Putta sudhakar yadav
-
మైదుకూరు టీడీపీలో ముసలం
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం జెండా మోసిన నియోజకవర్గ ఇన్చార్జిలకు అధిష్టానం మొండిచేయి చూపనుందా? సర్వేల పేరుతో పక్కన పెడుతున్నారా? అనూహ్యంగా ఆయా మాజీ నేతలను తెరపైకి తెస్తున్నారా.. అంటే..రాజకీయ విశ్లేషకులు ఔనని సమాధానమిస్తున్నారు. ఆ మేరకే జిల్లాలో మూడు నియోజకవర్గాలల్లో ప్రధానంగా మార్పులు చేర్పులు చేయాలనే దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా మైదుకూరు నియోజకవర్గం ఒక్కటి. ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డిని తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. 2014, 19 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్ మైదుకూరు నుంచి తలపడి వైఎస్సార్సీపీ అభ్యర్థి శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. వరుసగా ఓటమి మూటగట్టుకున్న సుధాకర్‌యాదవ్ మరోమారు 2024లో పోటీలో తలపడి అదృష్టం పరీక్షించుకోవాలని తలచారు. కాగా టీడీపీ అధిష్టానం చేయించుకున్న సర్వేలు పుట్టాకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. మైదుకూరులో టీడీపీ పట్ల అంతంత మాత్రమే ఆదరణ లభించగా, వ్యక్తిగత సర్వేల్లో పుట్టా సుధాకర్ బాగా వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో పుట్టా స్థానంలో మాజీ ఎమ్మెల్యే డీఎల్‌ను తీసుకొస్తే పోటీ ఇవ్వగలమనే అంచనాకు టీడీపీ అధినేత వచ్చినట్లు తెలుస్తోంది. ఆమేరకు సమాలోచనలో పడినట్లు సమాచారం. డీఎల్‌తో చర్చించేందుకు సన్నాహాలు.... టీడీపీ నిర్వహించిన సర్వేల ఆధారంగా మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డితో చర్చించేందుకు ఆ పార్టీ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతలను హైదరాబాద్ పార్టీ కార్యాలయం కేంద్రంగా ఇద్దరు నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ముందుగా ఆ ఇద్దరు నేతలు మైదుకూరుపై కూలంకషంగా చర్చించిన తర్వాత అధినేత చంద్రబాబుతో మంతనాలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ మేరకు తొలిదశ చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. సంపూర్ణంగా మరోమారు వారంలోపు చర్చించిన పిదప అధినేతతో అన్ని విషయాలు తెలియజేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే డీఎల్‌తో ముఖాముఖీ నిర్వహించినున్నట్లు విశ్వసనీయ సమాచారం. పుట్టా సుధాకర్‌యాదవ్ కినుక... అధిష్టానం నుంచి సర్వే సంకేతాలు అందుకున్న పుట్టా సుధాకర్‌యాదవ్ డైలామాలో పడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్ లాంటి ప్రధాన నాయకుల పర్యటనలో మినహా తర్వాత రోజులల్లో మైదుకూరులో కన్పించడం లేదు. పక్షం రోజులకు ఓమారు అలా వచ్చి వెళ్తున్నారు. నారాలోకేష్ యువగళం పర్యటన, చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమాలల్లో మాత్రమే నియోజకవర్గంలో పుట్టా కన్పించడం విశేషం. మైదుకూరు టీడీపీ టికెట్‌పై స్పష్టత లేకపోవడం, అధిష్టానం ప్రత్యామ్నాయ చూపులను పసిగట్టిన పుట్టా సన్నిహితుల వద్ద టీడీపీపై మండిపడుతోన్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు, కమలాపురంలలో సైతం.... టీడీపీ అధిష్టానం ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే, విజయం కోసం కృషి చేయాలని, తర్వాత మీ భవిష్యత్ నాదేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాతే మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరులో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కమలాపురంలో టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డిది సైతం అదే పరిస్థితి. టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలనే దిశగా సూచనలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమారు కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరికలు పంపినట్లు సమాచారం. రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ మాజీ నేత పట్ల టీడీపీ అధినేత ఆకర్షితులవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు వివరిస్తున్నారు. -
రచ్చ రచ్చ.. మైదుకూరు టీడీపీలో డీఎల్ ‘చిచ్చు’
సాక్షి ప్రతినిధి, కడప: రాబోయే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ టిక్కెట్ నాకంటే నాకంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌లు పోటీపడి ప్రచారం చేస్తున్నారు. దీంతో పచ్చ పార్టీలో రచ్చ రోడ్డెక్కింది. పార్టీలో చేరకుండానే సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశారు. ఔట్‌డేటెడ్ డీఎల్‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని, రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని పుట్టా సుధాకర్ యాదవ్ వర్గం తేల్చి చెబుతోంది. దీంతో మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. చదవండి: టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.40 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. జులై నెల నుంచి నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రచారం చేయనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. దశాబ్దకాలంగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న డీఎల్ ఇటీవలి కాలంలో అధికార పార్టీపై పనిగట్టుకుని విమర్శలకు దిగుతూ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మధ్యే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను డీఎల్ హైదరాబాదులో కలిశారు. తర్వాత నియోజకవర్గానికి వచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తన అనుయాయులతోపాటు మీడియాకు వెల్లడించారు. త్వరలోనే నియోజకవర్గంలో తిరుగుతానని చెప్పిన డీఎల్ అందుకోసం వేద పండితులను సంప్రదించి ముహూర్తం సైతం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోగా మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని టీడీపీ అధిష్టానంపై డీఎల్ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో మైదుకూరులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తప్ప మిగిలిన వ్యక్తులు ఇప్పటివరకు గెలువలేదని చంద్రబాబు, లోకేష్‌లకు గణాంకాలతో డీఎల్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకే టిక్కెట్ ఇవ్వాలని, ఒకవేళ సుధాకర్ యాదవ్‌కు ఇచ్చినా గెలిచే ప్రసక్తే లేదని డీఎల్ తేల్చి చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు ఎటూ తేల్చకపోవడంతో వెనుదిరిగి వచ్చిన ఆయన తనకే టిక్కెట్టు అంటూ మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. డీఎల్‌ది మైండ్ గేమ్....టిక్కెట్ నాదే! రాబోయే ఎన్నికల్లోనూ మైదుకూరు టిక్కెట్ తనకేనని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ధీమాగా ఉన్నారు. డీఎల్‌కు టీడీపీ టిక్కెట్ అన్న ప్రచారం నేపథ్యంలో ఆయన మూడు రోజుల కిందట పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం డీఎల్ మైండ్ గేమ్ మాటలు ఎవరూ నమ్మవద్దని నియోజకవర్గంలోని తన వర్గీయులకు తేల్చి చెప్పారు. సుధాకర్ యాదవ్ ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఆర్థికంగా నష్టపోయాడని, రెండుసార్లు ఓడిపోయాడన్న సానుభూతితోపాటు ఆర్థికంగా బలోపేతంగా ఉండడం ఆయనకు రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గం మొత్తం సుధాకర్ యాదవ్‌కు అండగా నిలవనుందని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో సుధాకర్‌యాదవ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ వర్గం ఈ దఫా ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవైపు డీఎల్ చెప్పిన రెడ్డి సామాజిక వర్గ సెంటిమెంట్‌ను పదేపదే చంద్రబాబు, లోకేష్ చెవిలో వేస్తున్నట్లు తెలుస్తోంది. రచ్చకెక్కిన వర్గ విబేధాలు మైదుకూరు టీడీపీ టిక్కెట్ తనకేనంటూ డీఎల్ రవీంద్రారెడ్డి తెరపైకి రావడంతో పార్టీలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. సుధాకర్‌యాదవ్‌ను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాలు డీఎల్‌కు టిక్కెట్ అంటూ ప్రచారం చేస్తుండగా సుధాకర్‌యాదవ్‌కు టిక్కెట్ ఇ వ్వకపోతే పార్టీనే వీడుతామని ఆయన అనుచరవ ర్గం అంటున్నారు. ఒకవేళ డీఎల్‌కు టిక్కెట్టు ఇచ్చినా ఆయనను ఓడగొట్టడం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా మైదుకూరు టీడీపీ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా ప్రత్యర్థి వర్గం సహకరించే పరిస్థితి లేదు. -
‘నిరూపించకపోతే సెంటర్లో నిలబడి లెంపలేసుకో’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అటవీ భూముల ఆక్రమణపై టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపణలను మైదుకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆసైన్మెంట్ కమిటీ ద్వారా ఎంతో మంది పేదలకు పట్టాలు ఇచ్చినట్లు, బి.మఠంలో తనకు ఒక్క సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. తను అటవీశాఖ భూములను ఆక్రమించినట్లు చేసిన ఆరోపణలను నెల రోజుల్లో నిరూపించాలని పుట్టా సుధాకర్ యాదవ్‌కు సవాల్ విసిరారు. (బలమైన శక్తుల పేర్లు ఉన్నందు వల్లేనా!?) ఆక్రమణ జరిగినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నిరూపించని పక్షంలో మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో తప్పు ఒప్పుకొని లెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరంగా తీసుకొనే చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, అప్పట్లో ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లు సంపాదించారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి తనను విమర్శించే హక్కు లేదన్నారు. తొందరలోనే సుధాకర్ యాదవ్ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని పేర్కొన్నారు. (ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా విజేతలు!) -
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి
-
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి అధ్యక్షునిగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం ఆయన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ హిందూ దేవదాయ, ధర్మాదాయ చట్టం, 1987ను అనుసరించి ఈ నియామకం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోర్డులో ఇతర సభ్యుల నియామకాన్ని త్వరలోనే చేపడతామని తెలిపారు. ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయానా తోడల్లుడు. వైఎస్ మరణం తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో స్థాపించిన వైఎస్సార్సీపీలో వైవీ దశాబ్ద కాలంగా క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014లో ఆయన ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలోనూ,వెలుపల పోరాడారు. హోదా కోసం సహచర ఎంపీలతోపాటు ఆయన తన పదవిని త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయక పోయినా పార్టీ గెలుపు కోసం గట్టి కృషి చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. కాగా, తనను టీటీడీ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత తిరుమలకు బయలుదేరిన సుబ్బారెడ్డి మార్గ మధ్యలో తిరుపతి పద్మావతిపురంలో ఉంటున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అతంతరం వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారి మెట్ల మార్గం మీదుగా తిరుమల వెళ్లారు. పాత పాలక మండలి రద్దు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సహా పలువురు సభ్యుల రాజీనామాల అనంతరం ముగ్గురు సభ్యులతో మిగిలిన దేవస్థానం పాలక మండలిని పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ పాలకమండలి సమావేశం కావాలంటే కనీసం ఐదుగురు సభ్యుల కోరం అవసరమని, పలువురు సభ్యుల రాజీనామాల అనంతరం ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి ముగ్గురు సభ్యులే మిగలడం వల్ల ఈ పాలకమండలి కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉండదని టీటీడీ ఈవో ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరడంతో పూర్తి స్థాయిలో కొత్త పాలక మండలి ఏర్పాటుకు వీలుగా పాత పాలక మండలిని పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, జీవో జారీ
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. అలాగే గత పాలక మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొంది. త్వరలో కొత్త బోర్డు సభ్యుల నియామకం చేపట్టనుంది. కాగా నూతన చైర్మన్‌గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు గరుడ ఆళ్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తిరుపతి చేసుకున్న వైవీ సుబ్బారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. -
టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి గత లోక్‌సభలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో జరిగిన పోరాటంలో వైవీ పార్టీ తరపున అగ్రభాగాన నిలిచారు. చివరకు సహచర ఎంపీలతో పాటుగా పదవీ త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ అంతర్గతంగా జరిగిన సర్దుబాట్ల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు స్థానం నుంచి పోటీ చేయకుండా ఉండి పోయారు. కాగా టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా రాజీనామా
-
టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా రాజీనామా
సాక్షి, తిరుమల: ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా కోరారు. ఇప్పటికే పలువురు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో నైతిక బాధ్యత వహించి నామినేటెడ్ సంస్థల చైర్మన్లు, సభ్యులు రాజీనామా చేస్తున్నారు. కానీ, టీటీడీ పాలకమండలి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. సాంకేతిక అంశం సాకుతో నిన్న మొన్నటి వరకూ టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసేది లేదని... తమని ప్రభుత్వం నియమిస్తేనే ప్రమాణ స్వీకారం చేశామని, వాళ్లు రద్దు చేస్తేనే పదవులు వదులుకుంటామని, స్వచ్చందంగా మాత్రం రాజీనామా చేయనంటూ పుట్టా సుధాకర్ యాదవ్ భీష్మించుకున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన చివరకు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. -
టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌పై ఫిర్యాదు
సాక్షి, తిరుమల: టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ ఫిర్యాదు చేశారు. తాను సిఫారసు చేసిన వారిందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటూ స్విమ్స్ డైరెక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇవ్వాలని సుధాకర్ యాదవ్ కోరుతుండటంతో స్విమ్స్ డైరెక్టర్ ఈ విషయంపై టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారణ నిర్వహించిన టీటీడీ అధికారులు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినా..ఆ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ ఇంకా అదే పదవిలో కొనసాగుతుండటం గమనార్హం. -
అర్ధాంతరంగా ముగిసిన టీటీడీ బోర్డు సమావేశం
-
కొండపై రాజకీయం
సాక్షి, తిరుపతి/తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్యుల పాచిక పారలేదు. పది మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పించడం, కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శల నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశం చివరకు అర్ధంతరంగా ముగిసింది. టీటీడీ ఈవో, జేఈవో సమావేశాన్ని బహిష్కరించడంతో సభ్యుల వ్యూహం బెడిసికొట్టింది. తర్వాత పది నిముషాల్లో చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులు కూడా సమావేశాన్ని ముగించారు. టీటీడీ అధికారుల తీరుకు నిరసనగా పాలకమండలి సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చైర్మన్ పుట్టా చెప్పారు. తిరుమల జేఈవోపై విమర్శలు గత ప్రభుత్వం హయాంలో నియమించిన టీటీడీ పాలకమండలి సభ్యులు మంగళవారం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తిరుమల అన్నమయ్య భవన్లో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశం ప్రారంభం కాగానే తిరుమల జేఈవోపై పలువురు బోర్డు సభ్యులు దర్శన టికెట్లకోసం విమర్శలు చేయడంతో రసాభాసగా మారింది. దీంతో జేఈవో శ్రీనివాసరాజు బయటకు వచ్చేశారు. టికెట్ల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటి విషయాలు జేఈవో పరిధిలోనిది అని బోర్డు సభ్యులకు ఈవో ఎకె సింఘాల్ వివరించారు. అనంతరం సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కూడా బయటకు వచ్చారు. తర్వాత బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి బయటకు వచ్చి తన రాజీనామా లేఖను ఈవోకు ఇచ్చి వెళ్లిపోయారు. మరో పది నిమిషాల తర్వాత బోర్డు చైర్మన్ పుట్టా కూడా సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు పాలకమండలి కొనసాగుతుందని చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. రాజీనామా చేసే యోచన తమకు లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే తాము నడుచుకుంటామని తెలిపారు. అంతవరకు టీటీడీ చైర్మన్ పదవిని వదిలే ప్రసక్తే లేదని చెప్పడం గమనార్హం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టీటీడీ సమావేశాన్ని బహిష్కరించిన ఈవో, జేఈవో
-
రసాభాసగా టీటీడీ పాలకమండలి సమావేశం
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) పాలకమండలి సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజులు బయటకు వచ్చారు. పాలకమండలి సభ్యత్వానికి చల్లా రామచంద్రారెడ్డి (బాబు) రాజీనామా చేయడంతో కార్యదర్శి హోదాలో టీటీడీ ఈవో సమావేశం నిర్వహించాల్సింది. కానీ టీటీడీ అధికారులు సమావేశాన్ని బహిష్కరించడంతో బోర్డు తీర్మానాల అమలు కోసం నిర్వహించిన సమావేశం అర్థాంతరంగా ముగిసింది. అంతకు ముందు బోర్డు సభ్యుడుగా ఇచ్చిన లెటర్ పై ఎందుకు దర్శనాలు ఇవ్వటంలేదని సభ్యుడు చల్లాబాబు అధికారులను నిలదీశారు. అధికారులు ససేమిరా అనటంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు చల్లా బాబు. తీరు మారకపోవటంతో.. చల్లా రామచంద్రారెడ్డి పాలమండలికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. నెల రోజుల క్రితమే పాలక మండలి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించామని.. అందులో భాగంగానే ఈ భేటీ జరిగినట్లు చైర్మన్ సుధాకర్ యాదవ్ మీడియాకు తెలిపారు. సమావేశంలో తాము వేచి చూసినా అధికారులు రాలేదన్నారు. తమని ప్రభుత్వం నియమిస్తేనే ప్రమాణ స్వీకారం చేశామని, వాళ్లు రద్దు చేస్తేనే పదవులు వదులుకుంటామన్నారు. స్వచ్చందంగా మాత్రం రాజీనామా చేయమన్నారు. ఇక టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి చల్లా బాబుతో పాటు పార్థసారథి, రాయపాటి, బోండా ఉమలు కూడా రాజీనామా చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అయితే రాష్ట్రంలో మరో రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సమయంలో హడావుడిగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సాధారణంగా ఎన్నికల్లో పాలక ప్రభుత్వం ఓడిపోతే దాని ద్వారా నియమితులైన పాలక మండళ్లు నైతికంగా రాజీనామా చేస్తాయి. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించటానికి ప్రయత్నించారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తిరుమలలో విస్తృత ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఇటీవల పెద్దఎత్తున బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ ఓ మాట.. బ్యాంకు అధికారులు మరోమాట చెప్పడంతో అనేకానేక అనుమానాలు తలెత్తాయి. వీటిని ఇటు టీటీడీ కానీ, అటు టీడీపీ సర్కారు కానీ నివృత్తి చేసిన దాఖలాల్లేవు. అదే విధంగా.. ప్రైవేటు బ్యాంకుల్లో నగదు, బంగారం డిపాజిట్ల వెనుక కొందరు పాలక మండలి సభ్యులతో పాటు ప్రభుత్వంలోని పలువురు పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పది మంది తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి కూడా పచ్చజెండా ఊపేందుకు కూడా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. -
‘ఆ బంగారం’ లెక్క తేల్చేందుకేనా
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మరో రెండ్రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న సమయంలో హడావుడిగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశాన్ని మంగళవారం నిర్వహించనుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. సాంకేతికంగా నిర్వహించుకోవచ్చన్న సాకు చూపించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఎన్నికల్లో పాలక ప్రభుత్వం ఓడిపోతే దాని ద్వారా నియమితులైన పాలక మండళ్లు నైతికంగా రాజీనామా చేస్తాయి. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా టీటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించటానికి రంగం సిద్ధంచేశారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తిరుమలలో విస్తృత ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఇటీవల పెద్దఎత్తున బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ ఓ మాట.. బ్యాంకు అధికారులు మరోమాట చెప్పడంతో అనేకానేక అనుమానాలు తలెత్తాయి. వీటిని ఇటు టీటీడీ కానీ, అటు టీడీపీ సర్కారు కానీ నివృత్తి చేసిన దాఖలాల్లేవు. అదే విధంగా.. ప్రైవేటు బ్యాంకుల్లో నగదు, బంగారం డిపాజిట్ల వెనుక కొందరు పాలక మండలి సభ్యులతో పాటు ప్రభుత్వంలోని పలువురు పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలున్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించే పాలక మండలి సమావేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం వివాదానికి క్లీన్చిట్? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఏప్రిల్ 17న తమిళనాడు నుంచి తరలిస్తున్న 1381 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఎటువంటి భద్రతా ఏర్పాట్లులేకుండా సాధారణ వాహనంలో సుమారు రూ.450 కోట్లు విలువ చేసే బంగారాన్ని తరలించడం.. దానిని తమిళనాడులో ఎన్నికల అధికారులు పట్టుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. బంగారాన్ని పట్టుకున్న సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు అది టీటీడీదని అన్నారు. మరోవైపు.. ఆ బంగారం తమది కాదని టీటీడీ ఈఓ విస్పష్టంగా చెప్పారు. ఆ తరువాత కొంత సమయానికే ఆయన మాటమార్చి పట్టుబడ్డ బంగారం టీటీడీదేనని చెప్పుకొచ్చారు. దీంతో అక్రమ బంగారాన్ని సక్రమం చేశారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఆ తరువాత కూడా టీటీడీ రకరకాల ప్రకటనలు చేసి ప్రజల్లో అనుమానాలకు ఆస్కారమిచ్చింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాల మేరకు ముఖ్య కార్యదర్శి మన్మోహన్సింగ్ తిరుపతిలో విచారణ చేపట్టారు. ఆ నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. అయితే, అది ఇప్పటివరకు వెలుగుచూడలేదు. ఇలాగే.. టీటీడీకి సంబంధించిన బంగారం, నగదును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యటంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు, కొందరు టీటీడీ అధికారులు, మరికొందరు పాలక మండలి సభ్యులు కమీషన్లకు కక్కుర్తిపడి కోట్ల రూపాయలను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని ప్రచారంలో ఉంది. టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఈ రెండు ప్రధాన ఆరోపణల్లో వాస్తవంలేదని చెప్పుకునేందుకే ఈ టీటీడీ బోర్డు సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రాజీనామా చేయకుండా.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న సందర్భంలో నైతిక బాధ్యత వహించి నామినేటెడ్ సంస్థల చైర్మన్లు, సభ్యులు రాజీనామా చేస్తున్నారు. కానీ, టీటీడీ పాలకమండలి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సాంకేతిక అంశం సాకుతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాత్కాలిక నియామకాల కోసం.. ఓ పది మంది తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి కూడా పచ్చజెండా ఊపేందుకు కూడా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో టీటీడీలో ఓ అధికారి.. ఇద్దరు బోర్డు సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. ఆ పది మంది నుంచి గతంలోనే భారీగానే మామూళ్లు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. అదే విధంగా మరికొన్ని కాంట్రాక్టు పనులు ఖరారు చేసుకునేందుకు ఈ పాలక మండలి భేటీని కొందరు ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది. టీటీడీ బోర్డును రద్దు చేయాలి చంద్రబాబునాయుడు హయాంలో ఏర్పాటైన టీటీడీ పాలక మండలిని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ రద్దుచెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారు? టీడీపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎస్వీబీసీ చైర్మన్‌గా ఉన్న కే రాఘవేంద్రరావు రాజీనామా చేయడం అభినందనీయం. ఆయనలాగే టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, పాలక మండలి సభ్యులు వెంటనే రాజీనామా చెయ్యాలి. అలా కాకుండా బోర్డు సమావేశం నిర్వహిస్తే అడ్డుకుంటాం. – నారాయణస్వామి, ఎమ్మెల్యే, గంగాధర నెల్లూరు గోవిందా.. ఇదేంటయ్యా..! గోవిందుని పాదాల చెంత నిరుపేదలకు వైద్య సేవలందిస్తున్న బర్డ్ ఆస్పత్రి పరువును బజారు పాలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టక ముందే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని హడావుడిగా నిర్వహించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జగదీష్ పదవీ కాలం ఇంకా ముగియకమునుపే మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కొత్త బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సివుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నది నామినేటెడ్ బోర్డు అన్న విషయాన్ని సభ్యులు మరిచి డైరెక్టర్ పదవీ కాలం పొడిగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. మరో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం రానుంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ బోర్డు అయితే పాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డుకు సాధారణంగా అధికారం ఉండదు... బోర్డు రద్దు అవుతుంది. అయితే సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతి«థి గృహంలో బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశం హడావుడిగా జరిగింది. గంట పాటు వాడివేడిగా చర్చలు జరిగాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నారు. బర్డ్ ఆస్పత్రి డైరెక్టర్‌గా గత 20 ఏళ్లుగా డాక్టర్ జగదీష్ కొనసాగుతున్నారు. గత టీటీడీ బోర్డు సమావేశంలో ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని అజెండాలో చేర్చగా పలువురు తిరస్కరించారు. అత్యవసర సమావేశం ఎందుకు.? నామినేటెడ్ కిందకు వచ్చే బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని హడావుడిగా నిర్వహించారు. 450 పడకల అత్యంత ప్రతిష్టాత్మక బర్డ్ ఆస్పత్రికి డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత వుంది. అటువంటి నిర్ణయం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త సభ్యుల సమక్షంలో తీసుకోవాలి. అయితే డాక్టర్ జగదీష్ పదవీ కాలం మరో నెల రోజుల పాటు ఉంది. ఈ దశలో పదవీ కాలం పొడిగింపు నిర్ణయం తీసుకోవడం దుమారం రేపుతోంది. తొందర పాటు నిర్ణయం కొత్త ప్రభుత్వం ఏర్పడితే నామినేటెడ్ బోర్డులు రద్దు అవుతాయి. బోర్డు చైర్మన్‌తో పాటు సభ్యులు రాజీనామా చేయడం సాధారణం. టీడీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ నియమించిన పలు బోర్డుల చైర్మన్లు, సభ్యులు రాజీనామాలు చేశారు. తిరుపతిలో తుడా చైర్మన్ నర్సింహయాదవ్ తన పదవీకి రాజీనామా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నామినేటెడ్ బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశాన్ని నిర్వహించి డైరెక్టర్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ తొందర పాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డు సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల పట్ల టీటీడీ అధికారులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. మీడియాను పక్కదారి పట్టించిన వైనం శ్రీ పద్మావతి అతిధి గృహంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు బర్డ్ ట్రస్ట్ బోర్డు సమావేశం జరుగుతుందని మీడియాకు లీకు కావడంతో సభ్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా రు. సాయత్రం 4.50 గంటలకే బోర్డు సమావేశా న్ని ముగించారు. దీంతో సాయంత్రం 5 గంటల కు అతి«థి గృహం వద్దకు చేరుకున్న మీడియాకు సమావేశం ముగిసిందని అక్కడి వారు చెప్పడం తో అవాక్కయ్యారు.సమావేశంలో నిర్ణయాలను గోప్యంగా ఉంచారు. టీటీడీ పీఆర్వో విభాగం అధికారులు సమావేశానికి హాజరైనా కనీసం పత్రికా ప్రకటన విడుదల చేయలేదు. టీటీడీ అధికారులు పత్రికా ప్రకటన విడుల చేయొద్దని పీఆర్వో సెక్షన్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. రహస్య సమావేశంలో బర్డ్ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు, బర్డ్ ఆస్పత్రిలో ఫైనాన్స్ సెక్షన్లో పోస్టు భర్తీతోపాటు ఆస్పత్రి నిర్వహణ ఇకపై బోర్డు అధీనంలో జరగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ బోర్డు సమావేశాన్ని నడిపించినట్లు సమాచారం. -
పోలింగ్ వేళ పుట్టాకు మరో షాక్
సాక్షి, దాపాడు: టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు తన కార్యకర్తలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మంగళవారం చియ్యపాడులో ముఖ్య టీడీపీ నాయకులు శివరామకృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డిలు పార్టీని వీడగా.. బుధవారం కేతవరం గ్రామానికి చెందిన మండల తెలుగు యువత అధ్యక్షుడు నారపురెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్సీపీకి దగ్గరయ్యారు. స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ కర్నాటి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారు. నారపురెడ్డి మాట్లాడుతూ పదిహేనేళ్లుగా కార్యకర్తగా, ఐదేళ్లుగా తెలుగు యువత అ«ధ్యక్షుడిగా పని చేస్తున్నా తనను పుట్టా సామాజిక వర్గానికి చెందిన మండలంలోని ముఖ్య నాయకుడు వేధిస్తున్నాడని వాపోయారు. మంగళవారం రాత్రి గ్రామంలో కార్యకర్తలతో సమావేశం కాగా ముఖ్య నాయకుడు తనను కించపరిచేలా వ్యవహరించారన్నారు. దీంతో మనస్థాపం చెంది విలువలు లేని పార్టీలో ఉండలేక బయటకు వచ్చినట్లు తెలిపారు. పుట్టా ప్రయత్నాలు విఫలం.. కేతవరం గ్రామానికి చెందిన తెలుగు యువత మండల అధ్యక్షులు నారపురెడ్డికి మంగళవారం మండల ముఖ్య నాయకుడికి మద్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం నారపురెడ్డి పార్టీని వీడుతున్న విషయం తెలుసుకున్న పుట్టా సుధాకర్‌యాదవ్ తమ అనుచరులను సంధి కోసం పంపినా కుదరలేదు. దీంతో స్వయంగా పుట్టానే నారపురెడ్డి ఇంటికెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా.. టీడీపీలో ఉండలేనని, నేనే కాదని నాలా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని నారపురెడ్డి తెలుపగా చేసేదేమీ లేక పుట్టా వెళ్లిపోయారు. -
వామ్మో ఆ ఐటీ సోదాలు ఉత్తుత్తివేనా!?
సాక్షి ప్రతినిధి కడప : వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలు.. ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల తనిఖీలు.. వీటిపై ఇప్పుడు పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి నిజంగా జరిగాయా.. లేక వారే కావాలని చేయించుకుని డ్రామా ఆడుతున్నారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో బుధవారం సాయంత్రం ఐటీ అధికారులు తనిఖీలకు వెళ్లారు. ఇరువురు పోలీసులను మాత్రమే బందోబస్తుకు తీసుకెళ్లారు. తనిఖీలకు వెళ్లిన అధికారులు సుధాకర్ తనయుడుతో కబుర్లలో మునిగిపోవడం, ఈలోపు సీఎం రమేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితర టీడీపీ నేతలు అక్కడి చేరుకోవడం.. తనిఖీలు చేయాలని ఎవరు అదేశించారో చెప్పాలంటూ నానాయాగీ చేశారు. దీంతో ఐటీ అధికారులు వెనుతిరగడం అనుమానాలకు ఆస్కారమిచ్చింది. పైగా.. విధులకు ఆటంకం కల్గించినట్లు వారు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. సానుభూతే లక్ష్యంగా ఐటీ తనిఖీలు మైదుకూరు నియోజకవర్గంలో ఇటీవల మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీమంత్రి రవీంద్రారెడి ్డకలిసికట్టుగా పనిచేస్తే అక్కడ మరే అభ్యర్థి అయినా నామమాత్రపు పోటీ ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితుల్లో పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో ఐటీ సోదాలకు టీడీపీ పెద్దలు స్కెచ్ వేసినట్లు సమాచారం. సానుభూతి కోసమే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. సీఎం రమేష్ ఇంట్లోనూ ఇంతే.. సుధాకర్‌యాదవ్ ఇంట్లో జరిగిన సంఘటనకు రెండ్రోజుల అనంతరం శుక్రవారం ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోట్లదుర్తి గ్రామంలో యర్రగుంట్ల సీఐ వెంకటరమణ నేతృత్వంలో ఇవి జరిగాయి. వాస్తవానికి ఎంపీ స్థాయి ఇంట్లో తనిఖీలు చేయాలంటే కనీసం డీఎస్పీ స్థాయి అధికారి వెళ్లాలి. కానీ, యర్రగుంట్ల సీఐ తన పై అధికారులైన ఎస్పీ అభిషేక్ మహంతి, డీఎస్పీ మాసూం బాషాకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనిఖీలు చేసినట్లు సమాచారం. కాగా, కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న వెంకటరమణ ఇటీవల వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. సీఎం రమేష్ సిఫార్సుల కారణంగానే ఆయన ఇక్కడకు వచ్చారని.. ఎంపీ వ్యూహంలో భాగంగానే వెంకటరమణ తనిఖీలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయినా, టీడీపీ నేతలు జిల్లా పోలీసు శాఖను, ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఇదంతా చూస్తుంటే.. టీడీపీ కుట్రలో భాగంగానే ఐటీ సోదాలు, పోలీసుల తనిఖీలు చోటుచేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
మైదుకూరులో టీడీపీ నేతల బెదిరింపులు
-
మైదుకూరులో టీడీపీ నేతల బెదిరింపులు
సాక్షి, వైఎస్సార్: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో టీడీపీ నేతల బెదిరింపుల పర్వం మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తమ మాట వినని వారిపై టీడీపీ నేతలు బెదిరించడమే కాకుండా నోటికి ఇష్టమెచ్చినట్టు దూషిస్తున్నారు. తాజాగా మైదుకూరులో టీటీడీ చైర్మన్, మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేశ్ యాదవ్ రెచ్చిపోయారు. బ్రహ్మంగారి మఠం టీడీపీ అధ్యక్షుడు రత్నకుమార్ యాదవ్ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే రత్నకుమార్ కుమారుడు బాలకృష్ణకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా బాలకృష్ణను బూతులు కూడా తిట్టారు. కాగా, మహేశ్ మంత్రి యనమల రామకృష్ణునికి అల్లుడు. -
ఐటీ పుట్టలో గుట్టు?
సాక్షి, కడప: టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఆదాయ పన్నుల శాఖ దాడులు వ్యూహాత్మకమేనా? నిజంగా చేపట్టారా.. అధికారుల, ఇటు టీడీపీ నాయకుల చర్యలు అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. ఐటీ అధికారుల తీరు, టీడీపీ నేతల రాద్ధాంతం పరి శీలిస్తే ఏదో మతలబు దాగి ఉందని స్పష్టమవుతోంది. పటిష్ట బందోబస్తు లేకుండా దాడులకు వెళ్లడం, విధులకు ఆటంకం కల్గించినా, అధి కారులు అక్కడి నుంచి జారుకోవడం...పైగా టీడీపీ నేతలు రాజకీయ ప్రసంగాలు చేయడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ప్రొద్దుటూరులో ఉంటున్న సుధాకర్ యాదవ్ ఇంటికి సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఇన్‌కం ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ మహాదేవ్, ప్రొద్దుటూరు ఐటీ అధికారులు లక్ష్మణరావు, రామలక్ష్మణ్ మరో అయిదుగురు కలిసి తనిఖీలకు వెళ్లారు. తనిఖీలకు సాధారణంగా పోలీసు ప్రొటెక్షన్ తీసుకుని వెళ్లడం సహజం. కానీ ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే వెంటబెట్టుకొని వెళ్లారు. సుధాకర్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో కుమారుడితో ఐటీ అధికారులు మాట్లాడారు. అరగంటలోపు టీడీపీ నేతలు రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డి లాంటి నాయకులంతా చేరుకున్నారు. మిమ్మల్ని ఎవరు పంపించారు. నరేంద్రమోదీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసికట్టుగా పథక రచన చేశారంటూ కేకలు వేయసాగారు. సుధాకర్ ఇంట్లో సోదా చేయమని ఎవరు చెప్పారో తేల్చాలని గట్టిగా నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తనిఖీకి వచ్చామని అధికారులు చెప్పుకొచ్చినా టీడీపీ నేతలు వినిపించుకోలేదు. అధికారుల బ్రీఫ్‌కేసులు తనిఖీలు చేస్తూ ఎంపీ రమేష్‌నాయుడు హంగామా చేశారు. దాంతో ఐటీ అధికారులు వెనుతిరిగారు. ఇదంతా ఓ నాటకాన్ని తలపించేలా ఉంది. ఇద్దరు పోలీసులను వెంటబెట్టుకొని సోదాలకు రావడం ఏమిటి? వచ్చిన వారు టీడీపీ నేతలు అడ్డగిస్తే వెనుక్కు వెళ్లడం ఏమిటీ? సెర్చి వారెంటు లేకుండా ఎందుకు వెళ్లారు. వారెంటు ఉంటే ఎందుకు తనిఖీలు పూర్తి చేయలేదు. పైగా విధులకు ఆటంకం కల్గించిన టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా అనుమానాలు రేకిత్తిస్తున్న అంశాలే. ముందే ఇంటివద్ద టీడీపీ నేతలు అందుకున్న పల్లవినే సుధాకర్ యాదవ్ కూడా వినిపించడం విశేషం. తన గెలుపును అడ్డుకునే చర్యల్లో భాగంగా సోదాలు చేయించారనడం మరింత అనుమానాలకు తావిస్తోంది. సానుభూతే అసలు లక్ష్యమా....? మైదుకూరు నియోజకవర్గంలో ఇటీవల మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ మంత్రి రవీంద్రారెడ్డి ఇద్దరు కలిసికట్టుగా ఎన్నికల్లో పనిచేస్తే అక్కడ మరే అభ్యర్థి అయినా నామమాత్రపు పోటీయేనని రాజకీయ విశ్లేషకుల భావన. ఈ తరుణంలో ఐటీ సోదాలమైండ్‌గేమ్‌ను టీడీపీ పెద్దలు రచించారా? సానుభూతి కోసమే వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేశారా? ఈ గేమ్‌లో ఐటీ అధికారులు భాగస్వాములు అయ్యారా? లాంటి అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. విధులకు ఆటంకం కల్గిస్తే టీడీపీ నాయకులపై అధికారుులు ఎందుకు కేసులు పెట్టలేదు. ఇద్దరు పోలీసులను పంపడం వెనుక ఉన్న మతలబు ఏమిటీ? ఇదంతా కూడా స్థానికంగా ఉన్న అధికారులతో కలిసి టీడీపీ నేతలు పన్నిన ప్రణాలికగా పలువురు చర్చించుకోవడం విశేషం. -
బరితెగించిన సీఎం రమేష్
సాక్షి, ప్రొద్దుటూరు : సోదాలకు వచ్చిన ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దౌర్జన్యానికి దిగారు. వారి విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా తమకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. టీటీడీ చైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంట్లో చోటుచేసుకున్న ఈ బరితెగింపు వివరాలిలా ఉన్నాయి.. పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంటికి బుధవారం సాయంత్రం 4.20 గంటలకు ఐటీ అధికారులు వచ్చారు. ఆ సమయంలో పుట్టా సుధాకర్‌యాదవ్ కుమారుడు మహేష్‌యాదవ్ ఇంట్లోనే ఉన్నారు. తనిఖీలు నిర్వహిస్తుండగా మహేష్‌యాదవ్ కొన్ని పేపర్లను నలిపి బయట పడేయడాన్ని గుర్తించిన ఐటీ అధికారులు అతన్ని ప్రశ్నించారు. ఇంతలో ఎంపీ సీఎం రమేష్, అతని వెంట కౌన్సిలర్ వీఎస్ ముక్తియార్, టీడీపీ పట్టణాధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి పుట్టా ఇంట్లోకి కేకలు వేసుకుంటూ వెళ్లారు. సీఎం రమేష్ నేరుగా ఐటీ అధికారులందరిపై కేకలు వేశారు. ‘ఎవరు పంపారు, ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేయడానికి మీకు ఎంత ధైర్యం’.. అంటూ మండిపడ్డారు. తనిఖీలు చేయకుండా అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులను లోపలికి తీసుకెళ్లి వారి సాక్షిగా అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. మిమ్మల్ని ఎవరు పంపారో మీడియాకు చెప్పాలంటూ కడప ఐటీ అసిస్టెంట్ కమిషనర్ మహాదేశ్పై తీవ్ర ఒత్తిడి చేశారు. ‘మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము తనిఖీలు చేస్తున్నాం.. అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు’ అని ఆయనన్నారు. దీంతో ఆయన చేతిలోని సూట్‌కేసును టీడీపీ నాయకులు లాక్కున్నారు. రమేష్ దానిని తెరిచారు. అందులోని పేపర్లను వీఎస్ ముక్తియార్ తీసి బయట వేయగా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విసిరికొట్టారు. మీడియాలో భారీగా డబ్బు, బంగారం దొరికిందని వస్తోందని.. ఏమీ దొరకలేదని చెప్పాలంటూ అసిస్టెంట్ కమిషనర్‌ను ఎంపీ ఒత్తిడిచేశారు. మీరు ఏమీ దొరకలేదని చెప్పకపోతే మా వాళ్లు వందల మంది వస్తారని, లా అండ్ ఆర్డర్ తప్పుతుందని హెచ్చరించారు. చెప్పేంత వరకు బయటకు వెళ్లనివ్వబోమని చుట్టుముట్టారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వారి వాహనాల్లో వెళ్లిపోయారు. పక్కా సమాచారంతోనే సోదాలు మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ ఇంటికి రెండు రోజుల కిందట భారీగా డబ్బు వచ్చిందన్న పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. తనిఖీల్లో ఆ డబ్బు ఎక్కడ బయట పడుతుందోనని రమేష్ వారి విధులకు ఆటంకం కలిగించినట్లు స్పష్టమవుతోంది. ఇంట్లో భారీగా బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారని, దీంతో అధికారులపై దౌర్జన్యంచేసి వారు వెళ్లిపోయేలా చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి, పుట్టా ఇంటికి చేరుకున్నారు. వారు మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులకు వైఎస్ జగన్ లోటస్ పాండ్‌లో పథకం రూపొందించారని, కేంద్రంతో కలిసి దాడులు చేయించారని ఆరోపించారు. ఎస్కార్ట్‌గా ఇద్దరు కానిస్టేబుళ్లే.. జిల్లా ఐటీ అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు మరో ఏడుగురు అధికారులు అధికార పార్టీ నాయకుని ఇంట్లో సోదాలు చేసేందుకు వస్తే పోలీసు అధికారులు కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐ నాయక్, డీఎస్పీ శ్రీనివాస్‌రావు వచ్చి ఘటనపై వాకబు చేసి వెళ్లిపోయారు. ఐటీ అధికారులపై ఎంపీ, టీడీపీ నాయకులు దౌర్జన్యం చేసి నిర్బంధించినంత పనిచేసినా పోలీసులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈసీ అధికారి స్టిక్కర్ ఉన్న వాహనంలో వచ్చిన అధికారులకు పోలీసులు ఎందుకు బందోబస్తు కల్పించలేకపోయారనే విషయం చర్చనీయాంశమైంది. ఐటీ సోదాలు జరిగే ఇంట్లోకి ఎవ్వరినీ అనుమతించరు. అక్కడ కానిస్టేబుళ్లు మాత్రమే ఉండడంతో టీడీపీ నేతలు బలవంతంగా లోపలికి వెళ్లి అధికారులపై దౌర్జన్యానికి దిగారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఉన్న ఓ ఐటీ ఉన్నతాధికారిపై భౌతిక దాడికి దిగినంత పనిచేసిన టీడీపీ నాయకులపై, తనిఖీలు చేయకుండా విధులకు అడ్డుకున్న సీఎం రమేష్‌పై కనీసం ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. చదవండి: టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు -
టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, ప్రొద్దుటూరు: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయపన్ను శాఖ సోదాలు కలకలం రేపాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు బుధవారం దాడి చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టా నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్టా పోటీ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్ ఏ1 కాంట్రాక్టర్‌గా ఉన్నారు. ఐటీ దాడులతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సీఎం రమేశ్ వాగ్వాదం పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్కడికి దూసుకొచ్చారు. ఐటీ అధికారులతో దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగారు. సీఎం రమేశ్ వ్యవహారశైలిపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బద్ధలైన ‘పుట్టా’ కంచుకోట
సాక్షి, నెర్రవాడ(చాపాడు): టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు కంచుకోటగా మారిన మండలంలోని నెర్రవాడలో తమ సామాజిక వర్గీయులైనా యాదవులు ఈ ఎన్నికల్లో షాక్ ఇవ్వనున్నారు. పుట్టా తీరును వ్యతిరేకిస్తూ, వైఎస్ జగన్‌పై ఇష్టంతో 35 యాదవ కుటుంబీకులు గురువారం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మేకల శేఖర్, లంకెల జయరాములు, చల్లా గంగన్న, చల్లా శ్రీనివాసులు, పెద్ద వీరయ్య, చల్లా గంగాధర్, పిట్టి నరసింహులు, శ్రీనివాసులు, బండారు సుబ్బయ్య, చింతల సుబ్బరాయుడు, కదిరేపల్లె శ్రీను, పిట్టి శ్రీనివాసులు, లంకెల రామచంద్రయ్య, కురాకు మాధవ, ఇరగబోయిన లక్షుమయ్య, గొగ్గి ఓబులేసు, గాలి బాబు, శివలింగమయ్య, పిట్టి అంజన ప్రసాద్, ప్రకాశ్, ఓబులేసు, గొగ్గి మల్లేషు, సాయి, చింతల బీరేష్, పిట్టి సాయికుమార్, పిట్టి కాశి, చల్లా పెద్ద గంగన్న, చల్లా వెంకటరమణ, మందాల నారాయణ, బండారు చిన్న సుబ్బయ్య, చల్లా చిన్నవీరయ్య, పిట్టి నరసింహులు పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు తనయుడు నాగిరెడ్డి ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు.కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాజశేఖరరెడ్డి, జెడ్పీటీసీ ఎస్సార్ బాలనరసింహారెడ్డి, మండల నాయకులు లక్షుమయ్య, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మదీనా దస్తగిరి, రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు శశిథర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు మడూరు ప్రతాప్‌రెడ్డి, గురివిరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీమన్నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ మారిన వారిని వదలను ..
సాక్షి, చాపాడు : అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలోకి వచ్చి ఇప్పుడు పార్టీ మారుతున్న వారిపై కక్ష సాధిస్తానని టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ అన్నారు. మీరు నమ్ముకుని వెళుతున్న నాయకులు ఈ ఎన్నికల్లో మాత్రమే ఉంటారని.. తానే మరో 20 ఏళ్ల వరకు పోటీలో ఉంటానని ఎవరినీ వదలిపెట్టనన్నారు. మండలకేంద్రమైన చాపాడులో ఆదివారం టీడీపీ కార్యాలయం ప్రారంభించిన పుట్టా మాట్లాడుతూ ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీలోకి మారడం తప్పని తనను నమ్మించి పార్టీలోకి చేరిన వారు ఇప్పుడు నాకు సినిమా చూపిస్తున్నారని, తాను కూడా పది సినిమాలు చూపిస్తానన్నారు. మొదట్లో తెలియక తప్పులు చేశానని, ఇప్పుడు రాజకీయాల గురించి తెలుసుకున్నానన్నారు. ఎన్నికల్లో దేనికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. వైఎస్సార్సీపీలోకి వెళుతున్నారని కారణాలు అడిగితే బంధువులు అని, కార్యకర్తలంటూ కథలు చెబుతున్నారని పార్టీలోకి వచ్చేటప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, గోసుల కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పుట్టా సుధాకర్‌కు చేదు అనుభవం
-
ఎట్టకేలకు టీటీడీ దిగొచ్చింది.
-
పరిమితంగా శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుపతి/తిరుమల: ఎట్టకేలకు టీటీడీ దిగొచ్చింది. భక్తుల ఒత్తిడితో మహాసంప్రోక్షణ జరిగే ఆరురోజులు పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని పాలకమండలి నిర్ణయించింది. రోజుకు కొన్ని గంటలే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. సర్వదర్శనం క్యూలో వచ్చే భక్తులకు మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టదిగ్బంధన బాలాలయ మహా సంప్రోక్షణ సందర్భంగా వచ్చే నెల 11 నుంచి 16 వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈనెల 14న పాలకమండలి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీనిలో భాగంగా మంగళవారం మరోసారి తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలకమండలి సమావేశమైంది. మహా సంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనున్నట్లు టీటీడీ చైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. ఎంత మందికి అనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చే భక్తులకు మాత్రమే స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఆరు రోజుల్లో రూ.300 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, టైంస్లాట్, దివ్యదర్శనం ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 11న 9 గంటలు, 12వ తేదీన 4 గంటలు, 13న 4 గంటలు, 14వ తేదీ 6 గంటలు, 15వ తేదీ 6 గంటలు, 16వ తేదీ 4 గంటల సమయం మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శనానికి అవకాశం ఉంటుంది. అభిప్రాయ సేకరణలో 33 శాతం మంది భక్తులు అవకాశం ఉన్న సమయంలో దర్శనం కల్పించమని కోరినట్లు వివరించారు. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు.. - వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 23 నుంచి 26 వరకు ఏపీ, తెలంగాణలో మనగుడి కార్యక్రమం నిర్వహణ. - హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణలో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించే జిల్లా, మండల ధర్మ ప్రచార మండలి సభ్యుల నిర్వాహక వర్గం పునర్వ్యవస్థీకరణకు ఆమోదం. - తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రెండేసి చొప్పున అర్చక పోస్టులు, శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మూడు, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో రెండు చొప్పున అర్చక పోస్టుల భర్తీకి నిర్ణయం. -
టీటీడీ నిర్ణయంతో ఆ విషయం బట్టబయలైంది!
సాక్షి, తిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అవకతవకలు జరిగాయని టీటీడీ తాజా నిర్ణయంతో బట్టబయలయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఎన్నడూ లేనివిధంగా స్వామివారి ఆలయంలోకి తొమ్మిది రోజులపాటు భక్తులను అనుమతించబోమని టీటీడీ ఎందుకు నిబంధనలు పెడుతోందని ఆమె ప్రశ్నించారు. టీటీడీ తీరుపై తిరుమల ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారని, టీటీడీ తాజా నిర్ణయం ఆయన ఆరోపణలకు బలం చేకూరుస్తోందని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. పోటులో తవ్వకాలు జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో పోటులోని సంపదలు తవ్వితీశారనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. రమణదీక్షితులు టీటీడీ అధికారులపై చేసిన ఆరోపణలు నిజమేనని తాజా పరిణామాలతో అనిపిస్తోందని ఆమె అన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ పాలకమాండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి టీటీడీ చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయని రోజా పేర్కొన్నారు. -
దర్శనం గోవిందా
-
ఆరు రోజులపాటు వెంకన్న దర్శనం రద్దు
-
ఆరు రోజులపాటు శ్రీవారి దర్శనం రద్దు
సాక్షి, తిరుపతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఆరు రోజులపాటు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించలేకపోతున్నట్లు ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహణ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ శనివారం తెలిపారు. వచ్చే ఆగస్టు 11 నుంచి 16 వరకు నిర్వహించే ఈ క్రతువుపై చర్చించేందుకు తిరుమల అన్న మయ్య భవన్లో శనివారం పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం టీటీడీ చైర్మన్ ‘పుట్టా’మీడియాతో మాట్లాడుతూ.. మహాసంప్రోక్షణ నేపథ్యం లో ఆగస్టు 9వ తేదీ సా.6 గంటల నుంచి భక్తులను క్యూలైన్లు, వైకుంఠం కంపార్ట్మెంట్లలోకి అనుమతించబోమన్నారు. అప్పటివరకు క్యూలైన్లలో ఉన్న వారికే 10వ తేదీన శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. తిరిగి ఆగస్టు 17వ తేది ఉ.6 గంటల నుంచి భక్తులకు పునఃదర్శనం ప్రారంభమవుతుందన్నారు. ఆగస్టు 11న అంకురార్పణ 12 ఏళ్లకొకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ఆగస్టు 11న అంకురార్పణతో ప్రారంభమవుతుందన్నారు. ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగే రోజులలో వైదిక కార్యక్రమాలు, శాంతి హోమాలకు ఎక్కువ ప్రాధాన్యత వుంటుందని చైర్మన్ చెప్పారు. ఈ సమయంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు కొన్ని గంటల సమయమే ఉండడంవల్ల ఆగస్టు 11 నుంచి 16 వరకు ఆరు రోజులపాటు శ్రీవారి దర్శనాన్ని రద్దుచేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించి ఆయా తేదీల్లో తిరుమల యాత్రను రద్దు చేసుకోవాలని కోరారు. కాగా, మహా సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా టీటీడీ అన్ని సేవలు రద్దుచేసింది. ఈ కార్యక్రమం ముగిసే వరకు ఎవరినీ జయవిజయలను దాటి అనుమతించరు. సన్నిధి సిబ్బందిని కూడా రాముల వారి మేడదాటి అనుమతించరు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసులరాజు, టీటీడీ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మహాసంప్రోక్షణ అంటే.. నదులకు ప్రతి పన్నెండేళ్లకోసారి పుష్కరాలు నిర్వహిస్తున్నట్లే.. తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలియజేశారు. మొట్టమొదటిసారిగా 1958లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిసారిగా 2006లో నిర్వహించగా.. మళ్లీ ఇప్పుడు ఆగస్టు 12 నుంచి 16 వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. నిజానికి ఆలయంలో మరమ్మతు పనులను నిర్వహించేందుకు నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో 12ఏళ్లకొకసారి దీనిని నిర్వహిస్తారు. అక్కడ చేయాల్సిన మరమ్మతులను బట్టి మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఆగమ పండితులు నిర్ణయిస్తారు. కాగా, శ్రీవారి గర్భాలయంలోకి అర్చకులు, జీయ్యంగార్లు మినహా మరెవ్వరినీ అనుమతించరు. దీంతో అక్కడ జరిగే మరమ్మతులను వారే నిర్వహించాలి. ఇతర ఆలయాల్లో చేసే విధంగా ఇంజనీరింగ్ అధికారులను ఆలయంలోకి అనుమతించరు. మహా సంప్రోక్షణంలో మూలవిరాట్ పాదాలు, పద్మపీఠం మధ్యన అష్టబంధనం కార్యక్రమాన్ని మాత్రమే నిర్వహిస్తున్నారు. మూడు విభాగాలుగా నిర్వహణ బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీవారి మూలవిరాట్‌లో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న పాత కళ్యాణమండపంలో ప్రత్యేకంగా 24 యాగశాలలను ఏర్పాటుచేయనున్నారు. స్వామి వారి శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని ఇక్కడ ఉంచుతారు. మూలవిరాట్‌కు నిత్యం నిర్వహించే పూజా కైంకర్యాలను ఈ కుంభానికి నిర్వహిస్తారు. ఆఖరి రోజున మహా సంప్రోక్షణతో స్వామి వారి శక్తిని తిరిగి మూలవిరాట్లోకి ఆవాహన చేస్తారు. ఈ కార్యక్రమంతో తిరిగి మూలవిరాట్ని నూతనంగా నిర్మించినట్లే. ఆగస్టు 15న మహాశాంతి తిరుమంజనం, ఆగస్టు 16న ఉదయం 10.16 గంటలకు తులా లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. అష్టబంధనం అంటే.. శ్రీవారి మూలవిరాట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నింపటమే అష్టబంధన కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్భంగా 8 రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదాల కింద, మూలవిరాట్ సమీపంలో ఉంచుతారు. ఇందులో నల్లసరిగళం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కండచక్కెర, లక్క, చెకుముకిరాయి, బెల్లం.. ఈ 8 రకాల వస్తువుల మిశ్రమాన్ని మూలవిరాట్‌తో పాటు ఆధార్పీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో, మూలవిరాట్ పైభాగంలో గోడకు వున్న రంధ్రాలలో ఈ చూర్ణాన్ని అద్దుతారు. కాలక్రమంలో ఈ మిశ్రమం కరిగిపోవడం.. రంగు మారడంవల్ల మూలవిరాట్‌లో శక్తి తగ్గిపోతుంది. తిరిగి ఆ శక్తిని పెంపొందించేందుకే ఈ మహోన్నత కార్యక్రమం. నాలుగు వేదాలు పఠిస్తాం మొదటిసారిగా కంకణభట్టార్‌గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా వుంది. ఈ ఐదు రోజులపాటు నాతో కలిపి 45 మంది రుత్వికులు, దాదాపు 100 మంది వేద పండితులు, ప్రబంధ పండితులు, వేద విద్యార్థులు ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఐదు రోజులపాటు స్వామివారిని కుంభంలోకి ఆహ్వానించి దానిని యాగశాలలో శక్తిని నింపుతాం. అక్కడ రామాయణం, వేదపారాయణం, భగవద్గీత, నాలుగు వేదాలను పఠించి కుంభానికి శక్తిని నింపి ఆఖరు రోజున ఆ కుంభాన్ని తిరిగి స్వామివారిలోకి పంపుతాం. – వేణుగోపాల్ దీక్షితులు, ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు -
దర్శనం గోవిందా
-
టీటీడీ: తొమ్మిది రోజుల పాటు వెంకన్న దర్శనం రద్దు
-
టీటీడీ సంచలన నిర్ణయం
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తులకు షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. శనివారం టీటీడీ ఆలయ అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం ఆలయ చైర్మన్ మాట్లాడుతూ.. ఆగస్టు 11న అంకురార్పణ ఉంటుందని, 12వ తేదీ నుంచి 16 తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంప్రోక్షణలో దాదాపు 30 వేల మంది భక్తులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ తొమ్మిది రోజుల పాటు కొండపైకి భక్తులను అనుమతించేది లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. తొమ్మిది రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం ఉండదు. గత కొంత కాలంగా టీటీడీలో చెలరేగుతున్న వరుస వివాదాల నేపథ్యంలో ఈ సమావేశం అందరిలో ఆసక్తి రేకిత్తిస్తోంది. శ్రీవారి నగలు మాయం చేస్తున్నారంటూ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఘాటు విమర్శలు చేస్తున్న సమయంలో, తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తూ పాలక మండలి తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. -
యనమల వియ్యంకుడికి రూ.38.98 కోట్ల నజరానా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు రూ.38.98 కోట్లను నజరానాగా ప్రభుత్వం ఇచ్చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలోని ఐదో ప్యాకేజీలో రూ.142.88 కోట్ల విలువైన పనులను 2016 నవంబర్ 30న పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన హెచ్‌ఈఎస్–పీఎస్కే సంస్థకు నిబంధనలను తుంగలో తొక్కుతూ నామినేషన్ విధానంలో కట్టబెట్టేసింది. అప్పట్లో అదే ధరలకు పనులు పూర్తి చేస్తామని అంగీకారపత్రం ఇచ్చిన సంస్థకే మంగళవారం అదనంగా రూ.38.98 కోట్లను చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ), ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్) కమిటీల అభ్యంతరాలను సైతం తోసి పుచ్చడం గమనార్హం. అనుభవం లేని సంస్థకు పనులా? పీఎస్కే సంస్థకు సాగునీటి ప్రాజెక్టులు, కాలువల పనులు చేసిన అనుభవం లేదు. తన వియ్యంకుడిని సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్‌గా మార్చేందుకు మంత్రి యనమల నడుం బిగించారు. తన సన్నిహితులకు చెందిన హెచ్‌ఈఎస్ సంస్థతో వియ్యకుండి సంస్థను కలిపి జాయింట్ వెంచర్(జేవీ) ఏర్పాటు చేశారు. అధికార బలాన్ని వినియోగించి పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనుల్లో ఐదో ప్యాకేజీ(93.70 కి.మీ. నుంచి 111.487 కి.మీ. వరకూ లైనింగ్సహా కాలువ పనులు)కాంట్రాక్టర్‌పై 60సీ నిబంధన కింద వేటు వేయించారు. అందులో మిగిలిపోయిన.. అంటే 5.754 కి.మీ.ల కాలువ తవ్వకం, 11.001 కి.మీ.ల లైనింగ్, కాజ్ వే, బ్రిడ్జ్ వంటి కాంక్రీట్ నిర్మాణ పనులను ‘హెచ్‌ఈఎస్–పీఎస్కే’కు నామినేషన్ విధానంలో అప్పగించాలని జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ పనుల విలువను రూ.142.88 కోట్లగా లెక్కగట్టిన ఎస్ఎల్ఎస్సీ, ఐబీఎం కమిటీలు ఏమాత్రం అనుభవం లేని సంస్థకు నామినేషన్‌పై పనులు అప్పగించే ప్రతిపాదనను తప్పుబట్టాయి. వాటిని బేఖాతరు చేస్తూ ఆ పనులను నామినేషన్ విధానంలో ఆ సంస్థకు అప్పగిస్తూ 2016 నవంబర్ 30న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులను రూ.142.88 కోట్లతోనే పూర్తి చేసేందుకు ఆమోదం తెలుపుతూ హెచ్‌ఈఎస్–పీఎస్కే సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ‘అంగీకార పత్రం’ కూడా ఇచ్చింది. పనులు చేతికి దక్కాక అదనపు నిధులు ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రి యనమల ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తాము చేసిన పనులకు అదనంగా రూ.38,98,61,783 ఇవ్వాలని మే 1న ఇంజనీర్–ఇన్–చీఫ్(ఈఎన్సీ)కు వినతిపత్రం ఇచ్చింది. ఆ మేరకు ఆ సంస్థకు అదనపు నిధులు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ సర్కార్‌కు ప్రతిపాదనలు పంపాలంటూ ఆర్థిక మంత్రి యనమల ఒత్తిడి తెచ్చారు. కాంట్రాక్టరే రూ.142.88 కోట్లకే పనులు పూర్తి చేస్తామంటూ అంగీకారపత్రం ఇచ్చి, ఇప్పుడు అదనంగా నిధులు ఇవ్వాలని కోరడంపై ఎస్ఎల్ఎస్సీ, ఐబీఎం కమిటీలు నివ్వెరపోయాయి. అదనపు నిధులు ఇచ్చేందుకు అభ్యంతరం తెలిపాయి. కానీ, ఉన్నతస్థాయి ఒత్తిళ్లకు లొంగిన అధికారులు ఆ సంస్థకు అదనంగా రూ.38.98 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తూ గత మే 6న సర్కార్‌కు ప్రతిపాదనలు పంపారు. అధికార బలాన్ని వినియోగించిన మంత్రి యనమల ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసేలా చక్రం తిప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
-
ఆగమ సలహాదారుడిగానూ రమణదీక్షితులు తొలగింపు
సాక్షి, తిరుపతి/తిరుమల: టీటీడీ ప్రధాన అర్చకునిగా ఉన్న రమణదీక్షితులును రిటైర్మెంట్ పేరుతో ఇంటికి పంపిన పాలకమండలి తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆగమ సలహాదారునిగా ఉన్న ఆయనను ఆ హోదా నుంచి కూడా తొలిగిస్తున్నట్లు చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రకటించారు. రమణదీక్షితులు ఆగమసలహాదారునిగా కొనసాగుతారని సోమవారం స్వామివారి ఆభరణాల పరిశీలన సమయంలో చెప్పిన ఆయనే 24 గంటలు గడవక ముందే నిర్ణయం మార్చుకోవడం చర్చనీయాంశమైంది. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. నూతనంగా ఏర్పాటైన పాలకమండలి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నెలరోజుల వ్యవధిలోనే మూడు పర్యాయాలు పాలకమండలి సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటి సారిగా నిర్వహించిన పాలకమండలి సమావేశంలో రమణదీక్షితులిని ప్రధాన అర్చకుని బాధ్యతల నుంచి రిటైర్మెంట్ పేరుతో తొలగించి వివాదాలకు తెరతీశారు. తాజా సమావేశంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుని చర్చనీయాంశంగా మార్చారు. సినీ నటుడు బాలకృష్ణ నియోజక వర్గంపై టీటీడీకి అమితమైన ప్రేమ హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి నియోజకవర్గాల అభివృద్ధి కోసం గతంలో టీటీడీ నుంచి నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి హిందూపురం నియోజక వర్గంలో శ్రీఆంజనేయస్వామి ఆలయ పునరుద్ధరణకు టీటీడీ రూ.25 లక్షలు కేటాయించింది. అదే విధంగా ప్రకాశం జిల్లా దొడ్డుకూరు గ్రామంలో చెన్నకేశవస్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.25లక్షలు, అనంతపురం జిల్లా పరిగి గ్రామం శ్రీ ఆంజనేయస్వామి, రొద్దకంభ ఆలయం సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు టీటీడీ కేటాయించింది. కాగా తిరుమలలో యాత్రికుల వసతి సముదాయాలు నిర్మించకూడదని గతంలో టీటీడీ నిర్ణయం తీసుకోగా తిరుమలలో కొత్తగా పీఏసీలు నిర్మించేందుకు రూ.79 కోట్లు కేటాయించాలని నిర్ణయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాలకమండలి ముఖ్యమైన నిర్ణయాలు: - తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ గోపురం బంగారు తాపడానికి రూ.32.26 కోట్లు. - గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు తలనీలాల ద్వారా రూ.133.32 కోట్లు రాబడి. - తిరుమలలో మరో పీఏసీల నిర్మాణానికి రూ.79 కోట్ల అంచనాలతో ఆమోదం. - ఆగమసలహాదారుగా రమణదీక్షితులు స్థానంలో వేణుగోపాల్ దీక్షితులు నియామకం. - మీరాశీ వంశీకుల నుంచి అర్హత కలిగిన 12 మంది అర్చకులుగా నియామకం. - రమణదీక్షితులకు ఇచ్చిన నోటీసులపై ఇంకా వివరణ అందలేదు. మరో మూడు రోజుల్లో రమణదీక్షితులు, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వివరణ ఇవ్వాలి. - ఒంటిమిట్ట అభివృద్ధి కోసం రూ.36 కోట్లు, యాత్రికుల వసతి గృహాలకు 5.25 కోట్లు . - రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టిన దివ్యదర్శనం పథకం అమలు చేయటంలో భాగంగా రవాణా సౌకర్యం కోసం 50 శాతం వ్యయాన్ని టీటీడీ ఖర్చు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీకి రూ.1.25 కోట్లు చెల్లించేందుకు ఆమోదం. - చిల్లర నాణేల మార్పిడి కోసం ఆర్బీఐతో సంప్రదింపుల కోసం కమిటీ. - నూతన కల్యాణమండపాల నిర్మాణంపై సబ్‌కమిటీ నివేదిక తర్వాత నిర్ణయం. - తిరుమలలో మాస్టర్‌ప్లాన్‌లో రూ.15 కోట్లు వెచ్చించి మురుగుదొడ్ల నిర్మాణం. -
తూతూమంత్రంగా శ్రీవారి ఆభరణాల తనిఖీ
-
రమణదీక్షితులుపై చర్యలకు సిద్ధమైన టీటీడీ
-
దీక్షితులుపై లీగల్‌గా ముందుకెళ్తాం: టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుమల: టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇటీవల ఉద్వాసనకు గురైన దేవస్థాన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవస్థాన వ్యవహరాలపై నిరాధార ఆరోపణలు చేస్తున్న దీక్షితులుపై లీగల్‌గా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సుధాకర్ యాదవ్, ఈవో సింఘాల్ మంగళవారం మీడియాతో తిరుమలలో మాట్లాడారు. 24 ఏళ్లపాటు ప్రధాన అర్చకుడిగా ఉన్న దీక్షితులు దేవస్థాన వ్యవహారాలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఛైర్మన్ మండిపడ్డారు. ఆరోపణలు చేసేముందు పాలక మండలి దృష్టికి తేవాల్సిందని అన్నారు. శ్రీవారి ఆభరణాలను భక్తుల సందర్శనకు పెడతామనీ, దీనిపై ఆగమ శాస్త్ర పండితుల సలహాలను తీసుకుంటామని ఈవో సింఘాల్ తెలిపారు. ఆభరణాల పూర్తి భద్రత టీటీడీదేనని అన్నారు. టీటీడీ పాలక మండలి తీసుకున్న పలు నిర్ణయాలను వారు వెల్లడించారు. రాష్ర్ట వ్యాప్తంగా దళిత, గిరిజన వాడలు, మత్స్యకారుల నివాస ప్రాంతాల్లో ఒక్కోటి 10 లక్షల రూపాయల వ్యయంతో ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. జిల్లాలోని నాగలాపురంలో వేద పాఠశాల ఏర్పాటు చేయనున్నామని వివరించారు. తిరుమలలో 70 ఎకరాల విస్తీర్ణంలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
విజిలెన్సు నివేదికలో వందల కోట్ల విలువైన డైమండ్
-
నిక్షేపాల కోసం వంటగదిలో తవ్వకాలు జరిపారు
-
లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా
సాక్షి, అమరావతి: శ్రీవారికి చెందిందిగా ప్రచారంలో ఉన్న గులాబీ వజ్రం అసలు లేనేలేదని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తిరుమల ఆలయంలో నగల మాయం, అర్చకుల తొలగింపు, విబేధాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన ఈ భేటీకి టీటీడీ ఈవో సింఘాల్ సహా ఇతర ఉన్నతాధికులు హాజరయ్యారు. (చదవండి: చంద్రబాబు పదేపదే అదే చెప్పారు: సింఘాల్) ‘‘శ్రీవారి ఆభరణాల రికార్డుల్లో గులాబీ వజ్రం అనేది లేనేలేదు. రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా? ఎక్కడి నుంచి తెస్తాం? అసలు రమణదీక్షితులు ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?’’ అని టీటీడీ చైర్మన్ ప్రశ్నించారు. కొద్దిరోజులుగా జరుగుతోన్న వ్యవహారాలపై సీఎం వివరాలు అడిగారని, అన్ని విషయాలూ సవివరంగా చెప్పామని, రమణదీక్షితులుగానీ మరొకరుగానీ చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ ఈవో సింఘాల్ సైతం మీడియాతో మాట్లాడుతూ.. ఆగమశాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను ప్రదర్శిస్తామని అన్నారు. వేంకటేశ్వరుడికి చెందిన గులాబీ వజ్రంతోపాటు కొన్ని ఆభరణాలు కనిపించకుండా పోయాయని, పోటు(వంటశాల)ను మూసివేసి స్వామివారిని పస్తులు ఉంచారని శ్రీవారి ఆలయం మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమధ్య జర్మనీలో వేలం వేసిన గులాబీ వజ్రం శ్రీవారిదే అయి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు కూడా. -
టీటీడీలో సరికొత్త శకం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నూతన ప్రధాన అర్చకులు నియమితులయ్యారు. నలుగురు అర్చకులను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. అనూహ్య పరిణామాల మధ్య గొల్లపల్లి వంశం నుంచి రమణ దీక్షితులకు బదులుగా వేణుగోపాల దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందరాజ దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులు, పైడిపల్లి కుటుంబం నుంచి కృష్ణ శేషాచల దీక్షితులను నియమించారు. ఎన్నో ఏళ్ల తర్వాత టీటీడీ సరికొత్త శకానికి శ్రీకారం చుట్టింది. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుల పాత్ర ప్రత్యేకమైంది. స్వామివారి కైంకర్యాల్లో అత్యంత కీలకమైన బాధ్యతలు ప్రధాన అర్చకులు నిర్వహిస్తారు. రమణదీక్షతుల వ్యవహారంతో శరవేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీటీడీ నలుగురు ప్రధాన అర్చకులను నియమించింది. వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయంలో, శ్రీనివాస దీక్షితులు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తారు. రిటైర్మెంట్ ప్రకటన శుభపరిణామం 40 తరాలుగా మిరాశిగా స్వామి వారికి సేవలు చేస్తున్నాను. 1997 వరకు మిరాసిగా వ్యవహరిస్తూ వస్తున్నాం. 65 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటన శుభపరిణామం. తర్వాతి తరాల వారికి కూడా అవకాశం కలిగించే భాగ్యం కలుగుతుంది. 65 సంవత్సరాలు పైబడిన వారికి హోదా మాత్రమే తగ్గుతుందే తప్ప మిగతా మర్యాదలతో పాటు స్వామి వారికి సేవలు చేసే భాగ్యం అలాగే ఉంటుంది. మిరాశిగా ఉన్నప్పుడు 8 ఏళ్లకు ఓసారి మారుతూ వచ్చేది. స్వామి వారి అభారణలపై విమర్శలు సరికాదు. టీటీడీ దగ్గర అని రికార్డ్స్ ఉన్నాయి. మహంతుల దగ్గర నుంచి తీసుకున్న అన్ని లెక్కలు ఉన్నాయి. వేణుగోపాల్ దీక్షితులు చాలా సంతోషంగా ఉంది ప్రధాన అర్చకుల హోదాలో మా నాన్నకు రిటైర్మెంట్ ఇచ్చి నాకు పోస్టింగ్ ఇచ్చారని పైడిపల్లి వంశానికి చెందిన శేషాచలం దీక్షితులు తెలిపారు. స్వామి వారికి సేవ చేసే భాగ్యం నాకు దక్కడం చాలా సంతోషంగా ఉంది. నాన్నగారి పర్యవేక్షణలోనే స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తాను. మరో వైపు తిరుపతమ్మ వంశానికి చెందిన గోవిందరాజ దీక్షితులు మాట్లాడుతూ.. దేవస్థానం చైర్మన్, ఈఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్నీ సవ్యంగా ఉన్నాయి 1958 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు స్వామి వారికి సేవలు చేస్తూ వస్తున్నాను. ఆగమశాస్త్రం ప్రకారమే స్వామి వారికి కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని సేవలు పద్దతి ప్రకారమే నిర్వహిస్తున్నారు. స్వామివారికి జరిపే పూజ కార్యక్రమాలలో ఎలాంటి దోషం లేదు. నైవేద్యం కూడా స్వామి వారికి సవ్యంగా జరుగుతుంది. షడ్కరా ఆరాధనలు స్వామి వారికి జరుగుతూనే ఉన్నాయి. పోటును మరమ్మత్తులు చేస్తున్నారే తప్ప లోపల కట్టడాలు ఏమీ కూల్చలేదు. సుధార వరధారాజన్, ఆగమశాస్త్ర సలహా దారులు -
టీటీడీలో రోజుకో వివాదం.. భక్తులు మండిపాటు
సాక్షి, తిరుమల : టీటీడీలో రోజుకో వివాదం తలెత్తుతున్నాయి. అంతేకాక టీటీడీ వివాదస్పద నిర్ణయాలపై భక్తులు మండిపడుతున్నారు. అరవై ఐదుళ్లు దాటిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌పై యాదవ్ సంఘాలు గుర్రుమంటున్నాయి. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంతో 5మంది మీరాశి అర్చకులు, 10 మంది నాన్ మిరాశి అర్చకులు, ఒక సన్నిధి గొల్ల ఉద్యోగాలు కోల్పోతారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై పూర్తి విచారణ చేయాలని సీఐటీయు నాయకుడు కందారపు మురళి కోరారు. ప్రభుత్వం వెంటనే దీనిపై సమాధానం చెప్పాలని మురళి పేర్కొన్నారు. ‘ఆలయంలో అసలేం జరుగుతుందో భక్తులకు అనుమానాలు కలుగుతున్నాయి. శ్రీవారి అభరణాలు, ఆస్తులు భద్రతపై భక్తులు నమ్మకం కోల్పోతున్నారు. వెంటనే ఈ ఆరోపణలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేయించాలి’. అని కందారపు మురళి అన్నారు. ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులకు ఈఓ నోటిసులు కూడా జారీ చేసింది. దీనిపై రమణ దీక్షితులు మాట్లాడుతూ.. మాపై చర్యలు తీసుకునే హక్కు టీటీడీకి లేదన్నారు. ఆ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. 143 చట్టం ప్రకారం మాకు మిరాసిలో వచ్చే ఆదాయం మాత్రమే రద్దయిందని తెలిపారు. వంశపారంపర్యం, సంభవణ, గౌరవంగా చూస్కోవాలని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది.. కోర్టు నిర్ణయాలను కూడా టీటీడీ లెక్కచెయ్యట్లేదన్నారు. మిరాశి అర్చకులును హీనంగా చూసిన సహించాము.. కానీ కైంకర్యాలలో లోపాలు జరిగితే ఉరుకోము. టీటీడీ అధికారులు వీఐపీల సేవలో తరిస్తూ, మాపై పెత్తనం చలాయిస్తున్నారు. నిత్య సేవలు త్వరగా నిర్వహించాలని మాపై ఒత్తిడి తేస్తున్నారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. -
65 ఏళ్లు దాటిన అర్చకులపై టీటీడీ వేటు
-
టీటీడీ అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల వయోపరిమితిపై ధర్మకర్తల మండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని నిర్ణయించింది. ఎండోమెంట్ యాక్టు ప్రకారం అర్హత గల మిరాశీ, నాన్ మిరాశీ కుటుంబాలకు చెందిన వేద పండితులను ఖాళీ పోస్టుల్లో అర్చకులుగా నియమి స్తామని టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. బుధవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్లో మండలి తొలి సమావేశం జరిగింది. మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌లు వివరాలను వెల్లడించారు. ఎజెండాలో పొందుపరిచిన 200 అంశాలపై సభ్యుల ఆమోదం తీసుకోవాల్సి ఉండగా కేవ లం 2 అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ తెలిపా రు. టీటీడీలో ఉన్న శ్రీవారి కానుకలను బ్యాంకుల్లో డిపాజిట్లు వేసే వ్యవహారంపై మంచీచెడులను విశ్లే షించి తగిన సూచనలు ఇచ్చేందుకు త్వరలో ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. రమణ దీక్షితులుకు నోటీసు మంగళవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీ పాలక మండలి, అధికారులు, ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు నోటీసు జారీ చేస్తున్నామని ఈవో అనిల్ కుమార్‌సింఘాల్ వెల్లడించారు. దీక్షితులు మీడియా ముందు ప్రస్తా వించిన అంశాలపై వివరణ కోరుతున్నామన్నారు. 65 ఏళ్లు పైబడి 16 మంది.. తిరుమలలో మిరాశీ కుటుంబాలకు చెందిన వంశపారంపర్య అర్చకత్వ సేవల్లో 52 మంది ఉన్నారు. ఇందులో 65 ఏళ్ల పైబడిన వారు 16 మంది ఉన్నారు. మార్గదర్శకాలు అమల్లోకి వస్తే వీరి తొల గింపు అనివార్యమవుతుంది. ఆలయ ప్రధానార్చక కుటుంబాలకు చెందిన రమణ దీక్షి తులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస, నారాయణ దీక్షితులు సైతం ఉద్యోగ విరమణ తీసుకోవాల్సి ఉంటుంది. చట్టబద్ధంగా ఎదుర్కొంటాం: రమణ దీక్షితులు అరవై ఐదేళ్లు దాటిన అర్చకులకు ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి బుధవారం తీసుకున్న నిర్ణయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు. వంశ పారంపర్య అర్చకత్వంలో వేలు పెట్టే అధికారం టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న తప్పులను మీడియా ముందు ఎత్తిచూపినందుకే ప్రతీకార చర్యగా టీటీడీ అర్చకుల వయోపరిమితిపై నిర్ణయం తీసుకుందని దీక్షితులు ఆరోపించారు. టీటీడీ అధికారులు అజ్ఞానంతో తీసుకునే నిర్ణయాలపై మాట్లాడాల్సి రావడం బాధగా ఉందంటూ.. అర్చకులకు న్యాయస్థానం కల్పించిన హక్కులను వివరించారు. 1996లో మిరాశీలను రద్దు చేసినప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన విషయాలను ఉటంకించారు. బహు మానాలు, మర్యాదల్లో టీటీడీ వంశపారంపర్య అర్చకులకు ఆటంకం కలిగించ కూడదన్నారు. సంభావన ఏర్పాటుపై కూడా కోర్టు స్పష్టంగా ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు టీటీడీ అర్చకులను ఉద్యోగులుగా చూపుతూ ఉద్యోగ విరమణ వర్తింపజేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. స్వామివారి కైంకర్యాలకు వెళ్లిన అర్చకులను దుర్భాషలాడుతూ, సిబ్బంది చేత అవమానకరంగా మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు. -
అర్చకులను బెదిరించి పనులు జరుపుకుంటున్నారు
-
టీటీడీ అర్చకులు రమణదీక్షితులపై వేటు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ వెంటనే అమలులోకి తీసుకువచ్చింది. దాంతో శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సహా అర్చకులు నరసింహదీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణదీక్షితులపై వేటు పడింది. రమణ దీక్షితులు సహా నలుగురు ప్రధాన అర్చకులు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే టీటీడీ తీసుకున్నఈ నిర్ణయంపై అర్చకులు మండిపడుతున్నారు. కాగా, టీటీడీ నిర్ణయాలపై రమణదీక్షితులు మంగళవారం చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆచార వ్యవహారాలపై పలు విమర్శలు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది జరిగి 24 గంటలకు గడవక ముందే 65 ఏళ్ల పరిమితి సాకు చూపి రమణదీక్షితులపై పాలకమండలి వేటు వేసింది. అంతేకాకుండా రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వివరణ కోరుతామని దేవస్థానం ఈవో సింఘాల్ తెలిపారు. -
టీటీడీ వివాదస్పద నిర్ణయం
-
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం బుధవారం నిర్వహించారు. చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన బుధవారం స్థానిక అన్నమయ్య భవన్లో 17 మంది సభ్యలతో ఈ సమావేశం జరిగింది. కొత్తగా పాలకమండలి ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న సమావేశం కావడంతో అందరూ హాజరయ్యారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు బోర్డు సభ్యులు తీసుకున్నారు. సమావేశం అనంతరం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘65 ఏళ్లు పైబడితే అర్చకులు పదవీ విరమణ చేయాలి. వంశపారంపర్యంగా వారి కుటుంబసభ్యులకు అవకాశం ఇస్తాం. ఢిల్లీలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సలహా మండలి ఏర్పాటు చేస్తున్నాం. టీటీడీ డిపాజిట్లపై సబ్‌కమిటీ నియమించాం. గత ఏడాది కాలంగా తీసుకున్న 200 తీర్మానాలుకు సంబంధించి 55 తీర్మానాలుకు ఆమోదం తెలిపాం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో, చంద్రగిరిలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రతీనెల పున్వరసు నక్షత్రాన ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహిస్తాం. జూన్ 5వ తేదీన మరోసారి టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహిస్తాం. తిరుమలలో శుభ్రత పర్యవేక్షణకు కమిటీ వేస్తున్నాం. అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై చర్చ జరిగింది. ఆయన అరోపణలపై వివరణ కోరుతాము. వివరణ ఇచ్చాక తగిన చర్యలు తీసుకుంటాము. ప్రతి ఏడాది ఆభరణాలను గ్రాములతో సహా లెక్కిస్తాం. 65 సంవత్సరాల పైబడిన వారు పదవీ విరమణ అమలు చేస్తే.. రమణ దీక్షితులు కూడా పదవి విరమణ చెయ్యాల్సిదే. 1997లోని చట్టం ప్రకారం సన్నిధి గొల్లలు టీటీడీ ఉద్యోగులుగా మారారు. ప్రస్తుతం 43 మంది మిరాశి అర్చకులు ఉన్నారు’ అని ఆయన వెల్లడించారు. -
టీటీడీ: కొత్త పాలక మండలి అసహనం.. బుజ్జగింపులు!
సాక్షి, తిరుమల : శ్రీవారి ఆలయంలో నూతన పాలకమండలి శనివారం ప్రమాణం స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ ప్రమాణం చేశారు. ఆయనతోపాటు 11మంది పాలక మండలి సభ్యులు కూడా ప్రమాణం స్వీకరించారు. ఈ క్రమంలో ఉదయం దర్శనం కోసం వచ్చిన నూతన పాలక మండలి సభ్యులను, వారి కుటుంబ సభ్యులను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తుల రద్దీ దృష్టి కొద్దిసేపు సిబ్బంది నిలిపేశారు. దీంతో టీటీడీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ నూతన పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీటీడీ ఇన్చార్జ్ సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, అధికారులు నూతన సభ్యులను బుజ్జగించి తీసుకొచ్చారు. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో తమకు అసౌకర్యం కలుగజేస్తున్నారంటూ శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
పుట్టా, అనిత నియామకంపై పిల్
సాక్షి, హైదరాబాద్: తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యురాలిగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితలను నియమిస్తూ ఏపీ సర్కార్ ఈ నెల 20న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అన్యమతానికి మద్దతు తెలిపే వారిద్దరికీ తిరుమల పాలక మండలిలో నియమితులయ్యేందుకు ఏమాత్రం అర్హత లేదంటూ తిరుపతికి చెందిన హిందూ చైతన్య సమితి ప్రతినిధి తుమ్మ ఓంకార్, మరో ఇద్దరు పిల్‌ను దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు మంగళవారం విచారించనుంది. -
తితిదే బోర్డు మెంబర్ల నియామకం..
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం చేపట్టింది. టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సభ్యులుగా ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీఎస్ఎస్ శివాజీ, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్యే అనిత, ఎమ్మెల్యే పార్థసారధి, ఎమ్మెల్యే చల్లా రామచంద్రారెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మేడా రామచంద్రా రెడ్డి, డొక్కా జగన్నాధం, సండ్ర వెంకట వీరయ్య(తెలంగాణ), ఇనుగాల పెద్దిరెడ్డి(తెలంగాణ), సుధా నారాయణ మూర్తి(కర్ణాటక), సప్న (మహారాష్ట్ర) నియమితులయ్యారు. -
తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రం వద్ద ఉద్రిక్త చోటుచేసుకుంది. వైఎస్సార్ జిల్లా టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించడాన్ని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శైవక్షేత్ర ముట్టడికి యాదవ సంఘాలు పిలుపునిచ్చాయి. ఆదివారం ఉదయం నుంచి ఇక్కడికి చేరుకున్న యాదవులు శైవక్షేత్రాన్ని ముట్టడించే యత్నం చేశారు. ముందు జాగ్రత్తగా శైవక్షేత్రం వద్ద భారీగా మోహరించిన పోలీసులు యాదవ సంఘాలను అడ్డుకున్నారు. అయినా శైవక్షేత్రంలోకి ప్రవేశించేందుకు యత్నించిన కొందరు యాదవులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాదవ సంఘ నాయకులను పోలీసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. శైవ క్షేత్రంపై జరగబోయే దాడి యావత్తు హిందూ ధర్మం, హిందువుల మీద దాడిగా పరిగణిస్తున్నామని, పుట్టా సుధాకర్ యాదవ్ కాకుండా హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న ఏ యాదవ సోదరుడిని నియమించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని పీఠాధిపతి శివస్వామి ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. (టీటీడీ చైర్మన్‌గా ఆయన తప్ప, ఎవరైనా సరే!) -
టీటీడీ చైర్మన్‌గా ఆయన తప్ప, ఎవరైనా సరే!
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ జిల్లా టీడీపీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఆయన నియామకాన్ని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యతిరేకిస్తున్నారు. ‘హిందు దేవాలయ పరిరక్షణను దెబ్బ తీయడం కోసమే పుట్టా సుధాకర్ యాదవ్‌ను టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియామకం చేసినట్లు అనిపిస్తోంది. 'ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తున్నందుకు రేపు (ఆదివారం) యాదవ సోదరులు శైవక్షేత్రం ముట్టడి చేయబోతున్నట్లు మాకు సమాచారం అందింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాం. శైవ క్షేత్రంపై జరగబోయే దాడి యావత్తు హిందూ ధర్మం, హిందువుల మీద దాడిగా పరిగణిస్తున్నాం. పుట్టా సుధాకర్ యాదవ్ కాకుండా హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న ఏ యాదవ సోదరుడిని నియమించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని' పీఠాధిపతి శివస్వామి తెలిపారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి పుట్టా సుధాకర్ యాదవ్ వియ్యంకుడన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి మైదుకూరు టిక్కెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైదుకూరు సీటు ఆశిస్తున్న పుట్టా సుధాకర్‌ను రేసు నుంచి తప్పించేందుకే టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని సమాచారం. -
టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్
-
‘పుట్టా’కు టీటీడీ.. ‘వర్ల’కు ఆర్టీసీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు సీఎం చంద్రబాబు అధ్యక్షులను నియమించారు. టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్, ఆర్టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్యను ఖరారు చేశారు. ఆ జాబితాను పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ సీఎం సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి లభించింది. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి అప్పగించారు. -
మైదుకూరులో జోరుగా రాజకీయ చర్చ
వైఎస్ఆర్ జిల్లా , మైదుకూరు టౌన్ : మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు మైదుకూరు టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్‌కు పార్టీ అధిష్టానం టీటీడీ చైర్మన్ పదవి ఖరారు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైదుకూరులో పుట్టా ఇన్చార్జ్గా కొనసాగుతారా...? మరొకరికి ఇస్తారా...? అనేది ఆ పార్టీ నాయకులతో పాటు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గ బాధ్యతలతోపాటు టీటీడీ చైర్మన్‌గా కూడా తానే కొనసాగుతానని, వచ్చే ఎన్నికల్లో తానే పోటీలో ఉంటానని పుట్టా తెగేసి చెబుతున్నారు. కొంతమంది ఆ పార్టీలోని వారే పుట్టాను పక్కన పెట్టేందుకే టీటీడీ చైర్మన్ పదవి కట్టబెడుతున్నారని.. ఇక మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకొని అతనికే ఇన్చార్జ్ ఇస్తారని చెబుతున్నారు. కానీ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం తనకు ఇన్చార్జ్ పదవితో పాటు నియోజకవర్గంలో మరెవ్వరూ తన విషయంలో జోక్యం చేసుకోరాదని షరతులు పెడుతున్నట్లు సమాచారం. పుట్టాకు టీటీడీ చైర్మన్ ఇస్తే ఆ పదవి క్యాబినెట్ హోదాతో సమానమని, ఆయన రాజకీయంగా ఇంకా బలపడుతారని, తాను ఆ పార్టీలోకి వెళ్లి ఎలా ఉనికి చాటుకోవాలో అనే సందిగ్ధంలో డీఎల్ కాస్త వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు... డీఎల్ తనకు సంబంధించిన వర్గీయులను పిలిపించుకొని ఏ పార్టీలోకి వెళితే బాగుంటుందనే అభిప్రాయాలను తెలుకొంటున్నట్లు తెలిసింది. డీఎల్ మాత్రం ఏపార్టీలోకి వెళ్లినా తనదే పైచేయి ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే డీఎల్ టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా..? లేక ఇండిపెండెంట్ అ«భ్యర్థిగా 2019 ఎన్నికల్లో పోటీచేస్తారా.. అనేది అంతు చిక్కడం లేదు. దీనికితోడు కొంతమంది పుట్టా వర్గీయులు, ఆయన సామాజికవర్గం వారు డీఎల్ పార్టీలోకి వస్తే తాము పనిచేయడం కష్టమని.. మీరు ఇన్చార్జ్గా ఉంటేనే మీ వెంట నడుస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది. మరికొంత మంది ఇప్పటి వరకు టీడీపీలోకి ఎవ్వరిని బడితే వారిని పుట్టా చేర్పించుకున్నారని, క్యాడర్‌కు విలువ ఇవ్వకుండా వెనకవచ్చినవారికే లబ్ధిచేకూరేలా వ్యవహరించారని, ఆయనను ఇన్చార్జి పదవి నుంచి తొలగించి డీఎల్ రవీంద్రారెడ్డిని తీసుకొంటే తమ ఉనికి చాటుకోవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా పుట్టాకు టీటీడీ చైర్మన్ పదవి.. మైదుకూరు ఇన్చార్జి వ్యవహారం, డీఎల్ టీడీపీలో చేరుతాడా..లేదా అనే దానిపై నియోజకవర్గవ్యాపితంగా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. -
టీటీడీ చైర్మన్‌గా సుధాకర్ యాదవ్?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ పాలక మండలి కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. పార్టీలోని కీలక నేతలతో సమావేశమై నూతన ట్రస్ట్ బోర్డుపై చర్చిస్తున్నారు. దసరాలోపే పాలక మండలిని ప్రకటించాలని మొదట నిర్ణయించినా పలు కారణా లతో అది సాధ్యంకాలేదు. దీంతో ట్రస్ట్‌బోర్డు లేకుండానే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారంతో ఇవి కూడా ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల లోపు పాలకమండలి నియామకం పూర్తయితే బ్రహ్మోత్సవాల సంబరం మరింత వేడుకగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తంకావడంతో సీఎం శుక్రవారం నుంచి దృష్టిసారించారు. తాజాగా వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ పేరు వినిపిస్తోంది. టీటీడీ ట్రస్ట్ బోర్డు నూతన చైర్మన్‌గా సుధాకర్‌యాదవ్ పేరు ఖరారైనట్లేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రసార మాధ్యమాల ద్వారా సీఎంకి సుధాకర్‌యాదవ్ ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే శుక్రవారం నుంచి మళ్లీ మదనపల్లికి చెందిన రవిశంకర్ పేరు వినిపిస్తోంది. కాగా, సుధాక ర్యాదవ్ పేరు ఖరారు విషయంలో మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం దగ్గర వ్యూహాత్మకంగా చక్రం తిప్పారని వినికిడి. దీనికితోడు డీఎల్ రవీంద్రా రెడ్డికి మైదుకూరులో స్థానం కల్పించాలంటే సుధాకర్‌యాదవ్‌ను మరోచోటికి పంపించాలన్న ఆలోచన కూడా కారణమని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి నలుగురికి..: ఈసారి ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో నలుగురు తెలం గాణ నేతలకు కూడా చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. చింతల రామచం ద్రారెడ్డి, సండ్ర వీరయ్యతో పాటు రేవంత్‌రెడ్డి, మరో నేత పేర్లు తెరమీదికొ స్తున్నాయి. అక్టోబర్ 2.. లేదా 5న నూతన పాలక మండలిని సీఎం అధికారి కంగా ప్రకటించే వీలుందని తెలుస్తోంది. -
పుట్టాకు టీటీడీ చైర్మన్
సాక్షి ప్రతినిధి – కడప : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు మైదుకూరు నియోజక వర్గంలో మరో ప్రయోగానికి తెర లేపబోతున్నారు.టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్‌ను తప్పించి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని నియోజక వర్గ నాయకున్ని చేయాలని నిర్ణయించుకున్నారు. పుట్టాను బుజ్జగించడం కోసం ఆయనకు తిరుమల–తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి చైర్మన్ పదవి ఆశ చూపారు. నేడో, రేపో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి మార్గం సుగమమైంది. అయితే చంద్రబాబు నిర్ణయంపై పుట్టా సుధాకర్‌యాదవ్‌తోపాటు రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తీవ్రంగా రగలిపోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన పుట్టాను గానీ, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ నియోజక వర్గంలో పార్టీనే నమ్ముకుని రాజకీయం చేస్తున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని గానీ సంప్రదించకుండా సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే వరలో మూడు కత్తులు ఇమడ్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వికటించి అక్కడ మూడు ముక్కలాట రాజకీయానికి తెర లేవబోతోందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పుట్టా వ్యతిరేకం కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి పనిచేసిన తనను పక్కన పెట్టి డీఎల్ రవీంద్రారెడ్డికి పార్టీ పెత్తనం ఇవ్వడాన్ని పుట్టా సుధాకర్‌యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కాంట్రాక్టులు, వ్యాపారాలు వదులుకుని తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని ఆయన చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఓడినా 2019 ఎన్నికల్లో నైనా గెలవాలనే పట్టుదలతో తాను పనిచేసుకుంటుంటే డీఎల్‌ను తీసుకు రావాలనుకోవడం ఏమిటని ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో డీఎల్ తనకు మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నా ఆయన సొంత బూత్‌లోనే వైఎస్సార్సీపీకి మెజారిటీ వచ్చిందని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతలు డీఎల్‌తో ఇమడలేరనే వాదన ఆయన లేవదీశారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినా అవసరం లేదని, ఎమ్మెల్యే కావాలనే గోల్‌తోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెగేసి చెబుతున్నారు. డీఎల్‌ను పార్టీలోకి తీసుకునే విషయంపై కనీసం తన అభిప్రాయం కూడా తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడాన్ని అవమానంగా భావిస్తున్నారు. డీఎల్‌ను ఎలాంటి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోరాదని హై కమాండ్‌తోనే తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులు, కేడర్‌తో డీఎల్‌తో ఇమడలేరనే వాదన ఆయన లేవదీశారు. రగులుతున్న రెడ్యం వర్గం ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన రెడ్యం కుటుంబం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంనే నమ్ముకుని ఉంది. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డితో 35 సంవత్సరాలుగా ఫ్యాక్షన్ రాజకీయం నడుపుతోంది. ఈ కుటుంబం తరపున రెడ్యం వెంకటసుబ్బారెడ్డి నియోజక వర్గంలో పార్టీని నడిపించే దిక్కులేని సమయంలో కూడా డీఎల్‌ను ఎదుర్కొని పనిచేశారు. ఈ క్రమంలో ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద అనేక కేసులు పెట్టారు. 2014 ఎన్నికల్లో మైదుకూరు టికెట్ కోసం రెడ్యం వెంకటసుబ్బారెడ్డి కూడా పోటీ పడ్డారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో బీసీలకు టికెట్ ఇస్తున్నామని, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర స్థాయి పదవి ఇస్తానని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. రెడ్యంకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్ర నాయకత్వానికి పంపి రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు దిక్కు లేదు. అయినా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమను కాదని తమ బద్ధ శత్రువు డీఎల్‌ను పార్టీలోకి తీసుకునే ప్రతిపాదనను రెడ్యం కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ విషయం గురించి కనీసం తమ అభిప్రాయం తీసుకోక పోవడంపై తీవ్రంగా రగిలిపోతున్నారు. డీఎల్ పార్టీలోకి వస్తే మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులను, కేడర్‌ను అణగదొక్కే రాజకీయం చేస్తారని, దీని వల్ల నిజమైన కార్యకర్తలు, నాయకులు పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితి వస్తుందని రెడ్యం, పుట్టా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తాను టీడీపీలోకి వస్తున్నానని డీఎల్ ఇప్పుడు అధికారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, తాము ప్రతిపాదించిన అభివృద్ధి పనులను కూడా అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారని మైదుకూరు టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో డీఎల్ ఆగమనం మైదుకూరు టీడీపీని ఏ తీరానికి చేరుస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. డీఎల్ షరతులు తాను పార్టీలో చేరాలంటే నియోజక వర్గ ఇన్చార్జ్గా ప్రకటించి, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని డీఎల్ రెండు షరతులు విధించారు. ఈ షరతులకు సీఎం చంద్రబాబు అంగీకరించడంతో డీఎల్ టీడీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. డీఎల్ వారం, పది రోజుల్లో అమరావతిలో సీఎంను కలిసి పార్టీలో చేరే విషయం ప్రకటిస్తారని చెబుతున్నారు. -
మైదుకూరు టీడీపీలో ముసలం
మైదుకూరు టౌన్: పాలకులు అవినీతి పరులైతే కింది స్థాయి సిబ్బంది కూడా వారి ఇష్టానుసారం దోచుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకు పావులు కదుపుతారు. మైదుకూరు మున్సిపాలిటీలో రోజు రోజుకు అవినీతి తీవ్ర స్థాయిలో పేరుకుపోతోంది. స్వపక్షంలోని కౌన్సిలర్లే రెండు వర్గాలుగా విడిపోయి మీరంటే మీరే అవినీతికి పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలో సిబ్బంది ఓ వర్గం కౌన్సిలర్లుకు మాత్రమే కొమ్ము కాస్తుండడంతో స్వపక్షంలోని మిగితా కౌన్సిలర్లు జరిగిన అక్రమాలపై నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పుట్లా మున్సిపల్ చైర్మన్ సీఎన్ రంగసింహపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించే కౌన్సిల్ సమావేశంపై ముందుగానే శుక్రవారం చైర్మన్ టీడీపీ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. తనపై పుట్టా సుధాకర్ యాదవ్‌కు ఫిర్యాదు చేయడమెందుకు, సమస్యలుంటే ఇక్కడే ప్రస్తావిస్తే లబ్ధి చేకూరేలా చూస్తాను కదాని చెప్పినట్లు సమాచారం. పలువురు కౌన్సిలర్లు డుమ్మా.. శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి మున్సిపల్ అధికారులు, చైర్మన్ రూపొందించిన అజెండాలోని పనులపై కౌన్సిలర్లు అసమ్మతి వ్యక్తం చేసి సమావేశానికి డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఈ అజెండాలోని ముఖ్యమైన వాటిలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాచనూరు చంద్ర పేరుపై మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లె సమీపంలో సర్వేనం.1453–1లో 1.74 హెక్టారుల్లో రోడ్డు మెటల్ , బిల్డింగ్ స్టోన్ క్రషరు పరిశ్రమ ఏర్పాటుకు కడప జియాలజీ డిపార్ట్మెంటు సర్వే చేసి తదుపరి సదరు పరిశ్రమ ఏర్పాటుకు మైదుకూరు పురపాలిక సంఘం నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందేందుకు కౌన్సిలర్ల ఆమోదం కోసం ఉంచారు. అయితే కొందరు కౌన్సిలర్లు ఇందుకు సమ్మతించడానికి ఇష్టం లేక కొందరు కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. అంతేకాక మున్సిపల్ చైర్మన్ వ్యవహారం మొదట నుంచి నచ్చని కొందరు కౌన్సిలర్లు ఆ పదవిని వేరే వ్యక్తికి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. అలాగే మరుగుదొడ్ల నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారంపై శనివారం సమావేశంలో నిలదీసేందుకు స్వపక్ష కౌన్సిలర్లతోపాటు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో చైర్మన్ సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు. టీడీపీలో ముసలం పుట్టిందిలా... టీడీపీ ఇన్చార్జి తమ సామాజిక వర్గం కాబట్టి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తమకే వస్తుందని కొంతమంది నాయకులు ఆశలపల్లకిలో ఊగిసలాడారు. ఈ నేపథ్యంలో ఆయన మాచనూరు చంద్రకు ఆ పదవిని కట్టబెట్టారు. ఏడాది కాలం తర్వాతనైనా మకు వస్తుందని ఆశించారు. అయితే మళ్లీ మాచనూరు చంద్రకే చైర్మన్ పదవిని అప్పగించారు. దీంతో పార్టీలోని మరో వర్గం ఖంగు తిన్నట్లయింది. పార్టీ కోసం కష్టపడుతున్నా తమకు పదవులు రాకపోవడంతో వారిలోవారే మల్లగుల్లాలు పడుతున్నారు. అంతేకాక మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం కొంతమంది టీడీపీ కౌన్సిలర్లు ఆశలు పెట్టుకున్నారు. ఆ పదవి కూడా వారికి దక్కకపోవడంతో ముసలం పుట్టింది. ఎలాగైనా సరే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో ప్రస్తుతం ఉన్నవారిని తొలగించి, తమ వర్గానికి దక్కేలా కొంతమంది నాయకులు, కౌన్సిలర్లు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీలో ఇరువర్గల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. -
ప్రొద్దుటూరులో రూ. 46 లక్షలు పట్టివేత
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ బంధువులకు చెందిన శ్రీకర్ జిన్నింగ్ మిల్లుపై మంగళవారం ఉన్నతాధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా మిల్లులో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన భారీ నగదును ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుని... అదాయపు పన్నుశాఖకు అప్పగించారు. ఉన్నతాధికారుల కథనం ప్రకారం... ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఓటర్లకు పంచేందుకు భారీ మొత్తంలో తీసుకువచ్చిన నగదును ఆయన బంధువుల మీల్లులో ఉంచినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు, ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం సంయుక్తంగా సుధాకర్ యాదవ్ బంధువుల మిల్లుపై దాడులు చేశారు. ఆ క్రమంలో రూ. 46.19 లక్షలు నగదును స్వాధీనం చేసుకుని...అదాయపు పన్ను శాఖకు అప్పగించారు. ఈ పట్టుబడిన నగదుపై పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్టా బందువు మిల్లులో నోట్లకట్టలు
కాటన్ మిల్లులో రూ. 46లక్షలకు పైగా నగదు పట్టివేత ఎన్నికల డబ్బేనని నిర్ధారించిన ఆర్ఓ రూ. 5 లక్షలు ఇస్తా.. వదిలి వెళ్లాలని బేరం ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఆదరణ లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు నోట్ల కట్టలను నమ్ముకున్నారు. డబ్బును వెదజల్లి ఓట్లు పొందాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమీప బంధువైన రమణయ్య కాటన్ మిల్లులో పెద్ద మొత్తంలో నగదును దాచారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ డబ్బును ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి ప్రయత్నాలకు పోలీసులు గండి కొట్టారు. సమాచారం అందడంతో మిల్లుపై దాడి చేశారు. అక్కడ ఉన్న రూ. 46,19,200 నగదును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మైదుకూరు నియోజక వర్గ తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమీప బంధువైన రమణయ్యకు చెందిన శ్రీవెంకటేశ్వరా ఇండస్ట్రీస్ ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ఉంది. ఈ ఇండస్ట్రీస్ ప్రాంగణంలోనే శ్రీకర్ కాటన్ ట్రేడర్స్‌తో పాటు మరో రెండు మిల్లులు ఉన్నాయి. ఇవన్నీ ఒకే వ్యక్తికి చెందినప్పటికీ పేర్లు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి. కాగా పుట్టా సుధాకర్ యాదవ్ మేనల్లుడు మేకల శ్రీనివాసులు యాదవ్ ఇక్కడ డబ్బు ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుధాకర్ యాదవ్‌కు పూర్తిగా ఇతనే డబ్బును సమకూర్చుతుంటాడు. ఇతని చేతుల మీదుగానే రూ. కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. మైదుకూరు ఎన్నికల కోసం శ్రీనివాసులుయాదవ్ ఇక్కడ డబ్బు దాచి ఉంచినట్లు తెలుస్తోంది. ఈ మిల్లులో పెద్ద మొత్తంలో నగదు దాచివుంచారని సోమవారం 11.50 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. దీంతో అర్బన్ సీఐ టీవీ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి మిల్లులోకి చేరుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు వహీద్, చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డిలు కూడా అక్కడికి చేరుకున్నారు. ముందుగా పోలీసులు ప్రాంగణంలో ఉన్న మిల్లుల్లో తనిఖీలు చేశారు. అయితే ఎక్కడా డబ్బు కనిపించలేదు. శ్రీకర్ కాటన్ ట్రేడర్స్ సమీపంలో ఉన్న ఒక గదికి తాళం వేసి ఉంది. దానిని తెరవమని చెప్పగా అక్కడ ఉన్న సిబ్బంది తాళాలు లేవని చెప్పారు. సంబంధిత మిల్లు యజమాని రమణయ్యకు ఫోన్ చేసిన సీఐ ఇక్కడికి వచ్చి తాళం తీయాలని చెప్పగా అతను సెల్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో పోలీసులు, స్క్వాడ్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ అక్కడే ఉన్నారు. అర్బన్ సీఐ సత్యనారాయణ సంబంధిత మిల్లు యజమానికి 20 సార్లు పైగా ఫోన్ చేశారు. అయినప్పటికీ అతను రాకపోవడంతో రిటర్నింగ్ అధికారి బాలసుబ్రమణ్యం, డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, ఇన్‌కంట్యాక్స్ అధికారి కృష్ణకుమార్ల సమక్షంలో గది తాళాన్ని పగులకొట్టారు. బీరువాలో చూడగా అందులో సుమారు రూ. 46,19,200 నగదు ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం నగదును ఈ నెల 19, 24, 25 తేదీలలో పట్టణంలోని ఐడీబీఐ, ఐఎన్జీ వైశ్యాబ్యాంక్ల నుంచి డ్రా చేసినట్టు నోట్ల కట్టల లేబుల్‌పై ఉంది. ఈ మొత్తాన్ని పోలీసు అధికారులు ఇన్‌కంట్యాక్స్ అధికారులకు అప్పగించారు. ఇది ఎన్నికల డబ్బే.. రమణయ్యకు చెందిన శ్రీకర్ కాటన్ ట్రేడర్స్‌లో దొరికిన నగదు ఎన్నికల కోసం దాచి ఉంచినదే నని ఆర్ఓ బాలసుబ్రమణ్యం అన్నారు. ఎక్కడైనా డబ్బు దాచి ఉంచారని సమాచారమిస్తే వెంటనే దాడి చేస్తాన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు అందరూ సహకరించాలన్నారు. రూ. 5 లక్షలు ఇస్తా.. వదిలి వెళ్లండి మిల్లు వద్దకు వచ్చి తాళం తీయాలని మధ్యాహ్నం నుంచి పోలీసులు రమణయ్యకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అతను రాలేదు. పక్కా సమాచారంతో దాడి చేశారని భావించిన రమణయ్య ఓ పోలీసు అధికారికి ఎర వేశాడు. రూ. 5 లక్షలు ఇస్తాను.. అక్కడి నుంచి వెళ్లిపోండి అని అతను పోలీసు అధికారితో అన్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఆ అధికారి దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ సంఘటనపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అర్బన్ సీఐ టివి సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఐడీబీఐ, ఐఎన్జీ వైశ్యాబ్యాంక్లలో డబ్బు ఎవరు డ్రా చేశారు, ఎవరి అకౌంట్లో నుంచి డ్రా చేశారన్న విషయమై పోలీసు, ఇన్‌కంట్యాక్స్ అధికారులు మంగళవారం విచారించనున్నారు. విచారణ తర్వాత సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. -
ప్రొద్దుటూరులో పచ్చనోట్లు
టీడీపీ అభ్యర్థి బంధువు మిల్లులో రూ.46 లక్షలు స్వాధీనం ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ఓట్లకోసం నోట్లు వెదజల్లాలనే ఒక టీడీపీ అభ్యర్థి బండారం బయటపడింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీకర్ కాటన్ ట్రేడర్స్ వద్ద ఒక గదిలో దాచిన రూ.46,19,200 సోమవారం అధికారులు పట్టుకున్నారు. ఈ మిల్లు మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ సమీప బంధువు రమణయ్యది. ఈ సొమ్ము ఎన్నికల కోసం దాచిందేనని రిటర్నింగ్ అధికారి బాలసుబ్రమణ్యం చెప్పారు. స్థానిక కొర్రపాడు రోడ్డులో రమణయ్యకు శ్రీవెంకటేశ్వరా ఇండస్ట్రీస్ ఉంది. ఈ ఇండస్ట్రీస్ ప్రాంగణంలోనే శ్రీకర్ కాటన్ ట్రేడర్స్, మరో రెండు మిల్లులు ఉన్నాయి. సుధాకర్‌యాదవ్ మేనల్లుడు మేకల శ్రీనివాసులుయాదవ్ ఇక్కడ డబ్బు ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మిల్లులో నగదు దాచారని పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని మిల్లుల్లో తనిఖీ చేశారు. శ్రీకర్ కాటన్ ట్రేడర్స్ సమీపంలో ఉన్న గది తాళం తీయమని కోరగా తాళంచెవులు లేవని సిబ్బంది చెప్పారు. మిల్లు యజమాని రమణయ్యకు సీఐ ఫోన్ చేసి తాళం తీయాలని చెప్పగా అతను సెల్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో రిటర్నింగ్ అధికారి బాలసుబ్రమణ్యం తదితరుల సమక్షంలో గది తాళాన్ని పగులగొట్టి బీరువాలో రూ.46,19,200 నగదును గుర్తించారు. ఈ మొత్తాన్ని ఆదాయపన్ను అధికారులకు అప్పగించారు. కాగా, మిల్లు వద్దకు వచ్చి తాళం తీయాలని పోలీసులు రమణయ్యకు ఫోన్ చేసినా అతడు స్పందించలేదు. పైగా అతడు రాకపోగా రూ.5 లక్షలిస్తా.. వెళ్లిపొండి అని ఒక పోలీసు అధికారితో బేరానికి దిగినట్లు తెలిసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అర్బన్ సీఐని ఆదేశించారు.