
పుట్టా సుధాకర్ యాదవ్
సాక్షి, ప్రొద్దుటూరు: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపన్ను శాఖ సోదాలు కలకలం రేపాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు బుధవారం దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టా నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్టా పోటీ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్ ఏ1 కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఐటీ దాడులతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
సీఎం రమేశ్ వాగ్వాదం
పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్కడికి దూసుకొచ్చారు. ఐటీ అధికారులతో దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగారు. సీఎం రమేశ్ వ్యవహారశైలిపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment