
సాక్షి, కృష్ణా జిల్లా: ప్రొద్దుటూరు గ్రామంలో దారుణం జరిగింది. రూ.150 రూపాయల అప్పు ప్రాణాలు తీసింది. వెంకటస్వామి వద్ద భుజంగరావు అనే వ్యక్తి 150 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.
భుజంగరావును వెంకటస్వామి ఛాతిపై గట్టిగా కొట్టాడు. దీంతో ఒక్కసారిగా భుజంగరావు కుప్పకూలిపోయారు. భుజంగరావును కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment