కడపలో టీడీపీ చెత్త పాలిటిక్స్‌.. భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ | TDP Leaders Over Action On Waste Politics In YSR Kadapa, Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

కడపలో టీడీపీ చెత్త పాలిటిక్స్‌.. భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ

Published Tue, Aug 27 2024 11:42 AM | Last Updated on Tue, Aug 27 2024 1:33 PM

TDP Leaders over action on Waste politics in ysr kadapa

వైఎస్సార్‌ కడప, సాక్షి: వైఎస్సార్‌ కడపలో టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్‌కు పాల్పడ్డారు. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గత మూడు రోజులుగా చెత్తపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చెత్తను కార్పొరేటర్లు మేయర్ ఇంటి ముందు వెయ్యాలని టీడీపీ నేతలను మాధవి రెడ్డి రెచ్చగొట్టారు. దీంతో ఇవాళ టీడీపీ నేతలను మేయర్ ఇంటి వద్దకు పంపించి చెత్తను వేయాలని ఆదేశించారు. 

టీడీపీ  ఎమ్మెల్యే, నేతలు చేస్తున్న చెత్త పాలిటిక్స్‌పై  వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో ఇలాంటి రెచ్చగొట్టి రాజకీయాలు చేయవద్దని వైఎస్సార్‌సీపీ నేతలు సూచిస్తున్నారు. ఇన్ని ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెచ్చగోట్ట రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.

మేయర్‌ ఆగ్రహం
తన ఇంటి ముందు చెత్త వేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట మేయర్ సురేష్ బాబు ధర్నాకు దిగారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా చేరి ధర్నాలో పాల్గొన్నాయి. ఈ  సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘చెత్త పై టీడీపీ నేతలను రెచ్చగొట్టి తన ఇంటి ముందు చెత్త వేసేలా ఎమ్మెల్యే చేయడం దుర్మార్గం. హుందాగా వ్యవహరించాలని గతంలోనూ ఆమెను మేం కోరాం. గెలిచిన మూడు నెలలకే ఇలాంటి నీచపు రాజకీయాలా?. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. కడపలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవు. టీడీపీ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. ఇంటికొచ్చి చెత్త వేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడపలో అల్లర్లు చేస్తున్నారు. హత్యారాజకీయాలు చేస్తున్నారు. నా ఇంటి ముందు చెత్త వేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కఠినంగా శిక్షించాలి.
 

మేయర్ ఇంట్లో చెత్త వేయించిన టీడీపీ ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement