
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. ఆయన అవినీతిపై అధికారులు విచారణ చేస్తే ఆధారాలు చూపిస్తానని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అండతో డీఎస్పీ శ్రీనివాసరావు రూ. రెండు కోట్ల మేర అవినీతి సొమ్ము సంపాదించారని ఆరోపించారు. డీఎస్పీపై గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్నారు. వారం రోజుల్లో శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment