
జింకా విజయలక్ష్మి రాజీనామా
ప్రొద్దుటూరు : ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ జింకా విజయలక్ష్మి శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామా లేఖ పంపారు. యధావిధిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ పురోభివృద్ధికి చేస్తానని ఆమె తెలిపారు.
వీరభద్రస్వామి ఆలయ కమిటీ సభ్యుల రాజీనామా
రాయచోటి టౌన్ : రాయచోటి వీరభద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు రాజీనామా చేసినట్లు ఆలయ ఈవో డివి.రమణారెడ్డి తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షురాలు పోలంరెడ్డి విజయతోపాటు కమిటీ సభ్యులు రత్నశేఖర్‌రెడ్డి, ఆర్.నరసింహులు, బి.జయభాస్కర్, ఎం.విజయ, యం.లక్ష్మి, డి.భారతమ్మ, బి.నాగభూషణం, కె.సురేష్‌కుమార్ మూకుమ్మడిగా రాజీనామా చేసినట్లు తెలిపారు. వీరి రాజీనామాలను దేవాదాయ, ధర్మాదాయశాఖకు పంపినట్లు తెలిపారు. పోలంరెడ్డి విజయ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సహకారంతో 92 భవనాల నిర్మాణం (దాతల సహకారంతో) చేపట్టారు. ఆలయంలో నిత్యాన్నదానంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు.
ఘాట్‌లో ప్రమాదం
చింతకొమ్మదిన్నె : కడప రాయచోటి ప్రధాన రహదారిలో గువ్వల చెరువు ఘాట్ వద్ద శనివారం బస్సు–లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారరు. హైదరాబాద్ నుండి చిత్తూరుకు వెళుతున్న బస్సును రాయచోటి వైపు నుంచి కడపకు వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

జింకా విజయలక్ష్మి రాజీనామా