ప్రగతి క్లినిక్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయికే వైద్య సేవలు అందించారు. ఆంధ్రా కాటన్ మిల్లు కార్మికులకు సేవలు అందిస్తూ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని సిమెంటు కర్మాగారాల్లోని ట్రేడ్ యూనియన్లకు నాయకత్వం వహించారు. రైతు కూలీ ఉద్యమం చేశారు. కొంత కాలం న్యాయవాదిగా పనిచేశారు. 1983లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత పలుమార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సాహిత్య పరిచయం ► 1966లో ‘కవిత’ అనే సాహిత్య మాస పత్రికను ప్రారంభించారు. 1969లో ‘ప్రభంజనం’ అనే రాజకీయ పక్ష పత్రికను ప్రారంభించి, నాలుగేళ్ల పాటు నడిపారు. 1983లో రాయలసీమ కన్నీటి గాథ అనే పుస్తకాన్ని ప్రచురించారు. తెలుగు సినిమా – స్వర్ణయుగం, పురోగమనం, పరిష్కారం, ఆయుధం పట్టని యోధుడు, తెలుగింటికి వచ్చిన ద్రౌపది, చివరకు మిగిలింది, పెద్దపులి ఆత్మకథ, మాటకారి, శంఖారావం, తెలుగింటి వ్యాకరణం తదితర పుస్తకాలు రాశారు. ► చరమాంకంలో అనారోగ్యంగా ఉన్నప్పటికీ మాగ్జిమ్ గోర్కీ ‘మదర్’ నవలను తెలుగులో ‘కడుపు తీపి’ పేరుతో అనువదించారు. టూకీగా ప్రపంచ చరిత్ర పేరుతో నాలుగు సంపుటాలు వెలువరించారు. తన ఆత్మకథను 151 పేజీలు రాసుకున్నారు. ఇది ఇంకా పూర్తవకుండానే తుదిశ్వాస విడిచారు. నేడు తాళ్లమాపురం రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఉదయం డాక్టర్ ఎంవీ రమణారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రాయలసీమ ఉద్యమంలో.. ► 1985 జనవరి 1న ప్రొద్దుటూరు కేంద్రంగా రాయలసీమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన 21 రోజుల తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. ఆ తర్వాతే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వచ్చింది. ► ఎన్టీ రామారావుతో రాయలసీమ సమస్యలపై విభేదించి.. రాయలసీమ విమోచన సమితి స్థాపించారు. 1985 డిసెంబర్ 31 నుంచి 1986 జనవరి 16వ తేదీ వరకు ప్రొద్దుటూరు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకు ‘కరువు యాత్ర’ చేపట్టారు. ► రాయలసీమకు సేద్యపు నీరు కావాలని, సీమ వాటా ఉద్యోగాలివ్వాలని, పరిశ్రమలను స్థాపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా కాటన్ మిల్ కార్మికుల విషయంలో జరిగిన గొడవల్లో ఎంవీఆర్ పలు మార్లు జైలుకు వెళ్లారు. ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవించారు. విప్లవ సాహితీ వేత్తలతో కలిసి పని చేశారు. వివిధ కారణాలతో పలు మార్లు జైలుకెళ్లారు. ► వైఎస్ రాజశేఖరరెడ్డితో ఆనాడు విభేదించినా, రాయలసీమ ఉద్యమ విషయాల్లో కొన్ని వేదికలను పంచుకున్నారు. ఖైదీగా ఉంటూ చేసిన ఆమరణ నిరాహార దీక్ష వల్ల రాష్ట్రంలో జైళ్లలో సంస్కరణలకు కారణమయ్యారు. ► వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి సభ్యుడిగా ఉంటూ పార్టీ విజయం కోసం కృషి చేశారు. గొప్ప మేధావి ఎంవీఆర్ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయితగా, చరిత్రకారునిగా, రాయలసీమ విమోచన సమితి వ్యవస్థాపకునిగా, విరసం వ్యవస్థాపక సభ్యునిగా విభిన్న రంగాల్లో నిష్ణాతునిగా పేరు పొందారని తెలిపారు. ఎంవీఆర్ రాసిన విప్లవాత్మక కవితలు, రాజకీయ వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయని పేర్కొన్నారు. ఆయన గొప్ప మేధావి అంటూ కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
రైతులకు అండగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులోని వైఎస్సార్ విగ్రహం వద్ద బుధవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి, మంత్రి కన్న బాబు, ఎంపీ అవినాష్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభలో.. రైతాంగానికి అండగా నిలుస్తున్నామని నిరూపిస్తూ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి రూ.2 కోట్లతో నియోజకవర్గ రైతులకు 23 ట్రాక్టర్లు పంపిణీ చేశారు. వీటిని 23 రైతు భరోసా కేంద్రాలకు అప్పగించనున్నారు. ఈ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గొప్ప కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి తన నియోజక ప్రజలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం విద్య , వైద్యం , వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో తండ్రికి తగ్గ తనయుడిగా నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారన్నారు. రైతాంగానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని, వారి కోసం డ్రిప్ ఇరిగేషన్ త్వరగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ రాబందులాగా శవాల కోసం ఏడురుచూస్తున్నాడని, రాష్ట్రంలో ఎక్కడ శవం కనిపించినా అక్కడ వాలిపోయి ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నాడంటూ విమర్శించారు. చదవండి: మహిళలు, బాలికల పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం -
కుమార్తెను వేధిస్తున్నాడని.. 9 ఏళ్ల బాలుడి దారుణ హత్య
ప్రొద్దుటూరు క్రైం/రాజుపాళెం : పిల్లలు ఆడుకుంటున్న సమయంలో నెలకొన్న చిన్నపాటి గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పసిపిల్లలే తగవే కదా అని పెద్దలూ సంయమనం పాటించలేదు.. చిలికి చిలికి గాలివానగా మారి రెండు కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. ఫలితంగా బాలిక తండ్రి దస్తగిరి పసి బాలుడు తనీష్‌రెడ్డి(9)ని గొంతు నులిమి దారుణంగా హత మార్చాడు. నిందితుడు సాయదుగాల పెద్ద దస్తగిరిని రాజుపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ప్రసాదరావు అరెస్ట్ వివరాలను రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. రాజుపాళెం మండలం, వెంగళాయపల్లెకు చెందిన గుద్దేటి సంజీవరెడ్డి కుమారురుడు తనీష్‌రెడ్డి ఈ నెల 7న మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. స్థానికంగా, బంధువుల ఊళ్లలో గాలించినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తల్లిదండ్రులు అదే రోజు రాజుపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 9వ తేదీ రాత్రి వెంగళాయపల్లెలోని అంకాలమ్మ గుడి ఎదురుగా ఉన్న కంప చెట్లలో పాడుబడిన రాళ్ల తొట్టిలో బాలుడు శవమై కనిపించాడు. ఐదు బృందాలతో దర్యాప్తు.. తనీష్‌రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలతో ఐదు బృందాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఏర్పాటు చేశారు. అమావాస్య ముందు రోజే బాలుడు కనిపించకుండా పోవడంతో క్షుద్రపూజలు జరిగి ఉంటాయని, నరబలి జరిగి ఉంటుందని మండలంలో ప్రచారం జరిగింది. రెండు డాగ్‌స్క్వాడ్ బృందాలతో సంఘటనా స్థలంలో దర్యాప్తు చేశారు. గ్రామంలోని అనుమానితులందరినీ విచారించారు. దర్యాప్తులో భాగంగా రెండు కుటుంబాల మధ్య నెలకొన్న మనస్పర్థలతో బాలుడు హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. 7వ తేదిన సాయంత్రం తనీష్‌రెడ్డిని దస్తగిరి తన పశువుల పాకలో గొంతు నులిమి చంపాడు. అదే రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత బాలుడి మృతదేహాన్ని అంకాలమ్మ ఆలయం సమీపంలో పడేశాడు. తనీష్‌రెడ్డి, దస్తగిరి కుమార్తె ఇద్దరూ రోజూ ఆడుకునే వారు. ఆడుకునే క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు వచ్చేవి. ఈ విషయమై ఇరువురి పెద్దలు పలుమార్లు గొడవ కూడా పడ్డారు. ఇలా రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు కొంత కాలంగా ఉండేవి. ఎన్నిసార్లు చెప్పినా తనీష్‌రెడ్డిలో మార్పు రాలేదని, తన కుమార్తెను వేధిస్తున్నాడని భావించిన దస్తగిరి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శుక్రవారం నిందితుడ్ని వెంగళాయపల్లెలో రూరల్ సీఐ మధుసూదన్‌గౌడ్, రాజుపాళెం ఎస్ఐ కృష్ణంరాజునాయక్ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. దస్తగిరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వివరించారు. నరబలి కాదు: డీఎస్పీ తన కుమార్తెను వేధించడం వల్లనే తనీష్‌రెడ్డిని దస్తగిరి హత్య చేసినట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. అంతేగానీ మూఢ నమ్మకాల కారణంగా క్షుద్రపూజలు, నరబలి లాంటివి జరగలేదని డీఎస్పీ అన్నారు. సమావేశంలో సీఐ రూరల్ సీఐతో పాటు రాజుపాళెం ఎస్ఐ కృష్ణంరాజునాయక్, చాపాడు ఎస్ఐ సుబ్బారావు, రూరల్ ఎస్ఐలు శివశంకర్, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
సోషల్ యాప్‌లే అతడి అడ్డా: యువతులతో నగ్నంగా..
కడప అర్బన్ : ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ అలియాస్ ప్రశాంతిరెడ్డి, అలియాస్ రాజారెడ్డి, అలియాస్ టోనీ (23) అనే కిలాడీ దొంగను శనివారం సాయంత్రం చౌటపల్లి రోడ్డులో పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. కడప డీఎస్పీ బూడిద సునీల్ ఆదివారం వివరాలు వెల్లడించారు. ప్రసన్నకుమార్ చిన్నవయసులోనే వ్యసనాలకు బానిసయ్యాడు. బీటెక్ మొదటి సంవత్సరంలోనే చదవు మానేశాడు. జల్సాలకు కావాల్సిన డబ్బుల కోసం 2017లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్, చాపాడు సీఎస్ల పరిధిలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు (ఇన్సెట్లో) నిందితుడు ప్రసన్న కుమార్ ప్రసన్నకుమార్‌కు కడప నబీకోటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి షేర్‌చాట్ ద్వారా 2020 డిసెంబర్లో పరిచయం అయ్యాడు. శ్రీనివాసుతో తన పేరు ప్రశాంత్‌రెడ్డి అలియాస్ రాజారెడ్డి అని, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో పనిచేస్తానని, అక్కడ చాలామంది తెలుసునని నమ్మబలికాడు. శ్రీనివాసుకు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని అతని తల్లిని నమ్మించాడు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని, చికిత్స చేయించాలని డబ్బులు కావాలని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆమె బంగారు సరుడు, తాళిబొట్టు అమ్మి డబ్బు ఇచ్చింది. తరువాత ప్రశాంత్‌రెడ్డికి శ్రీనివాస్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. జూలై 29న కడప అక్కాయపల్లెలో ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన తాళం చెవితో ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని సుమారు 30 గ్రాముల బంగారు గాజులు, కమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవి రింగులను దొంగిలించుకుని వెళ్లాడు. ప్రసన్నకుమార్‌ను పోలీసులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అల్లరి, చిల్లరగా తిరిగేవాడు. కడప, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో షేర్‌చాట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను, మధ్య వయసు మహిళలను టార్గెట్ చేసేవాడు. వారితో పరిచయం చేసుకుని ప్రేమలోకి దించి, వారితో అసభ్యకరరీతిలో చాటింగ్ చేసేవాడు. వారికి తెలియకుండా వివస్త్ర రీతిలో ఉన్న ఫోటోలు, వీడియోలను సేవ్ చేసుకుంటాడు. తద్వారా వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి తన గూగుల్‌పే, ఫోన్ పేల ద్వారా డబ్బులను వసూలు చేసేవాడు. మరికొంతమందిని శారీరకంగా కూడా అనుభవించడంతోపాటు వారి నుంచి డబ్బు, బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లి, వాటిని అమ్మి జల్సాగా తిరిగేవాడు. ఈ విధంగా సుమారు 200 మంది అమ్మాయిలు, 100 సంఖ్యలో మహిళలను మోసగించినట్లు తెలిసింది. పరువుకు సంబంధించిన విషయం కావడంతో బాధితులెవరూ కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన కడప తాలూకా సీఐ ఎం. నాగభూషణం, ఎస్ఐలు ఎస్‌కెఎం హుసేన్, బి.రామకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ జి.సుబ్బరాయుడు, కానిస్టేబుళ్లు ఎస్.ఓబులేసు, పులయ్య, ప్రదీప్‌లను డిఎస్పీ సునీల్ అభినందించారు. ఈ సంఘటనలో నిందితుడి నుంచి రూ.1,26,000 నగదును, 30గ్రాముల బరువున్న బంగారుగాజులు, ఒక జతకమ్మలు, రెండు ఉంగరాలు, ఒక చెవిరింగ్, నిందితుడి సెల్ఫోన్లను రికవరీ చేశారు. -
ప్రేమానురాగాలు మరిచి..అయినవారినే హతమార్చి..
నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి అని కూడా చూడలేదు.. తన చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగిన ఒక్కగానొక్క సోదరి పట్ల కనికరం చూపలేదు.. కలిసి పెరిగిన సోదరుడిపై కాస్తంత ప్రేమ చూపించలేదు. సైకో అవతారం ఎత్తిన అతను కన్న తల్లిని.. తోడబుట్టిన చెల్లిని.. తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు. బంధాలను మరచిన అతను క్షణాల వ్యవధిలో ముగ్గురినీ రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ప్రొద్దుటూరులో సోమవారం ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు క్రైం (వైఎస్సార్ జిల్లా): ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న హైదర్‌ఖాన్ వీధిలో గుల్జార్‌బేగం (51), కరీమున్నీసా(27), మహమ్మద్‌రఫి (23) దారుణ హత్యకు గురయ్యారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చాంద్‌బాషా ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్ వీధిలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య గుల్జార్‌బేగం, కరీముల్లా, మహబూబ్‌బాషా, మహమ్మద్‌రఫి అనే కుమారులు, కరీమున్నీసా అనే కుమార్తె ఉన్నారు. అతను బొంగుబజార్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మహ్మద్‌రఫి తండ్రితో పాటు పని చేస్తుండగా మిగతా ఇద్దరూ బీరువాల తయారీ పని చేస్తుంటారు. వీళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మహబూబ్‌బాషా తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిపైనే బాడుగకు ఉంటున్నాడు. కరీముల్లా మాత్రం తల్లిదండ్రుల వద్ద ఉండేవాడు. కుమార్తె కరీమున్నీసాకు భగత్‌సింగ్ కాలనీకి చెందిన రహిముల్లాతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కరీముల్లా కొన్ని రోజుల నుంచి కుటుంబాన్ని పట్టించుకోలేదు. కుటుంబ ఖర్చులకు డబ్బు కూడా సరిగా ఇచ్చేవాడు కాదు. దీంతో తల్లిదండ్రులు అతన్ని పిలిచి మందలించారు. ఈ క్రమంలో ఏడాది క్రితం హైదర్‌ఖాన్ పక్కనే ఉన్న వీధిలో కరీముల్లాతో వేరు కాపురం పెట్టించారు. వారికి ఒక కుమార్తె ఉంది. వేరుకాపురం పెట్టిన నాటి నుంచి గొడవలు మొదలయ్యాయి.ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఒక రోజు భార్యను నిలదీశాడు. ‘మీ వాళ్లు కావాలనే నాపై నిందలు వేస్తున్నారు.. వాళ్లు నీకు చేతబడి చేసి ఉంటారు’ అని చెప్పింది. ఆ రోజు నుంచి తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడుతున్నాడు. అటు భార్యపై అనుమానం, ఇటు తల్లిదండ్రులపై కోపం అతన్ని రాక్షసుడిగా మార్చాయి. నాకు సుఖం లేనప్పుడు మిమ్మల్ని బతకనీయను.. తనకు సుఖం లేనప్పుడు ఇంట్లో ఎవ్వరినీ బతకనీయనని కరీముల్లా ఎప్పుడూ చెప్పేవాడు. అయినా అతని మాటలను కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు.చెప్పినట్లు గానే తల్లి,చెల్లి, తమ్ముడిని హతమార్చాడు. నా కుమారుడ్ని ఉరి తీయండి సార్.. అమ్మను,తమ్ముడిని, చెల్లెల్ని చంపినఆ రాక్షసుడు భూమ్మీద ఉండొద్దు.. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు.. వాడిని ఉరి తీయండి’అంటూ తండ్రి చాంద్‌బాషా రోదించ సాగాడు. నా భార్య ఏ పాపం చేసింది.. కరీమున్నీసా ఆరు నెలల గర్భిణీ. 3 నెలల నుంచి అమ్మగారింట్లోనే ఉంటోంది. 2రోజుల క్రితం భర్త రహీముల్లా అత్తగారింటికి వెళ్లి భార్యను పంపమని అడిగాడు. కొన్ని రోజులుండి పంపుతామని కరిమున్నీసా తల్లిదండ్రులు చెప్పారు. ఇంతలోనే అన్న చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఏ పాపం చేసిందని నా భార్యను చంపాడు.. అంటూ అతను రోదిస్తున్నాడు. చదవండి: మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం సాక్షి ఎఫెక్ట్: అక్రమాల కోటలు కూలుతున్నాయ్.. -
మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అరెస్టు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరు మండలం కామనూరులో వరదరాజులరెడ్డి తన సోదరులు, అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీ నాయకుడు నంద్యాల బాలవరదరాజులరెడ్డి ఇంటిపైకెళ్లి దౌర్జన్యం చేశారు. సెల్‌ఫోన్ లాక్కుని మహిళలను దూషించి భయాందోళనకు గురిచేశారు. నామినేషన్ విత్డడ్రా చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఓటింగ్ ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుతో వరదరాజులరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై వరద కుటుంబీకుల దౌర్జన్యం -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్ స్థావరాలపై దాడులు నిర్వహించి 31 మంది బుకీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.లక్ష నగదు, 6 కిలోల గంజాయి, రెండు కార్లు, 7 ల్యాప్‌టాప్‌లు, 8 కాలిక్యులేటర్లు, రెండు కమ్యూనికేటర్లు, పది బెట్టింగ్ అకౌంట్ పుస్తకాలను స్వాదీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు వినాయక నగర్‌కు చెందిన షేక్ షాహీద్ అక్రమ్, ఖాజామొహిద్దీన్ అలియాస్ కల్తీ, భూమిరెడ్డి సురేష్ రెడ్డి, మునగా రామాంజనేయులు అలియాస్ రాము మరికొంతమంది కలిసి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా గంజాయి కూడా అమ్ముతున్నారు. ప్రస్తుతం అరెస్టైన వారు, పరారీలో ఉన్న ప్రధాన బుకీలు కలిసి సుమారు రూ.34.78 కోట్ల మేర బెట్టింగ్‌లు నిర్వహించినట్టు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలను సేకరించి ఇన్‌కం ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు నివేదిస్తామన్నారు. వీరిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఎస్ఈబీ అదనపు ఎస్పీ చక్రవర్తి, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవప్రసాద్, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావును, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
మాజీ ఎమ్మెల్యే ‘వరద’ కుమారుడు, అల్లుడిపై కేసు
ప్రొద్దుటూరు/హైదరాబాద్: ఒక డిగ్రీ కళాశాల స్థల వివాదానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి, అల్లుడు రామచంద్రారెడ్డితోపాటు మరో 15 మందిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మహిళల విద్య కోసం 1977లో స్థానిక అగస్తేశ్వర స్వామి ఆలయానికి చెందిన 18.18 ఎకరాల భూమిని దేవరశెట్టి ఆదిలక్షుమ్మ మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించారు. నిబంధనల ప్రకారం.. ఈ భూమిని అమ్మకూడదు. అయితే కళాశాల నిర్వాహకులు ఇందులోని 11 ఎకరాలను అమ్మేందుకు మాజీ ముఖ్యమంత్రి సోదరుడొకరు చక్రం తిప్పారు. ఇందులో భాగంగా 2012 మార్చి 30న ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ స్థలం విలువ ప్రస్తుతం ఎకరా రూ.15 కోట్లకుపైగా ఉంది. ఇందులో రెండున్నర ఎకరాల స్థలం మిట్టా శివ గణేశ్‌కు ఉంది. ఇది వివాదంలో ఉండటంతో ఆయన ఇటీవల రామచంద్రారెడ్డిని సంప్రదించాడు. వివాదాన్ని పరిష్కరిస్తే ఎకరం స్థలాన్ని ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే మొత్తం రెండున్నర ఎకరాలు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కొండారెడ్డి, రామచంద్రారెడ్డితోపాటు వారి గన్మెన్లు, అనుచరులు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్న మిట్టా శివగణేశ్‌పై మంగళవారం దాడి చేశారు. చంపేస్తామని బెదిరించి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. ఈ మేరకు శివగణేశ్ వారిపై ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఈ కళాశాల స్థలం అమ్మకంపై స్థానికులు కూడా కోర్టులో కేసు వేశారు. -
మామ ఆత్మహత్య కేసులో అల్లుడు అరెస్ట్
సాక్షి, ప్రొద్దుటూరు: పట్టణంలోని వైఎంఆర్ కాలనీకి చెందిన ధనిరెడ్డి బాబుల్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి అతని అల్లుడు సురేష్‌కుమార్‌రెడ్డిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 7న సాయంత్రం అతను బైపాస్‌రోడ్డులోని ఒక వెంచర్లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి అతని మేనల్లుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక బాబుల్‌రెడ్డి కుమార్తెలు శ్వేత, సాయిప్రీతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రూరల్ సీఐ విశ్వనాథ్‌రెడ్డి, ఎస్ఐ సునీల్‌కుమార్‌రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. తాళ్లమాపురం గ్రామానికి చెందిన సురేష్‌కుమార్‌రెడ్డి ఏడాది కిందట బాబుల్‌రెడ్డి పెద్ద కూతురు శ్వేతను వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మోసం చేయడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలోనే పుట్టింటి నుంచి డబ్బు తీసుకొని రమ్మని భార్యను వేధించేవాడు. అంతేగాక మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని 9 నెలలుగా భార్య శ్వేతను నిత్యం చిత్రహింసలు పెట్టేవాడు. (తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య) కేసు వివరాలను వెల్లడిస్తున్న సీఐ విశ్వనాథ్‌రెడ్డి కూతురు కాపురాన్ని చక్కబెట్టాలని ప్రయత్నం చేసినా.. కుమార్తె శ్వేత కాపురం ఎందుకిలా అయిందని తండ్రి రోజు మదన పడేవాడు. ఆమె కాపురాన్ని చక్కపెట్టేందుకు ఎంత ప్రయతి్నంచినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందేవాడు. ఎన్నిసార్లు పంచాయితీ చేసినా అల్లుడు సురేష్‌కుమార్‌రెడ్డి వినకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఆత్మహత్యకు పాల్పడే కొన్ని నిమిషాల ముందు తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్తోసెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన మరణానికి అల్లుడు సురేష్‌కుమార్‌రెడ్డి కారణమని, జిల్లా ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వేడుకున్నాడు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని సురేష్‌కుమార్‌రెడ్డిని ఖాదర్‌బాద్ సమీపంలో అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు అతన్ని రిమాండుకు పంపిస్తున్నామని వివరించారు. -
తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య
కమలాపురం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ముగ్గురి ప్రాణాల్ని బలి తీసుకుంది. అల్లుడి వేధింపులతో కూతురు పడుతున్న కష్టాలు చూడలేక తండ్రి ఆత్మహత్య చేసుకుంటే, తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఈ విషాద ఘటన జరిగింది. బంధువులు తెలిపిన సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీకి చెందిన డి.బాబుల్‌రెడ్డి (55)కి ఇద్దరు కుమార్తెలు శ్వేత, సాయి ఉన్నారు.పెద్ద కుమార్తె శ్వేతను అదే మండలంలోని తాళ్లమాపురం గ్రామానికి చెందిన సురేష్ కుమార్‌రెడ్డికి ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం చేశారు. శ్వేత, సురేష్‌కుమార్‌రెడ్డిల మధ్య ఆరు నెలల నుంచి వివాదాలు తలెత్తాయి. సురేష్ కుమార్‌రెడ్డి తరచూ వేధించడంతో శ్వేత పుట్టింటికి వచ్చేసింది. అల్లుడి వేధింపులు తట్టుకోలేక, కుమార్తె పడుతున్న బాధలు చూడలేక బాబురెడ్డి తనువు చాలించాలనుకున్నాడు. శుక్రవారం సెల్ఫీ వీడియో తీసుకుని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రిలో తండ్రి మృతదేహాన్ని చూసిన కుమార్తెలు శ్వేత, సాయి తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. శనివారం ఉదయం కమలాపురం మండలం రాయునిపేట, ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు మధ్య రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప రైల్వే పోలీసులు శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
విషాదం: తండ్రి మరణంతో కూతుళ్లు కూడా..
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో ఓ తండ్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. తండ్రి మరణాన్ని తట్టుకోలేని అతని ఇద్దరు కూతుళ్లు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ప్రొద్దుటూరులోని వైఎమ్ఆర్ కాలనీకి చెందిన బాబురెడ్డి.. కుటుంబ సమస్యలు, పెద్ద కూతరైన శ్వేతను భర్త వేదించడాన్ని తట్టుకోలేక సెల్ఫీవీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మరణవార్తను భరించలేని అతని ఇద్దరు కూతుళ్లు శ్వేత, ఇంజనీరింగ్ చదువుతున్న సాయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు - రాణిపేట మధ్యగల రైల్వే ట్రాక్ పైన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదివింది మూడు.. నకిలీ కంపెనీని సృష్టించి) -
కరుణిస్తే.. అరుణోదయం
చిన్న కుటుంబం వారిది.. నిరుపేద కుటుంబమైనా తల్లిదండ్రులు, కుమారుడు ఎంతో సంతోషంగా ఉండేవారు.. తమ రెక్కల కష్టంతోఒక్కగానొక్క బిడ్డ అరుణ్‌కుమార్‌ను చదివిస్తున్నారు.. అతడు డిగ్రీలో చేరడంతో ఇక కష్టాలు తీరడానికి ఎంతో కాలం పట్టదని భావించారు.భవిష్యత్తు బాగుంటుందని, కుమారుడు ప్రయోజకుడవుతాడనే ధైర్యంతో శక్తికి మించి కష్టపడుతున్నారు. అయితే కష్టాలన్నీ కట్టకట్టుకొనిఒక్కసారిగా వచ్చినట్లు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. కుమారుడికి సంబంధించిన గుండె పగిలే విషయం ఒకటి తల్లిదండ్రులకు తెలిసింది.కుమారుడికి రెండు కిడ్నీలు చెడిపోయాయని తెలియడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ప్రొద్దుటూరు :జమ్మలమడుగులోని ఈడిగెపేటకు చెందిన లక్ష్మీనరసమ్మ, చక్రవర్తిల ఒక్కగానొక్క కుమారుడు అరుణ్‌కుమార్. అతను పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం డిగ్రీ చదుతున్నాడు. డిగ్రీ పూర్తి అయితే ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుంటాననే ధైర్యం అతనిలో ఉండేది. కుమారుడికి ఉద్యోగం వస్తే కష్టాలన్నీ గట్టెక్కుతాయని తల్లిదండ్రులు భావించారు. సంతోషం ఆవిరైన రోజు.. మరో రెండు, మూడు రోజుల్లో లాక్డౌన్ విధిస్తారు. అప్పుడే తెలిసింది అరుణ్‌కుమార్‌కు రెండు కిడ్నీలు చెడిపోయాయని. సంతోషంగా ఉన్న ఆ కుటంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కడప పెద్దాసుపత్రికి తీసుకెళ్లగా కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, వెంటనే ఆపరేషన్ నిర్వహించి డయాలసిస్ చేయాలని చెప్పారు. ఆపరేషన్‌కు సుమారు రూ. 4 లక్షలు దాకా ఖర్చు అవుతాయన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయిద్దామనుకుంటే.. ఆపరేషన్ చేయించేందుకు కావలసిన ఆధార్, రేషన్‌కార్డు చూసుకోగా రెండింట్లో పేర్లు వేర్వేరుగా ఉన్నాయి. తెలిసిన వాళ్లకు చూపిస్తే రెండింట్లోనూ పేర్లు ఒకేలా ఉండాలని, వేర్వేరుగా ఉంటే ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు. పేరు సరిచేసుకుందామని ప్రయత్నం చేయగా లాక్డౌన్ కారణంగా మీ సేవా కేంద్రాలన్నీ మూత పడ్డాయి. బిడ్డను బతికించుకునేందుకు బంధువులు, తెలిసిన వాళ్ల వద్ద అప్పు అడిగాడు. అరుణ్‌కుమార్ ధీనస్థితి చూసిన కొందరు డబ్బులిచ్చారు. అపరేషన్‌కు ఇంకొంత డబ్బు తక్కువ రావడంతో తన ఆటోను తాకట్టు పెట్టాడు. మార్చి 31 ఆపరేషన్ అయితే చేయించగలిగారు కానీ అంతటితో వారి కష్టాలు తీరలేదు. అరుణ్‌కుమార్‌కు ఆపరేషన్ చేసినా కిడ్నీలు పనికి రాలేదు. ఇక కిడ్నీలను మార్చడం ఒక్కటే మార్గమని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రుల కిడ్నీలు సరిపోవని చెప్పారు తల్లిదండ్రుల్లో ఒకరి కిడ్నీ అమర్చితే అరుణ్‌కుమార్ మామూలు మనిషి అవుతాడని వైద్యులు చెప్పారు. తండ్రి చక్రవర్తికి గుండె జబ్బు, షుగర్ ఉండటం, తల్లి లక్ష్మినరసమ్మకు థైరాయిడ్ ఉండటంతో సరిపోవన్నారు. దీంతో వేరొకరి కిడ్నీపై ఆధార పడాల్సిన అగత్యం ఏర్పడింది. కిడ్నీ మార్పిడికి సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు కుమారుడికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించేందుకు చక్రవర్తి దంపతులు దేవుడిపైనే భారం వేశారు. దయార్ద్ర హృదయులు సాయం చేస్తే కుమారుడ్ని బతికించుకుంటామని వారు అంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అరుణ్‌కుమార్ ఆపరేషన్‌కు ఆపన్న హస్తం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సాయం చేయాల్సిన వారు 7670859470, 9912944697 సెల్ నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. -
ఆ ఆస్పత్రిలో ఏం జరుగుతోంది?
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఆస్పత్రి.. సిబ్బంది వర్గపోరుకు వేదికైంది. వారు రోగుల ముందే వాగ్వాదం చేసుకుంటూ, గొడవ పడుతున్నారు. ఈ ఘటనలు ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని ఆరోగ్య ఉపకేంద్రంలో చోటుచేసుకుంటున్నాయి. ప్రొద్దుటూరులో ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. అర్బన్ హెల్త్ సెంటర్లు గతంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉండేవి. 2016 నుంచి అపోలో సంస్థకు అప్పగించారు. ఆ రోజు నుంచి ఉద్యోగులందరూ అపోలో కిందనే పని చేస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో డాక్టర్‌తో సహా ఏడుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎన్జీఓల ఆధ్వర్యంలో ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్న సమయంలో.. డీఎంహెచ్ఓకు పూర్తి అజమాయిషీ ఉండేది. ఆస్పత్రులు అపోలో సంస్థ చేతిలోకి వెళ్లాక డీఎంహెచ్ఓ పర్యవేక్షణ కొరవడినట్లు తెలుస్తోంది. కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ప్రతి నెలా ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల మొత్తం నేరుగా అపోలో సంస్థకు వెళ్తున్నాయి. సంస్థ నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడుతున్న కారణంగా అపోలో ఉద్యోగులు డీఎంహెచ్ఓ, ఇతర జిల్లా అధికారులను లెక్క చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా డీఎంహెచ్ఓ పర్యవేక్షణ లోపించినట్లు పలువురు చెబుతున్నారు. ఇదే అదునుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే పలువురు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రంలో పని చేసే సిబ్బందిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడి సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి ఆస్పత్రి వాతావరణాన్ని చెడగొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ గొడవల్లో భాగంగా అక్కడ 8 ఏళ్లుగా పని చేస్తున్న పుష్పావతి అనే ఏఎన్ఎంను ఉన్నట్టుండి బదిలీ చేశారు. అపోలో సంస్థ ఏర్పాటు కంటే ముందు నుంచి ఏఎన్ఎంగా పని చేస్తున్న తనను అన్యాయంగా బదిలీ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె బదిలీకి దారి తీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అన్యాయంగా బదిలీ తనకు జరిగిన అన్యాయం గురించి పుష్పావతి ఆదివారం విలేకరుల వద్ద మొరపెట్టుకుంది. బాధితురాలు తెలిపిన కథనం మేరకు.. పుష్పావతి ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీ అర్బన్ హెల్త్‌సెంటర్‌లో సుమారు 8 ఏళ్ల నుంచి ఏఎన్ఎంగా పని చేస్తోంది. ఆమె క్యారీ తెచ్చుకోవడంతో మధ్యాహ్నం ఆస్పత్రిలోనే భోజనం చేసి, సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నారు. ఉదయం ఆస్పత్రికి వచ్చిన సిబ్బందిలో ఎక్కువ మంది మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తారు. అయితే క్యారీ తెచ్చుకోవడం వల్ల ఏఎన్ఎం పుష్పావతి మధ్యాహ్నం ఆస్పత్రిలోనే ఉంటోంది. మధ్యాహ్న సమయంలో తాను ఆస్పత్రిలో ఉండటం కొందరికి నచ్చడం లేదని ఆమె చెబుతోంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొందరు ఉద్యోగులు బ్యాచ్‌లుగా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించడమే ఇందుకు కారణమని ఆరోపించింది. వాళ్ల బాగోతం ఎక్కడ బయట పడతుందోనని భావించి.. ఎలాగైనా ఇక్కడి నుంచి తనను పంపించాలని పథకం పన్నారని వివరించింది. మూడు రోజుల క్రితం కొందరు సిబ్బంది పక్కన పడేసిన కాలం చెల్లిన మందులను తీసుకొని వచ్చి ఫార్మసీ గదిలో ఉంచారని తెలిపింది. ఎందుకు వాటిని తీసేయలేదని తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా పుష్పావతిని కర్నూలు జిల్లాలోని ఆదోనికి బదిలీ చేస్తూ డీఎం ద్వారకనాథ్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన బదిలీ ఉత్తర్వులు తీసుకొని స్వయంగా ప్రొద్దుటూరు వచ్చారు. 10వ తేదీలోగా ఆదోనిలో రిపోర్టు చేసుకోక పోతే ఉద్యోగం పోతుందని డీఎం తనను హెచ్చరించారని ఆమె తెలిపింది. ఉన్నతాధికారులు ప్రొద్దుటూరుకు వచ్చి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె కోరుతోంది. మీ ఇష్టమొచ్చినట్లు రాసుకోండి ఆస్పత్రిలోని సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు, పుష్పావతిని ఇబ్బంది పెడుతున్న వైనంపై డీఎం ద్వారకనాథ్‌ను విలేకరులు వివరణ కోరగా.. ‘నేను చెప్పేది ఏం లేదు.. మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండి.. నేను ఇక్కడికి వచ్చిన విషయం మీకు ఎవరు చెప్పారు.. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ’ ఆగ్రహంతో ఊగిపోయారు. పుష్పావతికి బదిలీ జరగలేదని ఒక సారి, ఆదోనికి బదిలీ అయిందని, ఆమె బదిలీ ఉత్తర్వులు తీసుకోలేదని మరోసారి చెప్పుకొచ్చారు. -
మద్యం మత్తులో తండ్రి.. రోదిస్తున్న పిల్లలు
వైఎస్ఆర్ జిల్లా,ప్రొద్దుటూరు క్రైం : అతను మద్యం మత్తులో రోడ్డు పక్కన పడిపోయాడు. పక్కనే ఇద్దరు పిల్లలు కూర్చొని ఏడుస్తున్నారు. అసలే ఎండ వేడి ఎక్కువగా ఉంది. మండే ఎండలో తండ్రి పక్కన కూర్చొని పిల్లలు ఏడుస్తున్నా దారిన వెళ్లేవారెవ్వరూ వారిని పట్టించుకోలేదు. అదే సమయంలో దారిలో వెళ్తున్న రూరల్ ఎస్ఐ సునీల్‌రెడ్డి, సిబ్బంది వారి పట్ల ఔదార్యం చాటుకున్నారు. ప్రొద్దుటూరు సమీపంలోని పెద్దశెట్టిపల్లె వద్ద ఉన్న జమ్మలమడుగు రోడ్డులో పడి ఉన్న అతన్ని చూసిన ఎస్ఐ సునీల్‌రెడ్డి వాహనాన్ని ఆపారు. ఏడుస్తున్న పిల్లలతో మాట్లాడగా.. చాపాడు మండలంలోని ఏటూరు నుంచి బైక్‌లో తండ్రితో కలిసి తమ స్వస్థలమైన జమ్మలమడుగుకు శుక్రవారం బయలుదేరామని చెప్పారు. అయితే మార్గం మధ్యలో తమ తండ్రి ఇమ్మానుయేల్ మద్యం తాగాడన్నారు. పెద్దశెట్టిపల్లె గ్రామం దాటగానే అతనికి మత్తు ఎక్కువ కావడంతో అక్కడే పడిపోయాడని పిల్లలు ధనుష్, పునీత్ తెలిపారు. అంబులెన్స్‌కు ఫోన్ చేయగా వారు స్పందించకపోవడంతో ఎస్ఐ తన జీపులో ఇమ్మానుయేల్‌ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏడుస్తున్న పిల్లలకు ధైర్యం చెప్పి, వారికి ఆహారం అందించారు. -
అయ్యో 'పాపం'
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని మిట్టమడి వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు పసి కందు మృతదేహాన్ని పడేసి వెళ్లడం కలకలం సృష్టించింది. వీధిలోని ఒక ప్రైవేట్ పాఠశాల వెనుక వైపున ఖాళీ ప్రదేశంలో బుధవారం ఉదయం ఆడ శిశువు మృతదేహం ఉందని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున గుమి కూడారు. విషయం తెలియడంతో వన్‌టౌన్ పోలీసులు, మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆడపిల్ల అని వదిలించుకోవడానికి ఎవరైనా జీవించి ఉండగానే పసికందును పడేశారా.. లేక మృత శిశువును పారేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీధిలోనూ, చుట్టు పక్కల ప్రాంతాల్లో కాన్పు అయిన మహిళల వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సేకరిస్తున్నారు వారి నివేదిక ఆధారంగా మృత శిశువు ఎవరనేది తెలిసే అవకాశం ఉంది. పసి కందు మృతదేహాన్ని ఖననం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది తీసుకొని వెళ్లారు. -
మాజీ ఎమ్మెల్యేకి చెక్ పెట్టిన టీడీపీ
సాక్షి, ప్రొద్దుటూరు : టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డికి పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఈ పరిస్థితుల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభావం కారణంగా టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించగా ఆ తర్వాత 1, 2 ఏళ్లకు మల్లేల లింగారెడ్డి పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. 2009లో జిల్లాకంతటికీ టీడీపీ శాసనసభ్యునిగా లింగారెడ్డి మాత్రమే ఎన్నికయ్యారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షునిగా, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా పనిచేయగా, ఆయన సతీమణి మల్లేల లక్ష్మీప్రసన్న కూడా మహిళా విభాగంలో కీలక బాధ్యతలు వ్యవహరించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు వచ్చే సమయంలో టీడీపీ ఏదో రకమైన కొత్తమెలిక పెడుతోంది. చాలా ఎన్నికల్లో నామినేషన్లు వేసే వరకు శాసనసభ అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు లేవు. 2014 శాసనసభ ఎన్నికల్లో సైతం అప్పటికప్పుడు పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి టికెట్ ఇవ్వడం, ఓడిపోయిన తర్వాత ఆయనే చాలా రోజుల వరకు ఇన్చార్జిగా ఉండటం జరిగింది. చదవండి: జేసీ బ్రదర్స్ కాళ్లబేరం! స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సమన్వయకర్తగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించడం జరిగింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఈయన పార్టీలో లేరు. 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించారని ప్రచారం ఊపందుకోవడంతో లింగారెడ్డి సోమవారం స్వయంగా సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో కార్యకర్తలకు ప్రచారం చేసుకున్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కేవలం 20 రోజులపాటు ఎన్నికల సమన్వయకర్తగా మాత్రమే పనిచేస్తారని, పార్టీ ఇన్చార్జితో అతనికి సంబంధం లేదని అన్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. -
ఆ సీఐకు రూ.2 లక్షలు ఇవ్వాలట!
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం: ‘స్టేషన్ పరిధిలో ఎంతో మంది మట్కా కంపెనీలు నిర్వహిస్తున్నారు.. అయినా వారిని పోలీసులు పట్టించుకోలేదు.. అయితే మట్కా రాస్తున్నారనే కారణంతో మా పిల్లలను నలుగురిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వారిని కోర్టులో హాజరు పరచకుండా రూ. 2 లక్షలు డబ్బు తీసుకొని రావాలంటూ 15 రోజుల నుంచి సీఐ ఈశ్వరరెడ్డి బెదిరిస్తున్నారు..’ అంటూ మహిళలు ఆదివారం పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. హైదర్‌ఖాన్ వీధి, కేహెచ్‌ఎం స్ట్రీట్‌కు చెందిన షేక్ కరిముల్లా, సర్ఫరాజ్, యర్రబల్లి ఖాజా, గయాజ్ మట్కా రాస్తున్నారనే కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు పట్టుకొని 15 రోజులు అవుతోందని, అయినా కేసు పెట్టకుండా రోజూ స్టేషన్‌కు తిప్పుకుంటున్నారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ వారి కుటుంబ సభ్యులు, వీధిలోని మహిళలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రూ. లక్షలు ఎక్కడి నుంచితెస్తారు..? మట్కా రాయడం తప్పేనని, అయితే కేసు రాసి కోర్టులో హాజరు పరచాల్సిన పోలీసులు తమ అదుపులోనే పెట్టుకున్నారని మహిళలు ఆరోపించారు. స్టేషన్ పరిధిలోనే పెద్ద పెద్ద మట్కా కంపెనీ నిర్వాహకులు ఉన్నారని, వారిని పట్టుకోకుండా రూ. 2 లక్షలు డబ్బు తీసుకొని రావాలని సీఐ ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కూలి, నాలీ చేసుకొని జీవించే యువకులు రూ. లక్షలు ఎలా తెస్తారని వారన్నారు. కోర్టుకు పెట్టమని అడిగితే కేసులో రూ. 1.06 లక్షలు, స్టేషన్‌కు రూ. 1 లక్ష ఇవ్వాలని డిమాండు చేస్తున్నారని తెలిపారు. శనివారం రాత్రి స్టేషన్లో ఉన్న నలుగురికి అన్నం కూడా పెట్టలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో స్థానిక మైనార్టీ నాయకుడు వైఎస్ మహమూద్తో పాటు మరి కొందరు స్టేషన్ వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చిన డీఎస్పీ సుధాకర్‌తో మాట్లాడారు. తర్వాత డీఎస్పీ మహిళలతో మాట్లాడి న్యాయం చేస్తానని చెప్పారు. ఎస్పీ విచారణ ? మట్కా కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన సంఘటనలో ఆరోపణలు రావడం, కేసులోని నిందితుల బంధువులు, మహిళలు పెద్ద ఎత్తున వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళన చేయడాన్ని జిల్లా ఎస్పీ అన్బురాజన్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు స్థానిక పోలీసు అధికారులతో ఎస్పీ మాట్లాడినట్లు తెలుస్తోంది.పోలీసుల అదుపులో ఉన్న నలుగురిని ఆదివారం కడపకు తీసుకొని వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని ఎస్పీ స్వయంగా విచారణ చేసినట్లు తెలిసింది. ఎస్పీ ఎదుట నలుగురు చెప్పే సమాధానంపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ అధికారుల భవితవ్యం ఆధారపడి ఉంది. పోలీసు అధికారులు డబ్బు డిమాండు చేశారని నలుగురు చెబితే మాత్రం కచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయని పోలీసు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేసు నమోదు చేశాం.. కరిముల్లా, సర్ఫరాజ్, యర్రబల్లి ఖాజా, గయాజ్తో పాటు ప్రధాన మట్కా నిర్వాహకుడు ఖదీర్‌పై శనివారం కేసు నమోదు చేశాం. నలుగురి కోసం కుటుంబ సభ్యులు వస్తే జామిన్ ఇచ్చి పంపించాలనుకున్నాం. కానీ ఎవ్వరూ రాలేదు. ఈ లోపే అందరూ స్టేషన్ వద్దకు వచ్చారు. ఇటీవల వైఎస్ మహమూద్‌పై రెండు కేసులు నమోదు చేశాం. అందువల్లనే అతను స్టేషన్ వద్దకు వచ్చి రాద్ధాంతం చేశాడు. డబ్బు ఇవ్వాలని ఎవ్వరినీ డిమాండు చేయలేదు. – ఈశ్వరరెడ్డి, వన్‌టౌన్ సీఐ, ప్రొద్దుటూరు. -
ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు..
సాక్షి, ప్రొద్దుటూరు: చాగలమర్రి సమీపంలోని కడప–కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉప్పలపాడు, ఇడమడక అనే రెండు గ్రామాలు ఉన్నాయి. మధ్యలో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డే రెండు గ్రామాల మధ్య హద్దు. ఎడమ వైపు ఉన్న ఉప్పలపాడు గ్రామం రాజుపాళెం మండల పరిధిలోకి వస్తే.. రోడ్డుకు కుడి వైపు ఉన్న ఇడమడక దువ్వూరు మండల పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామాల్లో ఏదైన సంఘటన జరిగినప్పుడు ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలో తెలియక ప్రజలు నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్ వన్‌టౌన్, టూ టౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలోకి వస్తుంది. అయితే సమీపంలో త్రీ టౌన్ పరిధి కూడా ఉంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధితులు ఎక్కడ ఫిర్యాదు చేయాలనే సందేహాలు గతంలో అనేక సార్లు వ్యక్తం అయ్యాయి. ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లినప్పుడు తమ పరిధిలోకి రాదని పోలీసులు వెనక్కి పంపిన సంఘటనలూ చాలానే ఉన్నాయి. ప్రొద్దుటూరులోని రూరల్ పోలీస్‌స్టేషన్‌ను టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్మించారు. ఇటీవల రూరల్ స్టేషన్ ఆవరణంలో చిన్నశెట్టిపల్లె గ్రామస్తులు ఘర్షణ పడగా టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి రూరల్ స్టేషన్ ముందు విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా ఆ కేసు కూడా టూ టౌన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పట్టణాలు, నగరాల్లో నాలుగైదు పోలీస్స్టేషన్లు ఉంటాయి. చాలా మందికి ఏ ప్రాంతం ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అందుబాటులో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. సంఘటన జరిగిన స్థలం తమ పరిధిలోకి రాదని, మరో స్టేషన్‌కు వెళ్లమని పోలీసు అధికారులు బాధితులను వెనక్కి పంపించిన సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరిగిన కారణంగా నేరగాళ్లు తప్పించుకుపోయే అవకాశాలు లేకపోలేదు. ఈ కారణంగా బాధితులకు సత్వర న్యాయం జరగాలనే ఉద్దేశంతో ‘జీరో ఎఫ్ఐఆర్’ ను నమోదు చేయాలని పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానంతో సంఘటన జరిగిన ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఏ స్టేషన్‌కు వెళ్లైనా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదును తిరస్కరిస్తే చర్యలు.. బాధితులు ఏ స్టేషన్‌కు వెళ్లినా అక్కడి స్టేషన్ అధికారులు ఫిర్యాదు స్వీకరించాల్సించి ఉంటుంది. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారిని ఐపీసీ 166–ఏ సెక్షన్ ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి ఆదేశించి, శాఖాపరమైన చర్యలకు సిఫార్స్ చేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినా ప్రజల రక్షణ కోసం చేయాల్సిందేనని పోలీసు అధికారులు అంటున్నారు. కేసు తీసుకోనని చెప్పడానికి ఏ పోలీస్ అధికారికి హక్కు లేదు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఎప్పటి నుంచో ఉన్నా ప్రభుత్వాలు అమలు చేయలేదు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత డిల్లీ, ముంబై నగరాల్లో మాత్రమే ఈ ‘జీరో ఎఫ్ఐఆర్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. మహిళలు, చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏపీలో తొలిసారిగా జీరో ఎఫ్ఐఆర్ను అందుబాటులోకి తీసుకొని రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘జీరో ఎఫ్ఐఆర్’తో పాటు మహిళలు, చిన్నారులు ఆపదలో ఉన్నప్పుడు 100, 112, 181 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని డీఎస్పీ సుధాకర్ సూచించారు. మహిళల రక్షణ సవాల్‌గా మారింది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా మహిళలు ఫిర్యాదులు ఇవ్వొచ్చని, మహిళా సంరక్షణ కార్యదర్శులు వాటిని పోలీస్‌ష్టేషన్‌కు పంపిస్తారని డీఎస్పీ అంటున్నారు. ‘జీరో ఎఫ్ఐఆర్’ అంటే.. చాలా మంది పోలీసులకు ‘జీరో ఎఫ్ఐఆర్’పై సరైన అవగాహన లేదు. జీరో ఎఫ్ఐఆర్ అంటే.. ఘటన జరిగిన ప్రదేశం ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలియనప్పుడు.. ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం. రాత్రి, పగలు ఎప్పుడైనా ఆపద సమయంలో బాధితులు స్టేషన్‌కు వెళ్లినప్పుడు పరిధితో నిమిత్తం లేకుండా పోలీసు అధికారులు ఫిర్యాదును స్వీకరించాలి. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుడు చెప్పిన విషయం ప్రా«థమికంగా నిర్ధారణ అయితే కేసు నమోదు చేయాలి. సాధారణంగా స్టేషన్‌లోని వరుస సంఖ్యతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అయితే వచ్చిన కేసు తమ స్టేషన్ పరిధిలోకి రాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ‘జీరో’ నంబర్ కేటాయిస్తారు. తర్వాత ఆయా పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశాక అక్కడ ఎఫ్ఐఆర్కు నెంబర్ ఇస్తారు. ఆపద సమయంలో దారిలో కనిపించే స్టేషన్‌కు గానీ, లేదా దగ్గరలో ఉండే స్టేషన్‌కు గానీ బాధితులు వెళ్లడం సహజం. చట్టంలో జీరో ఎఫ్‌ఆర్‌కు వెసులు బాటు ఉన్నా అధికారుల ఉదాసీనత కారణంగా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా నిత్యం ఎంతో మంది బా«ధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై కేసుల నమోదు చేయడంలో ఎలాంటి జాప్యం జరగకూడదనే ప్రభుత్వం ‘జీరో ఎఫ్ఐఆర్’ ను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానంతో స్థానికంగానే గాక రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉన్నా ఆయా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ‘జీరో ఎఫ్ఐఆర్’ కింద కేసు నమోదు చేసుకోమని పోలీసు అధికారులను అడగవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చాం.. స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేశాం. బాధితులు ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదులు తీసుకుంటాం. మహిళలు నిర్భయంగా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. మíßహిళలు, చిన్న పిల్లల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – లోసారి సుధాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ. జీరో ఎఫ్ఐఆర్ కింద ఫిర్యాదు తీసుకోవాల్సిందే.. బాధితుడికి అన్యాయం జరిగితే తాను నివసించే చోటు నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పరిధితో నిమిత్తం లేకుండా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాల్సిందేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ ఇటీవల లోక్‌అదాలత్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సమగ్ర దర్యాప్తు కోసం సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలని తెలిపారు. ఒక బాధితుడు తమ దగ్గరికి ఫిర్యాదు చేసేందుకు రాగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించానన్నారు. తీరా స్టేషన్‌కు వెళితే తమకు సంబంధం లేదని బాధితుడిని పోలీసులు వెనక్కి పంపించినట్లు జిల్లా జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వెంట్‌గా ఎస్ఐ గానీ, సీఐ గానీ ఎక్కడైనా సెక్షన్ 154 సీఆర్పీసీ ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలన్నారు. లేకుంటే 166ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం వారే నిందితులవుతారని స్పష్టం చేశారు. ‘దిశ’ మిస్సింగ్‌పై ఫిర్యాదు తీసుకోని పోలీసులు.. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ మిస్సింగ్ విషయంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా సంఘటనా స్థలం తమ పరిధిలోకి రాదని, మరో స్టేషన్‌కు వెళ్లాలని అక్కడి పోలీసులు చెప్పినట్లు వార్తలు రావడం వివాదాస్పదమైంది. తర్వాత దిశను నలుగురు కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో బాధితుల నుంచి ఏ పోలీస్‌స్టేషన్‌కు మొదట ఫిర్యాదు వస్తే అక్కడే తీసుకోవాలని నిబంధనలు పెట్టారు. ఈ మేరకు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. -
'మహానగరాల కంటే ఇక్కడ బంగారం ధర తక్కువ'
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : బెంగళూరుకు చెందిన రతన్‌సింగ్ అనే బంగారు వ్యాపారి సూట్‌కేసులో సుమారు 2.2 కిలోల బంగారు నగలను ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చాడు. మైదుకూరు రోడ్డులో వెళ్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటపడి పట్టుకున్నారు. పోలీసు అధికారులు ప్రశ్నించగా తన పేరు రతన్‌సింగ్ అని, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినట్లు తెలిపాడు. తరచూ ప్రొద్దుటూరు, కడపలోని దుకాణాల్లో బంగారు నగలను విక్రయిస్తున్నానని చెప్పాడు. బిల్లులు చూపించమని అడగ్గా తెల్లముఖం వేశాడు. పోలీసులు నగలను స్వాధీనం చేసుకున్నారు. నగలను పోలీసులు కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. బంగారం కేసు ఐటీకి అప్పగింత కడప అర్బన్: కడపలో ఈనెల 21న కారులో బయట పడిన బంగారు ఆభరణాల కేసును పోలీసులు ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు. కడప అర్బన్ సీఐ ఎస్‌కెఎం ఆలీ శుక్రవారం ఈ విషయం తెలిపారు. కడప నగరంలో టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కారు వెనుకసీటులో రహస్యంగా బాక్స్‌ను ఏర్పాటు చేసుకుని రూ.3 కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు ఆభరణాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరు పట్టణంలోని మౌనిక జ్యుయెలర్స్ పేరుతో ఉన్న బిల్లులను మాత్రం కారులోని ముగ్గురు వ్యక్తులు చూపించారు. ఆదాయపన్నుకు సంబంధించిన వ్యవహారం కావడంతో బంగారాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు విచారణ బాధ్యతలను తిరుపతిలోని ఆదాయపన్ను శాఖ ఏడీ రాజారావుకు అప్పగించారు. ►కొన్ని రోజుల క్రితం చెన్నై నుంచి సుమారు 3 కిలోల బంగారు నగలను తీసుకు వస్తున్న వారిని ఎర్రగుంట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిల్లులు లేకపోవడంతో కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. ►కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరుకు చెందిన ముకుందరాజన్ అనే వ్యాపారి నుంచి నలుగురు వ్యక్తులు పోలీసు వేషంలో వచ్చి టోకరా వేశారు. రూ.21 లక్షల విలువైన బంగారం దోపిడీ చేశారు. వ్యాపారి కోయంబత్తూరు నుంచి జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రొద్దుటూరుకు బయలుదేరగా పోలీసు దుస్తుల్లో రైలు ఎక్కి వ్యాపారి బ్యాగులను తనిఖీ చేశారు. బంగారు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని రెండు మొబైల్ ఫోన్లు, చేతిలో బంగారు నగల బ్యాగును లాక్కొని వెళ్లారు.. ఇలాంటి ఉదంతాలు ప్రొద్దుటూరు బంగారు వ్యాపారంలో చాలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పసిడి వ్యాపారానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. రాష్ట్రంలో ఎక్కడ బంగారం పట్టుబడ్డా ప్రొద్దుటూరుకు ముడిపడి ఉంటుంది. తులం, రెండు తులాలు కాదు ఎక్కడ బంగారం పట్టుబడ్డా కేజీల్లోనే ఉంటుంది. కడపలో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు(ఫైల్) చెన్నై, కోయంబత్తూరు నుంచి.. గతంలో ప్రొద్దుటూరులోని బంగారు వ్యాపారులు నగలను తయారు చేయాలంటే స్థానికంగా ఉన్న స్వర్ణకారులకు ఇచ్చేవారు. నగలకు కావలసినంత బంగారు వ్యాపారులే ఇచ్చి కోరిన డిజైన్లు చేయించుకునే వారు. స్థానికంగా వ్యాపారాలు బాగుండటంతో స్వర్ణకారులు కూడా పెద్ద ఎత్తున వెలిశారు. 10 ఏళ్ల నుంచి పరిస్థితి మారిపోయింది. ప్రొద్దుటూరు మార్కెట్లోకి చెన్నై, సేలం, కోయంబత్తూరు, ముంబైకి చెందిన వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. ఇక్కడి వ్యాపారులతో సంబంధాలు ఏర్పరచుకొని నగల తయారీకి ఆర్డర్లు తీసుకెళ్లడం ప్రారంభించారు. దీంతో స్థానికంగా స్వర్ణకారులకు పూర్తిగా పని తగ్గిపోయింది. బంగారు వ్యాపారులకు కావలసిన నగల మోడళ్లను వాట్సప్ ద్వారా పంపించి కిలోల్లో నగలను తెప్పించుకుంటున్నారు. వీళ్లు తెచ్చే బంగారానికి బిల్లులు లేకపోవడంతో ఆన్లైన్ ధర కంటే తక్కువకే ప్రొద్దుటూరులో విక్రయిస్తుంటారు. కొంత సరుక్కే బిల్లులు ఇతర రాష్ట్రాల నుంచి ప్రొద్దుటూరు, కడపకు వారంలో రెండు రోజులు బంగారు వస్తుంటుంది. వీరు నిత్యం ఒకే మార్గంలో కాకుండా రైలు, బస్సుల్లో, కార్లలో వస్తుంటారు. వ్యాపారులు ఎప్పుడు జిల్లాకు వచ్చినా మూడు నాలుగు కిలోలకు మించి బంగారంతో వస్తారు. మరీ ఆర్డర్లు ఎక్కువైతే ఇద్దరు వ్యాపారులు కలిసి వేరు వేరుగా వస్తారు. వీరి వద్ద సగం బంగారానికి సరిపడా బిల్లులు మాత్రమే ఉంటాయి. పోలీసులకు పట్టుబడితే సురక్షితంగా బయట పడేందుకు ముందుగానే స్థానిక వ్యాపారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు. పట్టుబడిన వెంటనే ఆలస్యం కాకుండా సేల్స్ ట్యాక్స్ అధికారులకు బంగారాన్ని అప్పగించేలా వ్యవహారం నడిపిస్తారు. ఉన్న బిల్లులతో పాటు స్థానికంగా ఉన్న వ్యాపారుల నుంచి మిగతా బంగారానికి సరిపడా బిల్లులు తెప్పించుకుంటారు. ఇలా పట్టుబడినప్పుడు ఆ బంగారం తమదే అని ..ఇక్కడి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే కొందరు వ్యాపారాలు ఆ భారాన్ని తమపై వేసుకుంటారు. ఇలా బయటి రాష్ట్రాల వ్యాపారులు ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా సురక్షితంగా తప్పించుకుంటున్నారు. అధికారులకూ తెలుసు! పెద్ద ఎత్తున బంగారం పట్టుబడినప్పుడు ఎలా బయట పడాలనే చిట్కాలను కొందరు అధికారులు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమ, గురువారాల్లో ఎక్కువగా బయటి రాష్ట్రాల వ్యాపారులు ప్రొద్దుటూరుకు వస్తుంటారు. నగలను డెలివరీ చేసి, ఒకటి, రెండు రోజుల పాటు జిల్లాలోనే మకాం వేసి తిరిగి ఆర్డర్లు తీసుకొని వెళ్తుంటారు. బిల్లులు లేకుండా విక్రయాలు చేస్తుండటంతో ముంబై, హైదరాబాద్ తదితర మహానగరాల కంటే ప్రొద్దుటూరులో బంగారం తక్కువ ధరకు దొరుకుతుంది. ప్రొద్దుటూరు, కడపలో అన్ని రకాలుగా అనుమతులు పొంది దుకాణాలు నిర్వహించుకునే వ్యాపారులు చాలా మంది ఉన్నారు. కొందరు పెద్ద మొత్తంలో బంగారు కొనుగోలు చేస్తున్న ప్రజలు పాన్, ఆధార్ కార్డులు లేకుండా కావాలని అడుగుతుండటంతో బిల్లుల్లో చూపని బంగారును వారికి విక్రయిస్తున్నారు. బిల్లులు లేకుంటే రేటు తగ్గుతుందనే ఉద్దేశంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల సకాలంలో ట్యాక్స్ చెల్లించే వ్యాపారులు ధరలు తగ్గించలేక ఇబ్బందులు పడుతున్నారు. సౌదీ అరేబియా, కువైట్ నుంచి కూడా.. సౌదీ అరేబియా, కువైట్ల నుంచి ప్రొద్దుటూరుకు బంగారు బిస్కెట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా కొందరు వ్యాపారులకు అక్కడి వారితో సంబంధాలు ఉన్నాయి. వీరు తరచు బంగారు బిస్కెట్లను పంపుతున్నట్లు సమాచారం. పెద్ద పెద్ద విమానాశ్రయాల్లో తనిఖీలు ఎక్కువగా ఉంటాయని చెన్నై లాంటి ఎయిర్‌పోర్టుల ద్వారా పంపిస్తున్నారు. జీవనోపాధి కోసం వెళ్లి ఇండియాకు వస్తున్న జిల్లా వాసుల ద్వారా కూడా బంగారాన్ని పంపిస్తున్నారు. వారు చెన్నై విమానాశ్రయాల్లో దిగగానే అక్కడే ఉన్న వ్యాపారులు బంగారం తీసుకుంటున్నారు. ఇందుకు గాను వారికి కమీషన్ కూడా ఇస్తున్నారు. ఇలా కూడా ప్రొద్దుటూరుకు పెద్ద ఎత్తున బంగారు వస్తోంది. -
షార్ట్ సర్క్యూట్‌తో పేలిన టీవీ
ప్రొద్దుటూరు క్రైం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టీవీ పేలిన సంఘటనలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో వీధిలోని ప్రజలు సాయం చేసేందుకు గుమిగూడారు. అదే సమయంలో పెద్ద శబ్ధంతో టీవీ పేలడంతో శకలాలు బయటికి దూసుకొని వచ్చి మీద పడ్డాయి. నిప్పు కనికల్లా ఉన్న శకలాలు మీద పడటంతో శరీరం కాలి ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన ప్రొద్దుటూరులోని వసంతపేటలో గురువారం జరి గింది. వీఆర్ఏ జయరాజ్ వసంతపేటలో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య మరియమ్మ రెండు రోజుల క్రితం అనంతపురం వెళ్లి గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. జయరాజ్ విధులకు వెళ్లడంతో ఆమె ఒక్కరే ఇంట్లో ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత విద్యుత్ వైర్లలో నుంచి పొగలు వ్యాపించడంతో ఇళ్లంతా పొగ కమ్ముకుంది. పొగ నిండుకొని ఊపిరాడకపోవడంతో ఆమె సొమ్మ సిల్లి పడిపోయింది. ఇంటి నుంచి పొగ రావడంతో వీధిలోని యువకులు ఇంట్లోకి వెళ్లిఆమెను బయటికి ఎత్తుకొని రాగా, ఇంకొందరు గ్యాస్ సిలిండర్‌ను తీసుకొని వచ్చారు. అప్పటికే పొగ ఎక్కువ కావడంతో లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. పెద్ద శబ్ధంతో పేలిన టీవీ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని తెలుసుకున్న స్థానికులు ద్ద ఎత్తున జయరాజ్ ఇంటి వద్దకు వచ్చారు. మహిళలు, చిన్న పిల్లలతో ఇంటి పరిసరాలు నిండిపోయాయి. కొద్ది సేపటి తర్వాత టీవీ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. పేలిన టీవీ భాగాలు బయటికి వచ్చి పడటంతో స్మైలీ (7), షాహిరా (6), ముబారక్ (10) అనే చిన్నారులతో పాటు పవన్‌కుమార్, రాధిక, మహబూబ్‌చాన్, గాంధీ, సందీప్‌లు గాయపడ్డారు. గాయడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి, పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. పవన్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనికి జిల్లా ఆస్పత్రిలోని బర్నింగ్ వార్డులో చికిత్సను అందిస్తున్నారు. ఊటుకూరు వీరయ్య బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పవన్‌కుమార్ భోజనానికి ఇంటికి వస్తున్న సమమంలో ఈ ప్రమాదం జరిగింది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా..తల్లీ ఇద్దరు కుమార్తెలకు గాయాలు వసంతపేటలో నివస్తున్న మహబూబ్‌చాన్ కుమార్తెలు ముబారక్, షాహిరాలు సమీపంలోని మున్సిపల్ పాఠశాలలో 1, 5వ తరగతి చదువుతున్నారు. భోజన విరామ సమయంలో ఆమె కుమార్తెలను ఇద్దరిని ఇంటికి పిలుచుకొని వస్తూ దారిలో అగ్నిప్రమాదం జరిగిన జయరాజ్ ఇంటి వద్ద ఆగారు. అదే సమయంలో టీవీ పేలిన సంఘటనలో ఆమెతో పాటు పిల్లలిద్దరికి గాయాలు అయ్యాయి. తల్లీ, కుమార్తెలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జయరాజ్ ఉన్న ఇంటిపై రాధిక కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో నుంచి పొగ రావడంతో మొదటి అంతస్తులో ఉన్న రాధిక, కుమార్తె స్మైలీని తీసుకొని కిందికి వెళ్లారు. ఆమె కిందికి వెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఈ సంఘటన జరిగింది. తల్లీ కూతుళ్లకు గాయాలు కావడంతో హోమస్‌పేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. శరీరం కాలడంతో చిన్నారి స్మైలీ విలపించసాగింది. బుగ్గిపాలైన సామగ్రి: అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంట్లోసామగ్రి పూర్తిగా కాలిపోయింది. టీవీతో పాటు ఫ్రిజ్, స్టీల్ సామగ్రి, బట్టలు, బీరువాలో ఉన్న రూ. 30 వేలు నగదు కాలి బూడిదయ్యాయి. ఏ ఒక్క వస్తువు మిగల్లేదు. కుటుంబ సభ్యులంతా కట్టుబట్టలతో మిగిలారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఈశ్వరరెడ్డి తెలిపారు. -
పోలీసుల వేధింపులతో దంపతుల ఆత్మహత్యాయత్నం
సాక్షి, వైఎస్సార్ జిల్లా : విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ ఎదుటే ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. ప్రొద్దుటూరు ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాసులు రెడ్డి అనే చీటీ ఏజెంట్ ప్రజలను మోసం చేసి పారిపోయాడు. ఆచూకీ చెప్పాలని అతని స్నేహితుడైన మురళిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఈ నేపథ్యంలో తనకు ఏ సమాచారం తెలియదని చెప్తున్నా నాలుగు రోజులుగా పోలీసులు వినిపించుకోవట్లేదని బాధితుడు ఆవేదనకు గురయ్యాడు. పోలీసుల తీరుతో విసిగిపోయిన మురళి దంపతులు శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో స్పందించిన పోలీసులు దంపతులను చికిత్స కోసం హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
కాటేస్తున్నాయి..
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : వైరల్ జ్వరాలు పిల్లలను కాటేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో చాపకింద నీరులా దాడి చేస్తున్నాయి. ఒక సీజన్ నుంచి మరో సీజన్లోకి ప్రవేశించే ముందు ఇన్ఫెక్షన్లు సులభంగా దాడి చేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్ వ్యాప్తికి అనుకూలమైంది. ఈ సీజన్లో ప్రతి 10 మందిలో ఒకరికి జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. ఎక్కువ మందిని బాధించే వైరల్ ఇన్ఫెక్షన్లలో ఫ్లూ జ్వరం ఒకటి. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న పిల్లల్లో ఎక్కువగా .. ఎక్కువమంది చిన్న పిల్లలు జ్వరాలు, దగ్గు, జలుబుతో బాధ పడుతున్నారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రితో పాటు జ్వర పీడితులతో ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కొందరు పిల్లల్లో డెంగ్యూ పాజిటివ్ లక్షణాలు కనబడడంతో కర్నూలు, తిరుపతి ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఒకటి, రెండు డెంగ్యూ కేసులు బయటపడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో రోజుకు 150 మందికి పైగా పిల్లలు ఓపీలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో సుమారు 50 మందికి పైగా చిన్నారులు వైద్యం తీసుకుంటున్నారు. ఎక్కువ మంది చేరడంతో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్త్రీ, పురుషుల జనరల్ వార్డులు కూడా జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే టోకెన్ కూడా దొరకడం కష్టంగా మారింది. ఉదయం టోకెన్ తీసుకుంటే రాత్రికి గాని వైద్యుడి వద్దకు వెళ్లడానికి అవకాశం దొరకడం లేదు. ఎలా వస్తాయంటే.. వైరల్ ఫీవర్ గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. వైరల్ జ్వరాలకు మరో కారణం కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రక్తనాళాలు కుచించుపోతాయి. దాని వల్ల రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్లు, జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఎక్కువ మంది గుమికూడి ఉండే చోట్లలో వైరల్ వ్యాప్తి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందుకే పిల్లల్లో జ్వరాలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అదే విధంగా రద్దీగా ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు కూడా ఫ్లూ జ్వరం బారిన పడే అవకాశం ఉంది. లక్షణాలు ఇవీ.. వైరల్ జ్వరాల బారిన పడిన వారిలో ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరం నిస్పత్తువ, తలనొప్పి ఉంటాయి. ఆహారం తీసుకోకపోవడం, గొం తునొప్పి, ముక్కులో నీళ్లు కారడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్రమంగా వ్యాయామం చేసేవారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. చాలా వరకు వైరల్ జ్వరాలు వాటికవే 5 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ జ్వరం వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలి. ♦ జ్వరంతో పాటు తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, ఒంటి నొప్పులు, తీవ్రమైన నీరసం ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ♦ పిల్లలతో పాటు పెద్దలు కూడా కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ♦ పిల్లలను ఐస్‌క్రీమ్‌లకు దూరంగా పెట్టాలి. ♦ వాతావరణం చల్లగా ఉంటుంది కావున పిల్లలకు రాత్రి వేళల్లో వెచ్చదనం కోసం దుప్పటి కప్పి నిద్రపుచ్చాలి. ♦ ఆకాశం మేఘావృతం అయినప్పుడు, వాతావరణం చల్లగా ఉన్న సమయంలో పిల్లలను బయటకు పంపరాదు. ♦ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి వాతావరణంలో మార్పుల కారణంగా చిన్న పిల్లల్లో వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరాలతో రోజు ఆస్పత్రికి 150 మందికి పైగా చిన్నారులు వస్తున్నారు. పిల్లలను చల్లని వాతావరణంలో తిప్పకూడదు. రాత్రి వేళల్లో దుప్పటి కప్పి పడుకోబెట్టాలి. జ్వరం వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలి.– డాక్టర్ డేవిడ్ సెల్వన్‌రాజ్, ఆర్ఎంఓ,చిన్నపిల్లల వైద్యుడు. ప్రొద్దుటూరు -
ప్రొద్దుటూరులో భారీ వర్షం,ముగ్గురు గల్లంతు
-
అన్నా.. ఎంత అవినీతి!
సాక్షి, ప్రొద్దుటూరు టౌన్ : అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం దోపిడీకి తెరలేపింది. తమకు నచ్చిన సంస్థకు కాంట్రాక్టును అప్పగించి నిర్మాణ వ్యయాన్ని ఎవ్వరూ ఊహించనంతగా పెంచి రేకుల షెడ్డుకు పైన పీఓబీ, చుట్టూ అద్దాలు, ఏర్పాటు చేసి ఒక్కో క్యాంటీన్‌కు రూ.40 లక్షలు ప్రజాధనాన్ని దోచి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం అమ్మా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం టీడీపీ ప్రభుత్వంలోని నాయకులు చూసి వచ్చి నాలుగేళ్ల వరకు వాటి జోలికి వెళ్లలేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు పేదలు గుర్తుకొచ్చారు. తయారు చేసి తీసుకొచ్చిన అన్నం పెట్టేందుకు రూ.లక్ష ఖర్చు చేస్తే షెడ్ నిర్మాణం పూర్తవుతుంది. కానీ టీడీపీ నేత కనుసన్నుల్లో ఉన్న నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి అన్న క్యాంటీన్ల నిర్మాణాలను అప్పగించింది. ఇలా టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతికి తెరలేపింది. రూ.38.65 లక్షలు ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి ఖర్చుచేసేందుకు తీర్మానం చేసింది. అది నాలుగైదు నెలల్లో ఎన్నికలు వస్తాయన్న వినికిడి నేపథ్యంలో జిల్లాలో 11 క్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అన్న క్యాంటీన్ నిర్మాణానికి వినియోగించిన ఇనుప దంతెలు, పైన పటారం, లోన లోటారంలా తయారు చేసిన అన్న క్యాంటీన్ ఇనుప దంతెలపై రేకుల షెడ్డు నిర్మాణం ఇనుప దంతెలపై రేకులు పరిచి క్యాంటీన్లు నిర్మించారు.సెంటున్నర్ర లోపు స్థలంలో చుట్టూ రంగు రంగుల రేకులతో తీర్చి దిద్దారు. చుట్టూ అద్దాలు వేసి అనవసర ఖర్చుకు పూనుకున్నారు. సిమెంట్ స్లాబ్‌తో భారీ భవనం నిర్మించేంత డబ్బులు కాంట్రాక్టర్ తీసుకొని రేకుల షెడ్డుకు పీఓబీ ఏర్పాటు చేసి సగానికి పైగా డబ్బు కాజేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రమైన కడప కార్పొరేషన్లో పాత మున్సిపల్ కార్యాలయం, జెడ్పీ కార్యాలయ ఆవరణం, పాత బస్టాండ్లలో, ప్రొద్దుటూరు, రాయచోటి తదితర మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లు పూర్తయ్యాయి. స్థలాలు లేని ప్రాంతాల్లో అద్దెకు తీసుకుని అక్కడ స్థల యజమానుల నియమాలకు తలొగ్గి నిర్మిస్తే చివరకు అవి వారికే సొంతం అయ్యేలా నిబంధనలు టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. నిలుచుని భోజనం చేసేందుకు ఇంత వ్యయం ఖర్చు చేయాలా అని ప్రజలు ప్రశ్నించినా పట్టించుకోకపోవడం గమనార్హం. అన్న క్యాంటీన్లకు విద్యుత్, వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీల నుంచి రూ.2లక్షలు ఖర్చు చేశారు. జిల్లాలో 11 క్యాంటీన్ల నిర్మాణానికి మొత్తం రూ.425.15 లక్షలు ఖర్చు పెట్టేందుకు అంచనాలు సిద్ధం చేశారు. అయితే ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగులో తదితర మున్సిపాలిటీల్లో వీటిని ప్రారంభించారు. ఏది ఏమైనా టీడీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. -
ఇరిగేషన్ అధికారిపై ఏసీబీ దాడులు.. భారీగా ఆస్తులు!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నీటిపారుదలశాఖలో ఏఈఈగా పనిచేస్తున్న పల్లా సుబ్బయ్య ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. సుమారు రూ. రెండుకోట్ల విలువైన స్థలాల పత్రాలను, 560 గ్రాముల బంగారాన్ని, రూ. లక్ష నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మైలవరం ఇరిగేషన్ కార్యాయలంలో ఏఈఈగా పల్లా సుబ్బయ్య విధులు నిర్వర్తిస్తున్నారు. -
పాపం అంజలికి స్థూలకాయం
సాక్షి, కడప : అంజలి పేరు విని అమ్మాయి అనుకునేరు. అంజలి అంటే కోతిపేరు. ఆ కథ ఏంటో తెలుసుకుందాం... పెద్దశెట్టిపల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి, సుబ్బలక్షుమ్మలకు సంతానం లేదు. చిన్న తనంలో తన ఇంటి పరిసరాల్లో వచ్చిన కోతిని మచ్చిక చేసుకున్నారు. కోతికి అంజలి అని ముద్దుగా పేరు పెట్టారు. దీంతో వారికి కోతితో అనుంబంధం ఏర్పడింది. కోతికి ప్రత్యేకంగా డ్రెస్ కుట్టించడంతోపాటు ఇంటిలోనే ఆహార పానీయాలు పెడుతూ పోషిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి అలాగే పోషిస్తుండగా ప్రస్తుతం కోతికి స్థూలకాయం ఏర్పడింది. 14 కిలోల బరువు ఉంది. దీంతో నడవడానికి అంజలి ఇబ్బంది పడుతోంది. వైద్య చికిత్స నిమిత్తం సోమవారం గోపవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ పశువైద్య కళాశాల ప్రాంగణంలో ఉన్న వైద్యశాలకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన అనంతరం పశువైద్య నిపుణుడు అన్నం పెట్టకుండా కేవలం జొన్న, రాగులతో తయారు చేసిన వంటకాలను మాత్రమే పెట్టాలని సూచించారు. పశువైద్య కళాశాల విద్యార్థులు ఆశ్చర్యంతో శివారెడ్డిని కోతి గురించి అడిగి తెలుసుకున్నారు. -
‘ఆ డీఎస్పీ అవినీతిపై విచారణ చేస్తే ఆధారాలు చూపిస్తా’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. ఆయన అవినీతిపై అధికారులు విచారణ చేస్తే ఆధారాలు చూపిస్తానని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అండతో డీఎస్పీ శ్రీనివాసరావు రూ. రెండు కోట్ల మేర అవినీతి సొమ్ము సంపాదించారని ఆరోపించారు. డీఎస్పీపై గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్నారు. వారం రోజుల్లో శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, ప్రొద్దుటూరు: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపన్ను శాఖ సోదాలు కలకలం రేపాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు బుధవారం దాడి చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టా నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్టా పోటీ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్ ఏ1 కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఐటీ దాడులతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సీఎం రమేశ్ వాగ్వాదం పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్కడికి దూసుకొచ్చారు. ఐటీ అధికారులతో దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగారు. సీఎం రమేశ్ వ్యవహారశైలిపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు మాటలన్నీ నీటి మూటలే: చేనేత కార్మికులు
చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కుప్పలు తెప్పలుగా హామీల వర్షం కురిపించి.. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తకపోవడంతో చేనేతల బతుకులు అతుకు.. మెతుకు కరువై దుర్భరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మోసాన్ని తలుచుకుని నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. సాక్షి, ప్రొద్దుటూరు : జిల్లాలో సుమారు 30 వేల కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాం నుంచి ఆనవాయితీగా ఎక్కువ శాతం మంది టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం చేనేత కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. స్వయంగా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలు సైతం ప్రభుత్వం అమలు చేయలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014 మే 4న ప్రొద్దుటూరు పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్లో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. చేనేత ఐక్యవేదిక కన్వీనర్ అవ్వారు ప్రసాద్ చేనేత కార్మికులకు వర్క్‌షెడ్‌తో కూడిన ఇళ్లు మంజూరు చేయాలని కోరగా అందుకు ఆయన అంగీకారం తెలిపారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అపెరల్ పార్కు కోసం కేటాయించిన 76.16 ఎకరాల స్థలాన్ని బదలాయించి మున్సిపల్ అధికారులు ఇళ్ల నిర్మాణానికి కేటాయించారు. చేనేత కార్మికుల కోసం కేటాయించిన స్థలాన్ని ఇతరులకు ఎలా ఇస్తారని నేతన్నలు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ హామీలు గుర్తున్నాయా బాబూ..! చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు : ఎంతో మంది చేనేతలు గుర్తింపు కార్డులు లేక అవస్థలు పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 22,142 మంది చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ : అసలు రుణాలే ఇవ్వలేదు. సొసైటీలకు మాత్రమే ఇచ్చారు. లబ్ధి పొందింది సొసైటీ నిర్వాహకులే. చేనేత కార్మికుల పిల్లలను చదివించేందుకు ప్రత్యేక ప్యాకేజీ, ఉచిత వైద్యం : అసలు అమలు కాలేదు. రూ.లక్షా 50వేలతో ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు ఏర్పాటు : చేనేత కార్మికులకు ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణం జరగలేదు. అసలు వర్క్‌షెడ్‌తో కూడిన ఇళ్లు ఏర్పాటు చేయలేదు. ఒక్కొక్క చేనేత కుటుంబానికి రూ.లక్ష మేరకు సంస్థాగత రుణం : అమలుకు నోచుకోలేదు. చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు : రుణాల ఊసే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు : జిల్లాలో అమలు కాలేదు. ఉచిత ఆరోగ్య బీమా : గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐసీఐసీఐ లాంబార్డు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో 2005 నుంచి అమలు చేసిన ఆరోగ్య పథకం 2014 సెప్టెంబర్ 30తో ముగిసింది. తిరిగి ఈ పథకాన్ని అమలు చేయలేదు. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి ముడిసరుకులను సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలను జిల్లా, డివిజన్ కేంద్రాల్లో అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాం. : ఈ విధానం అమలుకు నోచుకోలేదు. జిల్లాకు ఒక చేనేత పార్కును ఏర్పాటు చేసి కార్మికులకు శిక్షణ, ఉపాధి : చేనేత పార్కు ఏర్పాటు చేయకపోగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ప్రొద్దుటూరులోని అపెరల్ పార్కు, మైలవరంలోని టెక్స్టైల్ పార్కు ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. సగం ధరకే జనతా వస్తాలు: జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ : గత ఐదేళ్లలో ఈ పథకం ఊసే లేదు. మగ్గాలకు ఉచిత విద్యుత్ : నేటికీ అమలుకు నోచుకోలేదు. విద్యుత్ చార్జీల భారంతో చేనేతలు అవస్థలు పడుతున్నారు. చేనేత ఉత్పత్తులపై ఆఫ్ సీజన్ సమయాల్లో రుణ సదుపాయం కల్పించి గిట్టుబాటు ధర వచ్చేదాకా వాటిని నిల్వ ఉంచుకునే అవకాశం కల్పించడం. : ఈ పథకం అమలుకు నోచుకోలేదు. చేనేత పరిశ్రమల ఆధునికీకరణకు ప్రత్యేక విభాగం : ఏర్పాటు కాలేదు. -
ప్రొద్దుటూరులో టెన్త్ విద్యార్థినిపై దారుణం
ప్రొద్దుటూరు క్రైం: పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థి.. మరో విద్యార్థితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరంపై స్కూల్ యాజమాన్యం వద్ద బాలిక మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. బాలికకు ధైర్యం చెప్పాల్సిన పాఠశాల కరస్పాండెంట్.. మరింత బెదిరించడంతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రొద్దుటూరులో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. ఎర్రగుంట్ల మండలానికి చెందిన బాలిక ప్రొద్దుటూరు నేతాజీనగర్‌లోని ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఈ నెల 24వ తేదీన బాలిక హాస్టల్ గదిలో ఉండగా అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలుడు, ఏడాది కిందట ఆ పాఠశాలలో పదో తరగతి చదివిన మరో బాలుడు కలిసి బాలికను హాస్టల్ పైఅంతస్తులోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. భయంతో వణికిపోయిన బాలిక జరిగిన ఘటన గురించి స్కూల్ కరస్పాండెంట్‌కు చెప్పింది. బాలికకు ధైర్యం చెప్పి ఓదార్చాల్సిన ఆయన.. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానని.. టెన్త్ క్లాస్ ఫెయిల్ చేయిస్తానంటూ బాలికనే బెదిరించాడు. దీంతో తీవ్ర అవమానభారంతో ఆ బాలిక 25వ తేదీన పాఠశాల మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలు జారిపడినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ పాఠశాల మైదానంలో అపస్మారక స్థితిలో పడిఉన్న బాలికను స్కూల్ యాజమాన్యం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. ‘మీ పాప స్కూల్ భవనంపై నుంచి కాలు జారి కింద పడింద’ని స్కూల్ యాజమాన్యం బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. వారు వచ్చేలోపే.. పరిస్థితి విషమించిందని, కర్నూలు ఆస్పత్రికి తరలించాలని బాలికను అంబులెన్స్‌లో ఎక్కించారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక 27 సాయంత్రం స్పృహలోకొచ్చింది. బాలికకు నడుము, కాళ్లు పూర్తిగా విరిగిపోయాయని వైద్యులు చెప్పారు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తన చిన్నమ్మకు వివరించింది. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లేందుకు బాలిక కుటుంబ సభ్యులు ప్రయత్నించగా అక్కడ కాపలాగా ఉన్న స్కూల్ యాజమాన్యం మనుషులు వారిని అడ్డుకుని బెదిరించారు. ఈ క్రమంలో తిరుపతి ఆస్పత్రికి వెళ్తున్నామని చెప్పి బాలికను గురువారం సాయంత్రం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి.. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ రామలింగమయ్య చెప్పారు. -
ఏపీ అధికారుల అత్యుత్సాహం..!!
సాక్షి, వైఎస్సార్ కడప : అధికార పార్టీ అండతో ఏపీ ప్రభుత్వాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రొద్దుటూరు బస్టాండ్‌లోని దుకాణాలను కూల్చి అన్నా క్యాంటీన్ నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాగా, ప్రొద్దుటూరు బస్టాండ్‌లో అన్నా క్యాంటీన్ నిర్మాణం చేపట్టొద్దంటూ మున్సిపల్ కౌన్సిల్ గతంలోనే తీర్మానం చేసింది. దుకాణాలు కూల్చి క్యాంటీన్ నిర్మించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ విషయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆందోళన కూడా చేపట్టారు. దీంతో క్యాంటీన్ నిర్మాణంపై వెనక్కి తగ్గిన అధికారులు టీడీపీ నేతల ఒత్తిడితో మరోమారు క్యాంటీన్ నిర్మించేందుకు సమాయత్తం కావడం చర్చనీయాంశమైంది. -
మట్కా స్థావరాలపై పోలీసుల దాడులు
వైఎస్ఆర్ జిల్లా , ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు పోలీసులు మట్కా స్థావరాలను ఏరిపారేస్తున్నారు. వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏక కాలంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో 9 మంది మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 11 లక్షల 84 వేల నగదు, మట్కా స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో మట్కా జూదంలో ఇంత పెద్ద మొత్తం పట్టుకోవడం ఇదే మొదటి సారి. డీఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఉత్తర్వుల మేరకు దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీసు అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి దాడులు నిర్వహించారన్నారు. మట్కా నిర్వహించడానికి ప్రత్యేక అనుమతులున్నాయని కొందరు నిర్వాహకులు ప్రజలను నమ్మించేవారన్నారు. ఈ క్రమంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో మట్కా రాస్తున్నారని సమాచారం రావడంతో ఎస్ఐలు, సీఐలు మంగళవారం ఏక కాలంలో దాడులు నిర్వహించారన్నారు. వన్‌టౌన్ పరిధిలోని మట్టిమసీదు వీధిలో షేక్ ఖాదర్‌బాషా, బీరం జయరామిరెడ్డిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 59, 440, 5 మట్కా పట్టీలు, టూ టౌన్ పరిధిలో మోడంపల్లెకు చెందిన సయ్యద్ ఆలీషేర్ను అరెస్ట్ చేసి రూ. 1 లక్షా 10 వేలు, 10 మట్కా పట్టీలు, త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొరసానిపల్లెకు చెందిన ఎన్. నారాయణ, కొండయ్య, రవిచంద్రారెడ్డి, కొత్తపల్లె గోపాల్, ఎర్రగంగుల రవికుమార్, ఉండెల వెంకటేష్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 10 లక్షల 15 వేలు నగదు, ఆరు మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నామన్నారు. మట్కా బీటర్లను జిల్లా బహిష్కరణ చేస్తాం మట్కా నిర్వహిస్తున్న వారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గతంలో మట్కా నిర్వహిస్తూ మానుకున్నవారు తిరిగి రాస్తున్నారన్నారు. వీరిని జిల్లా బహిష్కరణ చేస్తామని తెలిపారు. ఇంకా కొందరిని గుర్తిస్తున్నామని వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రొద్దుటూరులో మట్కా నిర్వాహకులు ఎక్కడున్నా ఉక్కుపాదం మోపుతామన్నారు. మట్కా స్థావరాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐలు జయానాయక్, మల్లికార్జున గుప్త, రామలింగమయ్య, ఎస్ఐలు కృష్ణంరాజునాయక్, నరసయ్య, మధుమళ్లేశ్వరరెడ్డి, నారాయణయాదవ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇసుక క్వారీ కోసం దీక్ష
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల కోసం ఇసుక క్వారీ మంజూరు చేయాలని కోరుతూ ఈనెల 4, 5 తేదీల్లో స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు నిరాహార దీక్షచేపట్టనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తుందే తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు రూ.2500 నుంచి రూ.4వేల వరకు వెచ్చించి ట్రాక్టర్ ఇసుకను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇదే అదనుగా భావించి టీడీపీ నేతలు ఇసుకను బంగారంగా మార్చుకుని పేద, మధ్యతరగతి ప్రజలను సైతం దోచుకుంటున్నారన్నారు. వారికి కలెక్టర్‌తోపాటు కింది స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని విమర్శించారు. ప్రొద్దుటూరులో ఇసుక క్వారీ చూపాలని చాలా రోజులుగా తాను జెడ్పీ సమావేశం, స్వయంగా కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేదన్నారు. దేవగుడి ఇసుక క్వారీకి ప్రొద్దుటూరు వాసులు వెళితే దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించే పరిస్థితి లేదన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు ఇసుక ద్వారా రూ.కోట్లు సంపాదిస్తుండగా మరో వైపు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మనుషులు పోట్లదుర్తి క్వారీ నుంచి ఇసుకను తరలించి లాభపడుతున్నారన్నారు. ఎవరైనా అత్యవసరానికి ఇతర చోట్ల ఇసుకను తెస్తే అధికారులు మాత్రం ఆ ట్రాక్టర్లకు రూ.2లక్షలు జరిమానా విధించి పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై గత నెల 18న తాను తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసినా నిద్ర నటిస్తున్న కలెక్టర్ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారని ఉచిత ఇసుకను ప్రజలకు భారంగా మార్చారని అన్నారు. ఏ ఫిర్యాదు చేసినా పట్టించుకోరు కలెక్టర్ టీడీపీ నేతలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. పాత బస్టాండ్‌ను కూల్చివేశారని చెప్పినా, మున్సిపల్ పార్కులో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి సంబంధించిన మట్టిని అమ్ముకున్నారని ఫిర్యాదు చేసినా, నిబంధనలకు విరుద్దంగా ట్యాంకును నిర్మించారని చెప్పినా, ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ల యజమానులపై దేవగుడిలో మంత్రి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పినా కేసులు నమోదు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాను శాంతియుతంగా దీక్ష చేపట్టాలనని నిర్ణయించానన్నారు. అప్పటికీ సమస్యను పరిష్కరించకపోతే బంద్‌కు పిలుపునిస్తానని, తర్వాత రాష్ట్రస్థాయిలో వైఎస్సార్సీపీ నాయకులను పిలిచి ఉద్యమం చేపడుతామన్నారు. అంతకూ స్పందించని పక్షంలో తాను ఆమరణ దీక్షకు పూనుకుంటానని తెలిపారు. అప్పటికైనా అధికారులు దిగి వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. స్థానిక తహసీల్దార్ సైతం తన ఆవేదనను పట్టించుకోకుండా ఊయలలో ఊగినట్లు వీల్ చైర్లో ఊగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మంత్రి అనుచరుల సహకారంతో తహసీల్దార్ రూ.లక్షలు దోచుకుంటున్నారని, టీడీపీ నేతలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక వ్యాపారం చేస్తూ టీడీపీ నేతలు రూ.కోట్లు సంపాదిస్తున్నారని అన్నారు. ఓ ఎమ్మెల్యే ఇసుకతో రూ.100 కోట్లు సంపాదించగా, మరో ఎమ్మెల్యే కోటీశ్వరుడు అయ్యారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చిప్పగిరి ప్రసాద్, నారాయణరెడ్డి, సోములవారిపల్లె శేఖర్, కల్లూరు నాగేంద్రారెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
ఎర్రచందనం గోడౌన్లు ఖాళీ
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : ఎర్రచందనం దుంగలు గోడౌన్లో ఉన్నాయంటే అక్కడ పని చేసే అధికారులకు నిత్యం టెన్షన్.. కాపలా ఉంటున్న సిబ్బందికైతే కంటిమీద కునుకు ఉండదు. సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షణ చేయాల్సి వచ్చేది. స్మగ్లర్ల బారి నుంచి విలువైన ఎర్రచందనాన్ని కాపాడుకోవడానికి అటవీశాఖ అధికారులు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. ఇకపై అటవీశాఖాధికారులకు ఎర్రచందనం కష్టాలు తొలగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖ కార్యాలయాల్లోని గోడౌన్లలో ఎంతో కాలంగా నిల్వ ఉంచిన చందనం దుంగలను తిరుపతిలోని సెంట్రల్ గోడౌన్లకు తరలిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం నుంచి డీఎఫ్ఓలకు ఆదేశాలు అందాయి. ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్ పరిధిలో 5 రేంజర్ కార్యాలయాలు ఉన్నాయి. అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఎర్రచందనాన్ని ఆయా రేంజర్ కార్యాలయాలకు తరలిస్తారు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి డివిజన్ కార్యాలయానికి తరలించి అక్కడ భద్రపరుస్తారు. ఇలా 10 ఏళ్ల నుంచి ప్రొద్దుటూరులో సుమారు 1600 మెట్రిక్ టన్నులు పైగా చందనం దుంగలను భద్రపరిచారు. గతంలో ఎర్రచందనం గోడౌన్లలో చోరీ ప్రొద్దుటూరు డివిజన్లోని ప్రొద్దుటూరుతో పాటు పలు రేంజర్ కార్యాలయాల్లో గతంలో ఎర్రచందనం దుంగలు చోరీకి గురి అయ్యాయి. అటవీశాఖ సిబ్బంది కొన్నింటిని చోరీ చేసి తరలించగా, కొన్ని చోట్ల గుర్తు తెలియని దొంగలు దుంగలను ఎత్తుకొని వెళ్లారు. చోరీకి సంబంధించి పలువురు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ కూడా చేశారు. అప్పటి నుంచి చందనం దుంగలు నిల్వ ఉంచిన గోడౌన్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి రక్షణ కోసం 24 గంటల పాటు సిబ్బంది కాపలా కాసేవారు. ఒక విధంగా చెప్పాలంటే గోడౌన్లకు కాపలా కాయడం సిబ్బందికి కత్తిమీద సాములా మారిందని చెప్పవచ్చు. 1200 మెట్రిక్ టన్నులు తిరుపతికి తరలింపు అడవుల్లోనే కాకుండా గోడౌన్లలో కూడా ఎర్రచందనానికి రక్షణ కరువైంది. గతంలో జరిగిన పలు సంఘటనలను దృష్టిలో ఉంచుకొని తిరుపతిలోని సెంట్రల్ గోడౌన్‌కు దుంగలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్ కార్యాలయ గోడౌన్ల నుంచి ఇప్పటి వరక 1200 మెట్రిక్ టన్నుల బీ, సీ గ్రేడ్ చందనం దుంగలను తరలించారు. మరో 30 టన్నులు ఉందని, వాటిని కూడా ప్రత్యేక లారీల్లో తరలిస్తున్నామని డీఎఫ్ఓ గురుప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అటవీశాఖ గోడౌన్లలో నిల్వ ఉన్న దుంగలను తిరుపతికి తరలిస్తున్నారు. చందనాన్ని ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించారు. గతంలో ఇక్కడి నుంచి ఏ గ్రేడ్ దుంగలను మాత్రమే డ్రెస్సింగ్ చేసి తిరుపతిలోని సెంట్రల్ గోడౌన్‌కు తరలించేవారు. గ్లోబల్ టెండర్ల ద్వారా వాటిని విక్రయించేవారు. బీ,సీ గ్రేడ్ల దుంగలు ఆయా అటవీశాఖ గోడౌన్లలోనే ఉండిపోయేవి. ఈ రకాలకు గ్లోబల్ టెండర్లు పిలిచినా టెండర్లలో పాల్గొనే కొనుగోలుదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీశాఖ గోడౌన్లకు వెళ్లి ఎర్రచందనాన్ని పరిశీలించేవారు. బయ్యర్లకు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం ఇబ్బందిగా ఉండేది. ఒకే చోట దుంగలు ఉండటం వల్ల కొనుగోలు చేసే వారికి సౌకర్యంగా ఉంటుందని, అంతేగాక భద్రత విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తవని అధికారులు అంటున్నారు. ఇకపై పోలీసు, అటవీశాఖ అధికారుల దాడుల్లో పట్టుబడిన చందనాన్ని వారం రోజుల్లోగా సెంట్రల్ గోడౌన్‌కు తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గోడౌన్లో ఉన్న దుంగలను తూకం వేసి, అది ఏ కేసులో స్వాధీనం చేసుకున్నారో క్రైం నెంబర్ కూడా నమోదు చేసుకొని తిరుపతికి పంపిస్తున్నారు. దుంగలను తిరుపతికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్నామని అటవీశాఖ అధికారులు, సిబ్బంది అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో తరలింపు ప్రభుత్వ ఆదేశాలతో చాలా ఏళ్ల నుంచి నిల్వ ఉంచిన బీ, సీ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను తిరుపతిలోని సెంట్రల్ గోడౌన్‌కు తరలిస్తున్నాం. ఇప్పటికే 1200 మెట్రిక్ టన్నులు తరలించాం. ఇంకా 30 టన్నుల వరకు ఉంది. భద్రత కోణంలో ఆలోచన చేసి విలువైన చందనం ఒకే చోట ఉంటే మంచిదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – గురుప్రభాకర్, డీఎఫ్ఓ, ప్రొద్దుటూరు. -
జ్వరం..కలవరం
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : శీతాకాలం ప్రారంభం కావడంతో కొన్ని రోజుల నుంచి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కొన్ని రోజులగా జిల్లాలో పగలు ఎండ, రాత్రి విపరీతమైన చలి వేస్తోంది. వేకువ జామున విపరీతమైన మంచు కూడా కురుస్తుంది. వీటి కారణంగా వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ వస్తున్నాయని, న్యూమోనియా, బ్రాంకైటిస్ వాంటి వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. చలి, పొగ మంచు కారణంగా ఇవి వ్యాపిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటుమలేరియా, చికెన్‌పాక్స్ (పొంగు) కూడా సోకుతున్నాయి. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చిన్న పిల్లల ఓపీ బాగా పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. గతంలో రోజు 100–140 మంది చిన్నారులుగా రాగా 10 రోజుల నుంచి రెట్టింపు సంఖ్యలో ఓపీకి వస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఆస్పత్రిలోని వార్డులో అడ్మిట్ చేస్తున్నారు. పిల్లల సంఖ్య పెరగడంతో ఒక్కో మంచంలో ఇద్దరిని పడుకోబెడుతున్నారు. చిన్న పిల్లలే గాక వృద్ధులు, చాలా మంది మహిళలు జ్వరంతో బాధపడుతున్నారు. ప్రొద్దుటూరులోని అనేక ప్రైవేట్ ఆస్పత్రులు కూడా చిన్న పిల్లలతో కిటకిట లాడుతున్నాయి. ప్రొద్దుటూరుతో పాటు ఎర్రగుంట్ల, మైదుకూరు, దువ్వూరు, రాజుపాళెం, కమలాపురం, కొండాపురం, ముద్దనూరు తదితర మండలాల నుంచి చిన్న పిల్లలను తీసుకొని వస్తున్నారు. కిటకిటలాడుతున్న ల్యాబ్‌లు జ్వరం సోకిన చిన్న పిల్లలతో ల్యాబ్‌లు కిటకిట లాడుతున్నాయి. వ్యాధి నిర్ధారణకు వైద్యులు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించడంతో అందరూ పరీక్షల కోసం ల్యాబ్‌లకు పరుగులు తీస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌లు జ్వర పీడితులతో కిక్కిరిసి పోయాయి. వేల రూపాయలు రక్త పరీక్షల కోసం ధార పోస్తున్నారు. వ్యాధుల లక్షణాలు శ్వాసకోశ వ్యాధులైన బ్రాంకైటీస్, బ్రాంకోన్యూమోనియాతో ఎక్కువ మంది చిన్నారులు బాధపడుతున్నారు. జలుబు, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం ఈ వ్యాధుల లక్షణాలు. వ్యాధి ముదిరితే శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చికెన్‌పాక్స్ వ్యాధికి గురైతే జ్వరం వస్తుంది. ఒళ్లంతా దద్దుర్లుతో కూడిన పొక్కులు వస్తాయి. విపరీతమైన దురద జలుబు కూడా ఉంటుంది. మలేరియా వ్యాధి బారిన పడిన వారికి జ్వరం కొంత సేపు ఉండి తగ్గిపోవడం, మళ్లీ రావడం జరుగుతుంది. రాత్రి సమయాల్లో చలి, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలిచిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ♦ పిల్లలను ఎక్కువగా చలిలో తిరగకుండా చూడాలి. ♦ ఫ్రిజ్ నీరు కాకుండా గోరువెచ్చని నీటిని తాగించాలి. ♦ చల్లని పదార్థాలు, శీతల పానియాల జోలికి వెళ్లకుండా చూడాలి. ♦ దోమలు కుట్టకుండా దోమతెరలు, ఇతర నివారణ సాధనాలు వాడాలి. ♦ కలుషిత నీరు తాగకుండా చూసుకోవాలి. జ్వరం కేసులుఎక్కువగా వస్తున్నాయి కొన్ని రోజుల నుంచి చిన్న పిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నాయి. చాలా మందిలో తట్టు కూడా ఉంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో చిన్న పిల్లల్లో ఈ తరహా వ్యాధులు ప్రబలుతున్నాయి. పిల్లల్లో జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి. పిల్లల ఆరోగ్యంపై అశ్రద్ధ చేయవద్దు.– డేవిడ్ సెల్వన్‌రాజ్, చిన్న పిల్లల వైద్యుడు, ఆర్ఎంఓ, జిల్లా ఆస్పత్రి, ప్రొద్దుటూరు -
ప్రొద్దుటూరులో గుట్కామాఫియా
ప్రొద్దుటూరు క్రైం : గుట్కా మాఫియా ప్రొద్దుటూరులో చెలరేగి పోతోంది. నిషేధిత గుట్కాను అనుమతి ఉన్న కంపెనీ ఉత్పత్తుల మాదిరిగా బహిరంగ విక్రయాలు చేస్తున్నారు. ఇక్కడి ప్రధాన డీలర్ల నుంచి హోల్ సేల్ దుకాణాలకు.. అక్కడి నుంచి కిల్లీ కొట్టు, సిగరెట్ దుకాణాలు, కిరాణా కొట్లకు సరఫరా అవుతున్నాయి. మూడు గుట్కాలు, ఆరు ఖైనీలు అన్న చందంగా వీరి వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రొద్దుటూరుకు వాణిజ్య పరంగా మంచి పేరుంది. సంబంధిత అధికారులు, ఇక్కడి పోలీసులు అక్రమ వ్యాపారాన్ని పట్టించుకోకపోవడంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి పాన్ షాప్, టీ బంకులు, కిరాణా కొట్టుల్లో విరివిగా లభిస్తున్నాయి. వీటి నిర్వాహకులకు అక్రమ వ్యాపారం కాసులు కురిపిస్తోంది. వీటి వాడకంతో క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయనే కారణంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి వీటిని అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. కానీ ప్రొద్దుటూరులో మాత్రం నిషేధిత గుట్కా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని అధికారులు నిరోధించిన సందర్భాలు చాలా తక్కువని చెప్పవచ్చు. దాడుల పేరుతో చిన్నా చితకా వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నారు గానీ అసలు సూత్రదారుల జోలికి మాత్రం వెళ్లడం లేదు. కోనేటికాల్వ వీధిలోని అనేక దుకాణాల్లో గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు గోడౌన్లలో నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండు బాగా వాడుకలో ఉండి తర్వాత నిషేధానికి గురైన ఏ వస్తువుకైనా మార్కెట్లో మంచి డిమాండు ఉంటుంది. గతంలో గుట్కా, పొగాకు ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయించేవారు. అయితే ప్రభుత్వం వీటి అమ్మకాలను నిషేధించినా ప్రజలు మాత్రం వాటి అలవాటును మానుకోలేదు. ప్రజల బలహీనతను అవకాశంగా చేసుకొని, నిషేధాన్ని సాకుగా చూపి రెండు నుంచి నాలుగు రెట్లు పెంచి అ«ధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి వ్యాపారులు రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టి రూ. కోట్లలో ఆదాయం పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి సరుకును అక్రమంగా తరలించి, అక్కడి నుంచి కడప జిల్లాతో పాటు రాయలసీమలోని ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. ప్రొద్దుటూరులో హోల్ సేల్ వ్యాపారం చేసే వ్యాపారులు అ«ధికంగా ఉన్నారు. గుట్కా వ్యాపారం ఒక మాఫియాలాగా మారిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ తెలిసినా పోలీసు అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు పోలీసు అధికారుల చల్లని చూపుతో వ్యాపారులకు పూర్తి స్వేచ్ఛ లభిస్తోంది. నిత్యావసర సరుకులు విక్రయించినంత తేలికగా జిల్లాలోనూ, పసిడిపురిగా పేరు గాంచిన ప్రొద్దుటూరులో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తున్నారు. పక్కరాష్ట్రాల నుంచి దిగుమతి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీలను జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నారు. వస్తు రవాణా వాహనాలు, ట్రావెల్స్ బస్సుల్లో ప్రొద్దుటూరుకు పంపిస్తున్నారు. ఇందులో కర్నాటక సరుకుకు మంచి డిమాండు ఉంది. ప్రొద్దుటూరులోని వ్యాపారులు గుట్కా వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరుగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం ప్రొద్దుటూరులోని యానాది కాలనీ, కోనేటి కాల్వవీధి, బాలోబిగారి వీధుల్లో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కిరాణా కొట్లలో విక్రయిస్తున్న చిరు వ్యాపారులను పలు మార్లు పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున గుట్కా వ్యాపారం చేస్తున్నా ఇప్పటి వరకూ పోలీస్‌స్టేషన్ మెట్లక్కని బడా వ్యాపారులు ప్రొద్దుటూరులో చాలా మంది ఉన్నారు. కొందరు పోలీసుల అండదండలతో ప్రొద్దుటూరులో గుట్కా మాఫియా రూ. లక్షలు ఆర్జిస్తోంది. రెట్టింపు ధరలకు విక్రయం ♦ 30 ప్యాకెట్లు ఉండే ఖైనీ బండిల్ ధర రూ.155, ఒక్కో ప్యాకెట్ రూ. 3 పడుతుంది. దీనిని వ్యాపారులు రూ. 9కి విక్రయిస్తున్నారు. ♦ 20 ప్యాకెట్ల జోడాబుల్ ఖైనీ రూ.100కు కొని రూ.400లకు రిటైల్‌గా విక్రయిస్తున్నారు. ♦ 80 ప్యాకెట్ల ఎంసీ దండను రూ.300లకు కొనుగోలు చేసి రూ.800లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ♦ ఆర్ఎండీ మిక్సింగ్ గుట్కా 100 ప్యాకెట్లు రూ. వెయ్యికి కొని రూ. 2500లకు అమ్ముతున్నారు. -
ఆలయం.. తేజోమయం
దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రొద్దుటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనూతనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది... దేవీ శరన్నవరాత్రలను పెద్ద దేవాలయాలతోపాటు చిన్న ఆలయాల వారు వైభ వంగా నిర్వహిస్తూ ఉత్స వాలకు శోభ తీసుకువస్తున్నారు... ఇందుకోసం 20 రోజులముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు... మరో రెండు రోజుల్లో నవ రాత్రులు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఆలయాల విశిష్టత,అక్కడ చేస్తున్న ఏర్పాట్లపై ‘సాక్షి’ అందిస్తున్నప్రత్యేక కథనం. ప్రొద్దుటూరు కల్చరల్: ప్రొద్దుటూరు రూరల్ పరిధి భగత్‌సింగ్ కాలనీలోని పెద్దమ్మ ఆలయంలో 8 ఏళ్లుగా శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. పెద్దమ్మ ఆ ప్రాంత వాసులకు, భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందారు. 2007లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంతకుముందు 20 ఏళ్లు పైగా అక్కడ ఉన్న వేప చెట్టుకు పూజలు చేసే వారు. హౌసింగ్ బోర్డు, భగత్‌సింగ్ కాలనీ ప్రజలు ఆరాధ్యదేవతగా పూజిస్తున్నారు. ఈ ఆలయ కమిటీలో హిందువులతోపాటు ముస్లిం, క్రైస్తవులు కూడా మెం బర్లుగా ఉంటూ.. అమ్మవారిని కొలుస్తూ సేవ చేస్తున్నారు. 2011 నుంచి నవరాత్రులను దాతలు, భక్తుల సహకారంతో కనుల పండువగా నిర్వహిస్తున్నారు. శరణు అన్న వారికి తన అభయ హస్తంతో వెంటనే కష్టాలు, సమస్యలను తొలగించి సుఖశాంతులు, ఆయురారోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించే తల్లిగా విరాజిల్లుతున్నారు. ఏటా ఉగాది, దసరా పర్వదినాలలో, జయంతి ఉత్సవాలలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలతోపాటు జపహోమాదులు, గ్రామోత్సవాన్ని లోకకల్యాణార్థం నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కట్టుకునే పందిరి రూపొందిస్తున్నారు. ఆలయాన్ని సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించడంతోపాటు ఎల్ఈడీ భారీ దేవతామూర్తుల ఆర్చీని ఏర్పాటు చేస్తున్నారు. రోజూ విశేష అలంకారాలు దసరా ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం అమ్మవారిని విశేషంగా అలంకరిస్తున్నారు. ఈ నెల 10న పెద్దమ్మ, 11న చౌడేశ్వరిదేవి, 12న అన్నపూర్ణ, 13న పార్వతి, 14న గజలక్ష్మి, 15న సరస్వతి, 16న భవానీ, 17న మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. 18న సాయంత్రం పెద్దమ్మతల్లి శమీదర్శనం, చెక్కభజనలు, మంగళవాయిద్యాల మధ్య గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల సహకారంతో.. గతేడాది కంటే ఈ ఏడాది దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. దాతలు, భక్తుల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించాలి. – దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ వృక్షంలోనే కొలువైన గౌరమ్మ ప్రొద్దుటూరు కల్చరల్ : కొవ్వూరు గ్యారేజి సమీపంలోని గౌరమ్మ ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది. అమ్మవారు వృక్షంలోనే కొలువైనారు. ఆ ఆలయంలో 21 ఏళ్లుగా దసరా ఉత్సవాలను కమనీయంగా నిర్వహిస్తున్నారు. దేవీశరన్నవరాత్రులలో అమ్మవారికి రోజూ ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. వందేళ్ల చరిత్ర గల ఈ గౌరమ్మ చెట్టు కింద పూర్వం అటుగా వెళ్లే ప్రయాణికులు సేద తీరే వాళ్లు. వేప చెట్టును గౌరమ్మతల్లిగా కొలిచే వారు. 30 ఏళ్ల కిందట రొటేరియన్ కేటీ రెడ్డి ఇక్కడ ఆలయం నిర్మించారు. అలాగే గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శ్రీరామనవమి, వినాయక చవితి, ప్రతి శుక్రవారం, విశేష పర్వదినాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులలో అమ్మవారికి రోజూ విశేష పూజా కార్యక్రమాలు చేయడంతోపాటు గౌరమ్మ చెట్టును వివిధ రూపాలలో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. గౌరమ్మ చెట్టుకే అమ్మవారి వెండి ముఖవర్చస్సు, ఆభరణాలను శోభాయమానంగా అలంకరిస్తారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. అలంకారాలు అమ్మవారిని ఈ నెల 10న రాజరాజేశ్వరి, 11న శారదాదేవి, 12న భవాని, 13న అన్నపూర్ణ, 14న పార్వతి, 15న సరస్వతి, 16న గజలక్ష్మి, 17న మహిషాసురమర్దిని, 18న గౌరమ్మ రూపంలో అలంకరించనున్నారు. -
ముస్లింలను మభ్యపెట్టేందుకే కపట నాటకాలు
-
ప్రొద్దుటూరులో మున్సిపల్ వైస్‌చైర్మన్ వీరంగం
ప్రొద్దుటూరు క్రైం : అధికార పార్టీ నాయకుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ వైఎస్ జబీవుల్లా తన వర్గీయులతో కలసి వీరంగం సృష్టించారు. మైదుకూరు రోడ్డులో అందరూ చూస్తుండగా వారు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. గురువారం 50 మందికి పైగా ఒక్కసారిగా హోటల్లోకి ప్రవేశించి అందులో ఉన్న అహ్లే హదీస్ కమిటీ కార్యదర్శి చాపాడు జిలానిబాషాతోపాటు మరి కొందరిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిలానిబాషా పట్టణంలోని దస్తగిరిపేటలో నివాసం ఉంటున్నాడు. అతను ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులో హోటల్ నిర్వహించుకుంటూ క్యాటరింగ్ కూడా చేస్తున్నాడు. అతను మూడేళ్ల క్రితం జమాతే అహ్లే హదీస్ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. బైపాస్‌రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద కమిటీ తరపున రంజాన్, బక్రీద్ పండుగలకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇందుకయ్యే ఖర్చులను చందాల రూపంలో నమాజ్‌కు వచ్చే ప్రజల నుంచి వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం ఈద్గా వద్ద జిలానిబాషాతో పాటు కమిటీ సభ్యులు జోలె పట్టుకొని చందాలు వసూలు చేస్తున్నారు. అయితే అక్కడే ఉన్న వైస్‌చైర్మన్ జబీవుల్లా సోదరుడు మైనుద్దీన్ చందాలు వసూలు చేయొద్దని చెప్పాడు. ఈద్గా పండుగ ఖర్చుల కోసం వసూలు చేస్తున్నాం వద్దని చెబితే ఖర్చులు ఎలా భరించాలని అతనితో అన్నారు. దీంతో మైనుద్దీన్ వారిని పరుష పదజాలంతో తిట్టాడు. వారి మధ్య వాగ్వాదం జరుగుతుండగా అక్కడున్న వారు వారించడంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. జబీవుల్లా ఫోన్ చేసి బెదిరించాడు.. ఈ క్రమంలో గురువారం ఉదయం వైఎస్ జబీవుల్లా కమిటీ సభ్యులకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈద్గాలో జరిగిన సంఘటన గురించి అందరికీ చెప్పావంట కదా.. నీవు ఎక్కడున్నావో చెప్పు వస్తున్నా అని అతను మందీ మార్బలంతో మైదుకూరు రోడ్డులోని హోటల్ వద్దకు వచ్చాడు. జబీవుల్లాతో పాటు సుమారు 50 మందికి పైగా హోటల్లోకి ప్రవేశించి రాడ్లు, కట్టెలు, అక్కడే ఉన్న పాలక్యాన్లను తీసుకొని విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న కొందరు విడిపించడంతో జబీవుల్లా, అతని వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనలో జిలానిబాషా గాయ పడ్డాడు. దీంతో ఆగ్రహించిన జిలానిబాషా కుటుంబ సభ్యులు, బంధువులు వైస్ చైర్మన్ జబీవుల్లా దౌర్జన్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. గాయపడిన జిలానిబాషాను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో అహ్లే హదీస్ కమిటీ æసభ్యులు పెద్ద ఎత్తున జిల్లా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సీఐలు వెంకటశివారెడ్డి, ఓబులేసు ఆస్పత్రికి చేరుకొని విచారించారు. జిలానిబాషా ఫిర్యాదు మేరకు జబీవుల్లాతో పాటు ముజాహిద్దీన్, ఆరిఫ్, జుబేర్, చక్రి మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి తెలిపారు. తనను కులంపేరుతో దూషించి దాడి చేశారని జబీవుల్లా డ్రైవర్ చక్రీనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిలానిబాషా, ఆయన కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రొద్దుటూరులో చైన్ స్నాచింగ్
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని మిట్టమడివీధిలో ఇందిరాదేవి అనే మహిళ మెడలో నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. వన్‌టౌన్ పోలీసుల కథనం మేరకు ఇందిరాదేవి దుకాణానికి వెళ్లి ఇంటికి వస్తుండగా గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు పల్సర్ బైక్‌లో వచ్చి గొలుసును లాక్కొని పారిపోయారు. ముందు వైపు కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె గట్టిగా కేకలు వేయగా నిందితులు బైక్‌లో పారిపోయారు. డీఎస్పీ శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలిని విచారించి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటశివారెడ్డి తెలిపారు. నిందితుల ఫొటో విడుదల చేసిన పోలీసులు మిట్టమడివీధిలో సీసీ కెమెరా ఉండటంతో చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. పరిశీలించిన పోలీసులు నిందితుల ఫొటోను పత్రికలకు విడుదల చేశారు. వారిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. ఇక్కడ చైన్ స్నాచింగ్‌కు పాల్ప డ్డ వారు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు చేసే అవకాశం ఉందని సీఐ అన్నారు. -
సీఎం రమేష్‌కు అంత భద్రత ఎందుకు
-
మోదీ,బాబు కలిసి కడపకు అన్యాయం చేశారు
-
తళుక్కుమన్న తమన్నా..
ప్రొద్దుటూరు : సినీనటి తమన్నా ప్రొద్దుటూరులో హల్చల్ చేశారు. స్థానిక మైదుకూరు రోడ్డులో ఏర్పాటు చేసిన బీన్యూ మొబైల్స్ 53వ షోరూంను శనివారం ఉదయం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు వచ్చారు.అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి ఆమె అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తాను నటిస్తున్న సినిమాల గురించి చెప్పడంతో అభిమానులు ఈలలు, కేకలు వేశారు. ఆమె స్వయంగా సెల్ఫీ స్టిక్‌తో ఫొటోలు తీయడం, ఆటో గ్రాఫ్‌లు ఇవ్వడం అభిమానుల్లో ఆనందం నింపాయి. సాంకేతిక సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి సాంకేతిక సేవలు కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని తమన్నా పేర్కొన్నారు. బీ న్యూ మొబైల్స్ షోరూం ప్రారంభం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఇక్కడ తనకు ఇంత మంది అభిమానులు ఉండటం గర్వంగా ఉందన్నారు. నటిగా రాణించడం తన అదృష్టమని, ఆ కారణంగానే తనకు ఇంత మంది అభిమానులు ఏర్పడ్డారన్నారు. బీన్యూ మొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ వైడీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలు అంటే తనకెంతో ఇష్టమని, ఆ కారణంగానే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తమ షోరూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదోని, కదిరి ప్రాంతాల్లో సైతం షోరూంలు ఏర్పాటు చేశామని, లక్ష జనాభా ప్రతిపదికన షోరూంలు ప్రారంభిస్తున్నామన్నారు. ఏడాది ఆఖరు నాటికి నవ్యాంధ్రలో వంద, తెలంగాణాలో వంద షోరూంలు ఏర్పాటు చేసి రూ.500 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో రాయల్ రెసిడెన్సీ ఓనర్ రాఘవరెడ్డి, బీ న్యూ మొబైల్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
రసాభసగా ప్రొద్దుటూరు మున్సిసిపల్ సమావేశం
-
మంత్రి ఆది మోసం : వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సాక్షి, అమరావతి బ్యూరో: కేశవరెడ్డి విద్యాసంస్థలకు తామిచ్చిన అప్పును తిరిగి ఇవ్వకుండా మంత్రి ఆదినారాయణరెడ్డి తమను తిప్పుకుంటున్నారని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బాధితుడు శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఆరేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ తిప్పుకుంటున్నారు తప్పితే డబ్బులు ఇవ్వట్లేదని వాపోయారు. మంత్రి హామీపై విసుగుచెందిన శ్రీనివాస్‌రెడ్డి, ఆయన తన భార్య హైమావతి, ముగ్గురు సంతానంతో కలసి సచివాలయం గేట్–2 వద్ద పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. అక్కడున్న భద్రతా సిబ్బంది దీన్ని గమనించి అడ్డుకుని ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. 2012లో ఓ మధ్యవర్తి ద్వారా కేశవరెడ్డికి రూ. 5 లక్షలు ఇచ్చామని 8 నెలల పాటు వడ్డీ ఇచ్చి తర్వాత నుంచి ఇవ్వడం మానేశారని చెప్పారు. ఈ విషయమై మంత్రి ఆదిని కలవగా డబ్బు తాను చెల్లిస్తానని హామీ ఇచ్చి పలు దఫాలుగా రూ.లక్ష ఇచ్చి తర్వాత చేతులు దులుపుకున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబును కలిసినా, ఆయన కూడా చేస్తాం.. చూస్తాం అన్నారు తప్పితే ఇంతవరకు న్యాయం చేయలేదని వాపోయాడు. నెల రోజుల్లో తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. -
ప్రొద్దుటూరులో చంద్రబాబు పోటీ చేస్తారా?
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు ఏమైనా పోటీ చేస్తారా అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి టీడీపీ నాయకులను ప్రశ్నించారు. ఇటీవల ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి ఒకే గొడుగు కింద ఉంటూ భిన్నమైన విమర్శలు చేశారన్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ‘నీకు బలమైన అభ్యర్థి పోటీలో ఉంటాడు’ అని తనను ఉద్దేశించి అన్నారని పేర్కొన్నారు. దీనిని బట్టి వరద బలమైన అభ్యర్థి కాదని చెప్పకనే చెబుతున్నారని తెలిపారు. లింగారెడ్డి మరో సమావేశంలో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ‘నీపై బలమైన అభ్యర్థి పోటీ చేయకపోవడం వల్ల, అదృష్టం కలిసి వచ్చి నెగ్గావు’ అని అన్నారన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వరదరాజులరెడ్డి పోటీ చేశారని తెలిపారు. వరద బలహీనమైన అభ్యర్థి అని లింగారెడ్డి చెప్పకనే చెప్పారని తెలిపారు. అలాగే 2019 ఎన్నికల్లో చురుకైన అభ్యర్థిని పోటీ చేయిస్తాం, ఆ పేరు వింటేనే నీవు షాక్‌కు గురవుతావని లింగారెడ్డి చెప్పడాన్ని బట్టి చూస్తే.. ఆయన చురుకైన అభ్యర్థి కాదని తెలుస్తోందని చెప్పారు. దీన్నిబట్టి వరద, లింగారెడ్డి డల్ స్టూడెంట్స్ అని తెలుస్తోందని వ్యంగ్యంగా అన్నారు. ఎవరితోనైనా పోటీకి సిద్ధం టీడీపీ తరఫున ఎవరు పోటీ చేసినా తాను సిద్ధంగా ఉన్నానని, వీరోచితంగా పోరాడి గెలవడంలో తనకు సంతోషం ఉంటుందని అన్నారు. తాము ధనాన్ని నమ్మిన వాళ్లం కాదని, ప్రజా సేవను నమ్ముకున్నామని చెప్పారు. చంద్రబాబు అయినా మరో బాబు అయినా ప్రజా దీవెనతో బరిలోకి దిగుతానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చిప్పగిరి ప్రసాద్, బలిమిడి చిన్నరాజు, లక్ష్మీనారాయణమ్మ, జింకా విజయలక్ష్మి, ఓబుళరెడ్డి, మల్లికార్జున ప్రసాద్, అజీం, బూసం రవి పాల్గొన్నారు. -
మద్యం మాయాజాలం
ఆ అధికారి దందాకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. నేనే రాజు.. నేనే మంత్రి అనేలాడిపోలో ఆయన పాలన సాగిస్తున్నాడు. తనకుఎవరైనా అడ్డు తగిలితే బదిలీ చేయిస్తాడు.తన అవినీతి బాగోతం బయటికి పొక్కకుండాఉండేందుకని ముందు జాగ్రత్తగా ముఖ్యమైనవిభాగాల్లో కుటుంబ సభ్యులను ఏర్పాటుచేసుకున్నాడు. ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రొద్దుటూరులో పని చేస్తున్నఆ అధికారి అవినీతి తారా స్థాయికి చేరింది. ప్రొద్దుటూరు క్రైం :గతంలో జిల్లా అంతటికి కడపలో మాత్రమే లిక్కర్ డిపో ఉండేది. మద్యం వ్యాపారుల సౌలభ్యం కోసం గత నవంబర్‌లో ప్రొద్దుటూరులో డిపోను ఏర్పాటు చేశారు. దీని పరిధిలో 134 మద్యం షాపులు, 12 బార్లు ఉన్నాయి.ఇందులో సుమారు 61 మంది హమాలీలు పని చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూలు నిర్వహించి 58 మందిని నియమించగా తర్వాత మరో ముగ్గురిని చేర్చుకున్నారు. నియామకాల సమయంలో కొందరి హమాలీల వద్ద రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైదుకూరు రోడ్డులోని లింగాపురం సమీపంలో ఉన్న ప్రొద్దుటూరు మద్యం డిపోకు వివిధ ప్రాంతాల నుంచి రోజు 10 లారీల లోడ్ వస్తుంది. ఒక్కో లారీలో 1275 కేసులు దాకా ఉంటాయి. లోడింగ్ సమయంలో సుమారు 15–20 సీసాలు దాకా డ్యామేజ్ అవుతాయని సిబ్బంది చెబుతున్నారు. అయితే డిపోలోని అధి కారి మాత్రం 40–50 దాకా సీసాల బ్రే కేజీ అయినట్లు రికార్డుల్లో రాసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్స్‌బర్గ్, సాబ్, యూబీ, బడ్వైజర్, టెన్ తౌజండ్ తదితర కంపెనీలకు చెం దిన ప్రతినిధులు (రెప్‌లు) డిపోలో ఉం టారు. బ్రేకేజీ ఎక్కువ ఎందుకు రాసుకుంటున్నారని అడ్డు చెప్పిన వారిపై అధికారి కంపెనీకి ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారి అవినీతి దందాను ప్రశ్నించినందుకు గాను కొం దరు కంపెనీ ప్రతినిధులను డిపో ఆవరణలోకి కూడా రానివ్వడం లేదని అక్కడి సిబ్బంది అంటున్నారు. డిపోకు లారీ లోడ్ రాగానే ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని బ్రేకేజీ అయ్యాయో కంపెనీ రెప్‌లు నమోదు చేసుకోవాల్సి ఉంది. మద్యం సరుకు ఇన్వాయిస్ పరిశీలించి కంపెనీకి రోజు వారి సమాచారం పంపించాలి. అయితే 20 బాటిళ్లకు బదులు 50 పగిలి నట్లు రాసుకుంటూ అధికారి మాయాజాలం చేస్తున్నట్లు సమాచారం. ఇలా రోజుకు 10 లారీల నుంచి సుమారు 12 కేసుల మద్యాన్ని సేకరించి దుకాణాలకు విక్రయిస్తున్నట్లు డిపోలోని సిబ్బంది కొందరు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇందులో రూ.200 నుంచి రూ.2 వేల విలువ చేసే మద్యం సీసాలు ఉన్నా యి. వీటిని విక్రయించడం వల్ల ఆ అధి కారికి రోజు సుమారు రూ.40–50 వేలు ఆదాయం వస్తున్నట్లు సమాచారం. కనిపించని సీసీ కెమెరాలు: ప్రొద్దుటూరు మద్యం డిపోలో రూ. కోట్ల విలువ చేసే మద్యం నిలువలు ఉన్నాయి. చిన్న దుకాణాలకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్న ఈ రోజుల్లో డిపోలో కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చినా ఏర్పాటు చేయకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలి. గోడౌన్‌లోని మద్యం సీసాల లెక్కింపులో తేడాలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నం అవుతోంది. కావాలనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. అనధికారికంగా ఎవరూపని చేయడం లేదు.. మా డిపోలో అనధికారికంగా ఎవరూ పని చేయడం లేదు. సీసీ కెమెరాల కోసం రాసి పంపించాం. ఎన్ని కెమెరాలు కావాలి.. ఎంత ఏరియా ఉందని ఉన్నతాధికారులు అడిగారు. ఇంకా కెమెరాలు రాలేదు. లారీ లోడ్‌లో మద్యం సీసాలు ఎన్ని బ్రేకేజీ అవుతాయో ఖచ్చితంగా చెప్పలేం. ఎన్ని పగిలితే అన్ని మాత్రమే స్కాన్ చేసి రాసుకుంటాం. ఎక్కువ బ్రేకేజీ రాసుకుంటామనడంలో వాస్తవం లేదు. అలా చేయడానికి అవకాశం ఉండదు. మద్యం కంపెనీల రెప్‌లు లోపలికి రాకూడదు. ఏదైనా పని ఉంటే చూసుకొని వెళ్లాలి. అవసరం ఉంటే మేమే పిలిపిస్తాం. వాళ్లు లోపలికి రావాలనే రూల్స్ పొజిషన్ ఏదీ లేదు. కాంపౌండ్‌లో స్టాఫ్, వర్కర్లు మాత్రమే ఉండాలి. – చెన్నప్ప,ఇన్చార్జి డిపో మేనేజర్, ప్రొద్దుటూరు అభ్యంతరం చెబితే వేధింపులు.. తన దందాకు అడ్డు వచ్చినా, అభ్యంతరం చెప్పినా వేధింపులు ఎదురౌతాయని సిబ్బంది అంటున్నారు. కృష్ణారావు అనే అధికారి నవంబర్ నుంచి స్టోర్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. మద్యం సీసాల బ్రేకేజీని ఎక్కవగా నమోదు చేయలేదనే కారణంతో డిపోబాస్ అతన్ని రోజు వేధింపులకు గురి చేసేవాడు.ఒత్తిడిని భరించలేక 15 రోజుల కిందట కృష్ణారావు బదిలీ చేయించుకొని వెళ్లిపోయాడు. రోజుకు ఎన్ని లారీలు వచ్చాయి.. ఎంత మేర డ్యామేజీ అయిందనే వివరాలను డిపోలోని కంప్యూటర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కీలకమైన ఈ విభాగంలోని పనులనుఅధికారి తన కుమారుడి ద్వారా చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. కంప్యూటర్ విభాగంలో ఆపరేటర్ ఉన్నా అధికారి మాత్రం అనధికారికంగా తన కుమారుడిని నియమించుకున్నాడని వ్యాపారులు చెబుతున్నారు. కడప డిపోలో పని చేస్తున్న ఒక హమాలిని డిపో బాస్ ప్రొద్దుటూరుకు రప్పించుకున్నాడు. హమాలి పోస్టును ఇతరులకు రూ.8 లక్షలకు విక్రయించి అతన్ని ప్రొద్దుటూరులో నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీపీపీలో పని చేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ద్వారా హమాలీ ఉద్యోగానికి దరఖాస్తు చేయించి ఎంపికైన తర్వాత ఆ ఉద్యోగాన్ని ఇతరులకు రూ. 4 లక్షలకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అమెరికాలో ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేస్తున్నాడు
-
బెంగళూరులో కిరాతకం
బొమ్మనహళ్లి (బెంగళూరు): బెంగళూరు సిటీ బస్సులో ప్రయాణిస్తున్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు ప్రయాణికుల ముందే కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోనప్పన అగ్రహారలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రొద్దుటూరుకు చెందిన సురేష్ (30) బుధవారం ఉదయం నగర సమీపంలోని ఆనేకల్ పట్టణం నుంచి బెంగళూరుకు వస్తున్న సిటీ బస్సులో ఎక్కాడు. మార్గమధ్యంలో దుండగులు బస్సును మరో వాహనంతో చేజింగ్ చేస్తూ వచ్చి కోనప్పన అగ్రహార సమీపంలో సిటీ బస్సులోకి ఎక్కారు. బస్సులో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నా లెక్క చేయకుండా దుండగులు కత్తులు, కొడవళ్లతో సురేష్‌ను నరికారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత బస్సు నుంచి పరారీ అయ్యారు. బస్సులో కలకలం రేగడంతో డ్రైవర్ బస్సును నిలిపాడు. ఈ రక్తపాతంతో ప్రయాణికులు కేకలు వేసుకుంటూ తలోదిక్కు పరుగులు పెట్టారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ప్రొద్దుటూరులో చేనేత కార్మికుల భిక్షాటన
-
వైఎస్వి స్కీంలు..బాబువి స్కాంలు
-
పాఠశాల శతాబ్ది ఉత్సవాలు
-
5వ రోజు పాదయాత్ర డైరీ
-
వైఎస్సార్ జిల్లాలో వీఆర్వోపై దాడి
-
పోలీసు వ్యవస్థపై టీడీపీ పెత్తనమేంటి.?
► వరుస హత్యలు, దొంగతనాలతో భయబ్రాంతులవుతున్న జనం ► పంచాయితీలు, సెటిల్మెంట్లకు అడ్డాగా తాలూకా పోలీసు స్టేషన్ ► టీడీపీ రాజకీయాల వల్లే డీఎస్పీ నియామకంలో ఆలస్యం ► శాంతియుత వాతావరణం నెలకొల్పడమే వైఎస్సార్సీపీ ఎజెండా ► ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కడప కార్పొరేషన్: ప్రొద్దుటూరులో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీకి వినతిపత్రం సమర్పించిన అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రొద్దుటూరులో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస హత్యలు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలతో ప్రజలు, వ్యాపార వర్గాల వారు భయాందోళనకు గురవుతున్నారన్నారు. మడూరు రోడ్లో ఆయిల్ మిల్ దగ్గర చంద్రశేఖర్‌రెడ్డి హత్య మొదలుకొని నిన్న హైందవి హత్య వరకూ 9 హత్యలు, 5 దొంగతనాలు జరిగాయన్నారు. ఈ మ«ధ్య జరిగిన ఓ హత్యను వాట్సాప్‌లో ప్రపంచ వ్యాప్తంగా వీక్షించారని గుర్తు చేశారు. తమకు శాంతి ఒక కన్ను అయితే అభివృద్ధి మరో కన్ను అని, శాంతి లేని చోట అభివృద్ధి జరగదని తెలిపారు. సభలు, సమావేశాల ద్వారా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఈమేరకు స్థానిక ఎమ్మెల్యేగా తాను శాంతి సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క పోలీసు అధికారి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థపై టీడీపీ పెత్తనమేంటి.? డీఎస్పీని నియమించకపోవడం వల్లే శాంతిభద్రతలు అదుపులో లేవని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడటం వాస్తవమేనన్నారు. అయితే డీఎస్పీని నియమించకపోవడానికి కారణం ఆయనేనని విమర్శించారు. సీఎం రమేష్, వరదరాజులరెడ్డి, లింగారెడ్డిలు ఎవరికి వారు తమకు అనుకూలమైన అధికారిని నియమించుకోవాలనే ధోరణితో డీఎస్పీ నియామకాన్ని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించేవారు అయి తే చాలునన్న ఏకాభిప్రాయం టీడీపీ నేతల్లో కొరవడిందన్నారు. అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐగా శ్రీనివాసులును నియమిస్తే అరగంటకే ఆయన్ను పంపించేశారని, మళ్లీ ఆ పోస్టు భర్తీ కావడానికి కొన్ని నెలలు పట్టిందన్నారు. ఇటీవల సుధాకర్‌రెడ్డిని నియమిస్తే ఆయన నెలరోజులకే దీర్ఘకాలిక సెలవులో వెళ్లారన్నారు. పోలీసు వ్యవస్థపై టీడీపీ పెత్తనమేంటని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో తాలూకా పోలీస్‌స్టేషన్ పంచాయితీలు, సెటిల్మెంట్లు, కమీషన్లకు అడ్డాగా మారిందని ఆరోపించారు. సీఐ, ఎస్ ఐలు పూర్తి పక్షపాతంతో టీడీపీ వారికి వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. డీఎస్పీగా నిజాయితీ పరుడైన డైనమిక్ ఆఫీసర్‌ను నియమించేందుకు టీడీపీ నేతలు సహకరించాలని అప్పుడే ప్రొద్దుటూరులో పరిస్థితులు చక్కబడుతాయన్నారు. వాస్తవ పరిస్థితులను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుపోయామని, ఆయన అన్నీ శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించారన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్‌రెడ్డి, 34వ వార్డు కౌన్సిలర్ భర్త పోసా భాస్కర్, పార్టీ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు. -
మంచిగా ఉంటూనే హైందవిని మట్టుపెట్టాడు..
► పరులతో జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు ► హైందవి హత్యతో ప్రొద్దుటూరులో భయాందోళనలు ప్రొద్దుటూరు: అతను అద్దెకు ఉన్నది మూడు నెలలే. అయినా ఆ కుటుంబంతో బాగా చనువు ఏర్పడింది. ఈ కారణంగా అప్పుడప్పుడు ఇంట్లోకి వెళ్లేవాడు. మంచిగా ఉంటూనే అతను బీటెక్ విద్యార్థిని హైందవిని మట్టుపెట్టాడు. గోకుల్‌నగర్‌లో నివాసం ఉంటున్న జయప్రకాష్‌రెడ్డికి కుమార్తె హైందవి, కుమారుడు మౌనీశ్వరరెడ్డిలు ఉన్నారు. ఆయన లెక్చర్‌గా పని చేస్తుండగా, భార్య విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. వారి కుమార్తె హైందవి 10 వరకూ ఉషోదయ హైస్కూల్, ఇంటర్ షిర్డిసాయి జూనియర్ కాలేజిలో చదువుకుంది. తర్వాత బీటెక్ ట్రిపుల్ఈ హైదరాబాద్‌లోని సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజిలో పూర్తి చేసింది. మొదటి నుంచి హైందవికి క్లాస్‌లో మంచి మార్కులు వచ్చేవి. బాగా చదివి ఎప్పటికైనా ఉన్నతమైన ఉద్యోగం సాధిస్తానని తల్లిదండ్రులతో చెప్పేది. ఈ క్రమంలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లలో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైంది. అయితే ఆ కంపెనీ నుంచి కాల్‌లెటర్ రాకపోవడంతో ఇంటిì వద్ద ఖాళీగా ఉండకుండా బ్యాంకు కోచింగ్‌కు వెళ్లేది. వృత్తి రీత్యా ఏనాడైనా విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుందని భావించిన హైందవి ఇటీవల పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఇంట్లో ఉంటే తల్లికి ఒక్క పని కూడా చేసే అవకాశం ఇవ్వదు. అంతా తానే చేస్తుంది. తన దారిన తాను వెళ్లి ఉంటే.. తన స్కూటీ రోజూ మొరాయిస్తుండంతో రిపేరు చేయించేందుకు షెడ్డులో ఇచ్చింది. స్కూటీ తెచ్చుకునేందుకు హైందవి తండ్రి బైక్‌లో బజారులోకి వెళ్లింది. అప్పటికే స్కూటీ రిపేరు చేసి ఉండటంతో తీసుకొని నేరుగా ఇంటికి బయలుదేరింది. పెట్రోల్ అయిపోవడంతో నవీన్ కుమార్ దారిలో బైక్ నిలిపి ఆగి ఉన్నాడు. అదే దారిలో వెళ్తున్న హైందవి అతన్ని చూసి ఆగింది. పెట్రోల్ అయిపోవడంతో ఆగానని అతను చెప్పగా మానవత్వం చూపిన హైందవి తన స్కూటీలో కూర్చోపెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్లింది. ఇంట్లో ఉన్న ఒక ఖాళీ బాటిల్ ఇచ్చి పెట్రోల్ తెచ్చుకోమని స్కూటీ తాళాలను అతనికి ఇచ్చింది. తమ కుటుంబంతో పరిచయం కారాణంగా హైందవి అతనికి సాయం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. అలా కాకుండా తన దారిన తాను వెళ్లి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని పలువురు అంటున్నారు. పరులతో జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు పరాయి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటి పక్కన ఉన్న కారణంగా చనువు ఉంటుందని, అలాంటి వారికి ఎక్కువ చనువు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని అంటున్నారు. కొందరు మనుసులో ఏదో ఆలోచన పెట్టుకొని పరిచయం పెంచుకునేవాళ్లు కూడా లేకపోలేదని పోలీసులు పేర్కొంటున్నారు. మంచితనం అనే ముసుగు కప్పుకొని నిండా ముంచేవాళ్లు ఇటీవల కాలంలో ఎక్కువగా ఉన్నారని, ఇంటా బయట జాగ్రత్తగా ఉంటే ఎలాంటి నేరాలు జరగడానికి అస్కారం ఉండదని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. హైందవి హత్యతో ప్రొద్దుటూరులో భయాందోళనలు హైందవి హత్య జరిగిన మరు క్షణం నుంచి ప్రొద్దుటూరు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంట్లోకి చొరబడి గొంతులు కోస్తుండటంతో పట్టణ వాసుల్లో అలజడి మొదలైంది. ఇప్పటి వరకూ బయటికి వెళ్లేటప్పుడు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేవారు. ఇళ్లలో ఉన్న వాళ్లు కూడా పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పట్టణంలోనే గాక శివారు ప్రాంతాల్లో పోలీసులు రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
బాబు బొమ్మలతో దోమలు పోతాయా..!
ప్రొద్దుటూరు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మలతో ర్యాలీలు చేస్తే.. దోమలు పోతాయా అని ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. దోమలపై యుద్ధం పేరుతో పట్టణంలో మంగళవారం మున్సిపల్ అధికారులు, చైర్మన్, వైద్యాధికారులు, సిబ్బంది.. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పుట్టపర్తి సర్కిల్ వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దోమల నివారణకు విద్యార్థులను పిలుచుకొచ్చి రోడ్ల వెంట ర్యాలీలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉండవన్నారు. చైర్మన్, కమిషనర్ చిత్తశుద్ధితో పని చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. శానిటేషన్ సిబ్బంది ఒక లక్ష్యాన్ని ఎంచుకుని పని చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మీడియా ద్వారా ప్రచారం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి త్యాగరాజు, డిప్యూటీ డీఎంహెచ్ఓ సత్యరంగయ్య, మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, వైస్ చైర్మన్ జబీవుల్లా, ఎన్జీఓ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, కౌన్సిలర్ కోనేటి సునంద, టీడీపీ పట్టణాధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు, ఎంఈ సురేంద్రబాబు, డీఈలు రాజేష్, ఆర్కే శ్రీనివాసులు, టీడీపీ నాయకుడు ఫరీద్, మెప్మా సీఓలు, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరులో మరో దారుణ హత్య
► బాకీ చెల్లించాలని అడిగినందుకు కత్తితో పొడిచిన కటిక వ్యాపారి ► మృతి చెందిన లారీ యజమాని శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలో సంచలనం సృష్టించిన మారుతి ప్రసాద్‌రెడ్డి హత్య మరువక ముందే మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బాకీ డబ్బు చెల్లించాలని అడిగినందుకు టీచర్స్ కాలనీకి చెందిన ఉండేల శ్రీనివాసులరెడ్డి (48)ని కటిక వ్యాపారి అమర్నా«థ్ అనే వ్యక్తి ఆదివారం కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులో ఉన్న టీచర్స్ కాలనీకి చెందిన శ్రీనివాసులరెడ్డి రిలయన్స్ పెట్రోల్ బంకు కూడలిలో టీ దుకాణం పెట్టుకొని జీవిస్తున్నాడు. ఆ టీ దుకాణం పక్కనే మత్స్య కాలనీకి చెందిన అమర్నాథ్ కటిక అంగడి ఉండేది. అప్పుడప్పుడు అమర్నాథరెడ్డి చేతి బదులుగా శ్రీనివాసులరెడ్డి దగ్గర అప్పు తీసుకొనేవాడు వాగ్వాదానికి దిగి.. 20 రోజుల క్రితం శ్రీనివాసులరెడ్డి వద్ద అమర్నాథ్ రూ.30 వేలు తీసుకున్నాడు. డబ్బు ఇవ్వాలని శ్రీనివాసులరెడ్డి రోజూ అడుగుతున్నా అతను రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చాడు. ఆదివారం డబ్బు కావాలని శ్రీనివాసరెడ్డి గట్టిగా అడగటంతో అందరూ చూస్తుండగానే అమర్నాథ్ మాంసం కోసే కత్తి తీసుకొని గుండెల్లో పొడవడంతో ప్రధాన రోడ్డుపై కుప్ప కూలి పోయాడు. తీవ్ర రక్తస్రావం అయిన అతన్ని స్థానికులు వెంటనే ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. భార్య శేషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఓబులేసు తెలిపారు. -
ఎప్పటికీ పార్టీ మారను: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే
-
ఎప్పటికీ పార్టీ మారను: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు: తాను టీడీపీలో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వాపోయారు. తాను ఎప్పటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకు ప్రేమ, అభిమానాలు ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ అంటే కృతజ్ఞత కూడా ఉందని చెప్పారు. ఇకనైనా తనపై దుష్ప్రచారం ఆపాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం అక్రమాలపై రాచమల్లు తన గళాన్ని గట్టిగా విన్పిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అధికార టీడీపీ రౌడీయిజాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నించారు. తన చెప్పుతో తానే కొట్టుకుని ప్రభుత్వ దౌర్జన్యాలను ఎండగట్టారు. -
వేటకొడవళ్లతో వెంటాడి.. వేటాడి
అది ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన రహదారి.. జన సమ్మర్ధంతో ఆ రహదారి కిటకిటలాడుతోంది. ఎవరి పనుల మీద వారు బిజీగా వెళ్తున్నారు.. ఇంతలో ఒక్కసారిగా చేతుల్లో వేటకొడవళ్లు పట్టుకున్న నలుగురు వ్యక్తులు చంపండి.. చంపండి.. అంటూ కేకలు వేస్తూ ఓ వ్యక్తిని వెంటాడుతున్న దృశ్యం. అంతే.. క్షణాల్లో ఆ వ్యక్తిపై తమ చేతిలోని మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. తీవ్ర గాయాలతో అలాగే పరుగులు పెడుతూ.. ఇక పరుగెత్తలేక రోడ్డుపై నిస్సహాయంగా పడిపోయిన ఆ వ్యక్తిని ఒకరు ఒడిసి పట్టుకుంటే.. మరొకరు వేటకొడవలి తీసుకుని మొద్దులు నరికినట్లు కసితీరా నరికి చంపి తాపీగా నడుచుకుంటూ వెళ్లారు. పట్టపగలు.. నడిరోడ్డుపై.. జనం అంతా చూస్తుండగా జరిగిన ఈ దారుణ హత్య ప్రొద్దుటూరులో తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించింది. ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణం టీబీరోడ్డులో గురువారం ఉదయం జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతి ప్రసాద్‌రెడ్డి (34) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ భక్తవత్సలం తెలిపిన వివరాల మేరకు బోరెడ్డి మారుతి ప్రసాద్‌రెడ్డి తండ్రి మునిరెడ్డి కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అతను ఇంటి వద్ద ఉండి పొలం పనులు చూసుకునేవాడు. అతని అక్క అనురాధా ప్రొద్దుటూరులోని శాస్త్రీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈమె రూరల్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈమెకు టీచర్స్ కాలనీకి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. ఈ విషయం అతని బామ్మర్దులు రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డితోపాటు భార్య నిర్మలకు తెలిసింది. ఈ క్రమంలో 2014లో నిర్మల శాస్త్రీనగర్‌లోని అనురాధ ఇంటి వద్దకు వెళ్లి గొడవ పడ్డారు. ఇకపై తన భర్తను ఎప్పుడు ఇంటి వద్దకు రానివ్వద్దని హెచ్చరించారు. ఈ విషయం అనురాధ తమ్ముడు మారుతి ప్రసాద్‌రెడ్డికి తెలియడంతో నిర్మల ఇంటికి వెళ్లి ఎందుకు మా అక్కను తిట్టావని బెదిరించాడు. ఇకపై ఇలా చేస్తే నీ అంతు చూస్తానని ఆమెను హెచ్చరించాడు. ఈ సంఘటనపై నిర్మల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మారుతి ప్రసాద్‌రెడ్డిపై 447, 507 సెక్షన్ల కింద బెదిరింపుల కేసు నమోదైంది. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్మల సోదరులు రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు మారుతి ప్రసాద్‌రెడ్డిపై పగను పెంచుకున్నారు. మారుతి ప్రసాద్‌రెడ్డిని హతమార్చాలని పథకం.. రఘునాథరెడ్డి ప్రకాశం జిల్లా, కనిగిరి తాలుకా, పామూరులో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. అతను ఏడాది క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రొద్దుటూరులోనే ఉంటున్నాడు. మారుతి ప్రసాద్‌రెడ్డిని చంపేందుకు పలువురితో కలిసి వ్యూహరచన చేసేవాడు. నెల రోజుల క్రితం పోలీసులకు ఈ విషయం తెలియడంతో రఘునాథరెడ్డి, పెద్ద దండ్లూరుకు చెందిన పట్నం ధరణి, ఈశ్వరరెడ్డినగర్కు చెందిన వెంకటరమణలను త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు. ఇటీవల వీరు బెయిల్‌పై బయటికి వచ్చారు. రఘునాథరెడ్డి జైలులో ఉన్నప్పుడు నిర్మల ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో మారుతి ప్రసాద్‌రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఈ విషయం జైలు నుంచి రాగానే తన సోదరులతో ఆమె చెప్పింది. మారుతి ప్రసాద్‌రెడ్డి సింగపూర్‌లో ఉన్నందున చాలా కాలం నుంచి 2014లో నమోదైన కేసులో కోర్టు వాయిదాలకు రావడం లేదు. తల్లి వెంకటలక్ష్మమ్మకు గుండె ఆపరేషన్ చేయడంతో రెండు నెలల క్రితం అతను సింగపూర్ నుంచి వచ్చాడు. గురువారం వాయిదా ఉందని తెలియడంతో దేవగుడి నుంచి ప్రొద్దుటూరుకు వచ్చాడు. ఈ కేసులో వాయిదా కోసం నిర్మల కూడా తన సోదరులతో కలిసి కోర్టుకు వచ్చింది. ఉదయం 10.10 గంటలకు కోర్టు ముందు ఉండగా ఎందుకు మా అక్క ఇంటి తలుపులు తట్టావని రఘునాథరెడ్డి అతనితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పథకం ప్రకారం తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డితో పాటు మరో ఇద్దరు మారుతి ప్రసాద్‌రెడ్డిని వెంటాడారు. వారి నుంచి తప్పించుకునేందుకు అతను టీబీ రోడ్డు వెంట పరుగులు తీశాడు. మధ్యలోనే కత్తి పోట్లకు గురైన అతను మార్కెట్ యార్డు సమీపంలోకి రాగానే కింద పడిపోయాడు. శ్రీనివాసులరెడ్డి గట్టిగా పట్టుకోగా రఘునాథరెడ్డి వేట కొడవలితో అందరూ చూస్తుండగానే దారుణంగా నరికి చంపాడు. పట్టపగలే అతి దారుణంగా నరకడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. కళ్ల ముందే అతను దారుణ హత్యకు గురవుతున్నా నివారించడానికి ఎవరూ సాహసం చేయలేదు. చుట్టూ గుమి కూడిన ప్రజలు చంపొద్దు.. చంపొద్దు అంటూ గట్టిగా కేకలు వేశారు. అందరూ చూస్తుండగానే మారుతి ప్రసాద్‌రెడ్డి ప్రాణాలు గాలిలో కలిశాయి. విషయం తెలియడంతో సీఐలు బాలస్వామిరెడ్డి, ఓబులేసు, ఎస్ఐలు సంఘటనా స్థలానికి వచ్చారు. కొన్ని నిమిషాల్లోనే పోలీసులు రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ ఓబులేసు తెలిపారు. డీఎస్పీ భక్తవత్సలం సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానిక పోలీసు అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో హత్య దృశ్యాలు సినిమా షూటింగ్‌ను తలపిస్తూ జరిగిన మారుతి ప్రసాద్‌రెడ్డి హత్య సంఘటనను స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. కొన్ని సెకండ్లలోనే వాట్సాప్, ఫేస్బుక్లో హత్య దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సెల్ఫోన్లలో హల్చల్ చేశాయి. అది ఫ్యాక్షన్ హత్య కాదు– వివాహేతర సంబంధమే కారణం ► పోలీసుల అదుపులో నిందితులు ► విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు కడప అర్బన్ : ప్రొద్దుటూరు పట్టణం మార్కెట్‌యార్డు సమీపంలో గురువారం జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతిరెడ్డి (36) దారుణంగా హత్యకు గురయ్యాడని, ఈ హత్యతో ఫ్యాక్షన్‌కు గానీ, ముఠా కక్షలకుగానీ, రాజకీయంగా కానీ ఎలాంటి సంబంధం లేదని జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) బి.సత్య ఏసుబాబు అన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మలమడుగు మండలం దేవగుడికి చెందిన బోరెడ్డి మారుతిరెడ్డిని ప్రొద్దుటూరు పట్టణం నడింపల్లెకు చెందిన నరసాపురం శ్రీనివాసరెడ్డి, రఘునాథరెడ్డిలు మార్కెట్‌యార్డు సమీపంలో దారుణంగా హత్య చేశారన్నారు. ఈ హత్య వెనుకగల కారణాలు ప్రాథమికంగా ఇలా ఉన్నాయని ఆయన వివరించారు. హతుడు మారుతిరెడ్డి సోదరి అనూరాధ ప్రొద్దుటూరుపట్టణంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోందన్నారు. అనూరాధకు నిందితుల బావమరిది చంద్రశేఖర్‌రెడ్డితో వివాహేతర సంబంధం ఉందన్నారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్‌రెడ్డి భార్య నిర్మల, ఆమె కుమారుడు అనూరాధ ఇంటికి వెళ్లి వారితో గొడవపడ్డారన్నారు. ఈ వివాహేతర సంబంధం ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలకు, కక్షలకు దారి తీసిందన్నారు. గురువారం తనపై ఉన్న పాత కేసు వాయిదా కోసం కోర్టుకు హాజరయ్యేందుకు మారుతిరెడ్డి వస్తుండగా నిందితులు హత్య చేశారన్నారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారన్నారు. ఈ సమావేశంలో ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, టాస్క్‌ఫోర్స్ సీఐ నాయకుల నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
నడిరోడ్డుపై దారుణహత్య
ప్రొద్దుటూరులో వేట కొడవళ్లతో వెంటాడి చంపిన ప్రత్యర్థులు ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో కోర్టు వాయిదాకు వచ్చిన ఓ యువకుడిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. పట్టపగలు నడిరోడ్డులో వేట కొడవళ్లు చేత బట్టుకుని వెంటాడి నరికి చంపిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతీప్రసాద్‌రెడ్డి (34) డిగ్రీ చదువుకున్నాడు. మూడేళ్ల కిందట విజయవాడకు చెందిన మహిళతో వివాహం కాగా ఇటీవలే విడాకులు తీసుకున్నాడు. తండ్రి చనిపోవడంతో కొంతకాలం ఇంటివద్దే ఉండి పొలం పనులు చూసుకున్న అతడు తర్వాత సింగపూర్ వెళ్లి కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన సోదరిని తిట్టిందనే కోపంతో నిర్మలమ్మ అనే మహిళను ఆమె ఇంటికెళ్లి బెదిరించాడనే ఆరోపణలపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మారుతీప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదైంది. అయితే చాలాకాలంగా కోర్టు వాయిదాలకు హాజరుకాలేదు. నెలరోజుల కిందట సింగపూర్ నుంచి వచ్చిన అతను గురువారం వాయిదా ఉండటంతో ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చాడు. అతడిపై ఫిర్యాదు చేసిన నిర్మలమ్మ, ఆమె బంధువులు కూడా వచ్చారు. కోర్టు వద్ద మారుతీప్రసాద్‌రెడ్డితో వారు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే తమ వద్ద ఉన్న వేటకొడవళ్లతో అతడిపై దాడికి ప్రయత్నించారు. దీంతో అతను జమ్మలమడుగు రోడ్డువైపు పరుగెత్తాడు. నలుగురు వ్యక్తులు వేట కొడవళ్లతో అతని వెంటపడ్డారు. రెండు కత్తిపోట్లు తగలడంతో మార్కెట్ యార్డు వద్ద కిందపడిన మారుతీప్రసాద్‌రెడ్డిని నిర్మలమ్మ సోదరులు శ్రీనివాసులరెడ్డి, రఘునాథరెడ్డిలు అందరూ చూస్తుండగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్యచేశారు. అనంతరం ఇద్దరు నిందితులను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు
-
సీఎం రమేష్‌పైనే కేసు పెడతావా?
ప్రొద్దుటూరు టౌన్/ఎర్రగుంట్ల: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దాడిలో గాయపడిన అసిస్టెంట్ లైన్మెన్ దండు వీరశేఖర్ ప్రొద్దుటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆదివారం రాత్రి పోట్లదుర్తి నాయకులు అక్కడికి వచ్చి అతన్ని బెదిరించి కేసు పెట్టకుండా చేశారు. ‘ఎంపీపైనే కేసు పెడతావా.. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’ అంటూ పోట్లదుర్తికి చెందిన ఓ నాయకుడు బాధితుడిని, అతని కుటుంబ సభ్యులను బెదిరించినట్లు సమాచారం. దీంతో ఆర్థో –2 వార్డులో చికిత్స పొందుతున్న బాధితుడు.. ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తాను చెట్టు కొమ్మపై నుంచి కింద పడినందున గాయమైందని చెప్పడం చూస్తుంటే అతను ఏమేరకు ఒత్తిడికి గురయ్యాడో స్పష్టమవుతోంది. చెట్టు కొమ్మలు కొట్టేశారని ఎంపీ సీఎం రమేష్.. అసిస్టెంట్ లైన్మెన్ దండు వీరశేఖర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. దాడికి గురైన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు జిల్లా ఆస్పత్రి యాక్సిడెంట్ రిజిష్టర్‌లో వైద్యులు దండు వీరశేఖర్ గాయాలను నమోదు చేశారు. ఎవరు దాడి చేశారో పేరు రాయకుండా చాకచక్యంగా వ్యవహరించారు. వైఎస్సార్ జిల్లా పోట్లదుర్తిలోని సత్యనారాయణ కాలనీలో జరిగిన ప్రమాదంలో ముక్కుపై దెబ్బ తగిలిందని, కమిలిన గాయమైందని పుట్టు మచ్చలను రాసిన వైద్యులు బాధితుడు చెప్పిన రాజ్యసభ సభ్యుని పేరు రాయలేదు. బాధితుడు చెప్పిన విధంగా సంఘటన జరిగిన విషయాన్ని యాక్సిడెంట్ రిజిష్టర్‌లో రాయాల్సి ఉందని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. కాగా, బాధితుని భార్య తన భర్తను పోట్లదుర్తి నుంచి బదిలీ చేయించాలని వేడుకోవడంతో నాయకులు ఆ మేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అధికార పార్టీ నాయకులు విద్యుత్‌శాఖ డీఈ విజయన్‌తో మాట్లాడించి వీరశేఖర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దాడి విషయమై డీఈ విజయన్ను ‘సాక్షి’ వివరణ కోరగా తాను ఆదివారం రాత్రి వీరశేఖర్‌ను జిల్లా ఆస్పత్రిలో పరామర్శించానన్నారు. తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. తనపై దాడి జరిగినట్లు వీరశేఖర్ ఫిర్యాదు చేయలేదని ఎర్రగుంట్ల సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. -
పట్టించుకునే దిక్కులేదు
– రోడ్డును పగులగొట్టి రాత్రికి రాత్రి కాలువ నిర్మాణం – అయినా చలనం లేని మున్సిపల్ అధికారులు ప్రొద్దుటూరు టౌన్ : పట్టణంలోని కోనేటికాలువ వీధిలోని 40 అడుగుల మున్సిపాలిటీ రోడ్డును సోమవారం అర్ధరాత్రి పగుల గొట్టారు. ఇప్పటి వరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులే లేరు. మంగళవారం అర్ధరాత్రి తిరిగి కాలువను నిర్మించారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డును పగుల గొట్టింది ఎవరు, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, తిరిగి కాలువను నిర్మించినా అధికారులు ఎందుకు పట్టించు కోలేదు అన్న విషయంపై మున్సిపల్ అధికారులు మాకు తెలియదంటే మాకు తెలియదని చేతులు దులుపుకుంటున్నారు. మంగళవారం వైఎస్ఆర్ సీపీ నాయకులు బంగారురెడ్డి ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినా ఫలితం లేదు. ఎందుకీ నిర్లక్ష్యం... కాలువలో నీరు వెల్లలేదని రూ.లక్షల వెచ్చించి నిర్మించిన రోడ్డును ద్వంసం చేసినా కూడా అధికారుల్లో చలనం లేదంటే పరిస్థితి అర్థం కావడంలేదు. రోడ్డును పగులగొట్టడం ద్వారా భారీ వాహనాలు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తే రోడ్డు కృంగిపోయే అవకాశాలు ఉన్నాయని అధికారుల చెబుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాల్లు పగులగొడుతుంటే ఎలా అని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. బిల్లులు కూడా కాని రోడ్డును పగుల కొట్టిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
గతేడాది బిల్లులకే దిక్కులేదు
► మళ్లీ చలివేంద్రాలా... ► రూ.1.62కోట్లు కేటాయించామని సర్క్యులర్ ప్రొద్దుటూరు టౌన్: చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. గత ఏడాది ఏర్పాటు చేసిన చలివేంద్రాలకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకపోవడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గత ఏడాది కుండలు, గ్లాసుల కొనుగోలుకు రూ.1000, ఇసుకకు రూ.500, 100 మందికి మజ్జిగకు రూ.400లు, పంపిణీ చేసిన సభ్యురాలికి రూ.200 ప్రకారం డబ్బు వెచ్చించారు. ఇదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎస్‌హెచ్‌జీ మెంబర్‌కు రూ.150తో కలిపి రూ.1950 ఖర్చు చేశారు. ఈ విధంగా మొత్తం 11 కేంద్రాల్లో 10 నుంచి 20 రోజుల పాటు చలివేంద్రాలు నిర్వహించారు. ఒక్కోదానికి రూ.10వేలు నుంచి రూ.12వేలు ఖర్చయింది. ఇక్కడ మజ్జిగ తాగిన వారి సంతకాలు, సెల్ నంబర్లు తీసుకోవాలని చెప్పడంతో ఎస్‌హెచ్‌జీ మెంబర్లు పుస్తకాలు ఏర్పాటు చేసి వారి వివరాలను నమోదు చేశారు. ఇంత పకడ్బందీగా నిర్వహించినా డబ్బు చెల్లించడానికి ఎవరూ ముందుకు రాలేదు. బిల్లులు ఇచ్చినా డబ్బు రాకపోవడంతో స్వయం సహాయ సంఘాల సభ్యులు వేదనకు గురయ్యారు. టీఎల్ఎఫ్ నుంచి ఒక్కో చలివేంద్రానికి రూ.6వేలు చెల్లించడం, మిగిలిన డబ్బును కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆవార్డులోఉన్న సంఘ లీడర్లు, ఆర్పీలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకూ వారికి ఖర్చు చేసిన డబ్బులో ఒక్క రూపాయి అందలేదు. ప్రభుత్వం ఈ ఏడాది జిల్లాలోని పంచాయతీల్లో 790, మున్సిపాలిటీల్లో 256 చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 25 రోజులపాటు వీటిని కొనసాగించాలని, పంచాయతీల్లో ఒక్కో దానికి రోజుకు రూ.550, మున్సిపాలిటీల్లో రూ.600 కేటాయిస్తూ ఉత్తుర్వులు ఇచ్చింది. ఈ విధంగా మొత్తం రూ.1.62 కోట్లు చలివేంద్రాల నిర్వహణకు కేటాయించారు. ఇందులో రూ.60లక్షలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. గత ఏడాది రూ.1.50లక్షలు ఖర్చు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గత ఏడాది ఏర్పాటు చేసిన 11 చలివేంద్రాలకు రూ.1.50లక్షలు ఖర్చయిందని పీఆర్పీ కెజియా జాస్లిన్.. మున్సిపల్ కమిషనర్ వెంకటశివారెడ్డికి తెలిపారు. బిల్లులు మంజూరు చేయకపోవడంతో సభ్యులు ఇబ్బందులు పడ్డారని వివరించారు. ఈ విషయంపై కమిషనర్ డీఈ రామచంద్ర ప్రభును వివరణ కోరగా తనకు బిల్లులు ఇవ్వలేదని తెలిపారు. పీఆర్పీ బిల్లులు ఇచ్చామని, అధికారులు ఇవ్వలేదని ఒకరిపై ఒకరు చెప్పుకున్నారు. ఈ విధంగా జిల్లాలో చాలా మున్సిపాలిటీ, పంచాయతీల్లో బిల్లులు మంజూరు కాలేదని సమాచారం. -
ప్రొద్దుటూరులో మర్డర్
-
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
బి.కోడూరు: వైఎస్ఆర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కాశీనాయన మండలం వంకమర్రి బ్రిడ్జి వద్ద సోమవారం వేకువజామున చోటు చేసుకున్న్ ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇందు ట్రావెల్స్ బస్సులో వేంపల్లె నుంచి గుడివాడలోని కేకే గౌతమ్ స్కూల్‌కు వెళ్తుంతుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగినపుడు బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను పోరుమామిళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వారిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
రాజ్యాంగమా.. నీకు రక్షణేదీ?
► యథేచ్ఛగా ఉల్లంఘనలు...చట్టాన్ని అమలు చేయడంలో విఫలం ► సభ్యులు మినహా ఇతరులెవ్వరూ కౌన్సిల్ హాల్లోకి వెళ్లకూడదు ► టీడీపీ అధ్యక్షుడికి నిబంధనలు సడలించిన అధికారులు ► రెండురోజులపాటు విచ్చలవిడి దౌర్జన్యకర ఘటనలు ► అధికారపార్టీకి జీ..హుజూర్ అంటున్న యంత్రాంగం ‘నిద్రపోతున్నవాడిని లేపొచ్చు, నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపడం చాలాకష్టం.’ అచ్చం అలాగే కన్పిస్తోంది జిల్లా యంత్రాంగం వైఖరి. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా, చట్టానికి లోబడి, రాజ్యాంగబద్ధులై విధులు నిర్వర్తించాల్సిన వారు ఏకపక్ష చర్యల వైపు మొగ్గు చూపుతున్నారు. ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’గా పోలీసు అధికారులతో కలిసి 600 మంది బందోబస్తు విధుల్లో ఉండి కూడా 41మంది సభ్యులకు సంబంధించిన ఎన్నికను నిర్వహించలేక అభాసుపాలయ్యారు. పరపతి ఉంటే రాజ్యాంగానికే దిక్కుమొక్కు ఉండదని నిరూపించారు. సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికలు అంటేనే అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఎన్నికల కమిషన్‌కు లోబడి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏకపక్ష చర్యలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అయితే గత రెండురోజులుగా జిల్లాలో అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. అధికారపార్టీ నేతలకు ఏకంగా రాజ్యాంగాన్నే తాకట్టు పెట్టారు. టీడీపీ నేతల డైరెక్షన్లో జిల్లా అధికారులు అద్భుతంగా స్క్రీన్‌ప్లే చేశారు. ఓవైపు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పటిష్టమైన బందోబస్తు, 144 సెక్షన్ అమలు అంటూనే, గుంపులు గుంపులుగా వందల మంది వీరంగం సృష్టించేందుకు ఆస్కారం ఇచ్చారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రక్తి కట్టించిన రెవెన్యూ యంత్రాంగం తెలుగుదేశం పార్టీ నేతల డైరెక్షన్ మేరకు ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడంలో రెవెన్యూ అధికారులు కీలకంగా వ్యవహరించారు. రెండు రోజులపాటు క్రమం తప్పకుండా సీన్ రక్తి కట్టించడంలో సఫలీకృతులయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. శనివారం కౌన్సిల్ హాల్లోకి సభ్యులు మినహా మరెవ్వరికి అనుమతి లేదని అధికారులు నిబంధనలు విధించారు. కాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఏకంగా కౌన్సిల్ హాల్ లోపలికి వెళ్లి కౌన్సిలర్ ముక్తియార్‌ను లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నిలువరించారు. అయితే శ్రీనివాసులరెడ్డి ఏ హోదాలో కౌన్సిల్ హాల్లోకి వెళ్లారు? ఆయన్ను అనుమతించిన వారిపై చర్యలేమైనా తీసుకున్నారా అంటే అధికారుల నుంచి సమాధానమే లేదు. 144 సెక్షన్ అమల్లో ఉన్నా, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వందల మందితో ఎలా వచ్చారు. రాళ్లు రువ్వడం, బీభత్స వాతావరణం సృష్టించడానికి ఆస్కారం ఎలా ఇచ్చారు. ఇందులో వైఫల్యం ఎవరిది? వారిపైన చర్యలేమైనా చేపట్టారా? అనే దానికి కూడా ఎలాంటి సమాధానం లభించడం లేదు. కౌన్సిల్ హాల్ నుంచి కౌన్సిలర్ పుల్లయ్య ఏకంగా మినిట్స్ బుక్ ఎత్తుకెళ్లారు. రెండవరోజు అయినా అలాంటి ఉపద్రవం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఎందుకు గ్రహించలేకపోయారు. రెండు గంటల పాటు విధ్వంసం సృష్టిస్తుంటే ఎందుకు నిలువరించే ప్రయత్నం చేయలేదు? రిటర్నింగ్ అధికారి, ఎన్నికల అబ్జర్వర్ చూస్తుండిపోవడమే విధిగా భావించారా? కావాలనే మౌనం దాల్చారా? సభ్యులు మరింత రెచ్చిపోవాలనే అలా వ్యవహరించారా? అంటే అవును అనే సమాధానాన్ని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. రాజ్యాంగం మేరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికారుల ఏకపక్ష చర్యల వెనుక అధికార పరపతి అధికంగా ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దలను ఛీకొడుతున్న ప్రజానీకం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అధికారులు అవలంబించిన తీరు, తెలుగు తమ్ముళ్లు సృష్టించిన విధ్వంసకర చర్యలు, ఎన్నికను వాయిదా వేసిన విధానాన్ని పరిశీలించిన ప్రజానీకం ప్రభుత్వ పెద్దలను ఛీ కొడుతున్నారు. 41 మంది సభ్యులున్న ఎన్నికను నిర్వహించలేని అసమర్థత అధికారులను ఆవహించడం, బలం లేకపోయినా చైర్మన్ గిరిని ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థి ఆసం రఘురామిరెడ్డికి కట్టబెట్టాలనే తలంపుపై అసహ్యించుకుంటున్నారు. అధికార పార్టీ నేతలకు అధికారులు జీ...హుజూర్‌గా మారడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. చట్టాన్ని అమలు చేయకుండా ఎటూ గాని విధంగా వ్యవహరించడం ఏమేరకు సబబో అంతరాత్మను ప్రశ్నించుకోవాలని ప్రజాస్వామ్యవాదులు ఘాటుగా స్పందిస్తున్నారు. -
ప్రొద్దుటూరులో టీడీపీ నేతల రభస
-
ప్రొద్దుటూరులో టీడీపీ నేతల రభస
ప్రొద్దుటూరు: మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆదివారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శనివారం టీడీపీ నేతల దౌర్జన్యంతో ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే.. ఓటమి భయంతో ఉన్న టీడీపీ నేతలు ఇవాళ కూడా ఎన్నికలకు అడ్డంకులు సృష్టించేలా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించడానికి వరదరాజులురెడ్డి వర్గీయులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర రభస ఏర్పడింది. ఓ దశలో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 40 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్సీసీపీ నుంచి బరిలో ఉన్న ముక్తియార్‌కు 24 మంది మద్దతు ఉంది. దీంతో టీడీపీ నేతలు మరోసారి ఎన్నికను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
వైఎస్ఆర్ జిల్లా: టీడీపీ నేతల దౌర్జన్యం మూలంగా వాయిదా పడిన ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో భారీగా పోలీసులు మోహరించారు. ఎన్నికల పరిశీలకులుగా జాయింట్ కలెక్టర్ శ్వేతను నియమించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా స్థానిక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి ఉన్నారు. గతంలో టీడీపీకి చెందిన చైర్మన్ గురివిరెడ్డి రాజీనామాతో మళ్లీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రొద్దుటూరులో మెత్తం కౌన్సిలర్ల సంఖ్య 40 ఉండగా.. వైఎస్ఆర్ సీపీ సభ్యుల సంఖ్య 19గా ఉంది. కాగా ఇప్పుడు.. వైఎస్ఆర్ సీపీ తరఫున బరిలోకి దిగిన కౌన్సిలర్ ముక్తియార్‌కు ఏడుగురు టీడీపీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో శనివారం జరగాల్సిన ఈ ఎన్నికను టీడీపీ నేతలు ఓటమి భయంతో అడ్డుకున్నారు. కౌన్సిల్లో కోరం ఉండటంతో సంతకాలు తీసుకున్న అధికారులు.. టీడీపీ నేతల దౌర్జన్యంతో ఎన్నికను ఇవాళ్టికి వాయిదా వేశారు. చైర్మన్‌గా పోటీలోకి దిగిన ముక్తియార్‌పై అధికార పార్టీ ఒత్తిళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. కాగా ముక్తియార్ వెనక్కి తగ్గకపోవడంతోనే టీడీపీ నేతలు బలవంతంగా ఎన్నికను ఆపారని వైఎస్ఆర్ సీపీ నేతలు వెల్లడించారు. -
ప్రొద్దుటూరులో డ్రగ్స్ మాఫియా ?
► గల్ఫ్ దేశాలకు డ్రగ్స్ సరఫరా ► హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దొరికిన నిషేధిత మత్తు పదార్థాలు ► పార్సిల్‌పై ప్రొద్దుటూరు వాసి పేరు ప్రొద్దుటూరు క్రైం: వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులో అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. క్రికెట్ బెట్టింగ్, మట్కా, పేకాట, చాటు మాటుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు కొందరు యువకులు చెడు వ్యసనాలకు లోనై మత్తు పదార్థాల బారిన పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రొద్దుటూరు వ్యక్తి పేరుతో ఉన్న పార్సిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. లక్షలు విలువ చేసే నిషేధిత డ్రగ్స్ ఉండటంతో జిల్లాతో పాటు ఇక్కడి పోలీసు అధికారులు ఉలిక్కి పడ్డారు. సిరిపురిలో డ్రగ్స్ మూలాలు సిరిపురిలో డ్రగ్స్ మూలాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు నాలుగేళ్ల క్రితం పట్టణంలోని ఒక స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకుల నుంచి బ్రౌన్ షుగర్ మాదిరిగా ఉన్న నాలుగు ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో వీటిని పోలీసు అధికారులు పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అయితే ఇంత వరకూ ఆ రిపోర్టు వివరాలు బయటికి రాలేదు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జీన్స్‌ప్యాంట్లు కలిగిన పార్సిల్‌ను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్యాంట్ల నడుము భాగం కుట్టులో డ్రగ్స్ బిళ్లలను అమర్చి వాటిని కార్గో పార్సిల్ ద్వారా కువైట్‌కు పంపించే ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేశారు. అందులో ఉన్న సుమారు 2500 ఎర్రటి బిళ్లలను స్వాధీనం చేసుకొని పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. వాటిని పరిశీలించిన అధికారులు నిషేధిత మత్తు పదార్థాలుగా భావిస్తున్నారు. వాటి విలువ సుమారు 9 లక్షల వరకూ ఉంటుందని అంచనా. పార్సిల్‌పై మహమ్మద్ రఫీ, ప్రొద్దుటూరు అనే పేరు ఉండటంతో అక్కడి అధికారులు జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వ్యాపారమా.. సేవించడానికా..! రూ.లక్షలు విలువ చేసే నిషేధిత బిళ్లలను ప్రొద్దుటూరు నుంచి కువైట్‌కు సరఫరా చేస్తున్న ముఠా గురించి ఇక్కడి పోలీసు అధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, నందలూరు, కడపతో పాటు ప్రొద్దుటూరులో కూడా వేల సంఖ్యలో గల్ఫ్ దేశాలకు వెళ్లారు. డ్రైవర్, బంగారు పని, ఏసీ మెకానిక్ తదితర పనులు చేసుకునేందుకు యువకులు కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సౌదీ, కువైట్ దేశాలకు వెళ్లారు. ఇలా వెళ్లిన కొందరు యువకులు కలిసి మత్తు పదార్థాలను తెప్పించుకుంటున్నారా లేక డ్రగ్స్ మాఫియా యువకులతో వ్యాపారం చేయిస్తోందా అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఎయిర్ పోర్టులో దొరికిన డ్రగ్స్ బిళ్లలు ఎక్కడి నుంచి వచ్చాయి, అవి యువకుల్లో ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి అనే విషయాలపై పోలీసు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. కావాలనే ప్రొద్దుటూరు వాసి పేరును రాసి ఉంటారా అనే కోణంలో కూడా విచారణ చేయనున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. -
ఖరారు కాని మద్యం పాలసీ
ప్రొద్దుటూరు : మద్యం షాపుల యజమానులు అయోమయంలో పడ్డారు. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 31 వరకు మద్యం దుకాణాలకు గడువు ఉంది. అయితే జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు దుకాణాలు ఉండరాదని ఇటీవల సుప్రీంకోర్డు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వ్యాపారులు డీలా పడ్డారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 109 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు 91 మద్యం షాపులు, 6 బార్లు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ విధానం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలసీలో ప్రాంతాలతో సంబంధం లేకుండా వైన్ షాపులు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 16 షాపులు, 6 బార్లు రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల లోపు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వేంపల్లి నుంచి ప్రొద్దుటూరు, రాజుపాళెం మీదుగా చాగలమర్రి వరకు ఉన్న రహదారి స్టేట్ హైవే కిందికి వస్తుంది. దీంతో కొర్రపాడు రోడ్డులోని భగత్‌సింగ్ కాలనీ, రాజుపాళెంలో ఉన్న మద్యం షాపులకు ఈ నిబంధన వర్తిస్తుంది. చాపాడు, లింగాపురం, మైదుకూరు రోడ్డు, కేకే స్ట్రీట్, వైఎంఆర్ రాజీవ్ సర్కిల్, టిబిరోడ్డు, గాంధీరోడ్డులోని గాంధీబొమ్మ పరిసర ప్రాంతాల్లోని మద్యం షాపులు 500 మీటర్లలోపు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారం పట్టణ, మండలాల్లో 90 శాతం పైగా మద్యం దుకాణాలను వేరే ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. ప్రస్తుతం వార్డుల వారీగా దుకాణాలను నిర్వహిస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో దుకాణాల నిర్వహణ జరగాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో అధికారులే మద్యం షాపు ఏర్పాటుకు స్థలాలను గుర్తిస్తారా లేక ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చనే నిబంధన వస్తే ఏం చేయాలని వైన్‌షాపు యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాలేదు.. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 20న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర, జాతీయ రహదారుల్లోని 500 మీటర్ల లోపు ఉన్న మద్యం దుకాణాలు, బార్లను గుర్తించి అధికారులకు నివేదిక పంపించాం. –బాలకృష్ణన్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు -
మాట తప్పిన ‘ఆది’ సవాల్ విసరడమా !
ప్రొద్దుటూరు: మాట మీద నిలబడని ఆదినారాయణరెడ్డి సవాల్ విసరడం ఏమిటని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మట్లాడారు. ఆది మాట మీద నిలబడే మనిషి కాదని అన్నారు. అధికార అంచుల మీద నిలబడ్డ ఆయన ఏనాటికైనా జారిపోక తప్పదని పేర్కొన్నారు. నాటి సవాళ్లు ఏమయ్యాయి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది మాట మీద నిలబడే వ్యక్తి కాదని చెప్పడానికి చాలా సంఘటనలు ఉన్నప్పటికీ రెండు మాత్రం ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నానని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. 2005 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 3 కౌన్సిల్ సీట్లు వస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆది సవాల్ విసిరారన్నారు. అయితే టీడీపీ 3 కౌన్సిలర్ స్థానాలు గెలిచిన తర్వాత రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీని వీడి టీడీపీలోకి వెళ్లేటప్పుడు కూడా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని అన్నారు. ఇంత వరకూ పార్టీకి, పదవికి రాజీనామా చేయలేదని తెలిపారు. డబ్బుతో రాజ్యసభ పదవిని కొన్న రమేష్‌నాయుడు రాజకీయ నాయకుడే కాదన్నారు. ఆయన ఏనాడూ ప్రజా విశ్వాసం పొందలేదని, రూ. 10కి కొని రూ.15కు విక్రయించే వ్యాపరస్తుడని ఎమ్మెల్యే తెలిపారు. వక్రీకరణలు వద్దు.. తాను మాట్లాడిన మాటలను టీడీపీ నాయక త్రయం వక్రీకరిస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ‘మీరు గెలిస్తే ఊడిగం చేస్తాననే’ మాట చెప్పలేదన్నారు. 60 ఓట్లు మా వద్ద ఎక్కువగా ఉన్నాయి..మరో 40 ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నాం.. వెరసి 100 ఓట్లతో గెలవబోతున్నాం అని టీడీపీ నాయకులు అన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. దానికి సమాధానంగానే 60 ఓట్ల సంఖ్యాబలం చూపిస్తే ఊడిగం చేస్తానని చెప్పానన్నారు. ఆ సవాల్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. తాను జమ్మలమడుగులో చేయడం వల్లనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 6 వేల ఓట్లతో బయట పడగలిగారని ఆది చెప్పడం ఆయన అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్ బొమ్మతో గెలిచిన వ్యక్తి ఇలా మాట్లాడటం బాధగా ఉందన్నారు. వైఎస్‌ను విపరీతంగా అభిమానించే ప్రజాప్రతినిధులారా ఆయన పట్ల మరోసారి ప్రేమను వ్యక్త పరచాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. పార్టీ పట్టణాధ్యక్షులు చిప్పగిరి ప్రసాద్, గజ్జల కళావతి, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, జింకా విజయలక్ష్మి, దేవిప్రసాదరెడ్డి పాల్గొన్నారు. -
రక్తస్రావంతో వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక హోమస్‌పేటకు చెందిన బంటు నాగూరయ్య (32) అనే వ్యక్తి తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగూరయ్య గతంలో క్లీనర్‌గా పని చేసే వాడు. కొన్ని నెలల నుంచి అతను మద్యానికి బానిసై జులాయిగా తిరిగే వాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి దొరసానిపల్లెలో అతని స్నేహితులు బాడుగ విషయమై వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో అక్కడికి వెళ్లాడు. సహనం కోల్పోయిన తాను పక్కనే ఉన్న రాయితో ఆటో అద్దాలను పగులకొట్డాడు. తర్వాత తన చేత్తో అద్దాన్ని పగులకొట్టే క్రమంలో గుచ్చుకొని తీవ్ర స్రావం అయింది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను కొన్ని గంటల తర్వాత మృతి చెందాడు. భార్య వసంత ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ జీఎండీ బాషా తెలిపారు. -
నేడు ఎమ్మెల్యే రోజాచే సైకిళ్ల పంపిణీ
– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సొంత నిధులతో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ ప్రొద్దుటూరు క్రైం: మండల పరిధిలోని దొరసానిపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సొంత నిధులతో నిర్వహించే సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి మంగళవారం నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, సినీ నటి ఆర్.కె.రోజా రానున్నట్లు పార్టీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొరసానిపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థినులు చాలా మంది ఉన్నారని చెప్పారు. విద్యార్థినుల సమస్యపై స్పందించిన రాచమల్లు నరసింహాపురం, కొత్తపేట, చౌటపల్లె, రామాపురం తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేనందున విద్యార్థినులు కాలినడకన పాఠశాలకు వస్తున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రకటించారని, ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లయినా రాష్ట్రంలో ఒక్క సైకిల్ కూడా పంపిణీ చేయలేదన్నారు. విద్యార్థినులు తమ సమస్యను ఎమ్మెల్యే రాచమల్లు దృష్టికి తేవడంతో స్పందించిన ఆయన తన సొంత నిధులతో విద్యార్థినులకు 50 సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి రోజా హాజరువుతున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి, మండల కన్వీనర్ దేవిప్రసాద్, నాయకుడు బలిమిడి చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రవీణ్ దీక్ష భగ్నం : ఆస్పత్రికి తరలింపు
వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరులో ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్న ప్రవీణ్‌కుమార్ రెడ్డి దీక్షను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో డాక్టర్లు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబసభ్యులు దీక్ష కొనసాగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. -
జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
ప్రొద్దుటూరు టౌన్ : స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 18న చేయబోయే ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్లో ఎమ్మార్పీఎస్ (మందకృష్ణమాదిగ) నాయకులు రిలే నిరాహార దీక్ష చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పూలమాలలు వేసి దీక్షాశిబిరంలో కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మురళీకృష్ణమనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంకుశ వైఖరి విడనాడాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా వాసి అయినందున సీఎం వివక్షత చూపుతున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే రాయలసీమ జిల్లాలో ఉన్న నిరుద్యోగులందరికి ఉద్యోగాలు వస్తాయన్నారు. రిలే దీక్షలో బీఎస్పీ నియోజకవర్గ నాయకులు మబ్బు గుర్రప్ప, సుబ్బు, కత్తి గుర్రయ్య, ఇల్లూరు గురుశంకర్, గజ్జల బాలన్న, గౌడ సంఘం నాయకులు శ్రీను గౌడ్, రామయ్య గౌడ్, పీడీఎస్‌యూ నాయకులు రమేష్, బాల, మాలమహానాడు నాయకులు ఐజయ్య, పీరా తదితరులు ఉన్నారు. స్టీల్ ప్లాంట్ సాధనా సమితి నాయకులు అమరనాథరెడ్డి, ఖలందర్ పాల్గొన్నారు. -
ఉత్తమ డ్రైవర్‌కు అవార్డు
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న కె.దస్తగిరి ప్రమాద రహిత డ్రైవర్‌గా జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన 17వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఆయనకు కేంద్ర ఉపరితల రవాణా, హైవే మంత్రిత్వ శాఖ అందజేసింది. దస్తగిరి 34 ఏళ్లుగా ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చినందుకు అవార్డును అందించింది. అలాగే రూ.25 వేల బహుమతిని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో తన అనుభవాలు పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘1982లో ఆర్టీసీ డ్రైవర్‌గా విధుల్లో చేరాను. రోజూ డ్యూటీ సమయాని కంటే ముందే డిపోకు చేరుకుంటాను. నేను నడిపే బస్సు సర్వీసును గ్యారేజీలోకి వెళ్లి ఏమైనా రిపేర్లు ఉన్నాయా, కండీషన్లో ఉందా అని పరీక్షిస్తాను. బస్సుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా దగ్గర ఉండి మెకానిక్‌లతో తయారు చేయించుకుంటాను. మెకానిక్‌లతో స్నేహంగా ఉంటాను. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే నా లక్ష్యం. రాష్ట్ర స్థాయిలో రెండు సార్లు, రీజనల్ స్థాయిలో ఒక సారి, జోనల్ స్థాయిలో ఒక సారి బెస్ట్ డ్రైవర్‌గా అవార్డులను అందుకున్నాను. కేఎంపీఎల్‌లో కూడా మా డిపోలో అందరి కంటే ముందున్నాను. సంస్థకు బాగుంటేనే మేము బాగుంటాం’ అని ఆయన వివరించారు. దస్తగిరి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక కావడం పట్ల ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో మేనేజర్ హరి హర్షం వ్యక్తం చేశారు. v -
రాయల్కౌంటీలో ఆలీ సందడి
ప్రొద్దుటూరు: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్థానిక రాయల్‌కౌంటీ రిసార్ట్స్‌లో ఆదివారం అర్ధరాత్రి రాయల్బాష్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు ఆలీ హాజరు కాగా జబర్దస్త్ టీం సభ్యులు హైపర్ ఆలీ, రైజింగ్ రాజా, అభి, యోధా సిస్టర్స్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో రాయల్ కౌంటీ రిసార్ట్స్ ఎండీ జంపాల మధుసూదన్‌రెడ్డితోపాటు డైరెక్టర్లు, సీనియర్ ఆపరేషన్స్ మేనేజర్ మోహన్మలావత్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళ అదృశ్యం
ప్రొద్దుటూరు క్రైం: కల్లూరు గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మ(26) కనిపించడం లేదని భర్త ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన తన భార్యను తీసుకొని ఈ నెల 10న కర్నూలు జిల్లాలోని సంజామల మండలం పేరుసోములలో ఉన్న కంబగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లాడు. ఆమె 11న ప్రొద్దుటూరు వెళ్లడానికి రోడ్డుపైకి వచ్చింది. భర్త లగేజి బ్యాగు తీసుకొని వచ్చేలోపే కనిపించలేదు. ఇంటికి వెళ్లిందేమోనని కల్లూరుకు వచ్చాడు. ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బం«ధువుల ఊళ్లలోనూ గాలించాడు. ఆమె జాడ ఇంత వరకు తెలియలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ తెలిసిన వారు నంబర్: 8897335364కు ఫోన్ చేయాలని అతను కోరారు. -
నేటి నుంచి వైవీయూ అంతర్ కళాశాలల పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్లో యోగివేమన యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రీడా పోటీలను గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్ అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్క్రీడా మైదానంలో, టెన్నీస్ జార్జికారొనేషన్ క్లబ్, బ్యాడ్మింటన్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో విద్యార్థులకు పోటీలు జరపనున్నారు. ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో జరగనున్న పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, సి.నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, వైవీయూ రిజిష్టార్ నజీర్ అహ్మద్ పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బిరెడ్డి తెలిపారు. -
25న సాహిత్య పురస్కార ప్రదానోత్సవం
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక ఎస్బీ మెమోరియల్ హైస్కూల్లో ఈనెల 25న ఉదయం 10గంటలకు ఎస్.దస్తగిరిసాహెబ్ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం, ''మన దస్తూ'' పుస్తకావిష్కరణ చేయనున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ అహ్మద్ హుసేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శతావదాని నరాలా రామారెడ్డి, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ కలీముల్లా తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. -
ఖాకీల్లో వణుకు పుట్టిస్తున్న మట్కా
ప్రొద్దుటూరు క్రైం: మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాట జరుగుతుందంటే.. అది కొందరు పోలీసుల చలవతోనే అని చెప్పవచ్చు. కొందరు పోలీసు అధికారుల చల్లని చూపు ఉండటం వల్లనే అసాంఘిక కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతున్నాయి. పోలీసు అధికారులు తల్చుకుంటే ఒక్కరు కూడా మట్కా రాయడానికి సాహసించరు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ లాంటి అధికారులు వీటిని ఎంతగా అణచివేయడానికి ప్రయత్నించినప్పటికీ కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఆశీస్సులతో అసాంఘిక కార్యకలాపాలకు బ్రేకు పడటం లేదు. మట్కా మామూళ్ల వ్యవహారం పోలీసు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మట్కా డాన్ నాగేశ్వరరావు నుంచి డబ్బు తీసుకున్నారనే కారణంతో త్రీ టౌన్ ఎస్ఐ మహేష్, ఏఎస్ఐ మునిచంద్రను డీఐజీ రమణకుమార్ ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు అధికారులపై వేటుతో ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటే పొరపాటే అవుతుంది. మరి కొంత మందిపై వేటు పడే అవకాశం ఉందని పోలీసు శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. పెంచిన మొక్కే కాటేసింది.. మట్కా డాన్ నాగేశ్వరరావు చాలా ఏళ్ల నుంచి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగరం వీధిలో నివాసం ఉంటున్నాడు. అతను 45 ఏళ్లుగా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద కంపెనీ ఏర్పాటు చేసి మట్కా నిర్వహిస్తున్నప్పటికీ నాగేశ్వరరావు ఎప్పుడూ పోలీసుల రికార్డుల్లోకి ఎక్కలేదు. అతని అనుచరులు దొరికిన ప్రతి సారి మట్కా డాన్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకై పోలీసులు రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా అతను పోలీసులపై రూ.లక్షలు వెదజల్లుతూ తన మట్కా సామ్రాజ్యాన్ని ప్రొద్దుటూరు నుంచి రాయలసీమ వ్యాప్తంగా విస్తరింప చేసుకున్నాడు. ఇలా కొందరు పోలీసులే అతన్ని చిన్న మొక్క నుంచి మహా వృక్షంలా మారడానికి కారకులయ్యారు. అయితే చివరకు పెంచిన మొక్కే పోలీసులను కాటేసింది. దర్యాప్తులో భాగంగా పోలీసుల అదుపులో ఉన్న నాగేశ్వరరావు మామూళ్ల చిట్టా విప్పడం వల్లనే ఎస్ఐ, ఏఎస్ఐలపై వేటు పడింది. ఆదిలోనే అతనిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి ఉంటే మట్కా డాన్‌గా మారేవాడు కాదని, అతని నేర సామ్రాజ్యం పొరుగు జిల్లాలకు విస్తరించేది కాదని పోలీసు వర్గాల అభిప్రాయం. -
నగదు లావాదేవీలన్నీ స్వైపింగ్ మిషన్లలోనే
ప్రొద్దుటూరు టౌన్: రాబోయే రోజుల్లో నగదు లావాదేవీలన్నీ స్వైపింగ్ మిషన్ల ద్వారానే జరుగుతాయని లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్డీఎం) రఘునాథరెడ్డి తెలిపారు. మంగళవారం మహిళా స్వశక్తి భవన్లో స్వయం సహాయక సంఘాల లీడర్లు, ఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అయినా దాని ఫలితాలు ముందు చాలా ఉన్నాయన్నారు. 24, 25 తేదీల్లో మరో రూ.300 కోట్లు వస్తోందని, ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని వివరించారు. ప్రతి ఒక్క లావాదేవీ చెక్కు, డెబిట్ కార్డు ద్వారానో చేయాలని తెలిపారు. జిల్లాలో 10వేల స్వైపింగ్ మిషన్లను తెప్పిస్తున్నామని అందులో ప్రొద్దుటూరుకు 3 వేలు ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలో 2.48 లక్షల మంది పింఛన్ డబ్బు కూడా బ్యాంకు ఖాతాలోనే పడుతుందని తెలిపారు. 12 రోజుల్లో రూ.1460 కోట్లు బ్యాంకులకు వచ్చి చేరిందని, ఇందులో రూ.650 కోట్లు నోట్ల మార్పిడి జరిగిందన్నారు. మహిళలకు, సీనియన్ సిటిజన్లకు ప్రత్యేక లైన్ మహిళలకు, సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల వద్ద ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకులకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లీడర్లు, సీఓలు ఎల్డీఎం దృష్టికి తీసుకొచ్చారు. కార్పొరేషన్ బ్యాంకులో రూ.500 నోట్లు తీసుకోలేదని సంఘం లీడర్ గజ్జల కళావతి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకర్లు కూడా ఒత్తిడికి గురవుతున్నారని, అందరి సహకారం ఉండాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి మాట్లాడుతూ ప్రధాని తీసుకున్న నిర్ణయం మంచిందని, నల్లధనం బయటికి వస్తుందని, సామాన్య ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఫీల్డ్ ఆఫీసర్లు అనురాధ, మల్లిఖార్జున, పీఆర్పీ కెజియా జాస్లిన్, సీఓలు విమల, సరస్వతి , సంఘ లీడర్లు, ఆర్పీలు పాల్గొన్నారు. -
కోర్టు పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ప్రొద్దుటూరు: కిడ్నాప్ కేసులో జీవిత ఖైదు పడటంతో.. ఓ నిందితుడు కోర్టు భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ప్రొద్దుటూరు న్యాయస్థానంలో గురువారం చోటు చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం కోసలింగాయపల్లికి చెందిన బండి సూర్య అనే బాలుడిని అతని దగ్గరి బంధువైన బండి కృష్ణతో పాటు చిత్తూరు జిల్లా కలకడ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి కిడ్నాప్ చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి నలుగురు నిందితులను కోర్టు ముందు హాజరుపరచగా.. ఈ రోజు ప్రొద్దుటూరు న్యాయస్థానం వారికి జీవిత ఖైదుతో పాటు రూ. 1000 చొప్పున జరిమాన విధించింది. కాగా కోర్టు తీర్పుతో మనస్తాపానికి గురైన బండి కృష్ణ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన కృష్ణను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
ముద్దనూరు: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం ప్రాంతానికి చెందిన నాగరాజు(35) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. యర్రగుంట్ల రైల్వే హెడ్‌కానిస్టేబుల్ దేవదానం సమాచారం మేరకు నాగరాజు మద్యానికి బానిసై అనారోగ్యం పాలయ్యాడు. ఈ నేపథ్యంలో కడుపు నొప్పి తాళలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
వెదుర్లబజార్‌లో అగ్నిప్రమాదం
రూ.4 లక్షల మేర నష్టం ప్రొద్దుటూరు క్రైం: స్థానిక వెదుర్లబజార్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. గూడూరు మనోజ్‌కుమార్ ఫ్యాన్సీ పొరకలు, ఇతర గృహోపకరణాల హోల్‌సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. దీపావళి పండుగ కావడంతో అతను రూ. లక్షలు విలువ చేసే సరుకును తెచ్చాడు. కింద నివాసం ఉండగా మొదటి, రెండో అంతస్తుల్లో దుకాణాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఉన్నట్టుండి రెండో అంతస్తు నుంచి పెద్ద ఎత్తున పొగ రావడంతో మనోజ్‌కుమార్ కుటుంబ సభ్యులు పరుగెత్తుకుంటూ బయటికి వచ్చారు. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పొరకలు, స్ప్రే బాటిళ్లు, ఇతర వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. రెండో అంతస్తులో ఉన్న ఏసీలో మంటలు వ్యాపించడంతో అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సుమారు రూ.4 లక్షలు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. -
కడప అమ్మావారిశాలలో వైఎస్ జగన్
-
అమ్మవారిని దర్శించుకున్న జగన్
-
దేవీ నమోస్తుతే
ప్రొద్దుటూరు కల్చరల్: దసరా ఉత్సవాల నిర్వహణలో రెండో మైసూరుగా ఖ్యాతిగడించిన పసిడిపురి శోభిల్లుతోంది. శనివారం నుంచి దేవీశరన్నవరాత్రులు ప్రారంభం కానుండటంతో ప్రొద్దుటూరుకు కొత్త కళ వచ్చింది. కలకత్తా సెట్టింగ్, గుడియాతం వంటి కళ్లుమిరిమిట్లు గొలిపే పందిరి సెట్టింగ్‌లతో ఆలయాలు కళకళలాడుతున్నాయి. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఉత్సవ కమిటీల వారు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పుట్టపర్తి సర్కిల్, మైదుకూరురోడ్డు, జమ్మలమడుగు రోడ్డులలో భారీ దేవతా సెట్టింగులను ఏర్పాటు చేశారు. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో ఆర్యవైశ్య సభవారు 126వ ఉత్సవాల సందర్భంగా అద్భుతమైన సినీ సెట్టింగ్‌లతో అమ్మవారిని తీర్చిదిద్దనున్నారు. శివాలయం రాజరాజేశ్వరి ఉత్సవకమిటీవారు తమిళనాడు అంబూరు చెందిన కళాకారులతో సెట్టింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దసరా ఉత్సవాలు ప్రారంభం ఇలా.. శ్రీఅగస్త్యేశ్వరస్వామి ఆలయం నుంచి 102 మంది ఆర్యవైశ్యులు శనివారం ఉదయం 6.30 గంటలకు వేదపఠనంతో నవగంగ తీర్థములు శ్రీకన్యకాపరమేశ్వరిదేవి ఆలయానికి తీసుకెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు అమ్మవారిశాల నుంచి మంగళవాయిద్యాలతో బయల్దేరి తెల్లాకుల శివయ్యగారి శ్రీనగరేశ్వరస్వామి ఆలయం నుంచి కన్యకాపరమేశ్వరి దేవి పురాణాన్ని ఆర్యవైశ్యులు తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే శివాలయం రాజరాజేశ్వరి ఉత్సవ కమిటీ వారు, రతనాల వెంకటేశ్వరస్వామి, శ్రీచెన్నకేశ్వస్వామి, రాజరాజేశ్వరి దేవి ఆలయ కమిటీల వారు కలశ పూజచేసి, ఊరేగింపుగా ఆలయానికి తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.