mla anitha
-
పాయకరావుపేట టీడీపీలో విభేదాలు
-
టీడీపీ ఎమ్మెల్యే అనితపై చెక్‌బౌన్స్ కేసు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): తనకు చెల్లని చెక్కు ఇవ్వడంతో..అధికార పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చెక్కు బౌన్స్ కేసు కింద కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయని వేగి శ్రీనివాసరావు అనే దివ్యాంగ కాంట్రాక్టర్ తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన శ్రీనివాసరావు సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత 2015 అక్టోబర్ నెలలో అతని వద్ద రూ.70 లక్షలు అప్పుగా తీసుకుంది. అందుకు సంబంధించి ప్రాంసరీ నోటు, పోస్ట్ డేటెడ్ చెక్కును అనిత ఇచ్చారు . అయితే చాలా రోజుల పాటు ఆ చెక్కును బ్యాంకులో వెయ్యొద్దంటూ శ్రీనివాసరావును ఆమె కోరుతూ వచ్చారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి బ్యాంకు లోన్ పెట్టానని, వచ్చిన వెంటనే మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని నమ్మబలికారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా.. తన అప్పు తీర్చాలని శ్రీనివాసరావు ఒత్తిడి తేగా.. గతేడాది జూలై 30న రూ.70 లక్షల హెచ్డీఎఫ్సీ బ్యాంకు చెక్కు (నంబరు 994220)ను అనిత ఇచ్చారు. ఆ చెక్కును బ్యాంకులో వేస్తే అకౌంట్లో బ్యాలెన్స్ లేదని బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావుకు లేఖ పంపారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సివిల్ కేసుకు సంబంధించి 12వ అదనపు జిల్లా జడ్జి నుంచి కోర్టుకు హాజరు కావాలని అనితకు (ఓఎస్ నంబరు 434/2018)తో సమన్లు అందాయి. ఇక క్రిమినల్ కేసు (సీసీ నంబరు 1919/2018)కి సంబంధించి ఈ నెల 26వ తేదీన వాయిదాకు హాజరు కావల్సి ఉంది. అధికారం తన చేతిలో ఉందని, ప్రజల్ని ఇలా మోసం చేయడం సరికాదని బాధితుడు వాపోతున్నాడు. అంత డబ్బు ఎందుకిచ్చానంటే.. తాను ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, కొంత అప్పు ఉందని, ఎమ్మెల్యేగా పరువు పోతుందని అనిత బతిమాలుకున్నారు. ఆమెపై నమ్మకంతో అప్పు ఇచ్చా. దఫదఫాలుగా సమకూర్చుకున్న రూ.70 లక్షల మొత్తాన్ని ఆమెకు ఒక్కసారిగానే అందజేశా. ఇంత వరకు ఆమె అప్పు తీర్చకపోగా..చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారు. అందుకే కోర్టును ఆశ్రయించా. –వేగి శ్రీనివాసరావు, బాధితుడు -
ఇంత దోపిడీ.. ‘అనిత’రసాధ్యం
పనులు చేయకుండానే బిల్లులు పెట్టేసుకోవడం.. రికార్డులు మార్చేసి యజమానులకు అందాల్సిన భూ పరిహారాన్ని కాజేయడం.. షిఫ్ట్ ఆపరేటర్, డీలర్ తదితర పోస్టులు అమ్ముకోవడం.. దళితుల అనుభవంలో ఉన్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించడం.. రోడ్డు నిర్మాణాలు, అక్రమ ఇసుక తవ్వకాలు.. ఇలా ఒకటేమిటి.. సొమ్ము దండుకునే అవకాశమున్న ఏ ఒక్కదాన్నీ వదలకుండా సర్వం స్వాహాపర్వం అన్నట్లు తయారైంది పాయకరావుపేట నియోజకవర్గంలో పరిస్థితి. నాలుగున్నరేళ్ల క్రితం అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన వంగలపూడి అనిత.. ఆమె అనుచరులుగా చెలామణీ అవుతున్న కొందరు టీడీపీ నేతల ఆగడాలు, అక్రమాలు అంతూపొంతూ లేకుండా సాగుతున్నాయి. కాదేదీ అవినీతికి అనర్హమన్నట్లు సర్కారు చేపట్టే ప్రతి పనినీ, సంక్షేమ కార్యక్రమాలనూ అవినీతి సంపాదనకు వనరులుగా మలచుకుంటున్నారు. ఖాళీగా ఉన్న భూములన్నింటినీ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తూ అభాసుపాలవుతున్నారు. ఇప్పటికే వందల ఎకరాల భూములు వీరి చెరలో చిక్కుకున్నాయి. పారిశ్రామిక కారిడార్‌లో కలిసే భూములకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా దోచుకోవడానికి తెగిస్తున్నారు. అసలు భూ యజమానులను కాదని తమ బినామీల పేర్లను రికార్డుల్లో చేర్పించి పరిహారం కొట్టేస్తున్నారు. విద్యుత్ శాఖకు చెందిన షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు, డీలర్ పోస్టులకు రేటు కట్టి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు.నీరు–చెట్టు, ఉపాధి హామీ పనులను తమ అనుచరులకు కట్టబెట్టి పనులు చేయకుండానే బిల్లులు దండేసుకున్నారు. చివరికి చెరువుల్లో పూడికతీసిన మట్టిని సైతం రైతుల పొలాలలకు ఉచితంగా తరలించకుండా అమ్మేసుకొని కాసులు దండేసుకున్న టీడీపీ ప్రజాప్రతినిధి, ఆ పార్టీ నేతల అక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలనాత్మక కథనం.. విశాఖపట్నం: పాయకరావుపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనంత అవినీతి ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి వెన్నంటి తిరుగుతున్న నలుగురైదుగురు నాయకులే ఈ అక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నీరు చెట్టు పథకంలో పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేయడం, డబుల్ ధమాకాలా చెరువు తవ్వకాల్లో వచ్చిన మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించడం, తాండవ, వరాహ నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వి జరిపి కంపెనీలకు విక్రయించడం, భూరికార్డులు ట్యాంపరింగ్ చేయడం, ప్రభుత్వ భూములకు పట్టాలు లేకుండానే నకిలీ పట్టాలు పుట్టించి పాసుపుస్తకాల్లో నమోదు చేయించుకోవడం, ఈ భూములకు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల పరిహారం పొందేందుకు స్కెచ్ వేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. మరుగుదొడ్లు, పక్కా గృహాలు, పింఛన్ల మంజూరు వంటి పథకాల అమలులో కూడా లబ్ధిదారుల నుంచి వేలాది రూపాయలు గుంజేశారు. నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు చేసిన అక్రమాలపై సాక్షి ఫోకస్.. సీసీ రోడ్లలోరూ.50 కోట్ల అవినీతి నియోజకవర్గంలో కొత్తగా 300 కిలోమీటర్లమేర సీసీ రోడ్ల నిర్మాణాన్ని టీడీపీకి చెందిన సర్పంచ్‌లు, ముఖ్య నాయకులే చేపట్టారు. ఈ పనులకు సుమారు రూ.300 కోట్లు మంజూరయ్యాయి. నాణ్యతాలోపంతో పనులు చేసి నిధులు స్వాహా చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఉపాది నిధులతో చేపట్టిన పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, సామాజిక భవనాల పరిస్థితి కూడా అంతే. నియోజకవర్గానికి 25 వేల మరుగుదొడ్లు మంజూరు కాగా నిర్మించే బాధ్యతను తెలుగుతమ్ముళ్లే తీసుకున్నారు. మరుగుదొడ్లలో సుమారు రూ.15 కోట్ల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి ఈ ఏడాది 32 రైతు రథాలు మంజూరయ్యాయి. ఇవన్నీ టీడీపీ నాయకులకే దక్కాయి. ట్రాక్టర్లు సరఫరా చేసే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఒక్కొక్క ట్రాక్టర్ నుంచి రూ.50 వేలు కమీషన్లు దండుకున్నట్లు ప్రచారం జరిగింది. 600 ఎకరాలుహాంఫట్భోంచేసిన భూముల విలువ రూ.200 కోట్లు... నియోజకవర్గంలో ఉన్న భూకుంభకోణాల్లో తెలుగు తమ్ముళ్లది అందెవేసిన చేయి. నక్కపల్లి మండలం పెద దొడ్డిగల్లు సర్వేనెం1లో సుమారు రూ.70 కోట్లు విలువైన 334 ఎకరాల భూమిని అప్పనంగా కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎకరం విలువ సుమారు రూ.15 లక్షల నుంచి 20 లక్షలు విలువ చేసే ఈ భూములను స్థానిక ప్రజాప్రతినిధి సమీప బంధువొకరు ఎకరం రూ.3 లక్షలకు కొనుగోలు చేసేందుకు సాగు రైతులతో ఒప్పందం కుదుర్చుకుని, ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అడ్వాన్సు చెల్లించారు. తాజాగా ఇదే భూములను చినబాబుతోపాటు, జిల్లాకు చెందిన మరో మంత్రి కుమారుడు ఎకరాకు రూ.8 లక్షల చొప్పున కొనుగోలు చేసేందుకు స్థానిక టీడీపీ నాయకులతో కలసి ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులతో చర్చలు జరుపుతున్నారు. రూ.70 కోట్ల విలువైన ఈ భూములను రూ.20 కోట్లకు కొనుగోలు చేసి పవర్‌ప్లాంటు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవిగాక మరో 300 ఎకరాల్లో రికార్డులను తారుమారు చేశారు. నీరు చెట్టు.. అవినీతికి మెట్టు నీరు చెట్టు పథకం కింద నియోజకవర్గంలో నాలుగేళ్లలో సుమారు రూ.12 కోట్ల విలువైన పనులు జరిగాయి. వీటిలో సగానికి సగం నిధులు స్వాహా చేశారు. పనులు తూతూమంత్రంగా చేపట్టడం, గతంలో చేసిన పనులనే ఈ ఏడాది కూడా చేసినట్లు ఎంబుక్‌లు నమోదు చేయించి నిధులు బొక్కేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎస్.రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల్లో ఇలా నిధులు కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయి. కాంట్రాక్ట్ పనులను టీడీపీ నాయకులు హైమావతి, అశోక్‌రాజు, పి.చంద్రరావు, పి బంగార్రాజు, కె.శ్రీనివాస్, ఎల్‌కేఎస్ నాయుడు తదితరులు చేపట్టారు. కోటవురట్లలో ఊరచెరువు, జల్లూరులో నాగన్న చెరువు, ఎస్.రాయవరం మండలం రామయ్య పట్నంలో జగ్గరాజు చెరువు పెదగుమ్ములూరులో రాతి చెరువు పెద ఉప్పలం చెరువు అప్పలరాజు చెరువులలో పనులు తూతూమంత్రంగా జరిగాయి. లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసుకున్నారు. ఇసుక నుంచి రూ.కోట్లు పిండేశారు.. తాండవ, వరాహ నదుల్లో దార్లపూడి, పందూరు, గొట్టివాడ, గుమ్ములూరు, పెదఉప్పలం, పెనుగొల్లు, ధర్మవరం, సోముదేవుపల్లి సత్యవరం, పెంటకోట, మాసయ్యపేట, అరట్లకోట తదితర ప్రాంతాల నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తవ్వేశారు. నిత్యం రేయింబవళ్లు పొక్లెయిన్లు ఏర్పాటు చేసుకుని లారీల్లో వేలాది ట్రిప్పులు తరలించారు. ఇసుకను పోలవరం కాలువ పనులకు, హెటెరో, డక్కన్ కంపెనీలకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు విక్రయించి కోట్లు గడించారు. సుమారు రూ.50 కోట్లు విలువైన ఇసుకను కొల్లగొట్టడం ద్వారా నాలుగు మండలాల ముఖ్య నాయకులు సుమారు రూ.20 కోట్ల మేర లాభాలు ఆర్జించినట్లు అంచనా. ఇక తీరప్రాంతం వెంబడి ఉన్న అమలాపురం, రాజయ్యపేట, బోయపాడు, రేవుపోలవరం, బంగారమ్మపాలెం, పెంటకోట, రాజవరం, వెంకటనగరం, పాల్మన్‌పేట, డిఎల్‌పురం గ్రామాల్లో ఉన్న సముద్రపు ఇసుకను కూడా అక్రమంగా తవ్వేసి తరలించేస్తున్నారు. బహిరంగమార్కెట్లోఔట్సోర్సింగ్ఉద్యోగాలు నియోజకవర్గానికి కొత్తగా నాలుగు సబ్స్టేషన్లు మంజూరయ్యాయి. ఒక్కొక్క సబ్‌స్టేషన్‌లో నాలుగు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు నియమించాల్సి ఉంది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ పోస్టులు ఒక్కొక్కటి రూ.4 లక్షల నుంచి 5 లక్షల చొప్పున విక్రయించి సుమారు రూ.60 లక్షలు స్వాహా చేశారు. ఇలా షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుకు రూ.3 లక్షల చెల్లించి ఉద్యోగం రాకపోవడంతో గొడిచర్లకు చెందిన నిరుద్యోగి బొడ్డపు నానాజీ పాదయాత్రలో స్దానిక ఎమ్మెల్యే అనితను అడ్డుకుని నిరసన తెలిపాడు. గ్రామస్తులంతా ఇతనికి అండగా నిలిచి రోడ్డుపై బైఠాయించారు. కొత్తగా 14 డీలర్ పోస్టులు మంజూరు కాగా ఒక్కొక్కదానికి రూ.లక్ష చొప్పున వసూలు చేసి తమ అస్మదీయులనే ఎంపిక చేశారు. ఈ విషయంపై తనకు అన్యాయం జరిగిందంటూ పాయకరావుపేటకు చెందిన టీడీపీ నాయకుడొకరు కోర్టును ఆశ్రయించడం గమనార్హం. నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులు భర్తీ చేశారు. ఒక్కొక్కరినుంచి రూ.50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ల్యాండ్ సీలింగ్ భూములకు ఎసరు ఎస్.రాయవరం మండలం గుర్రాజు పేటలోసాగి సావిత్రమ్మ 9 ఎకరాల మిగులు భూమిని ప్రభుత్వానికి స్వాదీనం చేయగా ప్రభుత్వం గుర్రాజు పేటకు చెందిన ఆరుగురు దళితులకు డీఫారం పట్టాల కింద పంపిణీ చేసింది. ఈభూమిని గుర్రాజుపేట గ్రామానికిచెందిన టీడీపీ సర్పంచ్ కురందాసు శ్రీనివాసరావు కబ్జాచేసి యధేచ్చగా వరి సాగుచేస్తున్నాడు. దీని విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుంది.ఈబాగోతం పత్రికల్లో రావడంతో అధికారులు స్పందించి భూములు స్వాదీనం చేసుకుని బాదితులకు అప్పగించారు. నక్కపల్లి మండలం అమలాపురం (వేంపాడు2) రెవెన్యూ పరిదిలో సర్వేనెం 375 ఎకరాలు ప్రభుత్వ భూమి( కొండప్రాంతం) ఉంది.2005లో దివంగత నేత వైఎస్ హయాంలో 250 ఎకరాలు పేదలకు పంపిణీ చేసారు.మిగిలి ఉన్న ప్రభుత్వభూమిపై కన్ను పడింది. గ్రామానికి చెందిన మాజీసర్పంచ్ కీలక పాత్ర పోషించి వీఆర్వో సహయాంతో సుమారు 39 మందిటీడీపీ కార్యకర్తల పేరున 53 ఎకరాలకు రికార్డులు తారు మారు చేసారు. -
తిమ్మాపురంలో ఎమ్మెల్యే అనితకు చేదు అనుభవం
-
ఎమ్మెల్యే అనిత పాదయాత్రను అడ్డుకున్న బాధితులు
-
ఎమ్మెల్యే అనితకు నిరసన సెగ
విశాఖ, నక్కపల్లి(పాయకరావుపేట): ఎమ్మెల్యే అనితకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల సెగతగిలింది. నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా నక్కపల్లి మండలంలో ఆమెకు చుక్కెదురైంది. ఉద్దండపురం, గొడిచర్ల గ్రామాల్లో అడుగడుగునా గ్రామస్తులు పలు సమస్యలపై నిలదీశారు. సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు విషయమై బాధితుడితోపాటు గొడిచర్ల గ్రామస్తులు పాదయాత్రను అడ్డుకున్నారు. స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే చుట్టూ గ్రామస్తులు వలయంగా ఏర్పడి నిరసన తెలిపారు. బాధితుడితో పాటు,గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ట్రాన్స్‌కో కొత్తగా గొడిచర్లకు సబ్‌స్టేషన్ మంజూరు చేసింది. ఇందులో నలుగురు షిఫ్ట్ ఆపరేటర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. సబ్‌స్టేషన్ నిర్మాణానికి పంచాయతీ ఉచితంగా స్థలం ఇవ్వడంతో రెండు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు గ్రామానికి మంజూరు చేస్తామని గతంలో ఎమ్మెల్యే హమీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చిమూడునెలలు పనిచేయించుకున్నాక తొలగించారని వారు ఆరోపించారు. గ్రామస్తులు, బాధితుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బొడ్డపు నానాజీ ఐటీఐ చదువుకుని ఖాళీగా ఉన్నాడు. స్థానిక టీడీపీ నాయకుడు ఒకరు అతనికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు ఆఫర్ చేశారు. దీంతో అతను టీడీపీనాయకుడు(మాజీసర్పంచ్ భర్త)కు అడ్వాన్సుగా రూ.3లక్షలు చెల్లించాడు. ఈమేరకు ఎమ్మెల్యే అనిత ద్వారా తనకు ఉద్యోగానికి ఒప్పందం కుదిరిందని, ఆగస్టులో ఎమ్మెల్యే తనను సబ్‌స్టేషన్‌లో చేరాలని లెటర్ కూడా ఇచ్చారన్నాడు. మూడు నెలలు సబ్‌స్టేషన్‌లో పనిచేశానని నానాజీ తెలిపాడు. తనతో పాటు ఐదుగురిని ట్రైనింగ్‌కు పంపించారన్నాడు. ఇప్పుడు తనను తప్పించి మిగిలిన నలుగురిని నియమించారన్నాడు. ట్రైనింగ్ పీరియడ్‌లో పైసా జీతం ఇవ్వలేదన్నాడు. అనకాపల్లి, విశాఖపట్నం తీసుకెళ్లారని త్వరలోనే నియామక ఉత్తర్వులు వస్తాయని ఆశచూపించారన్నాడు. దీనిపై తాను స్థానిక టీడీపి నాయకుడు, ఎమ్మెల్యే అనితల వద్దకు వెళ్లి ప్రశ్నించడం జరిగిందన్నారు. అమరావతి వెళ్లి నీ ఉద్యోగం విషయం మాట్లాడి పది రోజుల్లో తిరిగి పోస్టు ఇచ్చే ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారన్నారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించినట్టు చెప్పాడు. బాధితుడికి వైఎస్సార్సీపీ, జనసేన పార్టీ నాయకులు, గ్రామస్తులు అండగా నిలిచారు. ఎమ్మెల్యే డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామస్తులంతా రోడ్డుకు అడ్డంగా బైఠాయించడంతో ఎమ్మెల్యే అనిత వెనుక రోడ్డులో డొంకాడ వైపు వెళ్లిపోయారు. ఈమేరకు వైఎస్సార్సీపీ, జనసేన పార్టీల నాయకులు, టీడీపీ నాయకులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాలూ బాహాబాహీకి దిగాయి. పోలీసులు వారిని చెదర గొట్టారు. ఉద్డండంపురంలోనూ ఇలాగే జరిగింది. గ్రామంలోని పాఠశాలకు ఎదురుగా అంగన్వాడీ భవనాన్ని కొత్తగా రూ.పది లక్షలతో నిర్మించారు. ఏడాది క్రితం దీనిని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ పొడగట్ల శ్రీలక్ష్మి ప్రారంభించారు. అందులో కాకుండా టీడీపీ నాయకుల ఒత్తిడితో శిథిల భవనంలో ఇప్పటికీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భవనం పైకప్పు పెచ్చులు రాలి పడుతున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చేందుకు గ్రామస్తులు బచ్చల రాజు తదితరులు ప్రయత్నించారు. టీడీపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈమేరకు గ్రామస్తులంతా నిరసన తెలిపారు షిఫ్ట్ ఆపరేటర్ విషయమై ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ గ్రామానికి ఒక పోస్టు ఇస్తానని హమీ ఇచ్చిన మాట వాస్తవమేని, ఆ మాట నిలబెట్టుకుంటానని తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే అనితకు నిరసన సెగ
-
అనితకు అసమ్మతిసెగ
పాయకరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంగలపూడి అనితపై ఉన్న అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యేకు పాల్తేరులో సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. దీంతో పార్టీలోని రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బాహాబాహీకి దిగారు. తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. విశాఖపట్నం,పాయకరావుపేట: నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే అనితకు పాల్తేరులో పార్టీ నేతల నుంచి చుక్కెదురయింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీని ఆహ్వానించకపోవడం, పార్టీ అవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్న నాయకులను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం పాల్తేరులో టీడీపీ సీనియర్ నాయకులు దేవవరపు వెంకటరావు, దేవవరపు వెంకటరమణ తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే పాదయాత్రను అడ్డుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాము టీడీపీ గెలుపుకోసం పనిచేస్తున్నామని మీరు ఎమ్మెల్యేగా విజ యం సాధించడంలో మా కృషి కూడా ఉందని, అలాగే స్థానిక ఎంపీటీసీ లోవతల్లి కూడా సైకిల్ గుర్తుపైనే గెలిచారని గుర్తుచేశారు. గ్రామంలో పాదయాత్ర జరుగుతున్న విషయం తమకు గా ని, ఎంపీటీసీకిగానీ ఎందుకు తెలియజేయలేదని నిలదీశారు. గ్రామంలో ఒక్క అభివృద్ధి పని కూ డా జరగడం లేదని, అధికార పార్టీ తరపున గెలి చిన ఎంపీటీసీకి పార్టీలోనే విలువ లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తమకు సమాధానం చెప్పిన తర్వాతే ఇక్కడ నుంచి కదలాలని అప్పటివరకు పాదయాత్ర ముందుకు సాగనివ్వమని భీష్మించారు. సీనియర్ నాయకులు కార్యకర్తలంటే మీకు అలుసా, పార్టీ కోసం కష్టపడితే పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ స్థానిక ఎంపీటీసీకి సమాచారం ఇవ్వకపోవడం తప్పేనని ఒప్పుకున్నారు. రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను క్షమించాలని కోరారు. ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చూస్తానన్నారు. ఇక్కడ రెండు వర్గాలు ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు సరిగా జరగలేదని, ఇరువర్గాలను సమన్వయపరచి గ్రూపులు లేకుండా చేయడానికి చాలా సార్లు ప్రయత్నించినా నాయకులు పంతాలకు పోయి కలసి రాలేదన్నారు. ఎంపీటీసీ విషయంలో ప్రొటోకాల్ కోసం నిలదీస్తున్న నాయకులు సర్పంచ్ (తాజా మాజీ) విషయంలో ఎందుకు నిలదీయలేదని ఆయనను సర్పంచ్ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించనీయలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను ఒక వర్గం గ్రామస్తులు నిలదీయడంతో రెండో వర్గం వారు అభ్యం తరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు బాహాబాహీకి దిగారు. తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుకున్నారు. ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బం ది ఇరువర్గాలను చెదరగొట్టడంతో పాదయాత్ర ముందుకు సాగింది. ఎమ్మెల్యేని అడ్డుకున్నవారి లో ఎంపీటీసీ ఉండ్రాసు లోవతల్లి, బొజ్జయ్య, టీడీపీ మండల మాజీ ఉపాధ్యక్షుడు డి.వెంకటరమణ, దేవవరపు శ్రీను తదితరులు ఉన్నారు. రాజీనామా యోచనలో ఎంపీటీసీ? తెలుగుదేశం పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో పదవికి, పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఎంపీటీసీ లోవతల్లి ఉన్నట్లు సమాచారం. బుధవారం ఆమె పార్టీకి రాజీ నామా చేయనున్నట్టు తెలిసింది. పార్టీ గుర్తు పై గెలిచి, పార్టీ కోసం కష్టపడిన తనను అవమానించే విధంగా ఎమ్మెల్యే పాదయాత్రపై సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతో వాగ్వా దం జరగడంతో ఇక పార్టీలోను, పదవిలోను కొనసాగితే తన ను మరింత అవమానాలకు గురిచేస్తారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని పార్టీలో ఉంటూ అవమానాలు భరిం చే కంటే వైదొలగడమే మేలన్న భావనతో ఎంపీటీసీ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
పాయకరావుపేటలో నందమూరి అభిమానుల ఆందోళన
-
టీటీడీ బోర్డు నుంచి అనిత ఔట్
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యురాలిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అనిత నియామకంపై అటు ప్రజల్లో, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. గతంలో అనిత ఓ ప్రవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సైతం బయటకు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్యే ఇచ్చిన లేఖ ఆధారంగా బోర్డ్ మెంబెర్ గా తొలగించినట్లు సర్కార్ పేర్కొంది. మంత్రి పదవికోసం ఆశించిన అనితకు రెండుసార్లు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆశాభంగం ఎదురైంది. దీంతో అనిత గత కొద్దికాలం పార్టీ కార్యక్రామాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ విషయంపై పలుసార్లు ఎమ్మెల్యేను బుజ్జగించే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగానే టీటీడీ పాలక మండలిలో సభ్యత్వం ఇస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల 20న జీవో జారీ చేసింది. అయితే అనిత నియామకంపై విమర్శలు వెల్లువెత్తాయి. అనిత నియామకాన్ని సమర్ధిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం, ఎమ్మెల్యే సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. అంతేకాకుండా గతంలో ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని సైతం నెట్‌జన్లు బయటపెట్టడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. దీంతో స్వచ్చందంగా తప్పుకోవాలంటూ అధిస్టానం ఇచ్చిన సూచన మేరకు అనిత తనను పాలకమండలి నుంచి తప్పించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో అనిత సభ్యత్వం రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
పుట్టా, అనిత నియామకంపై పిల్
సాక్షి, హైదరాబాద్: తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యురాలిగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితలను నియమిస్తూ ఏపీ సర్కార్ ఈ నెల 20న జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అన్యమతానికి మద్దతు తెలిపే వారిద్దరికీ తిరుమల పాలక మండలిలో నియమితులయ్యేందుకు ఏమాత్రం అర్హత లేదంటూ తిరుపతికి చెందిన హిందూ చైతన్య సమితి ప్రతినిధి తుమ్మ ఓంకార్, మరో ఇద్దరు పిల్‌ను దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు మంగళవారం విచారించనుంది. -
వేటూరి ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి
సాక్షి, పాయకరావుపేట (విశాఖ జిల్లా): ఊపిరి ఉన్నంత వరకు తన జీవితం సినీపరిశ్రమకే అంకితమని ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్ అన్నారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీ ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా చంద్రబోస్‌కు వేటూరి అష్టమ సాహితీ పురస్కారాన్ని సోమవారం ప్రదానం చేశాయి. తుని చిట్టూరి మెట్రోలో జరిగిన కార్యక్రమంలో సాహితీ పీఠం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు చక్కా సూర్యనారాయణ, అధ్యక్షుడు సీహెచ్‌వీకే నరసింహారావు, వ్యవస్థాపక కార్యదర్శి కలగా జోగేశ్వరశర్మ, ప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ విజయ్‌ప్రకాష్‌లు ఈ పురస్కారాన్ని చంద్రబోస్‌కు ప్రదానం చేశారు. చంద్రబోస్‌కు పురస్కారంతో పాటు, 120 సాహితీ పుస్తకాలతో తుని, పాయకరావుపేట పట్టణాలకు చెందిన ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. వేటూరి ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని తనకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. నేటి యువతకు గాయకులుగా, గేయ రచయితలుగా రాణించడానికి ఎన్నో అవకాశాలున్నాయని మాతృభాషపై పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. వేటూరిని పూజించడమంటే అక్షరాన్ని పూజించడమేనని అన్నారు. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, తుని మార్కెట్ యార్డు చైర్మన్ యనమల కృష్ణుడు, టాలీవుడ్ చానల్ సీఈవో శర్మ పాల్గొన్నారు. -
బరువు పెరిగారంటే ఎస్సీ ఎస్టీ కేసా?
-
బరువు పెరిగారంటే ఎస్సీ ఎస్టీ కేసా?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మీద తాను ఎలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయలేదని పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అన్నారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించిన తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ మధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు అనితతో వివాదం ఏంటని మీడియా ప్రశ్నించగా.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ఓ సందర్భంలో అనిత అన్నారని.. దాని మీద తాను స్పందించి ఆమె అభివృద్ధి (బరువు పెరగడం) కనిపిస్తోంది గానీ, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనపడటం లేదని సోషల్ మీడియాలో పంచ్ వేశానని చెప్పారు. అంతకుముందు కూడా సమైక్య రాష్ట్రం 23 జిల్లాలతో లోకేష్‌లా లావుగా ఉండేదని, తర్వాత 13 జిల్లాలతో స్లిమ్ అయ్యిందని తాను ఒక పంచ్ వేశానన్నారు. ఇలా బరువు పెరగడం గురించి మాట్లాడటమే తప్పంటే అలాంటివి చాలా ఉంటాయని తెలిపారు. వెయిట్ లాస్ ప్రకటనల విషయంలో కూడా బిఫోర్, ఆఫ్టర్ అంటూ మహిళలకు సంబంధించిన రెండు ఫొటోలతో పెద్దపెద్ద ప్రకటనలు ఇస్తారని, అది మహిళలను అవమానించడం అయితే ఆ యాడ్ ఇచ్చినవాళ్ల మీద, ప్రకటనలు ప్రసారం చేసిన మీడియా మీద కూడా కేసులు పెట్టాలని ఆయన చెప్పారు. తనను తుళ్లూరు పోలీసులు గతంలో విచారించినప్పుడే తాము తలుచుకుంటే ఏమైనా చేస్తామని, మొద్దు శీనుకు ఏం జరిగిందో తెలుసు కదా అని బెదిరించారని.. తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా తమకు సంబంధం లేదని చెప్పారని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వాయిస్‌ను అణగదొక్కాలన్న లక్ష్యంతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు ఇదే విశాఖలో ఆర్కే బీచ్‌లో బికినీ ఫెస్టివల్ పెట్టారని, దాన్ని సోషల్ మీడియా గట్టిగా చెప్పడంతో తర్వాత కాస్త వెనక్కి తగ్గారని అన్నారు. అప్పట్లో అనితగారు బికినీ వేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారని, నిజానికి అది మహిళలను అవమానించడం అవుతుంది గానీ, గ్రోత్ అంటే అవమానించడం కాదని తెలిపారు. తాను ఈ తరహాలో ఎప్పుడూ ఊహించలేదని, తొలిసారి విచారణలో పోలీసులు చెప్పినట్లే ఇప్పుడు కూడా చేశారని, వాళ్లు అనుకున్నది సాధించారని రవికిరణ్ అన్నారు. ఆయన మీద 292, 509 సెక్షన్ల కింద, మహిళలపై వేధింపులకు గాను సెక్షన్ 6 కింద, ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టంలోని సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేశారు. -
దురుసుగా ప్రవర్తించిన పీతల సుజాత, అనిత
-
దురుసుగా ప్రవర్తించిన పీతల సుజాత, అనిత
అమరావతి: శాసనసభలోనే కాదూ... అసెంబ్లీ బయట కూడా అధికారపక్షం దౌర్జన్యం కొనసాగింది. ఏపీ అసెంబ్లీలోని మీడియా పాయింట్ దగ్గర మంగళవారం గందరగోళం నెలకొంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ మహిళా ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ ఎమ్మెల్యేలకు టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మహిళలపై వేధింపుల అంశంపై మాట్లాడుతున్న సమయంలో అక్కడకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనిత...వాళ్లని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, అనిత మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో మీడియా పాయింట్ దద్దరిల్లింది. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే అనిత వెళ్లిపోగా... మంత్రి పీతల సుజాత, కొంతమంది పురుష ఎమ్మెల్యేలతో అక్కడకు వచ్చి వాగ్యుద్ధానికి దిగారు. మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వెళ్లకపోవడంతో పీతల సుజాత మైక్‌లు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. గొడవ పెద్దది కావడంతో మార్షల్స్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
సభలో అధికారపక్షం ఎదురుదాడి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంగళవారం తీవ్ర గందరగోళం ఏర్పడింది. అసెంబ్లీ సాక్షిగా సమస్యను పక్కదారి పట్టించేందుకు అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. మహిళలపై వేధింపులకు పాల్పడటం తప్పుకాదు కానీ, వాటిని ప్రశ్నించడమే తప్పు అన్నట్లుగా అధికారపక్ష సభ్యులు మాట్లాడారు. మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మహిళలపై అత్యాచారాల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రస్తావించారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులను ఆమె వివరించారు. ఓ మహిళా ఎమ్మెల్యేపై ఏడాదిపాటు సస్పెండ్ చేయడం దారుణమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఓ మహిళా శాసనసభ్యురాలిని ఏడాదిపాటు సస్పెండ్ చేసిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కుతుందని మండిపడ్డారు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్ దోషులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని శాసనసభలో ప్రశ్నించారు. మంత్రి నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు. రిషితేశ్వరి అనుమానాస్పద మృతిపై దోషులను కాపాడారన్నారు. ఓ మహిళపై అనంతపురంలో టీడీపీ సర్పంచ్ దాడి చేస్తే చర్యలు లేవన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈశ్వరి సభలో ప్రశ్నించారు అయితే ఆమె ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. హోంమంత్రి మాట్లాడకుండానే నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు చేశారు. నా గురించి ఓనమాలు కూడా తెలియవు అంటూ ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అధికార పక్ష సభ్యుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ హయాంలో మహిళలపై దాడులు పెరిగాయంటూ నినాదాలు చేశారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. -
ఏయూ పసుపుమయం!
వర్సిటీలో నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు టపాసులు కాల్చి హంగామా చేసిన టీఎన్ఎస్ఎఫ్ చోద్యం చూసిన అధికారులు నాడు ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్న వారికి మాత్రం వేధింపులు సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రాజకీయ రంగు పులుముతున్నారు. వర్సిటీని పసుపుమయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ పుట్టినరోజు వేడుకలను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వర్సిటీ ప్రవేశ మార్గం వద్ద టపాసులు కాల్చుతూ ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ప్రవేశ మార్గానికి ఇరువైపులా లోకేశ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి.. వర్సిటీ ప్రవేశ మార్గాన్ని మూసివేస్తూ కటౌట్లు ఏర్పాటు చేస్తుంటే వర్సిటీ పాలకులు చోద్యం చూశారు. అనుమతి లేనిదే టపాసులు కాలిస్తే అనవసర రాద్ధాంతం చేసే పోలీసులు.. వర్సిటీ ప్రవేశ మార్గం వద్ద టపాసులు కాలుస్తున్నా మిన్నకుండిపోయారు. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట ఎమ్మెల్యే వి.అనిత హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కొందరు వర్సిటీ ఉద్యోగులు స్వయంగా పాల్గొని తమ స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వినిపించాయి. కాగా, మరో పార్టీ నాయకులు ఇలా చేస్తే పోలీసులు ఊరుకుంటారా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన వర్సిటీ పరిసరాలలో టపాసులు కాల్చడం, రాజకీయ నాయకుల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తే.. ఆ ఉద్యమంలో పాల్గొన్న వారిని పాలకులు నానా ఇబ్బందులకు గురిచేశారని పలువురు విద్యార్థులు గుర్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ నిర్వహించిన సదస్సులకు విద్యార్థులు తరలి వస్తుంటే బస్సులను అడ్డుకోవడం, సదస్సులో పాల్గొన్నారని ఏకంగా ఓ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేయడం.. ప్రజలెవ్వరూ మరచిపోలేదని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మాట్లాడితే ఒక విధంగా, పాలకులపై స్వామి భక్తి ప్రదర్శిస్తే మరొక విధంగా వ్యవహరించడం దారుణం అని మండిపడ్డారు. -
ఎమ్మెల్యేను నిలదీసిన గ్రామస్తులు
-
ఎమ్మెల్యే అనితపై ఫిర్యాదు
కోటవురట్ల: పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్వాతంత్య్ర దిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచేలా వ్యవహరించారంటూ ఎంపీపీ అయ్యపురెడ్డి వరహాలమ్మ స్థానిక పోలీసు స్టేషన్లో ఇన్చార్జ్ ఎస్ఐ గణపతిరావుకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అనితకు జాతీయ పతాకాన్ని ఎలా ఆవిష్కరించాలో తెలియకపోవడం శోచనీయమన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రొటోకాల్ ప్రకారం జాతీయ జెండాను ఎంపీపీ ఎగురవేయాల్సి ఉండగా, రాజకీయ దురుద్దేశంతో ఎమ్మెల్యే ఆవిష్కరించారని చెప్పారు. వందేమాతరం గీతాన్ని ఆలపించకుండానే హడావుడిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జనగనమణ ఆలపించకుండానే వెళ్లిపోయారన్నారు. ఎంతో పవిత్రంగా చేయవలసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాజకీయం చేసి అపవిత్రం చేశారని ఆవేదన చెందారు. జాతీయ పతాకాన్ని అగౌరవపరిచిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని, ఇదే అంశంపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదు అందజేసిన వారిలో జెడ్పీటీసీ సభ్యురాలు వంతర వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు అవుగడ్డి రాజకుమారి, సర్పంచ్‌లు శెట్టి వరహాలమ్మ తదితరులు ఉన్నారు. -
‘పరువునష్టం’ నోటీసులు వస్తే ఎదుర్కొంటా
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టీకరణ చెన్నై, సాక్షి ప్రతినిధి: తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత నుంచి తనకు పరువునష్టం దావా నోటీసులు వస్తే వాటిని చట్టపరంగా ఎదుర్కొంటానని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ దమ్ము ధైర్యం లేని రాజకీయాలు చేస్తోందని అసెంబ్లీలో ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్ప లేకనే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు.నగరి నియోజవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే సమస్యలను దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్‌కు తెలియజేసేందుకు బుధవారం చెన్నైకి వచ్చిన రోజా మీడియాతో మాట్లాడారు. టీడీపీతో న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తనపై పరువునష్టం దావా వేసిన ఎమ్మెల్యే అనితను టీడీపీ బలిపశువుగా వాడుకుంటున్నందుకు బాధపడుతున్నానని రోజా అన్నారు. అసెంబ్లీలో అంశాలంటూ అవాస్తవాలను సోషల్ మీడియాకు విడుదల చేసిన కాల్వ శ్రీనివాసులపై ఆమె పరువునష్టం దావా వేయాలన్నారు. ఈ కేసులో నోటీసులు అందితే న్యాయ పోరాటంలో భాగంగా వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు.