varada rajula reddy
-
అధినేత గుర్తింపు కోసంతెలుగుతమ్ముళ్ల తాపత్రయం
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు ముసుగుకు తెలుగుతమ్ముళ్ల స్వప్రయోజనాలు ముడిపడ్డాయి. ఒకే నియోజకవర్గంలో వేర్వేరుగా మూడు చోట్ల నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న మమకారంతో చేస్తున్నారా అంటే తప్పులో కాలేసినట్టే. వారి లక్ష్యం ఒక్కటే. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిత్వం సాధించడం. రేసులో వెనుకంజ వేయరాదనే సంకల్పంతో ఎవరికి వారు దీక్షలు ఆరంభించారు. ఒక నేత ఏకంగా తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. నవ్విపోదురుగాక..నాకేటి సిగ్గు అన్నట్లుగా ఎవరికి వారు ఛీప్ పాలి‘ట్రిక్స్’తెరపైకి తెస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత అరెస్టును నిరసిస్తూ ప్రొద్దుటూరులో తెలుగుతమ్ముళ్లు మూడు చోట్ల నిరసన దీక్షలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నేతృత్వంలో శివాలయం సెంటర్లో దీక్షా శిబిరం ఉండగా, ప్రస్తుత టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తన కార్యాలయం సమీపంలో దీక్షా శిబిరం, అలాగే రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్‌నాయుడు పాతబస్టాండ్ సమీపంలో మరో దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఎవరికీ వారు మమ అనిపిస్తూ దీక్షలు చేయడం వెనుక ఆయా నేతలకు టీడీపీ ప్రొద్దుటూరు టికెట్ దక్కించుకోడమే లక్ష్యంగా కన్పిస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అధినేత చంద్రబాబు మీద ప్రేమ కంటే టికెట్ పోటీలో తాము వెనుకపడి పోరాదనే భావనే మెండుగా కన్పిస్తోంది. ఈక్రమంలోనే 78 ఏళ్ల వయస్సులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి దగ్గరుండీ దీక్షలు చేయించడం విశేషంగా పలువురు వెల్లడిస్తున్నారు. ఆ మాజీలు ఎవరికీవారే... ప్రొద్దుటూరులో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్సీ టీడీపీలో కొనసాగుతున్నారు. ఈస్థాయి నేతలున్నా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందా అంటే అదీ లేదు. కాలం కలిసిరాదా? మరో చాన్స్ దక్కకపోదా? అన్న రీతిలో ఎవరికి వారు టీడీపీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. ‘కొత్త బిక్షగాడు పొద్దు ఎరుగడు’అన్నట్లు కొత్తగా మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. వీరిలో ఒకరు చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ఏకంగా తిరుమలకు పాదయాత్ర చేశారు. ఇలా ఎవరికివారు వేర్వరు కుంపట్లు పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజానీకానికి నవ్వులు తెప్పిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేష్ నాయుడు ముగ్గురు మూడు చోట్ల దీక్షలను కొనసాగిస్తుంటే, పార్లమెంటు అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ కలరింగ్ ఇస్తున్నారు. పాలిట్రిక్స్ ప్రదర్శించడంలో ప్రొద్దుటూరు టీడీపీ నేతల తర్వాతే మరెవ్వరైనా అన్నట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. -
మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అరెస్టు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం ప్రొద్దుటూరు మండలం కామనూరులో వరదరాజులరెడ్డి తన సోదరులు, అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీ నాయకుడు నంద్యాల బాలవరదరాజులరెడ్డి ఇంటిపైకెళ్లి దౌర్జన్యం చేశారు. సెల్‌ఫోన్ లాక్కుని మహిళలను దూషించి భయాందోళనకు గురిచేశారు. నామినేషన్ విత్డడ్రా చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఓటింగ్ ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుతో వరదరాజులరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై వరద కుటుంబీకుల దౌర్జన్యం -
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో కిడ్నాప్ కలకలం
-
సినీ ఫక్కీలో డిస్ట్రిబ్యూటర్ కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: సినిమా పంపిణీదారుడు శివ గణేష్‌పై కడప జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి దౌర్జన్యం చేశాడు. శివ గణేష్‌ని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి భూ దస్త్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. తుపాకులు, కత్తులతో తన అనుచరులతో కలిసి హల్చల్ చేశాడు. ఈ ఘటన నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుని ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కొండారెడ్డి, అతని గ్యాంగ్‌లోని 10 మందిపై కేసు నమోదు చేశారు. తుపాకులు, కత్తులు చూపించి కొండారెడ్డి తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడని శివ గణేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. శామీర్‌పేట, కడప జిల్లాకు చెందిన భూమికి సంబంధించిన పత్రాలపై కొండారెడ్డి గ్యాంగ్ బలవంతంగా సంతకాలు చేయించుకుందని తెలిపాడు. నాలుగు టీమ్‌ల ఏర్పాటు శివ గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారుంటూ కొండారెడ్డితో పాటు మరో పదిమందిపై శివగణేష్ ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. తుపాకులతో బెదిరించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు మొత్తం నాలుగు టీమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, బాధితుడు శివగణేష్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయనున్నారు. -
‘ఆ డీఎస్పీ అవినీతిపై విచారణ చేస్తే ఆధారాలు చూపిస్తా’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. ఆయన అవినీతిపై అధికారులు విచారణ చేస్తే ఆధారాలు చూపిస్తానని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అండతో డీఎస్పీ శ్రీనివాసరావు రూ. రెండు కోట్ల మేర అవినీతి సొమ్ము సంపాదించారని ఆరోపించారు. డీఎస్పీపై గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్నారు. వారం రోజుల్లో శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
సీఎం రమేష్ పంచాయతీకి ఎక్కువ..మండలానికి తక్కువ
-
నీకు దమ్ముంటే కడపలో రాజకీయాలు చేయి
ప్రొద్దుటూరు టౌన్(వైఎస్సార్‌కడప): ఎంపీ సీఎం రమేష్‌పై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రొద్టుటూరులోని నెహ్రూ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ రమేష్ గుంపులను తయారు చేసుకుని వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరులో నిలబెట్టాలన్న ఆలోచనతోనే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీని వల్ల పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. వైఎస్సార్సీపీతో సంబంధాలను నెరుపుతూ పార్టీకి నష్టం చేస్తున్నారని తెలిపారు. సీఎం రమేష్ కాల్ డేటాను పరిశీలిస్తే స్థానిక వైఎస్సార్సీపీ నాయకులకు ఫోన్లు చేసిన విషయం బయటపడుతుందన్నారు. దమ్ము, ధైర్యముంటే కడప, పులివెందుల మున్సిపాలిటీల్లో రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. గతంలో చెప్పినట్లు గ్రామ రాజకీయాలకు ఎక్కువ, మండల రాజకీయాలకు తక్కువ అన్నారు. దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తన సత్తాను చాటుకోవాలన్నారు. మున్సిపాలిటీలో రాజకీయాలు చేసేందుకు తాము అంగీకరించమని, సీఎం రమేష్ నాయకత్వాన్ని ఎవరూ కోరుకోవడం లేదని చెప్పారు. వరదరాజులరెడ్డి, సీఎం రమేష్ పరిస్థితి ఏమిటో సీఎం చంద్రబాబుకు కూడా తెలుసునన్నారు. సీఎంకు మరో మారు ఫిర్యాదు ప్రొద్దుటూరు వ్యవçహారంపై సీఎంకు మరో మారు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తన వర్గీయులతో సమావేశం పెట్టి మున్సిపల్ చైర్మన్‌కు తెలపలేదన్నారు. రూ.80 కోట్లు ఖర్చు పెట్టాలంటే నిబంధనల ప్రకారం చేయాలన్నారు. 40 మంది కౌన్సిలర్లలో 22 మంది కౌన్సిలర్లను తాను డబ్బు పెట్టి గెలిపించానన్నారు. ఇప్పుడు నీవు డబ్బు పెట్టి కొందరిని నీ పక్కకు తిప్పుకున్నావని, తన వద్ద డబ్బు ఉంటే మరో 10 మంది కౌన్సిలర్లను కొనేవాడనన్నారు. తాను ఇచ్చిన డబ్బు పాతపడిపోయింది కాబట్టి నీ వద్దకు వచ్చారన్నారు. తనకు ఎంత చెడ్డపేరు తేవాలని నీవు ప్రయత్నించినా అవి ఫలించవన్నారు. ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాల వల్ల నీకు రెండో సారి రాజ్యసభ సీటు దక్కిందన్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, అన్ని చోట్ల రాజకీయాలు చేసి పార్టీని నాశనం చేస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులో ఎంపీ రమేష్ తమ్ముడును నిలపాలని ఉన్నారని, అతనికి కూడా మా సహకారం కావాలి కదా అని అన్నారు. పార్టీలో ఎవరికి సీటు ఇచ్చినా తలవంచి పనిచేస్తామన్నారు. వేల కోట్లు అక్రమార్జన చేసి ఫ్లైట్లల్లో తిరిగితే ప్రజలెవ్వరు నమ్మరన్నారు. -
అభ్యర్థిని ప్రకటించే అర్హత అతనికి ఉందా...
-
ఎంపీ రమేష్ వర్సెస్ వరద
ప్రొద్దుటూరు టౌన్ : రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మధ్య వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది. శనివారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో ఎంపీ రమేష్ నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాన్ని అడ్డుకుని తాడోపేడో తేల్చుకునేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డి, ఆయన వరీ ్గయులు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీగా బయల్దేరారు. మున్సిపల్ కార్యాలయానికి వస్తే పరిస్థితి చేయిదాటిపోతుందని పసిగట్టిన పోలీసులు జమ్మలమడుగు, మైదుకూరు డీఎస్పీలతో పాటు ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు పట్ట ణంలో పలు ప్రాంతాల్లో పోలీసులను ఏర్పాటు చేసి ర్యాలీని అడ్డుకున్నారు. చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి లేకుం డా ఆయన చాంబర్లో కూర్చొని ఎంపీ రమేష్ అధికారులతో ఏవిధంగా సమీక్ష నిర్వహిస్తారని వరదరాజులరెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ కార్యాలయానికి వెళుతుంటే పోలీసులు తమను అడ్డుకుని అక్కడ సమావేశం నిర్వహించడానికి సహకరించడంపై వరద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు. ఎంపీ రమేష్ పోటుగాడా అంటూ వరద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట మున్సిపల్ కార్యాలయంలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. నడిరోడ్డుపై తోపులాట పోలీసులను తోసివేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వరదరాజులరెడ్డి, ఆయన వర్గీయులను పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించి ఆపారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వరరెడ్డిని టూటౌ న్ ఎస్ఐ, పోలీసు సిబ్బంది లాక్కెళ్లి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. వరదరాజులరెడ్డిని రూరల్ సీఐ ఓబులేసు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లినా ఆయన అక్కడ ఉండకుండా బయటికి వచ్చారు. రోడ్డుపై ధర్నాతో స్తంభించిన ట్రాఫిక్ వరదరాజులరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రఘురామి రెడ్డి, ఆయన వర్గీయులు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా రోడ్డుపై కూర్చొని దాదాపు గంటన్నరకుపైగా ధర్నా చేశారు. ఎంపీ రమేష్‌తోపాటు పోలీçసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగసారాయి అమ్ముకుంటున్న రమేష్‌నాయుడు రూ.కోట్లు వెదజల్లి మున్సిపల్ కౌన్సిలర్లను తన వైపునకు తిప్పుకున్నారని ఆరోపించారు. ఇక అతని ఆటలు సాగనివ్వమని తేల్చి చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం అనంతరం ఎంపీ రమేష్, ఆయన వర్గీయులు కార్యాలయం నుంచి వెళ్లిపోయారని తెలుసుకున్న వరదరాజులరెడ్డి, ఆయన వర్గీయులు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చేందుకు బయల్దేరారు. గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు రాగానే వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, డీఎస్పీ, పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లనివ్వమన్నారు. నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయానికి వరదరాజులరెడ్డిని పంపించారు. ఇక్కడ అరగంటపాటు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వరద వర్గీయులకు తోపులాట జరిగింది. ట్రాఫిక్ మళ్లింపు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద నాలుగు రోడ్లను పోలీ సులు దిగ్బంధనం చేశారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా పాత బస్టాండ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీ సులు ట్రాఫిక్‌ను మళ్లించారు. కొర్రపాడు రోడ్డు మీదుగా వచ్చే బస్సులు వాహనాలను దారి మళ్లిం చారు. రాజీవ్ సర్కిల్లో ఆర్అండ్బీ కార్యాలయం రోడ్డును దిగ్బంధనం చేశారు. రోడ్డుకు అడ్డుగా తోపుడు బండ్లను పెట్టి ఎవరిని అనుమతించలేదు. కళాశాలలు, కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు తీవ్రఇక్కట్లు ఎదుర్కొన్నారు. -
అతని స్థాయి ఏమిటీ? అభ్యర్థిని ప్రకటించే అర్హత ఉందా...
సాక్షి ప్రతినిధి కడప: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్థాయి పంచాయతీకి ఎక్కువ మండలానికి తక్కువ ప్రకటనతో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి టార్గెట్ అయ్యారా.. ఆ మేరకే రాజకీయంగా దెబ్బకొట్టాలనే ఆలోచన తలెత్తిందా....తన కుటుంబానికి పార్టీ పగ్గాలు అప్పగించాలనే వ్యూహాత్మక ఎత్తుగడలు అవలంబిస్తున్నారా...తరచూ వివాదాస్పద ఘటనలు కావాలనే తెరపైకి తెస్తున్నారా....ఇన్చార్జిని విస్మరిస్తూ వైరివర్గాన్ని ప్రోత్సహించడానికి కారణం అదేనా? అని ప్రశ్నిస్తే అవుననే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పంచాయతీకి ఎక్కువ..మండలానికి తక్కువ సీఎం రమేష్ పార్లమెంట్లో మెంబర్ అయినా అప్పటి సారా కాంట్రాక్టర్ పోట్లదుర్తి సీఎం సుబ్బానాయుడు మనవడే. ఇది జగమెరిగిన సత్యం. కాగా ‘మొగుడు కొట్టినందుకు కాదు...తోడికోడలు నవ్వినందుకు కోపం’ అన్నట్లుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ శైలి కన్పిస్తోంది. కన్పిస్తే కాల్చివేత రోజులు వస్తాయని సీఎం రమేష్‌ను ఉద్దేశించి మంత్రి ఆది బహిర్గతమయ్యారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ‘సీఎం రమేష్ స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’ అలాంటి వ్యక్తిని చంద్రబాబు ప్రోత్సహించి రాజ్యసభ సీటు ఇస్తే కాంట్రాక్టు పనుల్లో కమీషన్లు తీసుకుంటూ దోపిడీ చేయడమే కాకుండా వర్గరాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వాస్తవమే అయినప్పటికీ సీఎం రమేష్ వ్యక్తిగత స్థాయి పట్ల బహిర్గతం కావడం, మంత్రి ఆదితో కలిసిమెలిసి ఉండడంతో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి టార్గెట్ అయ్యారని పరిశీలకులు పేర్కొంటున్నారు. దానికి తోడు ప్రొద్దుటూరు పట్ట ణం సమీపంలోనే పోట్లదుర్తి ఉండడంతో నియోజకవర్గంపై తన కుటుంబ సభ్యులు ఆశలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో వ్యూహాత్మక ఎత్తుగడ అవలంబిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. గ్రూపులతో తలబొప్పి టీడీపీకి గ్రూపు రాజకీయాలతో తలబొప్పి కడుతోంది. శనివారం చేపట్టిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆ విషయం మరోమారు తేటతెల్లౖ మెంది. రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తనయుడు ప్రసాద్‌బాబు టీడీపీ నేతల తీరుపై ధ్వజమెత్తారు. మాకు ఏమాత్రం సమాచారం లేకుండానే నగరదర్శిని చేపడుతున్నారని, పైగా పార్టీకి చెందిన రాంగోపాల్‌రెడ్డి రాయచోటి టీడీపీ అభ్యర్థి రమేష్‌రెడ్డి అని ఎలా ప్రకటిస్తాడు, అతని స్థాయి ఏమిటీ? అసలు అభ్యర్థిని ప్రకటించే అర్హత ఉందా... ఎవడతడంటూ నిలదీశారు. అలాగే ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించవద్దని సీఎం స్పష్టంగా చెబుతున్నా జిల్లాలో గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది టీడీపీలోకి వచ్చిన తనపట్ల వివక్ష చూపుతూ వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తర్వాత తానే సీనియర్‌ను, జిల్లా అధ్యక్షుడు సమర్థవంతంగా పనిచేసినప్పటికీ తనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా కమిటీలు ఎంపిక నుంచి ఏకపక్ష చర్యలు చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కడప నేతలు సీఎం రిలీఫ్ పండ్ వ్యవహారంపై మండిపడ్డారు. అనేకమంది టీడీపీ కార్యకర్తకు సీఎం రిలీఫ్ ఫండ్ అందడం లేదని, కొంతమంది పార్టీలో చేరిన వ్యక్తులు కమీషన్లకు కక్కుర్తిపడి స్థితిమంతులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా డబ్బులు ఇప్పిస్తున్నారని, పాత కడపలో ఓ కుటుంబానికి రూ.10లక్షలు ఇప్పించడమే అందుకు నిదర్శనమని రగలిపోయారు. ఎవరిస్థాయిలో వారు పార్టీలో పైచేయి సాధించాలనే తపన ఉండడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని టీడీపీ సీనియర్ నాయకుడొకరు సాక్షితో వాపోవడం విశేషం. -
సీఎం రమేష్‌కు అంత సీన్ లేదు: వరదరాజులు రెడ్డి
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ సీఎం రమేష్‌పై మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ వరదరాజులురెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచే సత్తా సీఎం రమేష్‌కు లేదని, చంద్రబాబు నాయుడు దయవల్లే ఆయన ఎంపీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదరాజులరెడ్డి శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...‘ సీఎం రమేష్ స్థాయి గ్రామ పంచాయతీకి ఎక్కువ. మండలానికి తక్కువ. నేరుగా ఎన్నికల్లో గెలిచే సత్తా లేక జిల్లాలో గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రూపులు ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు. నామినేటెడ్ పదవులతో పబ్బం గడుపుకునే సీఎం రమేష్‌కు వర్గ రాజకీయాలు ఎందుకు?. కుందూ, పెన్నా వరద కాలువ విషయంలో సీఎం రమేష్ అయిదు శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దొంగ ఆస్తులను తనఖా పెట్టి వేలకోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నాడు.’ అంటూ ఆరోపణలు గుప్పిచ్చారు. -
రసకందాయంలో రాజకీయం
– శిబిరానికి వెళ్లిన లింగారెడ్డి వర్గ 14 మంది కౌన్సిలర్లు – దిక్కుతోచని స్థితిలో వరదవర్గం – కీలకమైన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ మొదలైంది. టీడీపీలోనే వరద, లింగారెడ్డి వర్గాలుగా ఏర్పడిన కౌన్సిలర్లు ఎవరికి వారు బలాబాలాలు నిరూపించుకుంటున్నారు. లింగారెడ్డి వర్గానికి చెందిన 14 మంది శిబిరానికి వెళ్లడంతో వరద వర్గీయ కౌన్సిలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చైర్మన్ పదవిని ఎవరు చేపట్టాలన్నా వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఓట్లే కీలకమయ్యాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికకు ఈనెల 15న అత్యవసర సమావేశాన్ని ఎన్నికల కమిషనర్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉండేల గురివిరెడ్డితో చైర్మన్ పదవికి రాజీనామా చేయించిన టీడీపీ నాయకులు రెండో చైర్మన్ అభ్యర్థిగా ఆసం రఘురామిరెడ్డిని కేటాయించారు. ఆసం రఘురామిరెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డి వర్గీయుడు కావడంతో లింగారెడ్డి వర్గంలో ఉన్న విఎస్ ముక్తియార్‌తోపాటు టీడీపీకి చెందిన కౌన్సిలర్లు ఆరు మంది వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 7 మంది కౌన్సిలర్లు ఒక వర్గంగా ఏర్పడి శుక్రవారం ఉదయం శిబిరానికి వెళ్లారు. అంతా వరదరాజులరెడ్డి చూసుకుంటాడని మొదటి నుంచి చెబుతున్న ఆసం రఘురామిరెడ్డి షాక్‌కు గురయ్యాడు. అధిష్ఠానం చెబితే ముక్తియార్ వర్గం కూడా వింటుందని ఆశించిన వరద వర్గీయ కౌన్సిలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వరదరాజులరెడ్డి చైర్మన్ అభ్యర్థిగా ఎవరిని నిలిపినా వ్యతిరేకిస్తామని టీడీపీ కౌన్సిలర్లు ఐదు మంది తేల్చి చెప్పడం చూస్తుంటే ఆసం రఘురామిరెడ్డికి చైర్మన్ సీటు దక్కుతుందన్న ఆశలు అడియాశలుగానే మిగలనున్నాయి. డబ్బే డబ్బు...: కొద్ది రోజుల క్రితం ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో కౌన్సిలర్‌కు రూ.5లక్షలు నజరానా అందడం, ఇప్పుడు చైర్మన్ సీటుకు పోటీ ఏర్పడటంతో ఒక్కొక్కరికి రూ.10లక్షలకుపైగా ఇచ్చేందుకు శిబిరానికి వెళ్లిన వర్గం సిద్ధమైందని సమాచారం. అయితే వరద వర్గంలో ఉన్న ఆసం రఘురామిరెడ్డి ఏ ఒక్క కౌన్సిలర్‌తో కూడా ఈ సమయంలో చర్చించలేదని, అంతా అధిష్ఠానం పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ఎందుకు ఓటు వేయాలని కొందరు వరద వర్గ కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యాడు, ఆయన చెబితే ముక్తియార్ వర్గం కూడా వింటుందని చెప్పుకోవడం తప్ప వరద వర్గ కౌన్సిలర్లలో చైర్మన్ సీటు మాకే దక్కుతుందనే భరోసా కనిపించడం లేదు. కీలకమైన వైఎస్సార్సీపీ: ఎవరికి చైర్మన్ పదవి దక్కాలన్నా ఇప్పుడు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఓట్లే కీలకమయ్యాయి. 9 మంది కౌన్సిలర్లతోపాటు ఒక ఓటు ఎక్స్ అఫిసియో మెంబర్ అయిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఉండటంతో మొత్తం 10 ఓట్లు ఉన్నాయి. ముక్తియార్ వర్గంలో 14 మంది కౌన్సిలర్లు ఉండగా వరద వర్గంలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారని చెప్పుకుంటున్నారు. వరదవర్గంలో చివరకు 10 మందే మిగులుతారని ముక్తియార్ సవాల్ చేశారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఎవరు చైర్మన్ సీటులో కూర్చోవాలన్నా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే కీలకమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆసం రఘురామిరెడ్డి చైర్మన్ అవుతాడన్న నమ్మకం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందిలో ఉన్న కౌన్సిలర్లు వరద శిబిరానికే చేరుకోనున్నారు.