శాసనసభలోనే కాదూ... అసెంబ్లీ బయట కూడా అధికారపక్షం దౌర్జన్యం కొనసాగింది. ఏపీ అసెంబ్లీలోని మీడియా పాయింట్ దగ్గర మంగళవారం గందరగోళం నెలకొంది. వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ మహిళా ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ ఎమ్మెల్యేలకు టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు.