కిడ్నాప్ కేసులో జీవిత ఖైదు పడటంతో.. ఓ నిందితుడు కోర్టు భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కోర్టు పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Published Thu, Nov 17 2016 3:45 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM
ప్రొద్దుటూరు: కిడ్నాప్ కేసులో జీవిత ఖైదు పడటంతో.. ఓ నిందితుడు కోర్టు భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ప్రొద్దుటూరు న్యాయస్థానంలో గురువారం చోటు చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం కోసలింగాయపల్లికి చెందిన బండి సూర్య అనే బాలుడిని అతని దగ్గరి బంధువైన బండి కృష్ణతో పాటు చిత్తూరు జిల్లా కలకడ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి కిడ్నాప్ చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి నలుగురు నిందితులను కోర్టు ముందు హాజరుపరచగా.. ఈ రోజు ప్రొద్దుటూరు న్యాయస్థానం వారికి జీవిత ఖైదుతో పాటు రూ. 1000 చొప్పున జరిమాన విధించింది. కాగా కోర్టు తీర్పుతో మనస్తాపానికి గురైన బండి కృష్ణ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన కృష్ణను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement