ఎమ్మెల్యే అనితకు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల సెగతగిలింది. నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా నక్కపల్లి మండలంలో ఆమెకు చుక్కెదురైంది. ఉద్దండపురం, గొడిచర్ల గ్రామాల్లో అడుగడుగునా గ్రామస్తులు పలు సమస్యలపై నిలదీశారు. సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు విషయమై బాధితుడితోపాటు గొడిచర్ల గ్రామస్తులు పాదయాత్రను అడ్డుకున్నారు. స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే చుట్టూ గ్రామస్తులు వలయంగా ఏర్పడి నిరసన తెలిపారు. బాధితుడితో పాటు,గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.