
సాక్షి, హైదరాబాద్: తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యురాలిగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితలను నియమిస్తూ ఏపీ సర్కార్ ఈ నెల 20న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
అన్యమతానికి మద్దతు తెలిపే వారిద్దరికీ తిరుమల పాలక మండలిలో నియమితులయ్యేందుకు ఏమాత్రం అర్హత లేదంటూ తిరుపతికి చెందిన హిందూ చైతన్య సమితి ప్రతినిధి తుమ్మ ఓంకార్, మరో ఇద్దరు పిల్‌ను దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు మంగళవారం విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment