ప్రొద్దుటూరులో ప్రవీణ్‌కుమార్ రెడ్డి దీక్షను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు.
వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరులో ఉక‍్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్న ప్రవీణ్‌కుమార్ రెడ్డి దీక్షను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో డాక్టర్లు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబసభ్యులు దీక్ష కొనసాగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.