
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరు మండలం కామనూరులో వరదరాజులరెడ్డి తన సోదరులు, అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ నాయకుడు నంద్యాల బాలవరదరాజులరెడ్డి ఇంటిపైకెళ్లి దౌర్జన్యం చేశారు. సెల్‌ఫోన్ లాక్కుని మహిళలను దూషించి భయాందోళనకు గురిచేశారు. నామినేషన్ విత్‌డడ్రా చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఓటింగ్ ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుతో వరదరాజులరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై వరద కుటుంబీకుల దౌర్జన్యం
Comments
Please login to add a commentAdd a comment