పాల్తేరులో ఎమ్మెల్యే అనితతో వాగ్వాదానికి దిగిన సీనియర్ టీడీపీ నాయకుడు వెంకటరమణ
పాయకరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంగలపూడి అనితపై ఉన్న అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యేకు పాల్తేరులో సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. దీంతో పార్టీలోని రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బాహాబాహీకి దిగారు. తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
విశాఖపట్నం,పాయకరావుపేట: నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే అనితకు పాల్తేరులో పార్టీ నేతల నుంచి చుక్కెదురయింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీని ఆహ్వానించకపోవడం, పార్టీ అవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్న నాయకులను పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం పాల్తేరులో టీడీపీ సీనియర్ నాయకులు దేవవరపు వెంకటరావు, దేవవరపు వెంకటరమణ తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే పాదయాత్రను అడ్డుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాము టీడీపీ గెలుపుకోసం పనిచేస్తున్నామని మీరు ఎమ్మెల్యేగా విజ యం సాధించడంలో మా కృషి కూడా ఉందని, అలాగే స్థానిక ఎంపీటీసీ లోవతల్లి కూడా సైకిల్ గుర్తుపైనే గెలిచారని గుర్తుచేశారు. గ్రామంలో పాదయాత్ర జరుగుతున్న విషయం తమకు గా ని, ఎంపీటీసీకిగానీ ఎందుకు తెలియజేయలేదని నిలదీశారు. గ్రామంలో ఒక్క అభివృద్ధి పని కూ డా జరగడం లేదని, అధికార పార్టీ తరపున గెలి చిన ఎంపీటీసీకి పార్టీలోనే విలువ లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తమకు సమాధానం చెప్పిన తర్వాతే ఇక్కడ నుంచి కదలాలని అప్పటివరకు పాదయాత్ర ముందుకు సాగనివ్వమని భీష్మించారు.
సీనియర్ నాయకులు కార్యకర్తలంటే మీకు అలుసా, పార్టీ కోసం కష్టపడితే పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ స్థానిక ఎంపీటీసీకి సమాచారం ఇవ్వకపోవడం తప్పేనని ఒప్పుకున్నారు. రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను క్షమించాలని కోరారు. ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చూస్తానన్నారు. ఇక్కడ రెండు వర్గాలు ఉండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు సరిగా జరగలేదని, ఇరువర్గాలను సమన్వయపరచి గ్రూపులు లేకుండా చేయడానికి చాలా సార్లు ప్రయత్నించినా నాయకులు పంతాలకు పోయి కలసి రాలేదన్నారు. ఎంపీటీసీ విషయంలో ప్రొటోకాల్ కోసం నిలదీస్తున్న నాయకులు సర్పంచ్ (తాజా మాజీ) విషయంలో ఎందుకు నిలదీయలేదని ఆయనను సర్పంచ్ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించనీయలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను ఒక వర్గం గ్రామస్తులు నిలదీయడంతో రెండో వర్గం వారు అభ్యం తరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు బాహాబాహీకి దిగారు. తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుకున్నారు. ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బం ది ఇరువర్గాలను చెదరగొట్టడంతో పాదయాత్ర ముందుకు సాగింది. ఎమ్మెల్యేని అడ్డుకున్నవారి లో ఎంపీటీసీ ఉండ్రాసు లోవతల్లి, బొజ్జయ్య, టీడీపీ మండల మాజీ ఉపాధ్యక్షుడు డి.వెంకటరమణ, దేవవరపు శ్రీను తదితరులు ఉన్నారు.
రాజీనామా యోచనలో ఎంపీటీసీ?
తెలుగుదేశం పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో పదవికి, పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఎంపీటీసీ లోవతల్లి ఉన్నట్లు సమాచారం. బుధవారం ఆమె పార్టీకి రాజీ నామా చేయనున్నట్టు తెలిసింది.
పార్టీ గుర్తు పై గెలిచి, పార్టీ కోసం కష్టపడిన తనను అవమానించే విధంగా ఎమ్మెల్యే పాదయాత్రపై సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతో వాగ్వా దం జరగడంతో ఇక పార్టీలోను, పదవిలోను కొనసాగితే తన ను మరింత అవమానాలకు గురిచేస్తారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారని పార్టీలో ఉంటూ అవమానాలు భరిం చే కంటే వైదొలగడమే మేలన్న భావనతో ఎంపీటీసీ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment